మీరు కారు ఔత్సాహికుల గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమి గుర్తుకు వస్తుంది? ఫాస్ట్ కార్లు, లౌడ్ రివింగ్ ఇంజిన్లు, అద్భుతమైన స్పేర్ పార్ట్స్ మరియు మరిన్ని. ఇవన్నీ కూడా కొత్త-తరం కార్ల అభిమానుల అభిరుచులు. కానీ, ముందు తరం కార్ల ప్రేమికులు ఇప్పటికీ కొత్త తరం కార్ల కంటే కూడా పాతకాలపు కార్లనే ఇష్టపడతారు. అది వారి స్టైల్ కోసమో లేదా దానిని సొంతం చేసుకున్న గర్వం కోసమో కావచ్చు. ఈ కార్లు నిస్సందేహంగా నేటి యుగంలో ఈ రోజు కూడా ప్రతి ఒక్కరిని తమవైపుకు ఆకర్షిస్తుంటాయి. ఈ వింటేజ్ కార్లను మెయింటైన్ చేయడం అంత సులభమేమి కాదు, కొందరు వ్యక్తులు మాత్రమే వీటిని కలిగి ఉంటారు, ఖచ్చితంగా చెప్పాలంటే వారు 3000 వరకు ఉండవచ్చు. ఒక సాధారణ కారు మాదిరిగా కాకుండా వింటేజ్ కార్ అనేది రుచికరమైన పాత వైన్‌లా ఉంటుంది. అది ఎంత పాతదైతే అంత విలువైనది అవుతుంది. కాబట్టి, ఈ విలువైన ఆస్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికి సమాధానం చాలా సులభం - ఇన్సూర్ చేయించుకోండి. ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఏవైనా ఆర్థిక ఖర్చులను కవర్ చేయడంలో సహాయపడుతుంది, అది లేకపోతే మీపై ఆర్థిక భారం పడవచ్చు. వింటేజ్ కారు అయినందున, విడిభాగాలు మరియు రిపేర్ ఖర్చులు అధికంగా ఉంటాయి.
ఒక కారును వింటేజ్ కారుగా వర్గీకరించడానికి ప్రమాణం ఏమిటి?
ఏదైనా కారు వింటేజ్ కారుగా వర్గీకరించబడాలంటే, అది వింటేజ్ మరియు క్లాసిక్ కార్ క్లబ్ ఆఫ్ ఇండియా (విసిసిఐ) ద్వారా ధృవీకరించబడాలి. వింటేజ్ కార్ల రకాలను తెలుసుకుందాం -
క్లాసిక్ కార్లు: 1940 నుండి 1970వ మధ్యకాలంలో తయారు చేయబడిన కార్లు క్లాసిక్ కారుగా పేర్కొనబడతాయి. అదనపు షరతు ఏమిటంటే, ఈ వాహనాలు సవరించబడకూడదు లేదా మార్చబడకూడదు మరియు వాటి షరతులు తప్పనిసరిగా ఒరిజినల్ వాహనం మాదిరిగా ఉండాలి.
యాంటీక్ కార్లు: వింటేజ్ కారుగా వర్గీకరించబడటానికి ఒక అడుగు దూరంలో ఉన్న కారు యాంటీక్ కారు. ఈ కార్లు 1930 మరియు 1940ల సమయంలో తయారు చేయబడినవి. ఈ కార్లు పురాతనమైనవి కాబట్టి, వీటిని ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో మరియు యథాస్థితిలో ఉంచడం మంచిది. దీని కోసం ఒక యాంటీక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీక్ కార్ ఇన్సూరెన్స్ ఉపయోగించి సాధారణ నిర్వహణ ఖర్చు మాత్రమే కాకుండా, అరుదైన విడిభాగాలను భర్తీ చేసే, రిపేర్ చేసే ఖర్చుల ఆర్థిక భారాన్ని కూడా నివారించవచ్చు.
వింటేజ్ కార్లు: దేశంలోని అత్యంత విలువైన మరియు ఖరీదైన కార్లు వింటేజ్ కార్లు. 1919 మరియు 1930 మధ్య తయారు చేయబడిన ఏదైనా కారు ఒక వింటేజ్ కారుగా పిలువబడుతుంది. సవరణలు చేసినప్పటికీ ఈ కార్ల విలువ మారదు అని మీరు గమనించాలి. దాని మైంటెనెన్స్ మరియు రిపేర్స్ కోసం వింటేజ్ కారు ఇన్సూరెన్స్‌ను ఉపయోగించడం ద్వారా ఆర్థిక పరమైన బ్యాకప్ పొందవచ్చు.
కారు ఇన్సూరెన్స్ అనేది పురాతన వైభవాన్ని కాపాడుకోవడానికి ఏకైక పరిష్కార గమ్యస్థానం. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేసే కొన్ని అంశాలను చూద్దాం: వింటేజ్
కారు ఇన్సూరెన్స్ పాలసీ -
#1. కారు వయస్సు
మీ వింటేజ్ లేదా క్లాసిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను నిర్ణయించడంలో కార్ వయస్సు చాలా కీలకమైన అంశం. కారు ఎంత పాతది అయితే, అంత ఎక్కువగా ఉంటుంది దాని
ఇన్సూరెన్స్ ప్రీమియం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారీ సంవత్సరాన్ని పేర్కొంటాయి మరియు ప్రీమియం నిర్ణయించడంలో ఇన్సూరెన్స్ కంపెనీకి దోహదపడతాయి.
#2. మీ కారు ప్రస్తుత విలువ
ఒక స్టాండర్డ్ పాలసీ మాదిరిగా కాకుండా, వింటేజ్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కారు విలువను నిర్ణయించేందుకు వేరే పద్ధతిని కలిగి ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలువను అంచనా వేసే సర్వేయర్‌ను నియమిస్తాయి. కొన్ని సందర్భాల్లో, Vintage and Classic Car Club of India అందించిన వాల్యుయేషన్‌ను ఇన్సూరెన్స్ సంస్థ అంగీకరిస్తుంది.
#3. భవిష్యత్తులో రిపేరింగ్ ఖర్చు
ఇది మీ వింటేజ్ కారుకు చెందిన అతి ముఖ్యమైన ఖర్చు. ఈ కాలాతీతమైన ఇంజనీరింగ్ అద్భుతాల కోసం వింటేజ్ కార్ల రిపేరింగ్‌లో నైపుణ్యం కలిగిన శిక్షణ పొందిన నిపుణులు తప్ప మరేమీ అవసరం లేదు. అలాగే, విడిభాగాల ధర అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది మరియు కొన్ని కార్లలో వినియోగించదగిన విడిభాగాలను తరచుగా భర్తీ చేయడం అవసరం కావచ్చు. పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, చవకైన క్లాసిక్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మంచిది కాదు. బదులుగా, మీ నిర్దిష్ట అవసరాలకు తగినంత కవరేజ్ అందించే వింటేజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి సమగ్ర పరిశోధన చేయండి.
#4 కవర్ చేయబడే దూరం
చివరగా, ప్రతి రెన్యూవల్ సైకిల్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ నడిచిన కిలోమీటర్లను చెక్ చేస్తుంది. మీరు ప్రతి సంవత్సరం అదే క్లాసిక్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగిస్తే, అది అంతర్గత రికార్డులను కలిగి ఉంటుంది. ఈ నంబర్లు చాలా ముఖ్యం, ఎందుకంటే వినియోగం ఎక్కువగా ఉంటే దాని నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ కార్ల ఇంజిన్‌ను యాక్టివ్‌గా మరియు రన్నింగ్‌లో ఉంచడానికి వాటిని నిర్దిష్ట దూరం వరకు రైడ్ కోసం తీసుకెళ్లాలి. చివరగా, కాలాతీతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్వహించడం అంత సులభమేమి కాదు. దానిని రన్నింగ్‌లో ఉంచడానికి స్పేర్ పార్ట్స్, లేబర్ మరియు అంకితభావంతో పాటు భారీ ఆర్థిక మద్దతు కూడా అవసరం. సకాలంలో
కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ తో పొందే చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పాలసీ అనేది కారును నిర్వహించడానికి , రాబోయే దశాబ్దాల పాటు దానిని వాడుకలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
రిప్లై ఇవ్వండి