రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
bike maintenance tasks for a smooth ride
ఏప్రిల్ 1, 2021

బైక్‌లలో పియుసి అంటే ఏమిటి?

Air pollution is one of the primary concerns of the country today. And the government is taking every action to control it. One of those many actions initiated by the government in controlling air pollution is keeping vehicular pollution within limits. With the boost in the number of vehicles on Indian roads, it has become imperative to keep a check on pollution. This is the reason why the ministry of transport made the PUC certificate mandatory for drivers as per the Central Motor Vehicle Act మోటార్ వాహన చట్టం, 1989. కాబట్టి, బైక్ లేదా కారు లేదా ఏదైనా ఇతర వాహనంలో పియుసి అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? సమాధానం ఇవ్వడానికి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని లోతుగా తెలుసుకుందాం!  

పియుసి అంటే ఏమిటి?

పియుసి అనే పదం పొల్యూషన్ అండర్ కంట్రోల్ కి సంక్షిప్త రూపం, ఇది వాహన ఉద్గార స్థాయిలను పరీక్షించిన తర్వాత ప్రతి వాహన యజమానికి జారీ చేయబడే ఒక సర్టిఫికేట్. ఈ సర్టిఫికెట్, వాహనాల ద్వారా వెలువడే ఉద్గారాలు మరియు అవి నిర్ణీత పరిమితుల్లో ఉన్నాయో లేదో అనే పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఈ ఉద్గార స్థాయిల పరీక్ష అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద అధీకృత కేంద్రాల్లో జరుగుతుంది. పియుసి అనేది బైక్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మాదిరిగా పనిచేస్తుంది, దీనిని ఎల్లవేళలా మీ వెంటే తీసుకెళ్లాలి. పియుసి సర్టిఫికెట్‌ ఈ కింది సమాచారాన్ని కలిగి ఉంటుంది:  
  • కారు, బైక్ లేదా ఏదైనా ఇతర వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్.
  • టెస్ట్ చెల్లుబాటు వ్యవధి
  • పియుసి యొక్క సీరియల్ నంబర్
  • ఎమిషన్ టెస్ట్ జరిగిన తేదీ
  • వాహనం యొక్క ఉద్గార రీడింగ్‌లు
 

నాకు పియుసి అవసరమా?

అవును, పియుసి సర్టిఫికెట్ అనేది ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల మాదిరిగా తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్. అది ఎందుకు అవసరం అనేది ఇక్కడ ఇవ్వబడింది:  
  1. చట్టం ప్రకారం ఇది తప్పనిసరి: మీరు తరచూ ప్రయాణించే వ్యక్తి అయితే, తప్పనిసరిగా పియుసి సర్టిఫికెట్‌ని వెంట తీసుకెళ్లాలి. డాక్యుమెంటేషన్ ప్రయోజనం కోసం మాత్రమే కాదు, ఇది భారతీయ చట్టం ప్రకారం తప్పనిసరి.
  నా ఫ్రెండ్ గౌరవ్‌కు ట్రాఫిక్ చలాన్ ఇవ్వబడింది, అయితే అతను ఏ నియమాన్ని ఉల్లంఘించలేదు. ఎందుకు? ఆరా తీయగా, అతని వద్ద చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికెట్ లేదని తెలిసింది. దీని కారణంగా ₹1000 జరిమానా విధించబడుతుంది. ఈ భారీ జరిమానాలను నివారించడానికి, మీరు పియుసి సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.  
  1. ఇది కాలుష్య నియంత్రణను ప్రోత్సహిస్తుంది: పియుసి సర్టిఫికేట్‌ను తీసుకోవడానికి గల రెండవ ప్రధాన కారణం, ఇది పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీ వాహన ఉద్గార స్థాయిలను అనుమతించదగిన పరిమితుల్లో ఉంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు మరియు పర్యావరణాన్ని పరిరక్షించడంలో మీ వంతు సహాయం చేయవచ్చు.
 
  1. ఇది మీ వాహన ఆరోగ్య స్థితిని గురించి మీకు తెలియజేస్తుంది: పియుసి సర్టిఫికెట్‌ను కలిగి ఉండటంలోని మరొక ఆవశ్యకత ఏమిటంటే ఇది మీ వాహనం యొక్క ఆరోగ్య స్థితిని గురించి మీకు తెలియజేస్తుంది. అందువల్ల, భవిష్యత్తులో భారీ జరిమానాల వల్ల తలెత్తే నష్టాలను నివారించవచ్చు.
 
  1. ఇది జరిమానాలను నిరోధిస్తుంది: కొత్త నిబంధనల ప్రకారం, మీరు పియుసి సర్టిఫికేట్‌ను కలిగి ఉండకపోతే మీకు రూ. 1000 జరిమానా విధించబడుతుంది. ఇది అలాగే పునరావృతమైతే జరిమానా రూ. 2000 కూడా కావచ్చు. ఈ జరిమానాలను నివారించడానికి, పియుసి సర్టిఫికేట్‌ను కలిగి ఉండటం అవసరం.
 

భారతదేశంలోని వాహనాల కోసం నిర్దేశించిన కాలుష్య ప్రమాణాలు ఏమిటి?

వాహనాలు కారు, బైక్, ఆటో మరియు మరెన్నో రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా, ఇంధన రకాన్ని బట్టి నిర్దేశించిన కాలుష్య నిబంధనలు కూడా మారుతూ ఉంటాయి. ఆమోదయోగ్యమైన కాలుష్య స్థాయిలను ఒక సారి చూడండి.  

బైక్ మరియు 3-వీలర్లలో పియుసి అంటే ఏమిటి?

బైక్ మరియు 3-వీలర్ కోసం నిర్దేశించిన కాలుష్య స్థాయిలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
వాహనం హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ)
31 మార్చి 2000 (2 లేదా 4 స్ట్రోక్) కు ముందు లేదా ఆ తేదీన తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ 4.5% 9000
31 మార్చి 2000 (2 స్ట్రోక్) కు ముందు లేదా ఆ తర్వాత తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ 3.5% 6000
31 మార్చి 2000 (4 స్ట్రోక్) తర్వాత తయారు చేయబడిన బైక్ లేదా 3-వీలర్ 3.5% 4500
 

పెట్రోల్ కార్ల కోసం కాలుష్య స్థాయిలు

 
వాహనం హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ)
భారత్ స్టేజ్ 2 ప్రమాణాల ప్రకారం తయారు చేయబడిన 4-వీలర్లు 3% 1500
భారత్ స్టేజ్ 3 ప్రమాణాల ప్రకారం తయారు చేయబడిన 4-వీలర్లు 0.5% 750
 

సిఎన్‌జి/ఎల్‌పిజి /పెట్రోల్ వాహనాల (భారత్ స్టేజ్ 4) కోసం అనుమతించదగిన కాలుష్య స్థాయిలు

 
వాహనం హైడ్రోకార్బన్ (ప్రతి మిలియన్‌కు భాగాలు) కార్బన్ మోనో-ఆక్సైడ్ (సిఒ)
భారత్ స్టేజ్4 నిబంధనల ప్రకారం తయారు చేయబడిన సిఎన్‌జి/ఎల్‌పిజి 4-వీలర్లు 0.3% 200
భారత్ స్టేజ్ 4 నిబంధనల ప్రకారం తయారు చేయబడిన పెట్రోల్ 4-వీలర్లు 0.3% 200
 

పియుసి సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధి ఎంత?

Whenever you purchase a new vehicle, the dealer provides you the PUC certificate which is valid for one year. Post that, when a year is complete, you need to go to an authorized emission testing centre to get your తనిఖీ చేయబడిన వాహనం మరియు ఒక కొత్త పియుసి సర్టిఫికెట్ పొందండి, ఈ సర్టిఫికెట్ చెల్లుబాటు ఆరు నెలలు. కాబట్టి, ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి.  

పియుసి సర్టిఫికెట్‌ను ఎలా పొందాలి?

దీనిని పొందడానికి కొన్ని సులభమైన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:  
  • ముందుగా, మీరు ఒక అధికారిక కేంద్రాన్ని కనుగొనాలి. మీరు ఒక పెట్రోల్ పంపుకు వెళ్లవచ్చు మరియు అక్కడ కాలుష్య నియంత్రణ కేంద్రం ఉందో లేదో చెక్ చేయవచ్చు. ఇంతే కాకుండా, మీరు ఆన్‌లైన్‌లో Parivahan ప్లాట్‌ఫారమ్‌లో లైసెన్స్ పొందిన ఆర్‌టిఒ ఆమోదిత పియుసి సెంటర్ కోసం చూడవచ్చు.
 
  • సమీప పియుసి సెంటర్‌ను గుర్తించిన తర్వాత అక్కడ మీ వాహనాన్ని డ్రైవ్ చేయండి మరియు సిబ్బంది మీ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ పైపులోకి ఎమిషన్ టెస్ట్ ట్యూబ్‌ను పంపిస్తారు. ఇది మీ వెహికల్ యొక్క ఉద్గార స్థాయిలను తెలియజేస్తుంది.
 
  • ఆ తర్వాత; అతను మీ కోసం ఒక సర్టిఫికేట్‌ను కూడా అందజేస్తారు అది ఎలక్ట్రానిక్‌ రూపంలో జనరేట్ అవుతుంది. ఇది మీ వాహనం యొక్క ఉద్గార స్థాయిలను కలిగి ఉంటుంది.
 

దీని కోసం నాకు ఎంత ఖర్చవుతుంది?

ఒక బైక్ ఇన్సూరెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లతో పోలిస్తే, పియుసి సర్టిఫికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒక పియుసి సర్టిఫికెట్ కోసం మీకు దాదాపుగా రూ.50-100 ఖర్చవుతుంది.  

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. నేను ఆన్‌లైన్‌లో పియుసి పొందవచ్చా?
అవును, అది జారీ చేయబడిన తర్వాత మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో పియుసి పొందవచ్చు. మీరు ముందుగా మీ వాహనాన్ని అధీకృత కేంద్రంలో చెక్ చేయించుకోవాలి, ఆ తరువాత మాత్రమే మీరు Parivahan వెబ్‌సైట్ నుండి పియుసిని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
  1. కొత్త బైక్ కోసం పియుసి సర్టిఫికెట్ అవసరమా?
అవును, బైక్ ఇన్సూరెన్స్ మాదిరిగానే, ఒక కొత్త బైక్ కోసం ఒక పియుసి సర్టిఫికెట్ కూడా అవసరం. అయితే, మీరు దాని కోసం ఏ అధీకృత పియుసి సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. ఇది డీలర్ ద్వారా అందించబడుతుంది, 1 సంవత్సరం పాటు చెల్లుతుంది.  
  1. పియుసి సర్టిఫికెట్ ఎవరికి కావాలి?
సెంట్రల్ మోటర్ వెహికల్స్ చట్టం, 1989 ప్రకారం ప్రతి వాహనానికి పియుసి సర్టిఫికెట్ తప్పనిసరి. వీటిలో భారత్ స్టేజ్ 1/భారత్ స్టేజ్ 2/భారత్ స్టేజ్ 3/భారత్ స్టేజ్ 4 కు అనుగుణంగా ఉండే మరియు ఎల్‌పిజి /సిఎన్‌జి పై నడిచే వాహనాలు ఉన్నాయి.  
  1. నేను Digilockerలో పియుసి సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
అవును, అన్ని ఇతర వెహికల్ డాక్యుమెంట్లతో పాటు మీరు డిజిలాకర్ యాప్‌లో పియుసి ని కూడా చేర్చవచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి