రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Car Insurance Tax Deduction Guide
30 మార్చి, 2023

కార్ ఇన్సూరెన్స్ కోసం పన్ను మినహాయింపు ఉంటుందా? మా సూచనలు అనుసరించి పొదుపులను గరిష్ఠంగా పెంచుకోండి

ఇన్సూరెన్స్ పాలసీలనేవి ఊహించని ఆర్థిక నష్టాల నుండి రక్షించడానికి ఒక మార్గంగా ఉంటాయి. అది మీ జీవితం, మీ ఆరోగ్యం, మీ ప్రయాణాలు లేదా మీ కారు అయినప్పటికీ, దాని కోసం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు అందుబాటులో ఉంటుంది. అయితే, లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయానికి వస్తే, మీరు చెల్లించిన ప్రీమియంల కోసం ఆదాయపు పన్ను చట్టం కొన్ని మినహాయింపులను అనుమతిస్తుంది. ఇవి సాధారణంగా చాలా మందికి తెలిసినవి మరియు పన్నుల్లో ఆదా చేయడానికి ఉపయోగించబడుతాయి. అయితే, ఈ సౌలభ్యం అనేది తప్పక అనుసరించాల్సిన కొన్ని షరతులకు లోబడి ఉంటుంది. కానీ, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియంల సంగతి ఏమిటి? ఇది మీ పన్ను లెక్కింపులో మినహాయించదగినదిగా ఉంటుందా? ఈ ఆర్టికల్‌లో, కారు ఇన్సూరెన్స్‌కు పన్ను మినహాయింపు ఉంటుందా, ఆ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరికి అర్హత ఉంటుంది మరియు ఆ మినహాయింపును ఎలా క్లెయిమ్ చేయాలనే విషయాలను మేము అన్వేషిస్తాము.

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పన్ను మినహాయింపుతో వస్తుందా?

"కారు ఇన్సూరన్స్‌కు పన్ను మినహాయింపు" ఉంటుందా అనే ప్రశ్నకు 'అవును' మరియు 'లేదు’ అనే సమాధానం చెప్పవచ్చు. మీరు కారును ఉపయోగించే ఉద్దేశ్యం ఆధారంగా, మీరు దాని ప్రీమియం కోసం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలపై మినహాయింపును ఎలా క్లెయిమ్ చేయవచ్చో వివరించే రెండు సందర్భాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
  1. ఈ కారు ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది

మీరు మీ కారును ప్రత్యేకించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న వ్యక్తి అయితే, అప్పుడు మీరు మీ ప్రీమియం మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. ఇది ఎక్కువగా జీతం పొందే వ్యక్తులు వారి పని కోసం కార్లలో ప్రయాణించడానికి వర్తిస్తుంది. యజమాని ద్వారా ట్రావెల్ అలవెన్సులు చెల్లించబడతాయి కాబట్టి, దాని ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద మరింత మినహాయింపును మీరు క్లెయిమ్ చేయలేరు. యజమాని మీకు కారు అందించినప్పటికీ, దీని విషయంలో ఇదే నిజం.
  1. ఈ కారు వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది

మీరు మీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి కారు ఉపయోగిస్తే, మీరు దాని ప్రీమియం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని ఏ విభాగంలోనూ కారు ప్రీమియం మీద మినహాయింపు అనేది నేరుగా అందుబాటులో లేదు. బదులుగా, దానిని మీ వ్యాపార ఖర్చులకు జోడించడం ద్వారా ఆ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. తద్వారా, మీ వ్యాపారం మీద పన్నులు చెల్లించిన తర్వాత, మొత్తం లాభాలను ఇది తగ్గిస్తుంది. కాబట్టి, మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మీద మినహాయింపు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి ప్రత్యక్ష మార్గం లేదు. అయితే, వ్యాపార ఉపయోగం కోసం వారి వాహనాలను ఉపయోగించే నిపుణులు మరియు వ్యాపారవేత్తలు మాత్రమే పైన పేర్కొన్న మార్గాన్ని వినియోగించుకోవచ్చు. వాహనం పూర్తిగా లేదా పాక్షికంగా వ్యాపారం కోసం ఉపయోగించబడుతోందా అనే దానిమీద ఆధారపడి, ప్రీమియం మినహాయింపు అనేది పూర్తిగా లేదా ప్రో-రేటా ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. అలాంటి విభజన గురించిన మరిన్ని వివరాల కోసం, మీరు మీ టాక్స్ ప్రొఫెషనల్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించవచ్చు. **

మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంపై మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు మార్గాలు ఏవి?

  • ఒక సమగ్ర లేదా థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ పై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, మీరు మీ అకౌంట్ల పుస్తకాలను నిర్వహించాలి. అకౌంట్ల పుస్తకాలను నిర్వహించడం అనేది మీ వ్యాపారం కోసం మినహాయించదగిన అన్ని ఖర్చులను మొత్తం అమ్మకాల నుండి తగ్గించడం ద్వారా లాభం నిర్ణయించడాన్ని నిర్ధారిస్తుంది. **
  • అదనంగా, మీ వ్యాపారంలో రూ. 1 కోటికి పైగా టర్నోవర్ ఉంటే, ఒక సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా మీరు మీ అకౌంట్లను ఆడిట్ చేయించుకోవాలి. **
  • మీ అకౌంట్లు సరి చేసిన తర్వాత, పన్ను లెక్కించబడే మొత్తం లాభాల మొత్తం తగ్గించడం కోసం మినహాయించదగిన ఖర్చు క్రింద కారు ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులను క్లెయిమ్ చేయవచ్చు. **
  • మూలం వద్ద మినహాయించబడిన పన్ను ఆధారంగా, మీకు రిఫండ్ చేయబడుతుంది లేదా మీరు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ మీద కూడా పన్ను మినహాయింపు లభిస్తుందా?

ఇన్సూరెన్స్ ప్లాన్‌లనేవి నష్టపరిహారం సూత్రం మీద పనిచేస్తాయి. కాబట్టి, అవి లాభం పొందడానికి ఒక మార్గంలా కాకుండా, నష్టాలకు మంచి చేసే మార్గంగా ఉంటాయి. ఒక పాలసీదారుగా, మీరు క్లెయిమ్ చేసినప్పుడు మీరేమీ లాభాలు అందుకోవడం లేదు. కాబట్టి, ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన క్లెయిమ్ మీద పన్ను విధించబడదు. మీకు జరిగిన ఆర్థిక నష్టానికి ఇన్సూరర్ చెల్లిస్తారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం: శ్రీ సంజయ్‌ గారి వద్ద ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి) రూ. 5 లక్షలుగా కలిగిన నాలుగేళ్ల వయసు కలిగిన ఒక కారు ఉంది. ఒక అగ్నిప్రమాదం కారణంగా, ఆయన కారు మరమ్మత్తు చేయలేనంతగా దెబ్బతింది. దాంతో, పూర్తి నష్టం పేరుతో ఇన్సూరర్‌కి క్లెయిమ్ చేయబడడం వల్ల, పరిహారంగా ఇన్సూరర్ రూ. 5 లక్షలు చెల్లించారు. శ్రీ సంజయ్ గారు తన కారును తన వ్యాపారం కోసం ఉపయోగించినందున, క్లెయిమ్ అనేది మొత్తం ఐడివిని చెల్లించింది. కాబట్టి, ఆ మొత్తం మీద పన్ను విధించబడుతుందని ఆయన భావించారు. కానీ, ఆయనకు చెల్లించబడిన రూ. 5 లక్షల పరిహారంపై ఎలాంటి పన్ను విధించబడలేదు.

కారు కోసం ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండడం తప్పనిసరా?

అవును, దేశంలో రిజిస్టర్ చేయబడిన అన్ని వాహనాలకు మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. భారతదేశంలో చట్టపరంగా వాహనం నడపడానికి, చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పియుసి సర్టిఫికెట్ మరియు చెల్లుబాటు అయ్యే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం అవసరం. ఈ నియమం నుండి కార్లకి ఎలాంటి మినహాయింపు లేదు కాబట్టి, అన్ని కార్ల కోసం కారు ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాలి. అంతేకాకుండా, కారు ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక వన్-టైమ్ ప్రాసెస్ కాదు. కవరేజీని యాక్టివ్‌గా ఉంచడం కోసం, ప్రతి వ్యవధిలో క్రమం తప్పకుండా దానిని రెన్యూవల్ చేయాలి. *

చివరగా

కారును వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే, మినహాయించదగిన ఖర్చుల రూపంలో కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలను క్లెయిమ్ చేయవచ్చు. ఎంచుకోవడానికి వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ, ఏ పాలసీ ఎంచుకోవాలో నిర్ణయించడమనేది గందరగోళంగా అనిపించవచ్చు. అప్పుడు మీరు దీనిని ఉపయోగించవచ్చు కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్. ప్రీమియంల ఆధారంగా కాకుండా ఫీచర్ల ఆధారంగా వివిధ పాలసీలను సరిపోల్చడంలో ఈ సాధనం ఉపయోగపడుతుంది.   ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ** పన్ను ప్రయోజనాలు ప్రబలంగా ఉన్న పన్ను చట్టాల్లో మార్పుకు లోబడి ఉంటాయి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి