రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Why Do You Need Car Insurance?
ఏప్రిల్ 27, 2021

కారు ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం?

కారు ఇన్సూరెన్స్ అనేది ముఖ్యంగా భారతదేశంలోని ఏదైనా ఫోర్-వీలర్ యజమాని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. భారతీయ రోడ్లపై ప్రయాణం చేసే మీ కారు కోసం మోటార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. మొదటిసారి కారును కొనుగోలు చేసే కొనుగోలుదారులు కారు ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనదని తరచూ ఆశ్చర్యానికి గురవుతారు; ప్రమాదాలు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, కాబట్టి, ఇది నిజంగా అవసరమా? దానికి ఉత్తమ సమాధానం, అవును. ఒక కారు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా అవసరం మరియు నిబంధనల ప్రకారం దానిని కలిగి ఉండటం తప్పనిసరి. ఎందుకనగా. ఇది ప్రమాదం వల్ల కలిగే నష్టాలను కవర్ చేసే ఆర్థికపరమైన మరియు భావోద్వేగ పూరిత భారం నుండి మిమ్మల్ని సురక్షితం చేస్తుంది. మీరు ఇప్పుడే కారును కొనుగోలు చేసి ఉంటే, భారతదేశంలో ప్రభుత్వం నిర్దేశించిన ఈ నియమం 'ఎందుకు' మరియు మీకు ఖచ్చితంగా కారు ఇన్సూరెన్స్‌ ఎందుకు అవసరమో ఇక్కడ ఇవ్వబడింది:  
  • బాధ్యతను తగ్గిస్తుంది
ఏ పరిస్థితుల్లోనైనా, రోడ్డుపై మీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే, మీ బాధ్యతను నెరవేర్చడానికి మీకు కార్ ఇన్సూరెన్స్ అవసరం. అందుకే, భారతదేశంలో థర్డ్-పార్టీ లయబిలిటీ (టిపిఎల్) కారు ఇన్సూరెన్స్ కవరేజీని కొనుగోలు చేయడం తప్పనిసరి. ఉదాహరణకు, మీరు ప్రమాదానికి కారణమైనట్లయితే, మీరు మరొకరి కారును డ్యామేజ్ చేసినట్లయితే లేదా వేరొకరి గాయాలకు బాధ్యత వహిస్తే, అప్పుడు ఈ థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ ఆ ఖర్చులను భరిస్తుంది మరియు ఆ సంఘటనకు సంబంధించి చట్టపరమైన పరిణామాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.  
  • నష్టాలకు పరిహారాలు 
కార్లు చాలా ఖరీదైనవి అని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు నష్టం జరగడం సర్వసాధారణం. మీరు సురక్షితంగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ, మరొక డ్రైవర్ చేసిన చిన్న తప్పు లేదా నిర్లక్ష్యం కారణంగా ఏదైనా ఘర్షణ, తాకిడి లేదా డ్యామేజి జరగవచ్చు. కాబట్టి, ఏదైనా నష్టం జరిగిన సందర్భంలో రిపేర్ మరియు ఫిక్సింగ్ ఖర్చులకు పరిహారం చెల్లించడానికి మీకు ఒక మెరుగైన కవర్ అవసరం. ఇక్కడే మీకు కార్ ఇన్సూరెన్స్ అవసరం, ఎందుకంటే మీరు మీ స్వంత నష్టాల కోసం చెల్లించాలనుకుంటే, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది, అలాగే, అది మీ జేబు పై భారంగా మారవచ్చు. బదులుగా, దీని ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు మద్దతు ఇవ్వగలదు.  
  • తీవ్రమైన గాయాలకు చెల్లిస్తుంది 
ప్రతి ఒక్కరూ కేవలం స్వల్ప గాయాలు, చిన్న దెబ్బలతో బయటపడలేరు. కొన్నిసార్లు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తీవ్రమైన ప్రమాదాలు సంభవించవచ్చు మరియు అది తీవ్రమైన గాయాలకు దారితీయవచ్చు. కొన్ని ప్రమాదాలు హాస్పిటలైజెషన్ కోసం దారితీయవచ్చు, ఇది కేవలం మానసిక ఒత్తిడిని మాత్రమే కాకుండా, తీవ్రమైన ఆర్థిక భారానికి కూడా దారితీయవచ్చు. కారు ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం అని మీరు ఇప్పటికీ ఆలోచిస్తున్నట్లయితే - ఇది మీ స్వంత పొదుపులను ఖర్చు చేయకుండా హాస్పిటలైజెషన్ ఛార్జీలను కవర్ చేయడంలో మీకు సహాయపడుతుంది.  
  • మీరు మరణించిన తర్వాత మీ కుటుంబాన్ని సురక్షితం చేస్తుంది
కారు ఇన్సూరెన్స్ ముఖ్యమైనది చెప్పుకోవడానికి మరొక కారణం - ఇది కేవలం మీ కోసం మాత్రమే కాదు. ఇది ఏదైనా దురదృష్టకర సంఘటన కారణంగా ఆకస్మిక మరణం జరిగిన సందర్భంలో, మీ కుటుంబాన్ని కవర్ చేస్తుంది. కాబట్టి మీకు కార్ ఇన్సూరెన్స్ అవసరం. మీరు మీ కుటుంబాన్ని పోషించే ఒక కుటుంబ పెద్ద అయితే, అప్పుడు కారు ఇన్సూరెన్స్ మీ కుటుంబ ఖర్చులకు సహాయపడే ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను అందిస్తుంది. కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం మరియు ప్రీమియంలు చెల్లించడం చాలా ఖరీదైనది అని మీరు భావిస్తే, ఆ ఆలోచనను మానుకోండి. ఎందుకంటే, ఆన్‌లైన్‌ విధానంలో కారు ఇన్సూరెన్స్ కొనుగోలు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ ఇన్సూరెన్స్ పాలసీలు మరియు ప్రీమియంలను పరిశోధించి పోల్చవచ్చు. అలాగే, కారు ఇన్స్యూరెన్స్‌ను రెన్యూ చేయడం మర్చిపోవద్దు, లేదంటే అది లాప్స్ కావచ్చు.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి