రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Duplicate Two Wheeler Insurance Copy Online
31 మార్చి, 2021

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కాపీని ఎలా పొందాలి?

మన వాహనానికి, ముఖ్యంగా బైక్ పై ఉన్నప్పుడు, సంబంధించిన డాక్యుమెంట్లను వెంట తీసుకువెళ్ళడానికి ఇష్టపడము అని అందరూ అంగీకరిస్తారు. డాక్యుమెంట్లను స్టోర్ చేయడానికి బైక్ తగినంత స్థలాన్ని అందించదు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లిన ప్రతిసారీ ఒక బ్యాగును వెంట తీసుకువెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలోనే, డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో స్టోర్ చేసే ఆలోచన గొప్పగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. వాహన డాక్యుమెంట్ల డిజిటల్ ఫార్మాట్లను అంగీకరించమని ప్రతి రాష్ట్రం యొక్క ట్రాఫిక్ పోలీస్ విభాగాలకు భారతదేశపు రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా సూచించింది. మీరు ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్లతో సహా దానిని ప్రభుత్వం చేత ఆమోదించబడిన DigiLocker, mParivahan app, లేదా eVahan Bima లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక గొప్ప కార్యక్రమం అయినప్పటికీ, బైక్ ఇన్సూరెన్స్ యొక్క సాఫ్ట్ కాపీ చెల్లుబాటు అవుతుందా అని ప్రజలకు ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి? మరింత సమగ్రమైన సమాధానాన్ని పొందడానికి, మనం కొన్ని లోతైన అంశాలను చూద్దాం.

భారతదేశంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి?

మోటార్ వాహనాల చట్టం భారతదేశంలో ఏదైనా వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఈ క్రింది డాక్యుమెంట్లను వెంట తీసుకువెళ్లడం భారతదేశంలో తప్పనిసరి:
  • డ్రైవింగ్ లైసెన్స్: అన్ని సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్న వాహనం రకాన్ని బట్టి మీ వద్ద ఒక చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • రిజిస్ట్రేషన్ కార్డ్: మీరు డ్రైవ్ చేస్తున్న వాహనం యొక్క ఆర్‌సి ని కలిగి ఉండటం తప్పనిసరి. ఇది డ్రైవ్ చేయబడుతున్న వాహనం యొక్క చట్టబద్ధతను సూచిస్తుంది.
  • వెహికల్ ఇన్సూరెన్స్: వాహనం కోసం ఒక చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండడాన్ని భారతదేశ ప్రభుత్వం తప్పనిసరి చేసింది, దీనిని కలిగి ఉండకపోతే ఒక భారీ బైక్ ఇన్సూరెన్స్ జరిమానా విధించబడే అవకాశం ఉంది.
  • పియుసి సర్టిఫికెట్: చివరగా, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి, అధికారులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మీ వాహనం నడుస్తుంది అని ఇది నిర్దేశిస్తుంది.

నా బైక్ డాక్యుమెంట్లను డిజిటల్‌గా ఎలా స్టోర్ చేయాలి?

బైక్ ఇన్సూరెన్స్ యొక్క సాఫ్ట్ కాపీ మరియు ఇతర డాక్యుమెంట్లను డిజిటల్‌గా ఎలా స్టోర్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? మొదటి పనిగా, Play Store నుండి ప్రభుత్వం అందించే DigiLocker, mParivahan, లేదా eVahan Bima అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ముఖ్యం. ఆ తరువాత, కింద ఇవ్వబడిన దశలను అనుసరించండి:
  1. మీ మొబైల్ నంబర్ నుండి సైన్ అప్ చేయండి మరియు ఆధార్ నంబర్ ఉపయోగించి ధృవీకరించండి.
  2. డ్యాష్‌బోర్డ్ పై, 'అప్‌లోడ్ చేయండి' అని ఉన్న ఎంపికను ఎంచుకోండి.
  3. ఆర్‌సి, పియుసి, డిఎల్ మరియు బైక్ ఇన్సూరెన్స్ సాఫ్ట్ కాపీలను ఎంచుకోండి మరియు అప్లికేషన్‌లోకి వాటిని అప్‌లోడ్ చేయండి.
  4. ఇవ్వబడిన జాబితా నుండి అప్‌లోడ్ చేయబడిన డాక్యుమెంట్ యొక్క ఫైల్ రకాన్ని ఎంచుకోండి.
  5. 'సేవ్ చేయండి' బటన్ పై క్లిక్ చేయండి, పని పూర్తి అవుతుంది.

ఆన్‌లైన్‌లో బైక్ డాక్యుమెంట్లను స్టోర్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు

మీ బైక్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో స్టోర్ చేయడం ద్వారా మీరు పొందగల కొన్ని ప్రయోజనాలు క్రింద పేర్కొనబడ్డాయి:
  • భౌతిక రూపంలో డాక్యుమెంట్లను వెంట తీసుకువెళ్లడం గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
  • ట్రాఫిక్ పోలీస్ మీ డాక్యుమెంట్లను డిజిటల్‌గా ప్రమాణీకరించవచ్చు.
  • డాక్యుమెంట్లను పోగొట్టుకునే లేదా కోల్పోయే భయం ఉండదు.
  • మీ డాక్యుమెంట్లను ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

నా వద్ద నా బైక్ డాక్యుమెంట్ల భౌతిక కాపీలు కాకుండా సాఫ్ట్ కాపీలు ఉంటే నాకు చలానా విధిస్తారా?

ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. DigiLocker, mParivahan, లేదా eVahan Bima యాప్‌లో ధృవీకరించబడిన మరియు స్టోర్ చేయబడిన డాక్యుమెంట్లను మీరు చూపించవచ్చు. ఈ యాప్‌లు అన్నీ భారతదేశ ప్రభుత్వం ద్వారా అందించబడుతున్నాయి మరియు ఆయా అథారిటీల ద్వారా నేరుగా జారీ చేయబడిన మీ వాహన డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో కలిగి ఉంటాయి. అందుకే, దేశంలో ఎక్కడైనా మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ ఆపినప్పుడు, ప్రభుత్వం ద్వారా ఆమోదించబడిన ఈ డిజిటల్ యాప్స్ ద్వారా మీ ఆర్‌సి, పియుసి, లైసెన్స్ మరియు బైక్ ఇన్సూరెన్స్ సాఫ్ట్ కాపీని చూపించే హక్కు మీకు ఉంటుంది.

బైక్ ఇన్సూరెన్స్ యొక్క సాఫ్ట్ కాపీని ఎలా పొందాలి?

మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే, మీ బైక్ ఇన్సూరెన్స్ యొక్క సాఫ్ట్ కాపీని పొందడం చాలా సులభం. ఏదైనా డిజిటల్ డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఇవ్వబడిన దశలను అనుసరించవచ్చు.
  1. మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. 'పాలసీ రకం' అనే ఎంపికను ఎంచుకోండి.
  3. పాలసీ నంబర్ లేదా కోరిన ఏదైనా ఇతర వివరాలను నమోదు చేయండి.
  4. ఒక ఓటిపి ద్వారా మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి.
  5. సిస్టమ్ మిమ్మల్ని ప్రమాణీకరించిన తర్వాత, మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు చూడవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. DigiLocker లేదా mParivahan యాప్‌లో స్టోర్ చేయబడకపొతే, నా బైక్ డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలు అంగీకరించబడతాయా?
దురదృష్టవశాత్తు, లేదు. ప్రభుత్వం ఆమోదించిన డిజిటల్ అప్లికేషన్లలో నిల్వ చేయబడిన డాక్యుమెంట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయి.
  1. నా బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సురక్షితమేనా?
అవును, మీ బైక్ కోసం ఒక ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం పూర్తిగా సురక్షితం. మీరు బజాజ్ ఇన్సూరెన్స్, Policy Bazaar మొదలైనటువంటి ప్రామాణిక వనరుల నుండి దానిని కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోండి.
  1. నా బైక్ కోసం నేను థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ని మాత్రమే పొందగలనా?
పూర్తి ప్రయోజనాలను పొందడానికి మీ బైక్ కోసం సమగ్ర ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవలసిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే, బైక్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీరు ట్రాఫిక్ చట్టాల పరిధిలో ఉంచడానికి సరిపోతుంది.

ముగింపు

మన ప్రాథమిక ప్రశ్నకు వద్దాము, బైక్ ఇన్సూరెన్స్ యొక్క సాఫ్ట్ కాపీ చెల్లుబాటు అవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును, అవుతుంది. మీ బైక్ డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీ వంద శాతం చెల్లుబాటు అవుతుంది, అయితే అవి ప్రభుత్వం యొక్క అధీకృత అప్లికేషన్లలో డిజిటల్‌గా స్టోర్ చేయబడి ఉండాలి. కాబట్టి, ఈ సారి మీ బైక్ పై మీరు బయటకు వెళ్ళినప్పుడు, బైక్ యొక్క భౌతిక డాక్యుమెంట్లను ఇంటి వద్దనే ఉంచండి మరియు ఇబ్బందులు లేని రైడ్‌ని ఆనందించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి