రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Documents for Motor Insurance Claim
జూలై 23, 2020

మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

భారతీయ రోడ్లపై రద్దీ పెరుగుతోంది మరియు అది ఇప్పుడు ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఉంది. ట్రాఫిక్ జామ్‌లు మరియు అది క్లియర్ అయిన తరువాత ప్రజలు చూపించే తొందరపాటు వలన ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇది వాహనాలకు నష్టాన్ని మరియు ప్రజలకు గాయాలను కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ మాత్రమే కాకుండా, ప్రజలు, ముఖ్యంగా యువత తమ వాహనాల వేగాన్ని పెంచి రహదారుల పై దూసుకువెళ్తున్నారు, ఇది భయానకమైన ప్రమాదాలకు దారితీయడమే కాకుండా ప్రాణాపాయం కలిగించే గాయాలు మరియు తీవ్రమైన వాహన నష్టాలను కలిగిస్తున్నాయి. థర్డ్ పార్టీలు (ప్రజలు/ఆస్తి) మరియు మీ స్వంత వాహనం(లు) కు జరిగిన నష్టాలు మీ పై భారీ ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఇంకా, దురదృష్టవశాత్తు మీకు ఒక ప్రమాదం ఎదురైతే, మీకు ఆర్థికంగా సహకరించడానికి ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్  ‌లో కొనుగోలు చేయమని కోరుతున్నాము. మీరు తగిన యాడ్-ఆన్ కవర్లతో పాటుగా ఒక మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, మీరు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను బాగా అర్థం చేసుకోవాలి. అలాగే, మీరు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయవలసిన సందర్భంలో మీకు అవసరమైన అన్ని డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్‌ను తయారు చేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా, ఒక క్లెయిమ్ చేసేటప్పుడు మీరు గందరగోళానికి గురి అవ్వకుండా ఉండటానికి మేము ఇక్కడ పంచుకుంటున్న జాబితాను కూడా చూడవచ్చు. మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు మీరు సిద్ధంగా ఉంచుకోవలసిన డాక్యుమెంట్లు మరియు వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
  • మీ పాలసీ నంబర్‌ను పేర్కొనే ఇన్సూరెన్స్ రుజువు (పాలసీ డాక్యుమెంట్ లేదా కవర్ నోట్)
  • ఇంజిన్ నంబర్ మరియు ఛాసిస్ నంబర్
  • ప్రమాదం జరిగిన స్థానం, తేదీ మరియు సమయం వంటి వివరాలు
  • కారు యొక్క కిలోమీటర్ రీడింగ్
  • సరిగ్గా నింపిన క్లెయిమ్ ఫారం
  • ఎఫ్ఐఆర్ కాపీ (థర్డ్ పార్టీ ఆస్తి నష్టం / మరణం / శారీరక గాయం ఏర్పడినప్పుడు)
  • వాహనం యొక్క ఆర్‌సి కాపీ
  • డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
సంఘటన స్వభావం ఆధారంగా మీరు అదనంగా ఈ క్రింది డాక్యుమెంట్లను గ్యారేజ్/డీలర్‌కు సమర్పించాలి. యాక్సిడెంట్ క్లెయిములు
  • పోలీస్ పంచనామా/ఎఫ్ఐఆర్
  • పన్ను రసీదు
  • ఎక్కడైతే వాహనం రిపేర్ చేయబడుతుందో అక్కడ ఆ రిపేర్ చేసే వ్యక్తి రిపేర్ ఖర్చు కోసం వేసిన అంచనా
  • ఒరిజినల్ రిపెయిర్ ఇన్వాయిస్, చెల్లింపు రసీదు (నగదు రహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం - రిపెయిర్ ఇన్వాయిస్ మాత్రమే)
  • ఒక రెవెన్యూ స్టాంప్ పై సంతకంతో క్లెయిమ్స్ డిస్‌ఛార్జ్ మరియు శాటిస్‌ఫాక్షన్ వోచర్
  • వాహన తనిఖీ చిరునామా, మీరు వాహనాన్ని సమీప గ్యారేజీకి తీసుకువెళ్ళకపోతే
దొంగతనం క్లెయిములు
  • పన్ను చెల్లింపు రసీదు
  • మునుపటి ఇన్సూరెన్స్ వివరాలు - పాలసీ నంబర్, ఇన్సూరింగ్ ఆఫీస్/కంపెనీ, ఇన్సూరెన్స్ వ్యవధి
  • తాళం చెవుల సెట్లు/సర్వీస్ బుక్‌లెట్/వారంటీ కార్డు
  • ఫారం 28, 29 మరియు 30
  • సబ్రోగేషన్ లెటర్
  • ఒక రెవెన్యూ స్టాంపు, సంతకం చేయబడిన క్లెయిమ్ డిస్ఛార్జ్ వోచర్
థర్డ్ పార్టీ క్లెయిములు
  • సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్
  • పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ
  • డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
  • పాలసీ కాపీ
  • వాహనం యొక్క ఆర్‌సి కాపీ
  • కంపెనీ రిజిస్టర్డ్ వాహనం అయితే అసలు డాక్యుమెంట్ల విషయంలో స్టాంప్ అవసరం
మీ మొబైల్ ద్వారా మీ వాహనానికి జరిగిన నష్టాన్ని ఫోటో తీసి అప్‌లోడ్ చేయడం ద్వారా మా ఇన్సూరెన్స్ వాలెట్ యాప్ లోని మోటార్ ఒటిఎస్ ఫీచర్‌ను ఉపయోగించి మీ కారు ఇన్సూరెన్స్ లేదా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్‌ను క్షణాల్లో ఫైల్ చేయవచ్చు మరియు సెటిల్ చేయవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి