అనేక ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశంతో, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలతో వారి సాంప్రదాయక బైక్‌లను భర్తీ చేశారు. ఇది ఒక తక్కువ ఖర్చు అయ్యే మరియు పర్యావరణ-అనుకూలమైన ఎంపిక. మీరు ఎలక్ట్రిక్ బైక్‌ని కలిగి ఉంటే లేదా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, దాన్ని నడపడానికి మీకు లైసెన్స్ అవసరమా అని ఆశ్చర్యపోవచ్చు. నిరంతరం మారుతున్న రవాణా చట్టం పై అవగాహనను కలిగి ఉండడం కష్టంగా ఉండవచ్చు. చాలామంది వ్యక్తులు సాధారణ వాహనాల కోసం డ్రైవర్ లైసెన్స్ గురించి ఉన్న చట్టం మరియు ఆవశ్యకతను తెలుసుకుంటారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు దానికి సంబంధించిన చట్టం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. అలాగే, వారు దేశంలో
ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ ను ఎలా కొనుగోలు చేయాలో అర్థం చేసుకోవాలని అనుకోవచ్చు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌కు లైసెన్స్ అవసరమా?
మీరు ఏదైనా ఎలక్ట్రిక్ బైక్‌ను రైడ్ చేయాలనుకుంటే, మీకు మోటార్‌సైకిల్ లైసెన్స్ అవసరం. తక్కువ వేగం పరిమితి ఉన్న వాటికి మాత్రమే మినహాయింపు ఉంది. మీకు మోటార్ సైకిల్ లైసెన్స్ ఉన్నప్పుడు, మీరు ఒక టూ-వీల్డ్ మోటార్ సైకిల్‌ను మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. అయితే, ఇది బైక్ కాకుండా ఎలక్ట్రిక్ కారు లేదా ఏదైనా ఇతర ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపడానికి చెల్లదు. వివిధ హార్స్‌పవర్, వేగాలు మరియు ఫీచర్లతో టూ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత శ్రేణి ఉంది. ఎలక్ట్రిక్ బైకులు, ఇ-బైకులు, మరియు స్కూటర్లను కూడా తరచుగా ఎలక్ట్రిక్ మోటర్‌బైకులుగా పేర్కొనడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది. అలాగే, మోటార్ సైకిళ్లు మోటార్ బైక్లుగా సూచించబడతాయి మరియు చట్టంలో ఉన్న అస్పష్టత ఉన్న కారణంగా, ఇది కొందరిలో గందరగోళం సృష్టించవచ్చు. మీకు ఉన్న ఎలక్ట్రిక్ బైక్ రకంతో సంబంధం లేకుండా, మీరు ఖచ్ఛితంగా కలిగి ఉండవలసినవి ఒక లైసెన్స్ మరియు ఒక
ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. మీరు నివసిస్తున్న రాష్ట్ర నిబంధనలను కూడా తెలుసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా, బైక్ తయారీదారు ఎలక్ట్రిక్ బైక్ యొక్క చట్టపరమైన అవసరాలకు సంబంధించి మీకు మార్గనిర్దేశం చేయవచ్చు.
1. భారతదేశంలో లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్‌లు
గరిష్టంగా 250 వాట్స్ ఉత్పత్తి లేదా గరిష్టంగా 25కెఎంపిహెచ్ వేగం కలిగిన ఒక ఎలక్ట్రిక్ టూ-వీలర్ కోసం ప్రస్తుత నిబంధనల ప్రకారం డ్రైవర్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే, ఇ-స్కూటర్లు ఒక '' గా వర్గీకరించవలసిన అవసరాలను తీర్చవు
మోటార్ వాహనం’. *
2. భారతదేశంలో లైసెన్స్ అవసరమైన ఎలక్ట్రిక్ బైక్‌లు
250 కంటే ఎక్కువ వాట్స్ ఉత్పన్నం చేసే మోటార్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లకు భారతదేశంలో లైసెన్స్ అవసరం. అలాగే, మీ ఎలక్ట్రిక్ బైక్ 25 కెఎంపిహెచ్ కంటే ఎక్కువ టాప్ స్పీడ్‌లో వెళ్లగలిగితే, మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ఈ వాహనాలను రిజిస్టర్ చేసుకోవాలి. మీరు మీ ఎలక్ట్రిక్ బైక్ కోసం అందుబాటులో ఉన్న ఫేమ్-II రాష్ట్ర-నిర్దిష్ట సబ్సిడీల గురించిన వివరాలను చూడాలి. *ఫేమ్-II అనేది మూడు సంవత్సరాల సబ్సిడరీ కార్యక్రమంలో రెండవ దశ. రెండవ దశ పబ్లిక్ మరియు షేర్ చేయబడిన రవాణా విద్యుత్ కోసం మద్దతును అందించడం లక్ష్యంగా కలిగి ఉంది. మీరు ఒక ఎలక్ట్రిక్ బైక్ కలిగి ఉన్నందున, మీరు దానికి అర్హత పొందవచ్చు. కాబట్టి, "ఎలక్ట్రిక్ బైక్ కోసం మాకు లైసెన్స్ అవసరమా?" అనే ప్రశ్న ఎదురైనప్పుడు, మీకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ రకాన్ని బట్టి సమాధానం ఉంటుంది. మీరు లైసెన్స్ లేకుండా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనం కోసం చూస్తున్నట్లయితే, మీకు తక్కువ-వేగం ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఇతర చట్టాలు మరియు వయస్సు పరిమితులు
మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు లైసెన్స్ అవసరమా లేదా అని మీరు అర్థం చేసుకున్న తర్వాత, తదుపరి దశ ఒక ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన ఇతర చట్టాలు మరియు వయస్సు పరిమితులను అర్థం చేసుకోవడం. ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించి లైసెన్స్ కాకుండా ఇతర కొన్ని అవసరమైన పాయింటర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం రైడింగ్ వయస్సు పరిమితి 16 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ. *
- ఇ-స్కూటర్ లైసెన్స్ పొందడానికి 16 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న టీనేజర్లు అవసరమైన పరీక్షకు హాజరు కావాలి. *
- ఇంజిన్ పరిమాణం 50సిసి కి పరిమితం చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పొందడానికి 16 నుండి 18 సంవత్సరాల వయస్సు సమూహం అనుమతించబడుతుంది. *
- ఎలక్ట్రిక్ టూ-వీలర్ బైక్‌లకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్ ఉంటుంది. *
ప్రస్తుత సమయాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు అత్యంత ప్రాధాన్యతగల వాహనాలు. ఎలక్ట్రిక్ బైక్ గురించి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎటువంటి పొగ లేదా ఇతర విష పదార్థాలను ఉత్పత్తి చేయదు. ఎలక్ట్రిక్ బైక్‌లు అందించే అనేక ప్రయోజనాల కారణంగా, అవి భారతదేశంలో చాలా ప్రముఖమైనవిగా మారాయి. ఎలక్ట్రిక్ వాహనం కోసం మీకు అవసరమైన లైసెన్స్‌తో పాటు, మీరు ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌ను కూడా కలిగి ఉండాలి. మీకు ఎలక్ట్రిక్ బైక్ ఉంటే, థర్డ్-పార్టీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, మీరు మొత్తం కవరేజీని కోరుకుంటే, మీరు ఒక సమగ్ర ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఒక సమగ్ర కవర్‌తో, సాధారణంగా మీ కారును నిర్వహించడానికి మరియు ఏదైనా విపత్తుల నుండి రక్షించడానికి ఏర్పడే అన్ని ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడతాయని నిశ్చింతగా ఉండండి.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి