రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Return to Invoice Cover (RTI)
ఏప్రిల్ 1, 2021

కారు ఇన్సూరెన్స్‌లో రిటర్న్ టు ఇన్వాయిస్ (ఆర్‌టిఐ) కవర్

కారును ఒక విలాసవంతమైన వాహనం అనే రోజులు పోయాయి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది. మన నగరాలు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి మరియు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ప్రయాణించడం అనేది కత్తి మీద సాము లాగా మారింది. ఒక కారును కొనుగోలు చేయడంతో మీ జీవితం సులభతరం అవుతుంది. ఇక మీ ఇంజిన్‌ స్టార్ట్ చేయండి, తీరిక సమయాల్లో ప్రయాణించండి మరియు ప్రయాణాన్ని ఆస్వాదించండి! అందుబాటులో ఉన్న ఫైనాన్స్ ఆప్షన్లతో కారును సొంతం చేసుకోవడం మరింత సులభతరం అయింది. కాబట్టి, మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీ డ్రీమ్ కారును పొందడంలో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కారును కొనుగోలు చేయడంతో మీ కోరికల జాబితా ముగిసిపోదు, మీరు రిజిస్ట్రేషన్ మరియు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కాపీ లాంటి కొన్ని ఇతర సమ్మతిలను కూడా అనుసరించాలి. మోటార్ వాహనాల చట్టం, 2019 దేశంలో రిజిస్టర్ చేయబడిన ప్రతి వాహనం చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ కాపీని కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. అయితే, థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కవర్ అనేది కనీస అవసరం, అయినప్పటికీ, మీరు మీకు మరియు మీ కారుకు పూర్తి రక్షణను అందించడానికి ఒక సమగ్ర ఇన్సూరెన్స్ కవర్‌‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. సమగ్ర పాలసీతో మీరు మిమ్మల్ని అలాగే ఇతరులను ఏవైనా ఊహించని నష్టాలు లేదా గాయాల నుండి రక్షించవచ్చు. సమగ్ర కవర్‌తో మీరు ఎల్లప్పుడూ మీ కారు దాని సహజమైన స్థితిలో ఉందని నిర్ధారించుకోవచ్చు. అంతేకాక, రిటర్న్ టు ఇన్వాయిస్ లేదా ఆర్‌టిఐ కవర్ కూడా మీకు అలాంటి ప్రయోజనాన్ని కల్పిస్తుంది.  

ఆర్‌టిఐ కారు ఇన్సూరెన్స్ అర్థం

ఐడివి లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది ఒక సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు సమయంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రకటించే వాహనం యొక్క గరిష్ట విలువ. ఇది దాదాపు వాహనం మార్కెట్ విలువకు సమీపంగా ఉంటుంది. కానీ ఐడివి ప్రకటించేటప్పుడు, వాహనం వాస్తవ మార్కెట్ విలువను కనుగొనడానికి తరుగుదలను పరిగణించాలి. అందువల్ల, మీ వాహనం ఒరిజినల్ కొనుగోలు ధర మరియు దాని ప్రస్తుత మార్కెట్ విలువ మధ్య అంతరం ఉంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్‌ సహాయంతో ఈ అంతరాన్ని పూరించవచ్చు. దొంగతనం లేదా నిర్మాణాత్మక పూర్తి నష్టం లాంటి సందర్భంలో కారు కొనుగోలు కోసం మీరు చేసిన అన్ని ఖర్చులు ఆర్‌టిఐ కారు ఇన్సూరెన్స్‌ ద్వారా రీయింబర్స్ చేయబడతాయి. మేము ఖర్చును సూచించినప్పుడు, అందులో రహదారి పన్నులు కూడా వస్తాయి! ఇది ఒక మంచి విషయం, కారును కోల్పోయిన సందర్భంలో కూడా మీరు ఇన్సూరెన్స్‌ ద్వారా ఇలాంటి పరిహారం పొందవచ్చు.  

రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తింపు

ఆర్‌టిఐ కారు ఇన్సూరెన్స్ పాలసీ వర్తింపు అనేది వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలలో భిన్నంగా ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు మూడు సంవత్సరాల వయస్సు మించని కార్ల కోసం రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్‌ను అందించగా, మరికొన్ని ఐదు సంవత్సరాల వరకు అందిస్తాయి.  

రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్‌ వర్తించని సందర్భాలు

సాధారణంగా ఆసక్తిగల వ్యక్తులు తమ కారు ఎక్కువ కాలం పాటు అలాగే ఉండే లాగా నిర్ధారించుకోవడానికి రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్‌ను కొనుగోలు చేస్తారు. అందువల్ల, వీరు రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్‌తో సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ ‌ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవ్వబడ్డాయి -
  • పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం పాత కార్లకు ఆర్‌టిఐ కవర్‌ వర్తించదు. ఇది ప్రత్యేకంగా కొత్త కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, ముఖ్యంగా పైన చర్చించిన విధంగా పాలసీ వర్తింపు అనేది మీ పాలసీ నిబంధనలకు లోబడి ఉంటుంది.
  • ఇలాంటి ఒక ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కింద పూర్తి నష్టం లేదా పూర్తి డ్యామేజ్ మాత్రమే కవర్ చేయబడుతుంది. అలాగే ఈ అదనపు ఇన్సూరెన్స్ కవర్ కింద చిన్న గీతలు లేదా సాధారణ మరమ్మత్తులు కవర్ చేయబడవు.
  • మీరు ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్నప్పుడు మాత్రమే రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్-ఆన్ అందుబాటులో ఉంటుంది.
  ఈ యాడ్-ఆన్ మీ బేస్ పాలసీపై కొంత మొత్తంలో ఖర్చుతో వచ్చినప్పటికీ, మీ కారు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మీరు ఆర్థికంగా సురక్షితం చేయబడతారని హామీ ఇస్తుంది. దీంతోపాటు, పెరిగిన కవరేజితో కూడిన ఈ ఇన్సూరెన్స్ పాలసీకి ఇతర అనుకూలమైన యాడ్-ఆన్‌లను జతచేసినప్పుడు ఇది మరింత సమగ్రవంతమైన కవర్‌గా మారుతుంది. కాబట్టి, మీ వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నుండి సంపూర్ణ రక్షణ పొందడానికి సరైన యాడ్-ఆన్‌లను ఎంచుకోండి వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి