టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది మీ టూ వీలర్‌కు జరిగిన ప్రమాదవశాత్తు నష్టం మరియు/ లేదా ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, దోపిడి మొదలైన దురదృష్టకర సంఘటనల కారణంగా మీకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షించే ముఖ్యమైన సాధనం.
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించే అంశాలు ఏవి?
భారతదేశంలో బైక్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ కొరకు తీసుకోవడం తప్పనిసరి, IRDAI (Insurance Regulatory and Development Authority of India) ఈ ప్రీమియంను నిర్ణయిస్తుంది మరియు ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.
ఐఆర్‌డిఎఐ తప్పనిసరి కానప్పటికీ సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు ఒకదాన్ని ఎంచుకోవలసిందిగా సలహా ఇవ్వడమైనది, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు మరియు/లేదా ఊహించని ప్రమాదాల కారణంగా మీరు మీ వాహనాన్ని కోల్పోయినా/ డ్యామేజ్ అయినా, అది మీ ఫైనాన్సులను జాగ్రత్తగా చూసుకుంటుంది.
మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ కోసం ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- ఐడివి
- వాహనం యొక్క క్యూబిక్ సామర్థ్యం
- వాహనం యొక్క వయస్సు
- భౌగోళిక సరిహద్దు
- యాడ్-ఆన్ కవర్లు (ఆప్షనల్)
- యాక్సెసరీలు (ఆప్షనల్)
- మునుపటి ఎన్‌సిబి రికార్డులు (ఏవైనా ఉంటే)
అన్ని ఇతర పదాలు పేరును బట్టి అర్థం అవుతాయి. అయితే, మనం ఐడివి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
IDV అంటే ఏమిటి?
ఇన్సూరెన్స్‌లో ఐడివి అంటే ఇన్సూర్ చేసిన వ్యక్తి ప్రకటించే వాహన విలువ. ఇది మీ టూ వీలర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా లెక్కించబడుతుంది. ఐడివి అనేది తయారీదారు విక్రయ ధరపై నిర్ణయించబడుతుంది, ఇందులో రిజిస్ట్రేషన్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు మినహా, ఇన్వాయిస్ విలువ మరియు జిఎస్‌టి ఉంటుంది. మీ టూ వీలర్ ఐడివి ఈ కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- మీ వాహనం తయారీ
- మీ వాహనం మోడల్
- మీ బైకులో సబ్-మోడల్
- రిజిస్ట్రేషన్ తేదీ
ఐడివి యొక్క మరింత అధికారిక నిర్వచనం "ఇది ఇన్సూర్ చేయబడిన మొత్తం ఇన్సూర్ చేయబడిన వాహనం కోసం ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో నిర్ణయించబడిన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనం కోసం".
ఐడివి అనేది తయారీదారు యొక్క ప్రస్తుతం జాబితా చేయబడిన విక్రయ ధర ఆధారంగా ఉంటుంది. కాబట్టి, ఇది తగ్గవచ్చు లేదా తరుగుదలకు లోబడి ఉండవచ్చు. మీ టూ వీలర్ వయస్సు ఆధారంగా దాని తరుగుదల రేటును తెలుసుకోవడానికి ఈ కింది పట్టికను చూడవచ్చు.
వాహనం యొక్క వయస్సు | డిప్రిసియేషన్ % |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించిన కానీ 1 సంవత్సరం మించని | 5% |
1 సంవత్సరం మించిన కానీ 2 సంవత్సరాలు మించని | 15% |
2 సంవత్సరాలు మించిన 3 సంవత్సరాలు మించని | 20% |
3 సంవత్సరాలు మించిన 4 సంవత్సరాలు మించని | 40% |
4 సంవత్సరాలు మించిన 5 సంవత్సరాలు మించని | 50% |
5 సంవత్సరాల కంటే పాత వాహనాల కోసం ఐడివి అనేది మీకు, మీ ఇన్సూరర్ మధ్య ఒక చర్చ మరియు ఒప్పందం తర్వాత నిర్ణయించబడుతుంది.
కొత్త వాహనాల కోసం ఐడివి అనేది వాటి ఎక్స్-షోరూమ్ ధరలో 95% గా నిర్ణయించబడుతుంది. ఐడివి పై ఈ సమాచారం మీ బైక్/ టూ వీలర్ కోసం సరైన ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఒక తెలివైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుందని భావిస్తున్నాము. మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లు, ప్రయోజనాల గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు. మీరు దీని సహాయంతో కూడా మీ ప్రీమియంను నిర్ణయించవచ్చు- టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ .
రిప్లై ఇవ్వండి