రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Validity of Vehicle Documents Extended, Insurance Still Mandatory!
సెప్టెంబర్ 30, 2021

వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటు పొడిగించబడినప్పటికీ, ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి

కరోనావైరస్ మహమ్మారి యొక్క రెండవ దశ ప్రారంభంలో, వివిధ వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటును రెన్యూ చేయడం వాహన యజమానులకు ఒక సవాలుగా మారింది. ఈ సంక్షోభం దృష్ట్యా, సెంట్రల్ మోటార్ వెహికల్ చటం, 1989 మరియు మోటార్ వాహనాల చట్టం, 1988 కింద కవర్ చేయబడిన డాక్యుమెంట్ల పొడిగింపుకు సంబంధించిన ప్రకటనను, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. అందువల్ల, దిగువ పేర్కొన్న అన్ని డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువు 1 ఫిబ్రవరి 2021న ముగిసిపోయినట్లయితే లేదా 30 సెప్టెంబర్ 2021 నాటికి గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ, అవి 30 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుతాయి.
  • రోడ్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు
  • అనుమతి (అన్ని రకాల)
  • డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్)
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి)
  • ఇతర సంబంధిత డాక్యుమెంట్లు
వాహన డాక్యుమెంట్ల చెల్లుబాటు పొడిగింపు అనేది వాహన ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీ పొడిగింపును కవర్ చేయదని దయచేసి గుర్తుంచుకోండి. అందువల్ల, ఎంఒఆర్‌టిహెచ్ ద్వారా పొడిగింపు నియమం ఏదైనా వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలకు వర్తించదని అర్థం చేసుకోవడం తప్పనిసరి. పాలసీల చెల్లుబాటును కొనసాగించడానికి ప్రతి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని సంబంధిత రెన్యూవల్ తేదీ ప్రకారమే రెన్యూ చేయాల్సిన అవసరం ఉందని దీని అర్థం. మీకు ఒక బైక్ ఉంటే, మీకు రక్షణ కలిపించే బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి:
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్
  • బైక్ దొంగతనం లేదా చోరీ
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం
  • మానవ నిర్మిత విపత్తుల నుండి నష్టం
  • మీ బైక్ ద్వారా థర్డ్-పార్టీకి జరిగిన నష్టం యొక్క బాధ్యత
  • బైక్ రవాణా కారణంగా జరిగిన ఆర్థిక నష్టం
  • దొంగిలించబడిన బైక్ కారణంగా జరిగిన ఆర్థిక నష్టం
కాబట్టి, మీరు ఇప్పటికీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోకపోతే లేదా మీ పాలసీని రెన్యూ చేసుకోవాల్సి వస్తే, మీరు బజాజ్ అలియంజ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాంటాక్ట్‌లెస్ రెన్యూవల్ మరియు కొనుగోలును ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ పాలసీ సేకరణ ప్రక్రియలో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, మీరు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మాదిరిగానే, దీని కోసం కూడా ఒక ఆప్షన్ ఉంటుంది-‌ కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్. ప్రభుత్వం పేర్కొన్న విధంగా, చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్‌ను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంచుకోవాలి. కార్ ఇన్సూరెన్స్ అనేది భవిష్యత్తులో ఏవైనా ఆకస్మిక పరిస్థితుల నుండి ఫోర్-వీలర్‌ను సురక్షితం చేయడానికి ఉద్దేశించబడినది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ మరియు కారు యజమాని మధ్య ఒప్పందం రూపంలో అమలులోకి వస్తుంది. ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు సమగ్ర పాలసీ రెండింటినీ కవర్ చేస్తుంది. కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రాథమిక ప్రయోజనాలు:
  • నగదురహిత క్లెయిములు
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్
  • నష్టం/డ్యామేజీ నుండి ప్రొటెక్షన్
  • ఏదైనా భౌతికపరమైన నష్టానికి అపరిమితమైన థర్డ్ పార్టీ కవర్
ఇప్పుడు మీరు వాహన డాక్యుమెంట్లు మరియు ఇన్సూరెన్స్ పాలసీల చెల్లుబాటుకు సంబంధించిన వాస్తవాల గురించి తెలుసుకున్నారు కాబట్టి, మీరు అప్రమత్తంగా ఉండవచ్చు. మీ టూ-వీలర్ లేదా ఫోర్-వీలర్ కోసం అత్యంత సరసమైన మరియు ప్రయోజనకరమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి మరియు నిశ్చింతగా ఉండండి. మోటార్ వాహనాల డాక్యుమెంట్ల పొడిగింపు లేదా ఇన్సూరెన్స్‌కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి దిగువన ఉన్న కామెంట్ సెక్షన్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ఒక కొనుగోలుని పూర్తి చేయడానికి ముందు దాని ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/పాలసీ షరతులు మరియు నిబంధలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి