రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Electric Scooter/ Bike Subsidies in India
ఫిబ్రవరి 26, 2023

భారతదేశంలో రాష్ట్రం వారీగా ఎలక్ట్రిక్ స్కూటర్/ బైక్ సబ్సిడీలు

ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనమందరం గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావాలను అనుభవిస్తున్నాము. తీవ్రమైన వడగాల్పులు, అకాల వర్షాలు, భారీ వరదలు మరియు ఆకస్మిక కరువు దాని సూచికలలో కొన్ని. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించబడుతున్నప్పటికీ, ఆ పరిష్కారాలు పూర్తిగా అమలు అవ్వడానికి సమయం పడుతుంది. అయితే, మీరు చేపట్టగల తక్షణ పరిష్కారాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు స్కూటర్‌ల కోసం భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో ఒకటి. భారతీయ రోడ్లపై ఎక్కువ టూ-వీలర్లు శిలాజ ఇంధనం ఆధారంగా నడుస్తున్నపటికీ, ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు మారుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నడపడానికి, భారతదేశ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఆఫ్ ఇండియా అనేది ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మరియు కొనుగోలుదారులకు సబ్సిడీలను నిర్దేశించే అటువంటి ఒక పథకం. ఈ పాలసీ మరియు అందించబడే సబ్సిడీలకు సంబంధించిన మరింత సమాచారం క్రింద ఇవ్వబడింది.

ఎలక్ట్రిక్ వాహనం అంటే ఏమిటి?

ఎలక్ట్రిక్ వాహనం (ఈవి) అనేది పెట్రోల్ లేదా డీజిల్ వంటి శిలాజ ఇంధనం బదులుగా బ్యాటరీ పవర్ పై నడిచే ఒక రకం వాహనం. ఒక సాంప్రదాయక వాహనంలో, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసిఇ) స్వీయ జలనం కోసం మరియు వాహనాన్ని పవర్ చేయడానికి ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. ఈవి ల్లో, వాహనానికి అవసరమైన శక్తి కోసం ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఉపయోగించబడుతాయి. ఈవి ల్లో ఉపయోగించే ఇంజిన్‌ నుండి ఉద్గారాలు వెలువడవు కాబట్టి, ఉత్పత్తి అయ్యే ఉద్గారాలు తగ్గుతాయి. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలనేవి ఈవి ల్లోని కొన్ని రకాలు.

భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహన పాలసీ అంటే ఏమిటి?

ఇంతకుముందు పేర్కొన్నట్లు, భారతదేశంలో పబ్లిక్ మరియు ప్రైవేట్ రవాణాను విద్యుదీకరణ చేయడానికి, భారత ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది. భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహన పాలసీలో ప్రవేశపెట్టబడిన వివిధ అంశాలలో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఇన్ ఇండియా ఒకటి, దీనిని సంక్షిప్తంగా ఫేమ్ స్కీమ్ అని పేర్కొంటారు. ఈ స్కీమ్ కింద తయారీదారులు, సరఫరాదారులు మరియు వినియోగదారులు ప్రోత్సాహకాలను అందుకుంటారు.

ఫేమ్ పథకం అంటే ఏమిటి?

2015 లో ప్రారంభించబడిన ఫేమ్ పథకం అనేది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించబడింది. భారతదేశంలోని ఈవి మార్కెట్‌లో టూ మరియు త్రీ వీలర్‌లు ఆధిపత్యం కలిగి ఉన్నందున, తయారీదారులు భారీ ప్రోత్సాహకాలు పొందారు. ఫేమ్ స్కీం యొక్క మొదటి దశ 2015 లో ప్రారంభించబడింది మరియు ముగిసిన సమయం 31st మార్చి 2019. స్కీం యొక్క రెండవ దశ ఏప్రిల్ 2019 లో ప్రారంభించబడింది మరియు ముగిసే సమయం 31st మార్చి 2024.

ఈ పథకంలోని ఫీచర్లు ఏమిటి?

మొదటి దశ యొక్క ఫీచర్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
  1. డిమాండ్ సృష్టించడం, సాంకేతికత మీద దృష్టి కేంద్రీకరించడం మరియు ఛార్జింగ్ స్టేషన్ల కోసం మౌలిక సదుపాయాల నిర్మాణం మీద దృష్టి పెడుతుంది.
  2. 1st దశలో, ప్రభుత్వం 427 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.
రెండవ దశ యొక్క ఫీచర్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
  1. ప్రజా రవాణాను విద్యుదీకరించడం మీద దృష్టిపెట్టడం.
  2. రూ.10,000 కోట్ల ప్రభుత్వ బడ్జెట్.
  3. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం, 10 లక్షల రిజిస్టర్డ్ వాహనాల్లో ఒక్కోదానికి రూ. 20,000 ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.

ఫేమ్ సబ్సిడీ అంటే ఏమిటి?

ఫేమ్ స్కీం యొక్క రెండవ దశలో, వివిధ రాష్ట్రాలు ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీలను అందించాయి. టూ-వీలర్లపై సబ్సిడీలను అందించే రాష్ట్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:
రాష్ట్రం సబ్సిడీ (ప్రతి కిలోవాట్ అవర్ కోసం) గరిష్ట సబ్సిడీ రోడ్డు పన్ను మినహాయింపు
మహారాష్ట్ర Rs.5000 Rs.25,000 100%
గుజరాత్ Rs.10,000 Rs.20,000 50%
వెస్ట్ బెంగాల్ Rs.10,000 Rs.20,000 100%
కర్ణాటక - - 100%
తమిళనాడు - - 100%
ఉత్తర ప్రదేశ్ - - 100%
బీహార్* Rs.10,000 Rs.20,000 100%
పంజాబ్* - - 100%
కేరళ - - 50%
తెలంగాణ - - 100%
ఆంధ్రప్రదేశ్ - - 100%
మధ్యప్రదేశ్ - - 99%
ఒడిశా ఎన్ఎ Rs.5000 100%
రాజస్థాన్ Rs.2500 Rs.10,000 ఎన్ఎ
అస్సాం Rs.10,000 Rs.20,000 100%
మేఘాలయ Rs.10,000 Rs.20,000 100%
*బీహార్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో పాలసీ ఇంకా ఆమోదించబడాలి ఈ ఉదాహరణను చూడండి: మహారాష్ట్ర రాష్ట్రంలో మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే, రూ. 5000 కనీస సబ్సిడీ అందించబడుతుంది. కాబట్టి, స్కూటర్ ధర రూ. 1,15,000 అయితే, సబ్సిడీతో ధర రూ. 1,10,000కు తగ్గుతుంది. గరిష్ట సబ్సిడీ రూ. 20,000 ఇవ్వబడితే, ధర రూ. 90,000కు తగ్గుతుంది.

ఈ సబ్సిడీ ఎలా పనిచేస్తుంది?

ఫేమ్ సబ్సిడీ దశలు క్రింద ఇవ్వబడ్డాయి:
  1. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఫేమ్ సబ్సిడీకి అర్హత కలిగి ఉందో లేదో తనిఖీ చేయండి.
  2. స్కూటర్ తయారీదారు ఫేమ్ స్కీమ్‌తో రిజిస్టర్ చేయబడితే మీరు సబ్సిడీని పొందవచ్చు. అది లేకపోతే, మీకు ఎటువంటి సబ్సిడీ లభించదు.
  3. మీకు ఇవ్వబడిన కోటా అప్లై చేయబడిన సబ్సిడీ ఆధారంగా ఉంటుంది.
  4. మీరు స్కూటర్ కొనుగోలు చేసిన డీలర్ తయారీదారునికి కొనుగోలు యొక్క వివరాలను ఫార్వర్డ్ చేస్తారు.
  5. సబ్సిడీ పథకాన్ని పర్యవేక్షించే జాతీయ ఆటోమోటివ్ బోర్డు (ఎన్ఎబి) కు తయారీదారు ఈ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు.
  6. అన్ని వివరాలు ధృవీకరించబడిన తర్వాత, సబ్సిడీ తయారీదారునికి క్రెడిట్ చేయబడుతుంది, వారు తరువాత దానిని డీలర్‌కు క్రెడిట్ చేస్తారు.

ఈ స్కీమ్ మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

సబ్సిడీ కారణంగా ధర తగ్గింపు కాకుండా, మీరు రోడ్డు పన్ను నుండి కూడా మినహాయింపు పొందుతారు. ఇది డబ్బును మరింతగా ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇతర ప్రయోజనం, అందుబాటు ధరలో బైక్ ఇన్సూరెన్స్ మీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కోసం లభించడం. ధరలు మీ టూ-వీలర్ సామర్థ్యం ఆధారంగా ఉంటాయి. సామర్థ్యం తక్కువగా ఉంటే, ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న టూ-వీలర్ కోసం కోట్ పొందవచ్చు. *

ముగింపు

మీరు ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనుగోలు చేసినప్పుడు పాలసీ మరియు ఫేమ్ స్కీమ్ మీకు మరియు పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చవచ్చు. మీకు ఇష్టమైన బ్రాండ్ కోసం బైక్ ఇన్సూరెన్స్ ధరల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు మీ సమీప ఇన్సూరెన్స్ సలహాదారును సంప్రదించవచ్చు. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి