ప్రతి సంవత్సరం, భారతదేశంలోని రోడ్ల మీదకు, ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లోని రోడ్ల మీదకు పెద్ద సంఖ్యలో వాహనాలు కొత్తగా వస్తున్నాయి. అలాంటి పెరుగుదల అనేది ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల మీద భారం కలిగిస్తుంది మరియు తరచుగా రహదారుల మీద రద్దీకి దారితీయవచ్చు. రద్దీ రోడ్ల మీద తరచుగా ప్రమాదాలు జరగవచ్చు మరియు అలాంటి పరిస్థితిలో మీ కారు దెబ్బతిన్నా లేదా మరొక కారుకి నష్టం జరిగినా, మరమ్మత్తు మరియు పరిహారం కోసం చాలా ఖర్చు చేయాల్సి రావచ్చు. బదులుగా, మీ కారు కోసం
సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం వలన, అలాంటి ఆర్థిక మరియు చట్టపరమైన అంశాలను ఎదుర్కోవడంలో మీకు ఆర్థిక సహాయం అందించడానికి ఇది సహాయపడుతుంది.
కార్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?
ప్రమాదంలో మీ కారు దెబ్బతింటే, ఆ నష్టాలను మీరు మరమ్మత్తు చేయాల్సి ఉంటుంది. మీకు కారు ఇన్సూరెన్స్ లేకపోతే, మరమ్మత్తుల కోసం మీరు మీ జేబు నుండి చెల్లించాల్సి ఉంటుంది. మీకు సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ఉంటే, మరమ్మత్తు ఖర్చును ఆ పాలసీ కవర్ చేస్తుంది. మీ కారు కారణంగా, థర్డ్-పార్టీ వాహనానికి నష్టం జరిగితే, ఆ నష్టాల కోసం మీరు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏవైనా గాయాలు తగిలితే లేదా మరణం సంభవిస్తే, ఆ చట్టపరమైన బాధ్యతల ఖర్చును కూడా మీరే కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే, మీకు
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉంటే, యాక్సిడెంట్ కారణంగా ఎదురయ్యే థర్డ్-పార్టీ నష్టాలు మరియు ఇతర బాధ్యతల ఖర్చును ఈ పాలసీ కవర్ చేస్తుంది.
కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?
మీ కారు దెబ్బతిన్న సందర్భంలో లేదా ప్రమాదంలో నష్టం జరిగిన సందర్భంలో, మీరు పరిహారం కోసం క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. మీ వద్ద
ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ ఉంటే, క్లెయిమ్ ఫైల్ చేయడానికి అనుసరించవలసిన దశలు ఇవి:
ఇన్సూరర్‌కు తెలియజేయండి
క్లెయిమ్ ప్రాసెస్‌ను ప్రారంభించడమనేది మొదటి దశగా ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత, దాని గురించి మీ ఇన్సూరర్‌కు తెలియజేయడం మీ బాధ్యతగా ఉంటుంది. రెండు మాధ్యమాల ద్వారా మీరు మీ ఇన్సూరర్‌ను సంప్రదించవచ్చు:
- వారి క్లెయిమ్స్ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా
- వారి వెబ్‌సైట్‌లోని క్లెయిమ్స్ విభాగం ద్వారా
పోలీసులకు తెలియజేయండి
ప్రమాదం జరిగిన తర్వాత, ఆ యాక్సిడెంట్ గురించి మీరు పోలీసులకు తెలియజేయాలి. జరిగిన నష్టాలు చిన్నవి అయితే, ఎఫ్‌ఐఆర్ అవసరం కాకపోవచ్చు. అయితే, మీకు లేదా థర్డ్-పార్టీ వాహనానికి భారీ నష్టం జరిగితే, మీరు దానిని ఫైల్ చేయాల్సి ఉంటుంది. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎఫ్ఐఆర్ కాపీ అవసరం కాబట్టి, ఈ విషయం గురించి మీ ఇన్సూరర్ నుండి స్పష్టంగా నిర్ధారించుకోండి.
సాక్ష్యాలను సేకరించండి
మీ వాహనానికి జరిగిన నష్టం సంబంధిత ఫోటోలు మరియు వీడియోలు తీసుకోండి. థర్డ్-పార్టీ వాహనం విషయంలోనూ అదేవిధంగా చేయండి. మీరు పేర్కొన్న నష్టాలను ధృవీకరించడానికి ఇన్సూరెన్స్ సంస్థకు ఇది అవసరం.
డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి
మీరు పూర్తి సమాచారం సేకరించిన తర్వాత, మీ పాలసీ డాక్యుమెంట్ కాపీ, ఎఫ్ఐఆర్ మరియు మీరు తీసుకున్న ఫోటోలు మరియు వీడియోలు లాంటి డాక్యుమెంట్లను మీ ఇన్సూరర్‌కు సమర్పించండి. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా, మీ ఇన్సూరర్ మీ క్లెయిమ్‌ను ధృవీకరిస్తారు.
వాహనాలను తనిఖీ చేయించుకోండి
మీ కారుకు జరిగిన నష్టాలు పరిశీలించడం కోసం మీ ఇన్సూరర్ ఒక సర్వేయర్‌ను పంపుతారు. థర్డ్-పార్టీ వాహనం కోసం కూడా అదేవిధంగా చేయబడుతుంది. మీరు క్లెయిమ్‌లో పేర్కొన్న నష్టాలనేవి వాస్తవ నష్టాలతో సరిపోలాయా, లేదా అని వారు తనిఖీ చేస్తారు. అదేసయమంలో, మీ ఇన్సూరర్‌కు అందించే అదనపు సమాచారం కూడా వారు సేకరించవచ్చు.
వాహనాన్ని మరమ్మత్తు చేయించుకోండి
సర్వేయర్ అందించిన అన్ని వివరాలతో ఇన్సూరర్ సంతృప్తి చెంది, మీ క్లెయిమ్‌ను నిజమైనదే అని వారు గుర్తిస్తే, వారు మీకు పరిహారం అందిస్తారు*. ఈ పరిహారం క్లెయిమ్ చేయడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి:
- ఒక గ్యారేజీలో వాహనం మరమ్మత్తు చేయించుకోండి మరియు ఆ మరమ్మత్తు పని కోసం చెల్లించండి. ఆ బిల్లును మీ ఇన్సూరర్‌కు సమర్పించండి మరియు మీకు రీయింబర్స్ చేయబడుతుంది*.
- నెట్‌వర్క్ గ్యారేజీలో వాహనం మరమ్మత్తు చేయించుకోండి. గ్యారేజ్ యజమాని ఇన్సూరర్‌కు బిల్లు పంపుతారు. గ్యారేజీ యజమానితో ఇన్సూరర్ నగదురహిత సెటిల్‌మెంట్ ప్రారంభిస్తారు*.
ఇవి కూడా చదవండి:
కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి యొక్క ముఖ్యమైన అంశాలు
క్లెయిమ్ సెటిల్‌మెంట్ రకాలు
మీరు కలిగి ఉన్న ఇన్సూరెన్స్ రకం బట్టి, క్లెయిములను ఈ విధంగా వర్గీకరించవచ్చు:
- థర్డ్-పార్టీ క్లెయిమ్ - మీ కారు కారణంగా థర్డ్-పార్టీకి జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించబడుతుంది. మీరు మీ స్వంత నష్టాలకు పరిహారం పొందలేరు*.
- ఓన్ డ్యామేజ్ క్లెయిమ్- మీ వాహనానికి జరిగిన నష్టాల కోసం మీకు పరిహారం చెల్లించబడుతుంది. అయితే, థర్డ్-పార్టీకి మీరు మీ జేబులో నుండి పరిహారం చెల్లించాలి*.
- సమగ్ర సెటిల్‌మెంట్ - స్వంత నష్టాలు మరియు థర్డ్-పార్టీ నష్టాలు రెండింటి కోసం పరిహారం ఇవ్వబడుతుంది*.
మీరు కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకుంటే, ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఆ పని చేయవచ్చు:
- ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి
- మీ సంప్రదింపు వివరాలు మరియు మీ కారు వివరాలు అందించండి
- మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇన్సూరెన్స్ రకం ఎంచుకోండి- థర్డ్-పార్టీ లేదా సమగ్రమైనది
- మీరు సమగ్ర ఇన్సూరెన్స్ ఎంచుకుంటే, దానికి రైడర్లను జోడించడం ద్వారా పాలసీని కస్టమైజ్ చేసుకోండి
- ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి
ఈ కొన్ని సులభమైన దశలతో, మీరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు మరియు సొంతం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: బైక్ మరియు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్
ముగింపు
కార్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో మరియు ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఎలా క్లెయిమ్ చేయవచ్చో ఈ దశలు చూపుతాయి. కార్ ఇన్సూరెన్స్ అందించే ఆర్థిక రక్షణను మీరు ఆస్వాదించాలనుకుంటే, మీరు శోధిస్తున్న పాలసీ కోసం ఒక కోట్ పొందడానికి
ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించడం మరచిపోకండి.
ఇవి కూడా చదవండి: కార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి