రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
The Importance of Wearing a Helmet
జనవరి 10, 2019

హెల్మెట్ భద్రత: టూ వీలర్లపై హెల్మెట్ ధరించడానికి ముఖ్యమైన కారణాలు

ఇటీవల, భారతదేశంలోని మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరమైన పూణేలో, టూ వీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయబడింది. పూణేలోని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో మరియు వాటి కారణంగా సంభవించే ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఈ నిబంధనను అమలు చేసింది. పోలీస్ డిపార్ట్‌మెంట్ దీని గురించి ఒక మంచి ఆలోచన చేసినప్పటికీ, ప్రజలు అనేక (ఎక్కువగా అవివేకమైనవి) కారణాలు పేర్కొంటూ హెల్మెట్‌లను ధరించడం పట్ల విముఖత చూపుతున్నారు:
  • హెల్మెట్‌లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి
  • బైక్‌లు రైడ్ చేయనప్పుడు హెల్మెట్లను వెంట తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది
  • హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు చెదిరిపోతుంది
కానీ మీ విలువైన జీవితంతో పోలిస్తే ఈ కారణాలు చాల చిన్నవి. మధ్య యుగాల నుండి హెల్మెట్లు వాడుకలో ఉన్నాయి. అయితే, పూర్వ కాలంలో అవి సైనిక వినియోగానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. కాలక్రమేణా హెల్మెట్ల వాడకం మరియు వాటిలో డిజైన్లు అభివృద్ధి చెందాయి. ఆటలు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల తలను రక్షించడానికి మరియు క్యారేజ్‌లోని రైడర్లను రక్షించడానికి హెడ్‌గేర్ ఉపయోగించబడింది. ఈరోజు హెల్మెట్ ప్రాముఖ్యత మరింత ఎక్కువగా ఉంది, ఎందుకనగా, వేగంగా వెళ్లే వాహనాలతో రోడ్లు భారీగా నిండిపోయాయి మరియు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అలాగే, ప్యాచ్ వర్క్స్ మరియు భారతీయ రోడ్ల నిరంతర అభివృద్ధి అనేది ప్రమాదాల అవకాశాలను పెంచుతున్నాయి.

మీరు టూ-వీలర్‌ను నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ను ధరించడంలోని ప్రాముఖ్యత:

  • హెల్మెట్ తలకు తగిలే గాయాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది -- హెల్మెట్ ధరించడం వల్ల మీ తలపై ప్రమాదం యొక్క ప్రభావం తగ్గుతుంది. మీరు టూవీలర్ వెహికల్‌ను నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే, హెల్మెట్‌ను ధరించి ఉండకపోతే, తలకు తగిలిన గాయాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. మీరు హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే, అది బాహ్య మరియు అంతర్గత మెదడు భాగాల్లో గాయాలకు కారణం కావచ్చు, ఇది మీ ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంది. కాబట్టి, మీ ప్రాణాలను రక్షించుకోవడానికి మీరు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి.
  • హెల్మెట్ మీ కళ్లను రక్షిస్తుంది – ఒక ఫుల్-ఫేస్డ్ హెల్మెట్ మీ పూర్తి ముఖాన్ని కప్పివేస్తుంది, మీరు ప్రమాదానికి గురైతే మీకు పూర్తి రక్షణను అందిస్తుంది. ఈ రకమైన హెల్మెట్ మీరు టూ వీలర్ వాహనాన్ని నడుపుతున్నప్పుడు దుమ్ము మరియు హై బీమ్ లైట్స్ నుండి మీ కళ్లను రక్షిస్తుంది. అలాగే, ఈ హెల్మెట్ డిజైనింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు గరిష్ట దృష్టి పరిధిని అందిస్తుంది.
  • హెల్మెట్ వాహనం యొక్క మెరుగైన నియంత్రణను నిర్ధారిస్తుంది – బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ను ధరించడం మీ దృష్టిని మెరుగుపరుస్తుందని గమనించబడింది. మీరు టూ వీలర్ వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్‌ను ధరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు మరియు మీ వేగాన్ని నియంత్రణలో ఉంచుతారు. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
  • హెల్మెట్ చల్లని గాలి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది – హెల్మెట్‌ను ధరించడం అనేది తలను మాత్రమే కాకుండా చెవులను కూడా కప్పేస్తుంది. ఈ రక్షణ కవచం, చల్లటి గాలి మీ చెవులలోకి రాకుండా అడ్డుకుంటుంది, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు చల్లని వాతావరణంలో అనారోగ్యం బారిన పడకుండా ఇది నిరోధిస్తుంది. అలాగే, వేసవిలో హెల్మెట్ ధరించడం వల్ల ఇన్‌లైన్ కుషనింగ్ కారణంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి మీకు చల్లని అనుభూతి కలుగుతుంది.
  • హెల్మెట్‌ను ధరించడం మిమ్మల్ని జరిమానాల నుండి రక్షిస్తుంది – హెల్మెట్‌ను ధరించాలనే ఆదేశంతో ట్రాఫిక్ పోలీసులు, హెల్మెట్ లేకుండా టూ వీలర్‌ను నడిపే వాహనదారుల పై జరిమానా విధించేందుకు సిద్ధం అయ్యారు. కాబట్టి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్‌ను ధరించాలి మరియు భారీ జరిమానాలను నివారించేందుకు, మీ డ్రైవింగ్ రికార్డును మెరుగ్గా నిర్వహించేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి.

హెల్మెట్ కొనుగోలు కోసం చిట్కాలు

  • బైక్ పై ప్రయాణించే అందరి భద్రతను నిర్ధారించడానికి, డ్రైవర్‌కు అలాగే పిలియన్ రైడర్ కోసం ఒక హెల్మెట్ కొనుగోలు చేయండి.
  • ఎల్లప్పుడూ ఫుల్-ఫేస్డ్ హెల్మెట్‌ను కొనుగోలు చేయండి. ఎందుకనగా ఇది మీ పూర్తి ముఖాన్ని కవర్ చేస్తుంది మరియు పూర్తి భద్రతను అందిస్తుంది.
  • హెల్మెట్లకు కూడా గడువు తేదీ ఉంటుంది. అందువల్ల, మీరు ప్రతి 3-5 సంవత్సరాలకు ఒక కొత్త హెల్మెట్‌ను కొనుగోలు చేయాలి.
  • మీ బైక్‌ను నడుపుతున్నప్పుడు మెరుగైన దృష్టిని నిర్ధారించుకోవడానికి మీ హెల్మెట్ గ్లాస్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
  • ఏదైనా ప్రమాదంలో మీ హెల్మెట్ పాడైపోతే వెంటనే దానిని మార్చండి.
ఈ నూతన సంవత్సరంలో టూ వీలర్ వాహనాన్ని నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయమని మేము, మిమ్మల్ని కోరుతున్నాము. ఈ సందేశానికి మరింత ప్రచారం కలిపించడానికి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఉపయోగించండి. మీరు అనుసరించగల భద్రతా చర్యలలో మరొకటి ఒక బైక్ కోసం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం, ఏదైనా ప్రమాదంలో లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీరు మరియు/లేదా వాహనానికి నష్టం వాటిలినప్పుడు, మీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతను ఇది చూసుకుంటుంది. మరిన్ని వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.   *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

  • Arvind Harit - February 24, 2021 at 2:40 pm

    The question itself very important. In rural areas people not following rules for safety measures. Thanks for highlighting this information to save thousands of life.

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి