రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Tips to avoid car theft
సెప్టెంబర్ 14, 2020

కారు దొంగతనం నివారణ కోసం ఉత్తమ చిట్కాలు

కారు దొంగతనం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ, పెద్ద సమస్య ఏమిటంటే, మీరు మీ కారును తిరిగి పొందగలిగినప్పటికీ అది దొంగిలించబడిన అదే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి, మీరు ఈ రెండు సందర్భాల కోసం సిద్ధంగా ఉండాలి - మీరు మీ కారును తిరిగి పొందలేకపోవచ్చు లేదా మీరు దానిని తిరిగి పొందినట్లయితే, మీ కారులో ఆర్ స్టీరియో, సైడ్ మిర్రర్లు, రిమ్స్, టైర్లు మరియు లైసెన్స్ ప్లేట్లు మొదలైనటువంటి కొన్ని ముఖ్యమైన భాగాలను కోల్పోయే అవకాశం ఉంది. భారతదేశం వ్యాప్తంగా అన్ని నగరాల్లోని చాలా మంది ప్రజలు, వారి కార్లను ఇంటి వెలుపల వీధుల్లో పార్క్ చేస్తారు, ఇది అస్సలు సురక్షితం కాదు. పార్కింగ్ స్థలం తక్కువగా ఉన్నందున వారిలో కొందరు వారి ఇంటి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో కార్లను పార్కింగ్ చేసి ఉండవచ్చు. ఇది దొంగలు/ నేరస్థులకు కారును దొంగిలించడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది. మీ కారు దొంగిలించబడకుండా నిరోధించడానికి మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి:
  • మీ కారును ఎల్లప్పుడూ లాక్ చేయండి – మీరు మీ కారు నుండి బయటకు వచ్చిన వెంటనే దానిని లాక్ చేయడం అలవాటు చేసుకోండి. మీ కారు మీకు కొన్ని మీటర్ల దూరంలో ఉంటే, మీ కారును అన్‌లాక్ చేయడం సరైనది అని భావించకండి. మీ కారును అన్‌లాక్ చేసి, ఎక్కువ కాలం దానిని పట్టించుకోకుండా ఉంచడం సురక్షితం కాదు. వీలైతే, మీ కార్లను బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి, అలాగే మీరు, మీ కారు నుండి దిగిన తర్వాత దానిని లాక్ చేయండి.
  • తాళాలను చెక్ చేయండి – ఒకసారి, మీరు కారు బయటకు అడుగు పెట్టి దానిని లాక్ చేసిన తర్వాత, కారు ట్రంక్‌తో సహా అన్ని డోర్‌ల తాళాలను చెక్ చేయండి మరియు తిరిగి మళ్లీ ఒకసారి చెక్ చేయండి. అలాగే, మీ కారులోని అన్ని విండోలు మూసివేయబడి, బిగించబడ్డాయో లేదో చెక్ చేయండి.
  • మీ కారులో విలువైన వస్తువులను ఉంచడం మానుకోండి– కారు దొంగతనం జరుగుతుంది అంటే, దొంగలు సాధారణంగా మీ కారులో ఉంచబడిన విలువైన వస్తువులను విక్రయించాలనుకుంటారు. కాబట్టి, మీ కారులో ఆభరణాలు, నగదు లేదా ల్యాప్‌టాప్‌లు లాంటి విలువైన వస్తువులను వదిలి వేయడం మానుకోండి, మీరు మార్గం మధ్యలో ఏదైనా చిన్న అవసరానికి దిగాల్సి వచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. విలువైన వస్తువులను కారులో ఉంచడం తప్పనిసరి అయితే, మీ కారు వెలుపల ఉన్న వ్యక్తులకు కనిపించకుండా వాటిని సరిగ్గా దాచిపెట్టండి.
  • డాక్యుమెంట్లను మీతో పాటు తీసుకువెళ్ళండి – డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్ (ఆర్‌సి), కార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు మరియు కార్ లోపల అదనపు కీస్ మరియు మీ డాక్యుమెంట్లను వదిలివేయకండి. ఈ డాక్యుమెంట్లను ఉపయోగించి దొంగలు మీలా నటించి మోసగించవచ్చు, కాబట్టి వారిని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టమవుతుంది. ఒరిజినల్స్‌ని ఎల్లప్పుడూ మీ వెంటే తీసుకెళ్లండి.
  • యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయండి – మీ కార్లలో యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం వల్ల కారు దొంగతనాన్ని నిరోధించవచ్చు. ఒక యాంటీ-థెఫ్ట్ పరికరం మీ కారు దొంగిలించబడే అవకాశాలను తగ్గిస్తుంది. టెలిమాటిక్స్ పరికరాలు, డాష్-క్యామ్‌లు, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్‌లు, స్టీరింగ్ వీల్ లాక్‌లు మరియు దొంగల నుండి మీ కారును సురక్షితంగా ఉంచే ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్లు లాంటి అనేక రకాల యాంటీ-థెఫ్ట్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరియు మీరు మీ కారులో ఏదైనా రకమైన యాంటీ-థెఫ్ట్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం పై తగ్గింపును కూడా పొందవచ్చు.
మీ కారు దొంగతనాన్ని నివారించడానికి మీరు ఈ చిట్కాలను అనుసరించాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చేయడాన్ని ఎంచుకోవాలి, తద్వారా దురదృష్టవశాత్తూ కారు దొంగతనం జరిగితే, మీరు క్లెయిమ్ చేయవచ్చు మరియు మీపై వచ్చే ఆర్థిక భారాన్ని ఎదుర్కోవచ్చు. కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్ కవర్ వంటి కారు ఇన్సూరెన్స్ పాలసీతో పాటు యాడ్-ఆన్‌లు ను కొనుగోలు చేయాలని కూడా మేము మీకు సిఫార్సు చేస్తున్నాము, తద్వారా మీరు మీ కారు కోసం మెరుగైన కవరేజీని పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి