రెంటల్ కార్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?
మీరు ఎప్పుడైనా ఒక కారును సొంతం చేసుకోవాలని అనుకున్నారా, కానీ భారీ ధరలు మిమ్మల్ని వెనకడుగు వేసేలాగా చేస్తున్నాయా? అలా అనుకునే వారిలో మీరు ఒక్కరే లేరు, మరియు ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది. అద్దె కార్లు. పట్టణ వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం వలన కారు అనేది విలాస వస్తువు కాకుండా ఒక అవసరంగా మారింది. కాబట్టి, మీ వద్ద ఒక కారు ఉండటం వలన సౌలభ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, మరమ్మతులు, భారీ రుణం రీపేమెంట్లు మరియు ఇతర బాధ్యతల గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఒక అద్దె కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నేడు, రెంటల్ కారు కంపెనీల సంఖ్య పెరుగుతోంది, వీటి వలన కారుతో వచ్చే ఇబ్బందులు లేకుండా మీకు నచ్చిన కారుని సులభంగా డ్రైవ్ చేయవచ్చు. కానీ ఈ పరిమిత బాధ్యతలతో, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఇప్పటికీ ఎటువంటి నష్టాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయంలోనే,
కారు ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. ఒక పర్సనల్ కారు ఇన్సూరెన్స్ పాలసీ నుండి ఒక రెంటల్ కారు ఇన్సూరెన్స్ భిన్నంగా ఉన్నప్పటికీ, మీరు రెంటల్ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు కొనగల వివిధ ఇన్సూరెన్స్ కవరేజ్ పై ఈ ఆర్టికల్ కొన్ని వివరాలను అందిస్తుంది.
కొలిజన్ డ్యామేజ్ మాఫీ (సిడిడబ్ల్యూ):
కొలిజన్ డ్యామేజ్ మాఫీ అనే సదుపాయం వలన మీ అద్దె కారుకు జరిగిన నష్టాలు ఇన్సూర్ చేయబడతాయి. ఈ కవర్ స్కఫ్స్ మరియు డెంట్స్ వంటి వాహనం యొక్క బాడీవర్క్ నష్టాలను మాత్రమే కవర్ చేయడానికి పరిమితం అయింది. కొలిజన్ డ్యామేజ్ మాఫీ అనేది బ్యాటరీ, టైర్లు, ఇంజిన్, గేర్‌బాక్స్, లేదా విండ్‌షీల్డ్ మరియు ఇంటీరియర్‌కు జరిగిన నష్టాలను మినహాయిస్తుంది. అంతేకాకుండా, అద్దె కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద సిడిడబ్ల్యూ నుండి కారులో చేసే రెక్‌లెస్ డ్రైవింగ్ కూడా మినహాయించబడుతుంది.
దొంగతనం నుండి రక్షణ:
నష్టాల కోసం ఇన్సూరెన్స్ చేసిన తర్వాత, రెండవ అత్యంత సాధారణ కవరేజ్ అనేది దొంగతనం కోసం చేయబడుతుంది. మీ స్వాధీనంలో ఉన్నప్పుడు వాహనం దొంగిలించబడితే, రెంటల్ కారు కంపెనీ మిమ్మల్ని బాధ్యులుగా చేస్తుంది. దొంగతనం కోసం రెంటల్ కారు ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం వలన ఆర్థిక నష్టం జరుగుతుంది, అందువల్ల మీరు అద్దె కారును డ్రైవ్ చేయడానికి ఎంచుకున్నప్పుడు ఒకదాన్ని కొనుగోలు చేయవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. ఈ కవరేజీలో పైన పేర్కొన్న డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది, ఆ విధంగా ఇది దొంగతనం మరియు ఢీకొనడం రెండింటి నుండి రక్షణను అందిస్తుంది.
థర్డ్-పార్టీ లయబిలిటీ:
ఒక పర్సనల్ పాలసీలోని
థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కవర్ లాగా రెంటల్ కారు ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ బాధ్యతలకు కూడా కవరేజ్ అందిస్తుంది. ఒక ప్రమాదం వలన ఒక వ్యక్తికి గాయం లేదా ఆస్తికి నష్టం కలిగితే, ఈ రెంటల్ కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఇన్సూరెన్స్ పొందవచ్చు. అయితే, మీరు చట్టాలను ఉల్లంఘించినట్లుగా కనుగొనబడితే, ఈ రెంటల్ కారు ఇన్సూరెన్స్ కవర్ జరిగిన నష్టాలు లేదా కలిగిన గాయాల కోసం అయ్యే ఖర్చులను కవర్ చేయదు.
అద్దె కార్ల కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు తనిఖీ చేయవలసిన విషయాలు
ఒక పర్సనల్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా కాకుండా, అద్దె కార్ల విషయంలో పరిగణించవలసిన అంశాలు భిన్నంగా ఉంటాయి. ఒకదాన్ని కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
సిడిడబ్ల్యూ యొక్క గరిష్ట పరిమితి:
మీ పాలసీలో కవర్ చేయబడిన గరిష్ట నష్టాల మొత్తం ఎంచుకున్న పాలసీపై ఆధారపడి ఉంటుంది. అయితే, రెంటల్ కార్ కంపెనీ చేసిన క్లెయిమ్ అప్లికేషన్ మీ పాలసీ కవరేజీని మించితే, మీ స్వంత డబ్బుతో జరిగిన నష్టాల కోసం డబ్బును చెల్లించవలసి రావచ్చు.
మినహాయింపులు:
మినహాయింపులు అనేవి క్లెయిమ్ చేసినప్పుడు మీరు ముందుగానే చెల్లించవలసిన భాగం. ఒక సమగ్ర కవరేజ్ లేదా జీరో డిడక్టబుల్ కవర్ కొనుగోలు చేయడం వలన క్లెయిమ్ చేసినప్పుడు ఈ నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
రోడ్‍సైడ్ అసిస్టెన్స్:
అద్దె కార్ల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ కంపెనీలలో భిన్నంగా ఉంటుంది. కొంత మంది ఇన్సూరర్లు ఈ సదుపాయాన్ని పాలసీలో భాగంగా అందిస్తారు, మరికొందరు దీనిని ఒక నిర్దిష్ట ప్రాంతం వరకు మాత్రమే అందిస్తారు.
కారు కోసం కవరేజ్:
సిడిడబ్ల్యూ కింద మొత్తం కారు కవర్ చేయబడిందా లేదా నిర్దిష్ట భాగాల వరకు కవర్ చేయబడిందా అని తనిఖీ చేయాలి. క్లెయిమ్ సమయంలో చివరి నిమిషంలో చెల్లింపులు చేయవలసిన ఇబ్బందులను నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది. రెంటల్ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు పైన పేర్కొన్న ఈ ఇన్సూరెన్స్ కవరేజీలను గమనించండి. ఒక
స్వల్పకాలిక కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడానికి మరియు ప్రీమియంలను అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
*ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.
రిప్లై ఇవ్వండి