రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Section 184 of the Motor Vehicles Act
డిసెంబర్ 22, 2021

మోటార్ వాహన చట్టం యొక్క సెక్షన్ 184

దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని మోటార్ వాహన చట్టంలో మార్పులు చేయబడ్డాయి. 2019 యొక్క సవరించబడిన మోటార్ వాహన చట్టం కింద, జరిమానా విధానం మరింత కఠినంగా మారింది. మోటార్ వాహన యజమానులందరూ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి. ఈ ఆర్టికల్‌లో మోటారు వాహన చట్టం యొక్క సెక్షన్ 184 ను క్లుప్తంగా అర్థం చేసుకుందాం.

ఎంవి చట్టం యొక్క సెక్షన్ 184 ఏమిటి?

మోటార్ వాహన డ్రైవర్లు అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ మోటార్ వాహన యజమాని చట్టాలను ఉల్లంఘించినట్లుగా కనుగొనబడితే, దోషిగా నిర్ధారించబడి భారీగా జరిమానా విధించబడుతుంది. మోటార్ వాహన చట్టం, 1988 కింద 'ప్రమాదకరమైన డ్రైవింగ్' సెక్షన్‌కి భారతదేశ ప్రభుత్వం కొన్ని మార్పులను చేసింది. మరొక వ్యక్తి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే విధంగా వేగ పరిమితికి మించి వాహనాన్ని నడపడం. లేదా, రోడ్డును ఉపయోగించుకునే వారికి, దాని పైన ఉన్నవారికి మరియు రోడ్లకు దగ్గరలో ఉన్న వ్యక్తులకు ఆపద/భయం కలిగించే ఏదైనా చర్య. దీని కారణంగా 06 నెలల కంటే తక్కువ కాకుండా కారాగార శిక్ష విధించబడవచ్చు మరియు ఒక సంవత్సరం వరకు పొడిగించబడవచ్చు. రూ. 1000 కి తక్కువ కాకుండా రూ. 5000 వరకు ఉండే జరిమానాని చెల్లించవలసి ఉంటుంది. గతంలో చేసినటువంటి ఇటువంటి అపరాధాన్ని 03 సంవత్సరాలలోపు రెండవ సారి చేసినా లేదా ఏదైనా తదుపరి అపరాధం చేసినా కారాగార శిక్ష కాలం 02 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది మరియు రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది.

ఎంవి చట్టం యొక్క మోటార్ సెక్షన్ 184 క్రింద మీరు తెలుసుకోవలసిన ప్రధాన మార్పులు

చట్ట సవరణను ట్రాక్ చేయడం అనేది కొన్నిసార్లు విసుగు పుట్టించవచ్చు. ఎంవి చట్టం యొక్క సెక్షన్ 184 లో కీలక మార్పులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • ఎవరైనా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే వారికి రూ. 5000 వరకు జరిమానా మరియు ఒక సంవత్సరం వరకు కారాగార శిక్ష విధించబడవచ్చు. గతంలో జరిమానా రూ. 1000 మరియు కారాగార శిక్ష 06 నెలలు ఉండేది.
  • కొత్త చట్టం ప్రకారం, ఈ క్రింది సందర్భాలలో ఎవరైనా దోషిగా నిరూపించబడితే రూ. 10,000 జరిమానా విధించబడుతుంది:
  • ఏదైనా స్టాప్ సైన్‌ను ఉల్లంఘించడం
  • రెడ్ లైట్ సిగ్నల్‌ను ఉల్లంఘించడం
  • డ్రైవ్ చేసేటప్పుడు ఏవైనా హ్యాండ్‌హెల్డ్ డివైస్లు లేదా మొబైల్ ఫోన్లను ఉపయోగించడం
  • ఏదైనా తప్పు మార్గాల ద్వారా ఒక వాహనాన్ని దాటి వెళ్లడం
  • నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం
  • అనుమతించిన ట్రాఫిక్ ఫ్లో కి వ్యతిరేక దిశలో డ్రైవింగ్ చేయడం
డిస్‌క్లెయిమర్: మరిన్ని వివరాల కోసం, దయచేసి భారతదేశపు రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించిన అంశాలు ఏమిటి?

ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ భారీ వైద్య ఖర్చుల నుండి మీకు ఆర్థిక రక్షణ కలిపిస్తుంది. సరైన ప్లాన్ కలిగి ఉండడం వలన మనశ్శాంతి ఉంటుంది మరియు హాస్పిటలైజేషన్ ఖర్చులు మొదలైన వాటి గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. అనిశ్చితి పరిస్థితులు ముందస్తు నోటీసు లేకుండా రావు. అయితే, సిద్ధంగా ఉండడం దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. వాహనానికి ఒక చిన్న యాక్సిడెంట్ లేదా నష్టం ఆర్థిక భారం అవ్వచ్చు.

ముగింపు

భద్రతకు మీరు ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త ట్రాఫిక్ చట్టాలతో, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి. భారతదేశంలో, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, అయితే అవసరాలకు సరిపోయే సరైన వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమని సిఫారసు చేయబడుతుంది. పశ్చాత్తాప పడడం కంటే సురక్షితంగా ఉండడం ఎల్లప్పుడూ మంచిది. చట్టాలు మరియు నియమాలను భద్రత కోసం అనుసరించడానికి రూపొందించబడ్డాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం మరియు చట్టానికి కట్టుబడి ఉందాం.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి