రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Original Driving License Compulsory
డిసెంబర్ 5, 2024

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరా?

ఈ డిజిటల్ యుగం, సమాచారాన్ని మరియు డాక్యుమెంట్లను షేర్ చేసే మరియు నిల్వ చేసుకునే మన విధానాలను పూర్తిగా మార్చేసింది. మీరు మీ వాహనానికి సంబంధించిన ప్రధాన డాక్యుమెంట్లను మీ వెంట తీసుకెళ్లాల్సిన రోజులు పోయాయి. ప్రతిదీ డిజిటల్‌గా మారడంతో మీ ముఖ్యమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో స్టోర్ చేయడం చాలా సులభతరమైంది. ఇక్కడే “డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకువెళ్లడం తప్పనిసరా?” అనే ప్రశ్న తలెత్తుతుంది. సూటిగా చెప్పాలంటే, సమాధానం అవును! అయితే, దానిని ప్రదర్శించే మార్గాలు మారవచ్చు. ఈ క్రింద ఉన్న అంశాలను చదివి తెలుసుకుందాం

డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లను తీసుకెళ్లడం తప్పనిసరా?

భారతీయ చట్టం ప్రకారం, మీరు మీ ఒరిజినల్ కారు డాక్యుమెంట్లను పోలీసులకు తప్పనిసరిగా చూపించాలి. అయితే, ఇకపై ఆ డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను చూపించడం తప్పనిసరి కాదు. కేంద్ర మోటారు వాహనాల చట్టం, 1989లో తీసుకొచ్చిన తాజా సవరణలు, డ్రైవర్లు తమ వాహన డాక్యుమెంట్లను భద్రపరచడాన్ని మరియు నిర్వహించడాన్ని సులభతరం చేశాయి. సవరణల ప్రకారం, మీరు మీ డాక్యుమెంట్లను మీ ఫోన్‌లో డిజిటల్ రూపంలో ఉంచుకోవచ్చు. ఇవి హార్డ్ కాపీలకు సమానంగా పరిగణించబడతాయి, ఇకపై మీరు వీటిని మీ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ డాక్యుమెంట్లు సక్రమంగా ధృవీకరించబడితే మాత్రమే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయని ఈ సవరణ పేర్కొంది. మీ వాహన డాక్యుమెంట్లలో ఏదేని డాక్యుమెంట్ యొక్క స్కాన్ చేయబడిన కాపీ చెల్లదు.

డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లను ఎలా ధృవీకరించాలి?

మీరు ఏ డాక్యుమెంట్లు లేకుండా భారతీయ రోడ్ల పై డ్రైవ్ చేయాలనుకుంటే, డాక్యుమెంట్ల సర్టిఫైడ్ ఎలక్ట్రానిక్ వెర్షన్‌లను కలిగి ఉండటం మంచిది. ప్రభుత్వ సంస్థలు అమలులోకి తెచ్చిన మరియు వాటిచే నిర్వహించబడే కొన్ని యాప్‌లు, సర్టిఫైడ్ డాక్యుమెంట్లను పొందడానికి సహాయపడగలవు. ఎల్లవేళలా సర్టిఫైడ్ డాక్యుమెంట్లను మీ ఫోన్‌లో స్టోర్ చేసుకోవడానికి Digi-Locker మరియు m-Parivahan ను ఉపయోగించవచ్చు. ఈ యాప్స్, సాధారణ ప్రజలకు Google PlayStore లేదా App Store నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా వస్తాయి. ఈ యాప్‌లు కింది వాటిని గురించి డ్రైవర్‌కు అప్-టూ-డేట్ వివరాల కోసం ప్రాప్యత కల్పిస్తాయి:
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి బుక్)
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఫిట్‌నెస్ చెల్లుబాటు
  • మోటార్ ఇన్సూరెన్స్ మరియు దాని చెల్లుబాటు
  • పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్
మరియు ఇతరత్రా, ఏదైనా ఉంటే!

DigiLocker యాప్

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా DigiLocker యాప్‌ అందించబడుతుంది. రవాణా డాక్యుమెంట్లను జారీచేసేవారు నేరుగా ఈ యాప్‌ను నియంత్రిస్తారు, ఇది మీ డాక్యుమెంట్ల జారీ మరియు ధృవీకరణ కోసం అనువైనదిగా ఉంటుంది.

m-Parivahan యాప్

మరోవైపు, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా m-Parivahan యాప్ అందించబడుతూనీడ. మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ వాహనం యొక్క పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. కాబట్టి, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ వెంట తీసుకెళ్లడం తప్పనిసరా? అవును, కానీ కాగితరహిత రూపంలో! ఇవి కూడా చదవండి: అండరేజ్ డ్రైవింగ్ నియమాలు మరియు జరిమానాలు : పూర్తి మార్గదర్శకాలు

మీ డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

డ్రైవింగ్ లైసెన్స్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలా? అనే ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉంది. మీ వాహనం యొక్క అన్ని డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరచడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ అందించబడ్డాయి:

భద్రత మరియు పోర్టబిలిటీ

కాలక్రమేణా భౌతిక డాక్యుమెంట్లు చిరిగిపోవడం, అరిగిపోవడం మరియు వికృతంగా మారడం అనేవి సర్వసాధారణం. అంతేకాకుండా, మనలో చాలామంది అనుకోకుండా ఈ డాక్యుమెంట్లను పోగొట్టుకోవచ్చు మరియు ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఎలాంటి చట్టపరమైన డాక్యుమెంట్లు లేకుండా రోడ్డుపైకి వెళ్లడం అనేది ఒక సవాలుగా మారవచ్చు. పేర్కొన్న యాప్‌ల వినియోగంతో ఒక వ్యక్తి తన ఫోన్‌లో అన్ని సంబంధిత డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చు, అది మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ వాటిని నిర్వహించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. ఈ పద్దతి మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ఇతర డాక్యుమెంట్‌కు భౌతిక నష్టం జరగకుండా చూస్తుంది. గమనిక: డిజిటల్-ఓన్లీ ఇన్సూరర్‌ల నుండి ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి, ఇది పేపర్‌వర్క్‌ను తగ్గిస్తుంది మరియు భద్రతను నిర్ధారిస్తుంది.

వేగవంతమైన యాక్సెస్

భౌతిక డాక్యుమెంట్లను మీరు ఇంట్లో వదిలేసి వెళ్తే, వాటిని చూపించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను అక్కడికక్కడే యాక్సెస్ చేయవచ్చు. అందువల్ల, చాలా సమయం ఆదా అవుతుంది. ఇవి కూడా చదవండి: ఢిల్లీ ట్రాఫిక్ జరిమానాలకు అల్టిమేట్ గైడ్ మీ జరిమానాలను తెలుసుకోండి

అధికారుల కోసం ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల వలన కలిగే ప్రయోజనాలు

సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల లభ్యత అనేది ఈ కింది మార్గాల్లో అధికారులకు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది:

డాక్యుమెంట్ల వేగవంతమైన డెలివరీ

ప్రభుత్వ సంస్థలు డాక్యుమెంట్ల భౌతిక కాపీలను బట్వాడా చేయడంలో దాదాపు 15-20 రోజుల జాప్యాన్ని ఎదుర్కొంటాయి. దీంతో వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఎలక్ట్రానిక్‌ రూపంలోని అన్ని డాక్యుమెంట్లను ఆమోదించాలి అనే సవరణతో, సమయాల్లో జాప్యాన్ని కొన్ని నిమిషాలకు తగ్గించవచ్చు. ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంస్థలు, కస్టమర్ యొక్క ఇన్సూరెన్స్ పేపర్లను తక్షణమే ఆన్‌లైన్‌లో డెలివరీ చేయవచ్చు. అయితే, దీని కోసం వినియోగదారులు కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌ కొనుగోలు చేయాలి.

తక్కువ పేపర్‌వర్క్ నిర్వహణ

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు యూజర్ డాక్యుమెంట్లు గల ఫైల్స్ మరియు ఫోల్డర్లను ప్రత్యేకంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల, డాక్యుమెంట్ల భద్రతను గురించి ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, పేపర్ల ప్రామాణికతను ధృవీకరించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తక్షణమే వినియోగదారు డేటాను చెక్ చేయగలరు. అందుకోసం అధికారులు eChallan యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇవి కూడా చదవండి: ట్రాఫిక్ ఇ-చలాన్‌ను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి మరియు చెల్లించాలి

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. మేము డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోను చూపించవచ్చా?

మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోను డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారికి చూపించవచ్చు. దానిలో పెద్ద తేడా ఏమి ఉండదు. భారతీయ చట్టం ప్రకారం, DigiLocker మరియు m-Parivahan లాంటి యాప్‌లు మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ధృవీకరించబడిన కాపీని పొందడంలో మీకు సహాయపడతాయి. ఒక సాధారణ ఫోటోతో పోలిస్తే ఇది చెల్లుబాటు అవుతుంది.
  1. నేను పాత కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చా?

మీరు పాత కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి, మీరు మీ పాలసీని రెన్యూ చేసుకున్న తర్వాత, మీరు పాత డాక్యుమెంట్లను తొలగించవచ్చు మరియు కొత్త దానిని మీ ఫోన్‌లో ఉంచుకోవచ్చు.
  1. విరిగిపోయిన ఐడి కార్డు చెల్లుతుందా?

లేదు, విరిగిపోయిన లేదా అతికించబడిన ఐడి చెల్లదు, మీరు కొత్తదానిని పొందాల్సి ఉంటుంది.

ముగింపు

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరా? అవును, మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, మీరు దానిని భౌతికంగా కాగిత రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు; DigiLocker లేదా m-Parivahan యాప్‌ ద్వారా మీ ఫోన్‌లో తీసుకెళ్లవచ్చు. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి