రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
How can we celebrate Holi safe?
నవంబర్ 22, 2021

సురక్షితమైన మరియు రంగుల హోలీని జరుపుకోవడానికి 7 చిట్కాలు

భారతీయ రంగుల పండుగ హోలీ వసంత కాలం ప్రారంభం, శీతాకాలం ముగింపులో భారత ఉపఖండం అంతటా జరుపుకునే ఒక ఘనమైన వేడుక. రంగుల పండుగ హోలీ నాడు ప్రజలు వారి కుటుంబం, బంధువులు మరియు స్నేహితులతో కలిసి రంగులతో ఆడతారు, ఆటపాటలు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తారు. భారతదేశంలో అన్ని పండుగలు ఆట పాటలు, తీపి వంటకాలతో జరుపుకున్నప్పటికీ, హోలీని రంగులతో జరుపుకోవడం ప్రత్యేకం, ఇది ప్రజల్లో రెట్టింపు ఉత్సాహం కల్గిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను రంగులతో ఆడుకోవడానికి ఇష్టపడతారు. మెరిసే రంగులతో ముఖాలపై పెయింటింగ్ వేసుకుంటారు, చిన్నాపెద్ద తేడా లేకుండా వాటర్ బెలూన్‌లు, పిచికారీతో స్నేహితులను రంగుల్లో ముంచి ఆనందిస్తారు; అయితే, సరదాగా ఆడుకోవడానికి వాడే ఈ రంగులు మీకు ఆనందాన్ని కలిగించినప్పటికీ, హాని తలపెట్టవు అనే గ్యారెంటీ ఏది లేదు. హోలీ పండుగ తర్వాత కొన్ని రోజుల వరకు ఈ రంగుల మరకలు మీ వాహనాలపై, కొన్నిసార్లు మీ ఇంటి లోపల అలాగే ఉండటం మీరు గమనించవచ్చు. హోలీ సంబరాల్లో మీ ఇంట్లోని విలువైన వస్తువులు, మీ వాహనంలోని ఖరీదైన భాగాలు కూడా డ్యామేజ్ కావచ్చు, మనం అనేక సందర్భాలలో ఇలాంటి వాటిని చూసి ఉన్నాము. కాబట్టి, ఏ నష్టాలను గురించి చింతించకుండా, ఈ రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ఈ కింది భద్రతా చిట్కాలను అనుసరించండి.

హోలీ సమయంలో మీ ఇంటిని మరియు ఇంట్లోని వస్తువులను రక్షించుకోవడానికి చిట్కాలు

  • మీ ఇంట్లోని గోడలు మరియు బాహ్య గోడలపై యాంటీ-స్టెయిన్ వార్నిష్‌ అప్లై చేయండి.
  • ఒకవేళ ఎవరైనా రంగులు పూయడానికి మీ ఇంట్లోకి వస్తే, మీరు పాత బెడ్‌షీట్లతో మీ ఫర్నిచర్‌ను కవర్ చేయండి, ఇతర విలువైన వస్తువులను ప్రత్యేక గదిలో ఉంచండి.
  • డోర్ నాబ్స్ పై ఆయిల్ లేదా వ్యాజిలైన్ అప్లై చేయండి, అప్పుడు మీరు సెలబ్రేషన్ పూర్తయిన వెంటనే సులభంగా వాటిని శుభ్రం చేసుకోగలరు
  • సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత, బాత్రూమ్‌లో మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం మానుకోండి , బదులుగా బాల్కనీ లేదా ఒక గార్డెన్‌లో మీ రంగులను కడుక్కోండి
  • మరకలను నివారించడానికి మీ ఇంట్లో నేలపై న్యూస్ పేపర్లు వేయండి.

హోలీ సమయంలో మీ వాహనాలను రక్షించుకోవడానికి చిట్కాలు

  • హోలీ రంగుల వల్ల మీ వాహనం డ్యామేజ్ అవకుండా ఉండేందుకు మీ వాహనంలోని అన్ని పెయింటెడ్ భాగాలకు వ్యాక్స్ పాలిష్‌ను అప్లై చేయండి.
  • మీరు హోలీ రోజున మీ వాహనాన్ని ఉపయోగించకపోతే, ఎలాంటి మరకలు పడకుండా ఉండడానికి దానిని జాగ్రత్తగా సురక్షితమైన చోట ఉంచండి.
  • ఒకవేళ మీరు ఆ రోజున మీ వాహనాన్ని ఉపయోగిస్తే, దయచేసి జాగ్రత్తగా మరియు నెమ్మదిగా డ్రైవ్ చేయండి దానివల్ల స్లిప్పరీ రోడ్లపై స్కిడ్డింగ్ కారణంగా అయ్యే గాయాలను నివారించవచ్చు.
  • డిటర్జెంట్‌కి బదులు మీ కారును శుభ్రం చేయడానికి కారు షాంపూ వాడండి, ఇది మీ కారు పెయింట్‌ను సురక్షితంగా ఉంచుతుంది.
  • మీ ఫోర్-వీలర్ లోపలి భాగాలను రక్షించడానికి పాత కర్టెన్లు మరియు టవల్స్ ఉపయోగించండి.

హోలీ రోజున మీ చర్మాన్ని సంరక్షించుకోవడానికి చిట్కాలు

  • రంగులతో ఆడటం మొదలుపెట్టడానికి ముందు ఆలివ్ లేదా కొబ్బరి నూనెను అప్లై చేసుకోండి.
  • రసాయనిక రంగులకు బదులుగా చర్మానికి అనుకూలంగా ఉండే సహజ రంగులతో హోలీ ఆడండి.
  • రంగులు నేరుగా చర్మంపై పడకుండా ఉండటానికి, మీ పూర్తి శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించండి.
  • రంగుల వల్ల కలిగే దురదను నివారించడానికి, ఉపశమనం పొందడానికి మాయిశ్చరైజర్ వాడండి.
  • మీరు మీ శరీరమంతా మందపాటి సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవచ్చు, అలాగే చర్మం మరియు గోళ్లకు నెయిల్ పాలిష్‌ వేసుకోవచ్చు.
మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను కాపాడుకోడానికి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, అత్యంత సముచితమైన ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు ద్వారా మీ ఆర్థిక పరిస్థితులను కూడా సురక్షితం చేసుకోవాలని మేము కోరుతున్నాము.

మీ బాధ్యత

మీరు బజాజ్ అలియంజ్ వారి కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీ , ఇది హోలీ సంబరాల్లో మీ కారు డ్యామేజ్ కారణంగా తలెత్తే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. మీరు బజాజ్ అలియంజ్ అందించే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కలిగివుండాలి. ఇది హోలీ వేడుకల్లో పోగొట్టుకున్న/ దెబ్బతిన్న మీ ఇంటి నిర్మాణాన్ని మరియు వస్తువులను కవర్ చేస్తుంది. అదనంగా, బజాజ్ అలియంజ్ అందించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వల్ల మీరు ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనవచ్చు. మీ అందరికీ సురక్షితమైన మరియు రంగుల హోలీ శుభాకాంక్షలు!

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి