రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
traffic fines in Kolkata
30 మార్చి, 2023

కోల్‌కతాలో ట్రాఫిక్ జరిమానాల గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు

దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, కోల్‌కతా అనేది స్థానికత మీద అత్యంత ప్రేమ కలిగిన ఒక నగరం. కోల్‌కతా అనేది నేడు ఒక ముఖ్యమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా చాలామంది ప్రజలకు తెలిసినప్పటికీ, ఘనత వహించిన దాని గతం గురించి మరియు వివిధ పాలకులు మరియు విదేశీ పాలకులకు అదొక కీలక ప్రదేశంగా ఎలా ఉండేదో చరిత్ర అభిమానులు మాత్రమే చెప్పగలరు. బ్రిటిష్ వారికి ఈ నగరం వందేళ్లకు పైగా రాజధానిగా సేవలందించింది. రాజధానిని కోల్‌కతా నుండి ప్రస్తుత న్యూఢిల్లీకి మార్చిన తర్వాత కూడా, కోల్‌కతా దాని ప్రాముఖ్యతను కొనసాగించింది. ఆ తర్వాత, పశ్చిమ బెంగాల్ ఏర్పాటుతో ఆ రాష్ట్రానికి రాజధానిగా మారింది. 2001లో, ఈ నగరం పేరును కోల్‌కతాగా సరిచేశారు. బెంగాలీ భాషలో ఉచ్ఛారణకు సరిపోయేలా ఉండాలని ఈ విధంగా చేశారు. ఈ నగరం గురించిన మరొక విషయం ఏమిటంటే, ప్రత్యేకించి మీరిక్కడ డ్రైవ్ చేయాలనే ఆలోచనలో ఉంటే, కొత్త ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు తెలుసుకోవాలి. మోటార్ వాహనాల (సవరణ) చట్టం -2019ని ఆ సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టారు. దీంతో, దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు అమలులోకి వచ్చాయి. కోల్‌కతాలోనూ దీనిని వర్తింపజేశారు. కోల్‌కతాలో డ్రైవ్ చేయాలని మీరు ప్లాన్ చేస్తుంటే, అది ఒక టూ-వీలర్, ఫోర్-వీలర్ లేదా కమర్షియల్ వాహనం అయినప్పటికీ, ఈ నిబంధనలు అన్నింటినీ కాకపోయినప్పటికీ, వాటిలో కొన్నింటినైనా మీరు తప్పక తెలుసుకోవాలి. ఉదాహరణకు, కోల్‌కతాలో ట్రాఫిక్ జరిమానాల గురించి మీరు తెలుసుకోవాలి. తద్వారా, మీరు ఏదైనా దురదృష్టకర పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు, మీరు ఎలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారో మీకు బాగా అర్థం కాగలదు.

కోల్‌కతాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానాలు

మీరు కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినప్పుడు మీరు చెల్లించాల్సిన జరిమానాలు గురించి చూద్దాం. ఒకే రకం నేరానికి మీరు ఎన్నిసార్లు పట్టుబడ్డారనే దాని మీద ఆధారపడి, ప్రతి ఉల్లంఘన కోసం కోల్‌కతాలో ట్రాఫిక్ జరిమానాలు ఏవిధంగా ఉంటాయో క్రింది పట్టిక చూపుతుంది.
ఉల్లంఘన నేరం 1 నేరం 2 నేరం 3 నేరం 4
అధిక వేగం (టూ-వీలర్, ప్రైవేట్ ఫోర్-వీలర్, ఆటో) 1000 2000 2000 2000
పియుసి సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం 2000 2000 2000 2000
నోటీసు జారీ చేసిన 7 రోజుల్లోపు చెల్లుబాటు అయ్యే పియుసి సమర్పించడంలో వైఫల్యం 10000 10000 10000 10000
వాహనంలో హారన్ లేకపోవడం 500 1500 1500 1500
అధిక ధ్వని, ష్రిల్ లేదా మల్టీ-ట్యూన్డ్ హారన్ అమర్చిన వాహనం 500 1500 1500 1500
ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘన 500 1500 1500 1500
ప్రొటెక్టివ్ హెడ్‌గేర్ (టూ-వీలర్) ధరించకపోవడం 1000 1000 1000 1000
భద్రతా చర్యల ఉల్లంఘన (టూ-వీలర్ రైడర్ మరియు/లేదా వెనుక కూర్చున్న వ్యక్తి) 1000 1000 1000 1000
నిషేధం ఉన్నచోట యు-టర్న్ తీసుకోవడం 500 1500 1500 1500
యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్ డిమాండ్ చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చూపించడంలో వైఫల్యం 500 1500 1500 1500
యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇతర డాక్యుమెంట్లు (లైసెన్స్ మినహా) చూపడంలో వైఫల్యం 500 1500 1500 1500
ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘన 500 1500 1500 1500
వెహికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్‌ను చూపించడంలో విఫలత (దానిని సమర్పించడానికి మంజూరు చేయబడిన సమయం – 7 రోజులు) 500 1500 1500 1500
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవడం 500 1500 1500 1500
డ్రైవ్ చేయడానికి శారీరికంగా లేదా మానసికంగా అనుకూలంగా లేని వ్యక్తి డ్రైవింగ్ చేయడం 1000 2000 2000 2000
ప్రమాదకర పద్ధతిలో డ్రైవింగ్ 5000 10000 10000 10000
వాహనంలో రియర్-వ్యూ మిర్రర్ లేకపోవడం 500 1500 1500 1500
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్/ఇయర్‌ఫోన్ వినియోగం 5000 10000 10000 10000
'నో హారన్' ప్రాంతంలో హారన్ ఉపయోగించడం 1000 2000 2000 2000
ఫుట్‌పాత్ మీద డ్రైవింగ్ 500 1500 1500 1500
ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్ లేకుండా టూ-వీలర్ రైడింగ్ 500 1500 1500 1500
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం 5000 5000 5000 5000
ప్రమాదకర రీతిలో ఓవర్‌టేకింగ్ 500 1500 1500 1500
నంబర్ ప్లేట్ లోపభూయిష్టంగా ఉండడం 500 1500 1500 1500
లోపభూయిష్టమైన టైర్లతో డ్రైవింగ్ 500 1500 1500 1500
పేవ్‌మెంట్ మీద పార్కింగ్ చేయడం 500 1500 1500 1500
  ఇవి కొన్ని ముఖ్యమైన ఉల్లంఘనలు మరియు వాటికి సంబంధించిన జరిమానాలు. మీ వాహనం ఒక టూ-వీలర్, ఫోర్-వీలర్ లేదా ఇతర ఏదైనా వాహనం అయినప్పటికీ, ఈ ట్రాఫిక్ నియమాల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి.

మీ వాహనం కోసం డాక్యుమెంట్లు

మీరు ఏ వాహనం కలిగి ఉన్నారు లేదా డ్రైవ్ చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, మీ వద్ద కొన్ని డాక్యుమెంట్లు తప్పక ఉండాలి మరియు మీ వాహనం డ్రైవ్ చేసే సమయంలో అవి మీ వెంట ఉండాలి. ఉదాహరణకు, మీకు బైక్ ఉంటే, ఇతర డాక్యుమెంట్లతో పాటు మీ వద్ద చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ ఉండాలి. బైక్ యజమానిగా మీ వద్ద ఉండాల్సిన కొన్ని డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
  • డ్రైవింగ్ లైసెన్సు
  • వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • బైక్ ఇన్సూరెన్స్ పాలసీ
  • పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్
అదేవిధంగా, మీకు ఒక కారు ఉంటే, మీ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
  • డ్రైవింగ్ లైసెన్సు
  • వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • కారు ఇన్సూరెన్స్ పాలసీ
  • పియుసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్
మీ ఇన్సూరెన్స్ పాలసీ, అది బైక్ లేదా కారు ఇన్సూరెన్స్‌అయినా సరే, క్రమం తప్పకుండా రెన్యూవల్ అవసరమని గుర్తుంచుకోండి. దాని గడువు తేదీని గమనించి, మీరు దానిని సకాలంలో రెన్యూవల్ చేయాలి. పియుసి సర్టిఫికెట్‌ విషయంలోనూ అదే వర్తిస్తుంది. ఇది పరిమిత సమయం కోసం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఉన్నది చెల్లనిదిగా పరిగణించబడిన తక్షణం మీ వద్ద కొత్తది ఉండాలి. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు లేకుండా మీరు మీ వాహనం నడపడం మంచిది కాదు. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి