రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
PUC Certificate Validity For New Four Wheelers
ఏప్రిల్ 2, 2021

పియుసి సర్టిఫికెట్

ఈ రోజులలో ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. కొత్త వాహనాలకు సులభమైన ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నందున, మీ కలల కారు లేదా బైక్‌ను కొనుగోలు చేయడం సులభం. కానీ, గత దశాబ్దంలో వాహనాల కోసం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వలన పర్యావరణం పై ప్రతికూల ప్రభావం పడింది అని మీకు తెలుసా? అయితే, ఈ సమస్య అప్పుడప్పుడు బయటపడుతుంటుంది కానీ ఇప్పుడు దానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రభుత్వ సంస్థలు ఈ వాహనాల ద్వారా వెలువడే కాలుష్య స్థాయిలను అదుపులో ఉంచవలసిన అవసరాన్ని గుర్తించడం ప్రారంభించాయి. అందువల్ల, సెంట్రల్ మోటార్ వాహన నియమాలు, 1989 దేశంలో రిజిస్టర్ చేయబడిన ప్రతి వాహనానికి చెల్లుబాటు అయ్యే కాలుష్య సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మోటార్ వాహనాల చట్టం, 2019 వాహనం యొక్క డ్రైవర్ లేదా రైడర్‌తో అన్ని సమయాల్లో ఉంచవలసిన ఒక అవసరమైన డాక్యుమెంట్‌గా పియుసి ని చేస్తుంది. అలా చేయడంలో విఫలం చెందితే, విధించడబతాయి భారీ/బైక్ ఇన్సూరెన్స్ జరిమానాలు

పియుసి సర్టిఫికెట్ అంటే ఏమిటి?

పియుసి సర్టిఫికెట్ అని ప్రముఖంగా పేర్కొనబడే కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ అనే డాక్యుమెంట్‌లో మీ వాహనం యొక్క ఉద్గార స్థాయిలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఫ్యూయల్ స్టేషన్లలో సాధారణంగా కనుగొనబడే అధీకృత పరీక్ష కేంద్రాల ద్వారా మాత్రమే ఈ తనిఖీ చేయబడుతుంది. మీ వాహనం యొక్క ఉద్గార స్థాయిలను పరీక్షించి, అవి ఆమోదయోగ్యమైన పరిమితులలో ఉన్నాయా లేదా అని ధృవీకరించిన తర్వాత ఈ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం, 1989 ద్వారా ప్రతి వాహనానికి ఒక పియుసి సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి చేసింది.

ఒక పియుసి సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి?

మీ కారు లేదా బైక్ కోసం పియుసి సర్టిఫికేషన్ పొందడం సులభం -
  1. కొత్త వాహనాలకు డీలర్ ద్వారా పియుసి సర్టిఫికెట్ అందించబడుతుంది, ఇది ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. కాబట్టి మీరు దాని కోసం అప్లై చేయవలసిన అవసరం ఉండదు.
  2. రెన్యూవల్స్ విషయంలో, మీరు ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్లకు వెళ్లాలి. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించండి మరియు అటువంటి సర్టిఫికెట్‌ను పొందండి. అటువంటి పియుసి సర్టిఫికెట్ భారతదేశంలో చట్టపరంగా ఒక వాహనాన్ని నడపడానికి అవసరమైన డాక్యుమెంట్లలో ఒక భాగంగా ఉంటుంది.

నేను ఆన్‌లైన్‌లో పియుసి సర్టిఫికెట్‌ను ఎలా పొందగలను?

ప్రస్తుతం, అధీకృత ఎమిషన్ టెస్టింగ్ సెంటర్లు మరియు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల వద్ద మాత్రమే కాలుష్య సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో పొందగలరు. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన Parivahan పోర్టల్ పియుసి కేంద్రాల రిజిస్ట్రేషన్ లేదా పునరుద్ధరణకు వీలు కల్పిస్తుంది మరియు పియుసి సర్టిఫికెట్ ఆన్‌లైన్ తనిఖీ సౌకర్యంతో పాటు మీ పియుసి కేంద్రం యొక్క అప్లికేషన్ స్టేషన్ తనిఖీకి కూడా వీలు కల్పిస్తుంది.

నా పియుసి సర్టిఫికెట్‌ను నేను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

అవును, మీ పియుసి సర్టిఫికెట్‌ను మీరు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ ప్రక్రియ కోసం మీరు మూడు సులభమైన దశలను అనుసరించాలి- #1 Parivahan వెబ్ పోర్టల్‌కు వెళ్ళండి. ఇక్కడ మీ ఛాసిస్ నంబర్ యొక్క చివరి ఐదు అంకెలతో పాటు మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ వివరాలను అందించాలి. #2 సెక్యూరిటీ క్యాప్చాను ఎంటర్ చేయండి మరియు 'పియుసి వివరాలు' బటన్ పై క్లిక్ చేయండి. #3 మీ వద్ద ఒక యాక్టివ్ పియుసి సర్టిఫికెట్ ఉంటే, మీ ఎమిషన్ టెస్ట్ వివరాలను కలిగి ఉన్న ఒక కొత్త పేజీకి మీరు మళ్ళించబడతారు. మీరు 'ప్రింట్' బటన్ పై క్లిక్ చేయవచ్చు మరియు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కొత్త వాహనాలకు పియుసి సర్టిఫికెట్ అవసరమా?

కొత్త వాహనం యజమానులు ఒక పియుసి సర్టిఫికెట్ పొందవలసిన ప్రత్యేక అవసరం ఏదీ లేదు. ఈ వాహనాలు తయారీ సమయంలో పరీక్షించబడతాయి మరియు పియుసి తనిఖీ కోసం మొదటి సంవత్సరం మినహాయించబడతాయి. డీలర్ సాధారణంగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో నిర్వహించబడే కాలుష్య పరీక్ష ఫలితాలను అందిస్తారు.

నా పియుసి సర్టిఫికెట్ యొక్క చెల్లుబాటు సమయం ఎంత?

వివిధ ఉద్గార స్థాయిలు అనేవి మీ వాహనం వయస్సుపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల, దానిని సకాలంలో తనిఖీ చేయించుకోవడం మరియు మీ వాహనం పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించకుండా ఉండేలాగా నిర్ధారించుకోవడం మంచిది. మీ పియుసి సర్టిఫికెట్ యొక్క చెల్లుబాటు అది ఒక కొత్త వాహనం కోసమా లేదా పాత వాహనం కోసమా అనేదాని ఆధారంగా ఉంటుంది. కొత్త వాహనాల కోసం అప్లై చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీ వాహనం డెలివరీ సమయంలో దానిని డీలర్ అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది. ఈ అవధి గడువు ముగిసిన తర్వాత, మీ పియుసి సర్టిఫికెట్‌ను మీరు రెన్యూ చేసుకోవాలి. ఈ రెన్యూ చేయబడిన పియుసి సర్టిఫికెట్ ఆరు నెలల వరకు చెల్లుతుంది మరియు సకాలంలో రెన్యూ చేయాలి. కాబట్టి, పర్యావరణ హితం కోసం మరియు చట్టానికి కట్టుబడి ఉండడానికి మీ పొల్యూషన్ సర్టిఫికెట్ పొందండి. పియుసి సర్టిఫికెట్ లేకపోతే జరిమానాలు విధించబడతాయి, అందుకనే మీ పియుసి సర్టిఫికెట్‌ను మీరు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో వీటిని స్టోర్ చేసుకునే అవకాశం కలిపించే mParivahan వంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడే కారు ఇన్సూరెన్స్ మరియు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లను చూడండి మరియు ఆన్‌లైన్‌లో మీ వాహనాన్ని ఇన్సూర్ చేసుకోండి!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి