రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Duplicate RC Book: Online & Offline Process
జనవరి 22, 2021

డూప్లికేట్ ఆర్‌సి బుక్‌ని ఎలా పొందాలి: ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రక్రియ వివరించబడింది

మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి) అనేది మీ వాహనం భారత ప్రభుత్వంతో రిజిస్టర్ చేయబడినట్లు పేర్కొనే ఒక అధికారిక డాక్యుమెంట్. డ్రైవింగ్ లైసెన్స్ లాగానే ఇది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ మరియు మీ టూ-వీలర్‌ను రైడ్ చేసిన ప్రతిసారీ దానిని వెంట తీసుకువెళ్లవలసి ఉంటుంది. మీరు ఆర్‌సి అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నట్లయితే, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనగా మీ వాహనం మీ రాష్ట్ర ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టిఒ) వద్ద రిజిస్టర్ చేయబడింది అని అర్థం. సర్టిఫికెట్ ఒక పుస్తకం రూపంలో ఉంటుంది, అంటే ఆర్‌సి పుస్తకం లేదా ఒక స్మార్ట్ కార్డ్, అంటే ఆర్‌సి కార్డ్. ఆర్‌సి పుస్తకం లేదా కార్డ్ మీ వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది, అవి:
  • రిజిస్ట్రేషన్ తేదీ
  • ఛాసిస్ నంబర్
  • మీరు కలిగి ఉన్న వాహనం రకం
  • మీ వాహనం యొక్క మోడల్ నంబర్
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • ఇంజిన్ నంబర్
  • వాహనం రంగు
  • సీటింగ్ సామర్థ్యం

వాహన రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

మీ వాహనాన్ని బహిరంగా ప్రదేశాలలో ఉపయోగించడానికి ముందు, మీకు సమీపంలోని ఆర్‌టిఒ కింద దానిని రిజిస్టర్ చేయాలి. సాధారణంగా, ఒక టూ-వీలర్‌ని కొనుగోలు చేసినప్పుడు, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఆటోమొబైల్ డీలర్‌షిప్ ద్వారా చేయబడుతుంది. అంటే, వాహనం కొనుగోలుదారులు వారికి సమీపంలోని ఆర్‌టిఒ వద్ద తమ వాహనాన్ని వారే రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ టూ-వీలర్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • అప్లికేషన్ ఫారం (ఫారం 20)
  • సేల్స్ సర్టిఫికెట్ (ఫారం 21)
  • రహదారి యోగ్యత సర్టిఫికెట్ (ఫారం 22)
  • పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పియుసి)
  • టూ-వీలర్ కొనుగోలుదారు యొక్క పాన్ కార్డ్
  • చిరునామా రుజువు
  • దిగుమతి చేసుకున్న వాహనం అయితే కస్టమ్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్
  • తయారీదారు మరియు డీలర్ ఇన్వాయిస్
  • గుర్తింపు రుజువు
  • ఇన్సూరెన్స్ కవర్ నోట్ కాపీ
  • ఒక వేళ వర్తిస్తే: యజమాని మరియు ఫైనాన్షియర్ సంతకం చేసిన ఫారం 34
  • వర్తించే పన్నులు మరియు ఫీజు
  • తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ
పైన పేర్కొన్న డాక్యుమెంట్ల జాబితా సాధారణమైనది అని గుర్తుంచుకోండి. సమర్పించవలసిన డాక్యుమెంట్లు ఆర్‌టిఒ యొక్క నియమాల ఆధారంగా భిన్నంగా ఉండవచ్చు. ఇవి కూడా చదవండి: పియుసి సర్టిఫికెట్: మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

మీ ఆర్‌సి కార్డు లేదా బుక్‌ను పోగొట్టుకుంటే ఏమి చేయాలి?

మీ ఆర్‌సి ని పోగొట్టుకున్నట్లయితే లేదా అది దొంగిలించబడితే, మీరు ఆర్‌సి బుక్ యొక్క డూప్లికేట్ కాపీని పొందాలి. దానిని పొందడం చాలా సులభం మరియు అందుకోసం ఈ కింద ఉన్న డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలి:
  • పోలీస్ స్టేషన్ నుండి ఆర్‌సి కార్డు పోయినట్లుగా వ్రాయబడిన చలానా యొక్క కాపీ
  • మీ బైక్ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
  • మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • అప్లికేషన్ ఫారం
  • ఒకవేళ మీరు రుణం తీసుకున్నట్లయితే, బ్యాంక్ నుండి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఒసి)
  • ఎమిషన్ టెస్ట్ పేపర్ కాపీ
  • వయస్సుతో పాటు మీ చిరునామా రుజువు
  • మీ వాహనం కొనుగోలుని చూపే కాగితం

డూప్లికేట్ ఆర్‌సి బుక్ కోసం అప్లై చేసే ప్రక్రియ

Parivahan Sewa వెబ్‌సైట్ పై ఆన్‌లైన్‌లో లేదా మీకు సమీపంలోని ఆర్‌టిఒ కేంద్రం వద్ద ఆఫ్‌లైన్‌లో మీరు డూప్లికేట్ ఆర్‌సి బుక్ కోసం అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి మీరు క్రింద ఇవ్వబడిన సాధారణ దశలను అనుసరించాలి:
  1. మొదట, మీ ఆర్‌సి కార్డును మీరు పోగొట్టుకున్నారని పేర్కొంటూ చలాన్ జారీ చేయడానికి ఒక పోలీస్ ఫిర్యాదును ఫైల్ చేయండి.
  2. సూచించబడిన ఫారంలో, అనగా ఫారం 26లో డూప్లికేట్ ఆర్‌సి బుక్ కాపీ కోసం ఒక అప్లికేషన్ తప్పనిసరిగా చేయాలి. ఆర్‌టిఒ వెబ్‌సైట్ నుండి ఒక పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  3. రుణాల విషయంలో, ఒక ఆర్థిక సంస్థ లేదా బ్యాంక్ అయిన రుణదాత నుండి మీరు ఒక ఎన్ఒసి ని పొందాలి.
  4. మీ టూ-వీలర్ యొక్క అన్ని వివరాలను కలిగి ఉన్న ఒక అఫిడవిట్‌ను మీరు తప్పక పొందాలి. మీకు డూప్లికేట్ ఆర్‌సి అప్లికేషన్ అవసరం ఎందుకు ఏర్పడింది అనేదానికి కారణాన్ని తప్పకుండా జోడించండి.
  5. అప్పుడు మీరు నింపబడిన ఫారం-26తో డాక్యుమెంట్లను జతచేయవలసి ఉంటుంది. తర్వాత ధృవీకరణ కోసం, దానిని ఆర్‌టిఒ అధికారికి సబ్మిట్ చేయండి.
  6. ధృవీకరణ పూర్తయిన తర్వాత, ఫైల్ పై అధికారి సంతకం చేస్తారు.
  7. ఆ తరువాత, గుర్తింపు ధృవీకరణ కోసం మీరు అసిస్టెంట్ ఆర్‌టిఒ ను సందర్శించాలి / అవసరమైన సర్వీస్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి
  8. అవసరమైన ఫీజును చెల్లించిన తర్వాత, క్యాషియర్ మీకు రసీదును అందజేస్తారు.
  9. సూపరింటెండెంట్ కార్యాలయానికి రసీదును తీసుకుని వెళ్లి దాని పై వారి సంతకం పొందండి.
  10. చివరిగా, సూపరింటెండెంట్ నుండి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తీసుకోండి. మీరు ఆర్‌సి యొక్క డూప్లికేట్ కాపీని పొందే తేదీ అదే స్లిప్‌లో పేర్కొనబడుతుంది.
పై ఆర్టికల్ పోయిన ఆర్‌సి బుక్‌కు సంబంధించి మీ అన్ని ప్రశ్నలను పరిష్కరించింది అని ఆశిస్తున్నాము. సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి దృష్టిలో ఉంచుకోండి, పని సులువుగా అయిపోతుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి