రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
hit-and-run accident guide
24 మార్చి, 2023

హిట్-అండ్-రన్ యాక్సిడెంట్: బాధితులు మరియు నేరస్తుల సంబంధిత పూర్తి వివరాలు

భారతదేశంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న కారణంగా, ఆన్-రోడ్ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ప్రమాదాలనేవి ఇతర వాహనాల మీద గీతలు పడడం లాంటి చిన్న సంఘటనలు కావచ్చు. లేదంటే, థర్డ్ పార్టీ వాహనానికి సొట్టలు పడడం లేదా వారికి గాయాలు కావడం లాంటి తీవ్ర సంఘటనలుగా కూడా ఉండొచ్చు. మీ కారుకి జరిగిన ప్రమాదంలో మీరు బాధితులుగా ఉండొచ్చు లేదా మీరే నేరం చేసి ఉండొచ్చు. మీరు ఆ ప్రమాదంలో బాధితులైతే లేదా ఆ ప్రమాదానికి మీరే కారణమైతే, అంటే మీరే నేరస్థుడు అయితే, ఆ పరిస్థితిని నిర్వహించడానికి సరైన మార్గమేమిటి? దానికోసం పరిహారాన్ని మీ కార్ ఇన్సూరెన్స్ అందిస్తుందా? దీని గురించి మరింత అర్థం చేసుకుందాం.

మీరు బాధితుడైనప్పుడు ఏం చేయాలి?

ఈ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోండి: మీరు మీ వాహనాన్ని వీధిలో ఒక పక్కగా పార్కింగ్ చేసి, ఏదో పని కోసం వెళ్లారు. మీరు మీ కారు వద్దకి తిరిగి వచ్చారు మరియు కారు స్టార్ట్ చేసి ముందుకి వెళ్తున్నారు. అంతలో, వెనుక నుండి వేగంగా వస్తున్న కారు ఒకటి అస్సలు ఆగకుండా మీ కారుని రుద్దుకుంటూ వెళ్లిపోయింది. దాంతో, మీ కారు సైడ్-వ్యూ మిర్రర్ విరిగిపోయింది మరియు కారు బంపర్ ఒక వైపు దెబ్బతింది అది మీరు గమనించారు. నేరస్థుడు మీ వాహనాన్ని దెబ్బతీసి, తప్పించుకుని వెళ్లిపోయాడు కాబట్టి, అది హిట్-అండ్-రన్ కేస్‌గా పరిగణించబడుతుంది.

ఇప్పుడు మీ వద్ద ఏ ఎంపికలు ఉంటాయి?

మీరు క్రింది ఎంపికలను పరిగణనలోకి తీసుకోవచ్చు:
  1. మీరు లేదా మీ సహ-ప్రయాణీకులు గాయపడితే, వెంటనే సహాయం కోసం కాల్ చేయండి. సహాయం అందుకోవడం కోసం ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేయండి. దీని కోసం మీరు అటుగా వెళ్లే వారి సహాయం కూడా తీసుకోవచ్చు.
  2. జరిగిన ప్రమాదం గురించి వెంటనే పోలీసులకు తెలియజేయండి. యాక్సిడెంట్‌కు కారణమైన వాహనం గురించి వివరాలు అందించడంలో మీరు సహాయపడితే, ఏదైనా చెక్‌పాయింట్లలో పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించగలరు.
  3. మీరు వాహనం నంబర్ ప్లేట్‌ చూడకపోయినప్పటికీ, వాహనం గురించిన ఇతర వివరాలనేవి ఈ విషయంలో సహాయపడగలవు. కారు బ్రాండ్ లేదా మోడల్ లేదా దాని కలర్ లాంటివి ఈ వివరాల్లో ఉండవచ్చు.
  4. ప్రమాదం జరిగిన తర్వాత, మీ ఇన్సూరర్‌ను సంప్రదించండి. మీ వద్ద ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌‌ ఉంటే , నష్టాల కోసం మీకు పరిహారం లభించవచ్చు. మీ కారుకు జరిగిన నష్టానికి సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు తీసుకోండి. ఎందుకంటే, నష్టం అంచనా వేయడంలో మరియు తగినంత పరిహారం అందించడంలో అది ఇన్సూరర్‌కు సహాయపడగలదు. *
  5. మీరు ఒక న్యాయవాదిని కూడా సంప్రదించవచ్చు. క్లెయిమ్ ప్రాసెస్‌లో ఉత్పన్నమయ్యే ఏవైనా అవాంతరాల విషయంలో లాయర్ మీకు సహాయం చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, నేరస్తులను అధికారులు పట్టుకుంటే, వారి మీద బలంగా కేసు పెట్టడంలో లాయర్ మీకు సహాయపడగలరు. 

ఒక బాధితుడిగా మీరు క్లెయిమ్ ఫైల్ చేయవచ్చా?

అవును, మీరు హిట్-అండ్-రన్ ప్రమాదానికి గురైనప్పుడు, మీ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కి క్లెయిమ్ ఫైల్ చేయడమనేది మీ హక్కుల్లో భాగంగా ఉంటుంది. క్లెయిమ్ ఫైల్ చేయడం కోసం, మీరు:
  1. ప్రమాదం గురించి మీ ఇన్సూరర్‌కు తెలియజేయండి.
  2. ఫోటోలు మరియు వీడియోలు తీయడం ద్వారా, నష్టాలను డాక్యుమెంట్ చేయండి.
  3. ఫారంతో పాటుగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందించండి. మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, పోలీస్ ఎఫ్ఐర్ ఇందులో భాగంగా ఉంటుంది.
  4. ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చే సర్వేయర్‌తో మీ వాహనం తనిఖీ చేయించుకోండి.
  5. మీ కారును మరమ్మత్తు చేయించుకోండి మరియు ఇన్సూరర్ ద్వారా పరిహారం పొందండి. * 

నేరస్థుడిగా ఏమి చేయాలి?

చాలా సందర్భాల్లో, ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సహాయం లేదా పరిహారం అందించకుండానే ఆ ప్రమాద కారకులైన వ్యక్తులు ఆ ప్రదేశం నుండి పారిపోతుంటారు. దానివల్ల, ఆ నేరస్థుడికి భవిష్యత్తులో తీవ్రమైన చట్ట సమస్యలు ఎదురుకావచ్చు. ఏదైనా ప్రమాదానికి మీ వాహనం కారణమైతే, అప్పుడు మీరు అపరాధి అవుతారు. అప్పుడు మీరు ఇలా చేయవచ్చు:
  1. ప్రమాద ప్రదేశం నుండి పారిపోకండి. మీ వాహనాన్ని పక్కకి పార్క్ చేయండి మరియు బాధితుడికి ఏవైనా గాయాలు తగిలితే, సహాయం చేయండి. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి.
  2. ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులను సంప్రదించండి. ప్రమాదం తర్వాత, మీరు పారిపోతే, పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే, ఆ తర్వాత మీరు అనేక సమస్యల్లో చిక్కుకోవడం ఖాయం.
  3. మీ వద్ద థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌‌ ‌ఉంటే, మీ ఇన్సూరర్‌కు తెలియజేయండి. మీరు మీ జేబు నుండి చెల్లించడానికి బదులుగా, మీ ఇన్సూరర్ ద్వారా థర్డ్-పార్టీకి పరిహారం లభిస్తుంది. *
  4. అధికారులకి లేదా మీ ఇన్సూరర్‌కి తెలియజేయకుండా మీరు అక్కడి నుండి పారిపోతే, మీరు లాయర్‌ని సంప్రదించవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ఉత్పన్నమయ్యే చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవడంలో వారు మీకు సహాయపడగలరు. మీకు అవకాశం ఉన్న ఏవైనా ఎంపికల గురించి అంచనా వేయడంలో కూడా వారు మీకు సహాయపడగలరు. 

ముగింపు

ప్రమాదాలనేవి ఊహించలేనివే అయినప్పటికీ, అన్ని నియమాలను అనుసరించడం మరియు రహదారి భద్రతను నిర్వహించడమనేది కారు యజమానిగా మీ బాధ్యత. మీరు బాధితుడు అయినప్పటికీ, లేదా ఒక అపరాధి అయినప్పటికీ, మీ కారు కోసం మోటార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ముఖ్యం. మీ వద్ద లేకపోతే, ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ‌ను ఉపయోగించారు అని నిర్ధారించుకోండి మరియు మీ పాలసీని కొనుగోలు చేయండి. మీరు ఎంచుకున్న పరామితులు మరియు మీరు అందించే సమాచారం ఆధారంగా, క్యాలిక్యులేటర్ మీకు ఒక కోట్‌ అందిస్తుంది. అందించబడిన కోట్ మీ బడ్జెట్‌కు సరిపోతే, మీరు ముందుకు కొనసాగడం ద్వారా, పాలసీ కొనుగోలు చేయవచ్చు. అలా కాని పక్షంలో, దానికి బదులుగా మీరు వేరొక ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవచ్చు. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి