రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Third Party Vs Comprehensive Insurance
30 మార్చి, 2021

థర్డ్ పార్టీ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ మధ్య తేడా

రోడ్డుపై వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మరియు ఇది మరింత పెరుగుతుందని అంచనా. పూర్వ కాలంలో, వాహనం కలిగి ఉండటం అనేది కొందరికి మాత్రమే లభించే విలాసవంతమైన విషయం. ఈ రోజుల్లో, ఈ దృష్టాంతం భిన్నంగా ఉంది. ఇది అక్షరాలా రోజువారీ జీవితంలో భాగంగా మారింది. మోటార్ వాహనాల చట్టం వాహనం ఉపయోగంలో ఉన్నప్పుడు కనీసం చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి చేసింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌లో ఎదుర్కొనే ప్రధాన డ్రాబ్యాక్ ఏంటంటే ఇది థర్డ్ పార్టీకి జరిగిన నష్టం మరియు డ్యామేజీలను కవర్ చేస్తుంది. అయితే, పాలసీదారు స్వయంగా ఎదుర్కొన్న డ్యామేజీలు మరియు నష్టాలకు ఏమీ చెల్లించబడదు. ఇది ఒక ప్రశ్నకు దారి తీస్తుంది: మీరు మీ స్వంత నష్టాలు మరియు డ్యామేజీలను కూడా కవర్ చేసే విధానం ఏదైనా అమలులో ఉందా? దానికి సమాధానం 'అవును'. అటువంటి పాలసీలను సమగ్ర పాలసీలు అని పిలుస్తారు. మరియు తదుపరి తెలుసుకోవలసిన విషయం ఈ రెండు కారు ఇన్సూరెన్స్ రకాలు పాలసీల మధ్య ఏవైనా ఇతర వ్యత్యాసాలు ఉన్నాయా అని? అయితే, థర్డ్-పార్టీ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీల మధ్య వ్యత్యాసాలు ఏమిటో క్రింద మరింత తెలుసుకోండి.  
ముఖ్యమైన తేడా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ సమగ్ర ఇన్సూరెన్స్
అర్ధం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ మరియు పాలసీదారు మధ్య ప్రమాదం జరిగినప్పుడు థర్డ్ పార్టీ నష్టాలు మరియు డ్యామేజీలకు ఇన్సూర్ చేయబడే ఒక పాలసీ. సమగ్ర ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అలాగే వివిధ పరిస్థితులలో పాలసీదారుని నష్టాలు మరియు డ్యామేజీలను కవర్ చేస్తుంది.
కవరేజ్ థర్డ్ పార్టీ కవరేజ్ కారు ఇన్సూరెన్స్ మరియు బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు థర్డ్ పార్టీల గాయాలు మరియు వారి వాహనానికి ఏర్పడే నష్టాలకు పరిమితం చేయబడ్డాయి. సమగ్ర ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ నష్టాలు, గాయాలు మరియు పాలసీదారు, అతని వాహనానికి జరిగిన నష్టాలు మరియు గాయాలను కవర్ చేసే మరింత సమగ్ర విధానాన్ని కలిగి ఉంటుంది.
యాడ్-ఆన్‌ల కోసం పరిధి యాడ్-ఆన్‌ల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌కు ఎటువంటి పరిధి లేదు. మీ అవసరాలకు అనుగుణంగా ఒక సమగ్ర పాలసీని రూపొందించవచ్చు. వ్యక్తిగత గాయం ప్రొటెక్షన్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ రీప్లేస్‌మెంట్, జీరో డిప్రిసియేషన్ కవర్ వంటి సమగ్ర పాలసీలలో యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవన్నీ అధిక ప్రీమియం ధరతో లభిస్తాయి, కానీ ఒక ఎంపిక అందుబాటులో ఉంది.
ప్రయోజనాలు ● థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది రహదారిపై వాహనాన్ని నడపడానికి ఉన్న కనీస ఆవశ్యకత కాబట్టి ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుగుణంగా మీకు సహాయపడుతుంది ● ఇది థర్డ్-పార్టీకి గల ప్రమాదాలకు సంబంధించిన ఆర్థిక ప్రమాదం నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. ● ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన సందర్భంలో మీ సేవింగ్స్‌ను కోల్పోకుండా, మీకు మనశ్శాంతిని అందిస్తుంది. ●        థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ అనేది ఒక సమగ్ర పాలసీతో పోలిస్తే తక్కువ ప్రీమియం ఉంటుంది మరియు ఖర్చుకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది. ● ఇది థర్డ్-పార్టీ ఖర్చులతో పాటు మీ వాహనం యొక్క నష్టాలను కవర్ చేస్తుంది. ● మీరు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు మరియు మీ అవసరాలకు అనుగుణంగా మీ పాలసీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ● వరదలు, అగ్నిప్రమాదం మరియు దొంగతనం వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో జరిగే నష్టాన్ని ఇది కవర్ చేస్తుంది. ● మీరు యాడ్-ఆన్‌లను ఎంచుకుంటే, ఇది అవసరమైన సమయాల్లో చాలా ఉపయోగకరంగా ఉండే రోడ్డు అసిస్టెన్స్ మరియు జీరో డిప్రిసియేషన్ కవర్‌ను కూడా అందిస్తుంది. ● థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
పరిమితులు ● థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ ఎదుర్కొంటున్న ప్రధాన డ్రాబ్యాక్ ఏంటంటే ఇది పాలసీదారు వాహనానికి ఏర్పడే నష్టాలను కవర్ చేయదు. ● దొంగతనం లేదా అగ్నిప్రమాదం వంటి పరిస్థితుల విషయంలో, ఈ పాలసీ మిమ్మల్ని రక్షించదు. ● వాహనం యొక్క సాధారణ వయస్సు, అరుగుదల మరియు తరుగుదల కారణంగా జరిగిన నష్టాలను ఇది కవర్ చేయదు. ● ఈ ఇన్సూరెన్స్‌లో కొన్ని వాహన భాగాలు కవర్ చేయబడవు. కాబట్టి ఆ విడిభాగాలకు ఏవైనా నష్టాలు జరిగితే, కారు ఇన్సూరెన్స్ కంపెనీ కాకుండా యజమాని స్వయంగా భరించాలి. ● అణు దాడులు లేదా యుద్ధం వంటి సంఘటనల కారణంగా జరిగిన నష్టాల విషయంలో పాలసీ ఉపయోగపడదు.
మినహాయింపులు ● మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వలన జరిగిన నష్టాలు ● డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు ● యాక్సిడెంట్ ఒక ఉద్దేశపూర్వక చర్య అని రుజువు చేయబడినప్పుడు ● చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం వాహనం ఉపయోగించబడినప్పుడు ● ప్రమాదం కాకుండా ఏదైనా పరిస్థితి కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు. అంటే ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తు నష్టాలు చెల్లించబడవు. ● మద్యం తాగి డ్రైవ్ చేసే సందర్భాల్లో జరిగిన నష్టాలు. ● ఒక వ్యక్తి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ● పర్యవసాన నష్టాలు, అంటే, యాక్సిడెంట్ తర్వాత సంభవించే నష్టాలు, ప్రత్యేకంగా యాడ్-ఆన్‌గా తీసుకోకపోతే తప్ప కవర్ చేయబడవు. ● మెకానికల్ బ్రేక్‌డౌన్ కారణంగా జరిగిన నష్టాలు సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీలో భాగం కావు. ● యుద్ధం లేదా తిరుగుబాటు లేదా అణు దాడి ● యాక్సిడెంట్ ఒక ఉద్దేశపూర్వక చర్య అయితే ● చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం ఉపయోగించే వాహనం కారణంగా జరిగిన నష్టాలు లేదా డ్యామేజీలు
  తరచుగా అడిగే ప్రశ్నలు: “నేను 10 సంవత్సరాల నాటి సెకండ్-హ్యాండ్ కారును నడుపుతున్నాను. సమగ్ర లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏది మెరుగైనది?” నైనా అడిగారు. మీ కారు సెకండ్-హ్యాండ్ మరియు 10 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే, దాని అసలు విలువతో పోలిస్తే కారు విలువ గణనీయంగా తక్కువగా ఉన్నందున థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ సరిపోతుంది మరియు నష్టాలు మీకు భారంగా ఉండవు. “నాకు ఒక కొత్త మరియు ఖరీదైన కారు ఉంది, మరియు నేను నా పనిప్రదేశానికి క్రమం తప్పకుండా డ్రైవ్ చేస్తాను. సమగ్ర లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీలలో ఏది మెరుగైనది?” పరేష్ అడిగారు. కారు విలువ ఎక్కువగా ఉన్నందున మరియు కొత్తది కాబట్టి ఒక సమగ్ర పాలసీని కలిగి ఉండటం మంచిది, ఒక వేళ కారుకు ఏదైనా నష్టం జరిగితే, అది మీకు భారం కావచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి