ప్రయాణాలను సులభంగా చేసిన సమయాన్ని గుర్తుతెచ్చుకోండి. సెలవు రోజుల కోసం ప్లాన్ చేసి కుటుంబం మరియు స్నేహితులతో వెకేషన్‌కి వెళ్లే వాళ్ళం. అవి చాలా ఆనందకరమైన రోజులు! ప్రయాణం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. అయినా, మహమ్మారికి ముందు ఉన్నట్లుగా ప్రయాణం ఇప్పుడు లేదు. కోవిడ్-19 సమయాలలో, ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరంగా ఉండేది మరియు ప్రపంచంలో చాలా ప్రదేశాలలో ఇప్పటికీ క్లిష్టంగా ఉంది. మనమందరం ఇబ్బందులు లేని ప్రయాణాన్ని కోరుకుంటాము. అయితే, కొన్ని విషయాలలో తప్పు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, లగేజ్ మిస్ అవ్వడం, జాప్యం వలన ట్రాన్సిట్ విమానం మిస్ అవ్వడం. అటువంటి ఏవైనా సంఘటనలు భౌతికంగా, మానసికంగా మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు. అందుకనే ప్రయాణాన్ని దీనితో ప్రారంభించండి-
ట్రావెల్ ఇన్సూరెన్స్.
ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు?
మీరు దేశీయంగా ప్రయాణిస్తున్న లేదా విదేశాలలో ప్రయాణిస్తున్నా. ట్రావెల్ ఇన్సూరెన్స్ మార్గంలో వచ్చే ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ప్రతి వ్యక్తి యొక్క ప్రయాణ అవసరాలు విభిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ సమయంలో సురక్షితంగా ప్రయాణించడం ముఖ్యం. సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవడం వలన ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రయాణాన్ని ఆనందించడానికి సహాయపడుతుంది.
కోవిడ్-19 సమయాల్లో ప్రయాణించడం సురక్షితమేనా?
సులభమైన మాటల్లో చెప్పాలంటే, కోవిడ్-19 సమయాల్లో ప్రయాణం కొన్ని ప్రమాదాలతో కూడి ఉంది. అయితే, మనము పరిష్కారాలను కూడా శోధించాలి. మీరు ప్రయాణం చేయాలి అనుకుంటున్న గమ్యస్థానంలో కోవిడ్-19 వ్యాప్తి గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్రయాణం చేయకండి. ప్రత్యేకంగా, మీ కుటుంబంలో వ్యాక్సిన్ తీసుకోని వృద్ధులు ఉన్నట్లయితే వారు అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకోని ఏ వ్యక్తి అయినా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా, మీ మరియు ఇతరుల భద్రత కోసం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, ఇది మనందరి బాధ్యత.
నేను అన్ని డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ప్రయాణించడం సురక్షితమేనా?
ప్రయాణం చేసేటప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులను కలుస్తాము. పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తి ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందితే తీవ్రంగా అనారోగ్యానికి గురి అయ్యి ఇతరులకు వైరస్‌ను వ్యాప్తి చేసే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మీరు ప్రయాణించడానికి ముందు గమ్యస్థానం యొక్క ట్రావెల్ అడ్వైజరీ మరియు కోవిడ్-19 వ్యాప్తి గురించి తెలుసుకోండి. ఇక్కడ, మేము సురక్షితంగా ప్రయాణించడానికి మరియు సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి రావడానికి కొన్ని జాగ్రత్తలను అందించాము.
మీరు కుటుంబంతో ప్రయాణిస్తున్నట్లయితే తీసుకోవలసిన జాగ్రత్తలు
కుటుంబంతో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఎలా సిద్ధంగా ఉండాలి అనేదాని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలను చూడండి. ఇది ప్రతి రాష్ట్రానికి. లేదా విదేశాలలో భిన్నంగా ఉంటుంది.
- మీరు ప్రయాణించడానికి ముందు కుటుంబ సభ్యులందరికీ కోవిడ్-19 పరీక్ష చేయించండి.
- దీనిని చూడండి- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్. మీకు ఒక పాలసీ ఉంటే, పాలసీని సమీక్షించడం మంచిది, కవరేజ్ మరియు పరిమితుల గురించి తెలుసుకోండి.
- ఆహారం, వసతి మరియు రవాణా కోసం లొకేషన్/గమ్యస్థానంలో అందుబాటులో ఉన్న ఎంపికలను తనిఖీ చేయండి. మహమ్మారి కొనసాగుతున్నందున, ప్రభావితమైన ప్రాంతాలలో సేవలు మరియు వ్యాపారాలు పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేయబడి ఉండవచ్చు. కాబట్టి విధానాలు మరియు సేవలలో మార్పుల గురించిన సమాచారం కోసం తనిఖీ చేయడం మంచిది.
- అవసరానికి అనుగుణంగా ఔషధాలను తీసుకువెళ్ళండి.
- ఒక గమ్యస్థానం యొక్క పీక్ సీజన్‌లో ప్రయాణించడం మంచిది కాదు.
- ప్రజా రవాణా ఉపయోగించినట్లయితే ముసుగు ధరించడం, ఎప్పటికప్పుడు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ను ఉపయోగించడం, చేతులు కడుక్కోవడం మొదలైన తప్పనిసరి ముందస్తు జాగ్రత్తలను అనుసరించండి.
- ఇప్పటికైతే, ఏవైనా కన్సర్ట్‌లకు వెళ్లడం నివారించండి మరియు వెంటిలేషన్ ఉన్న మూసివేయబడిన ప్రదేశాలను కూడా నివారించండి.
- జాగ్రత్తలు అనుసరించబడే వసతిని బుక్ చేసుకోండి. సిబ్బంది మాస్కులను ధరించి ఉండాలి. కీలు, రిమోట్ కంట్రోల్, డోర్ నాబ్ మొదలైన వాటితో సహా మీరు బస చేసే గదిలో ఎక్కువగా తాకే అవకాశం ఉన్న ఉపరితలాలను తప్పనిసరిగా డిస్‌ఇన్ఫెక్ట్ చేయండి.
- ఒక ట్రావెల్ సేఫ్టీ కిట్ తయారు చేసుకోండి. హ్యాండ్ శానిటైజర్, స్పేర్ మాస్కులు, డిస్‌ఇన్ఫెక్టెంట్ బ్యాగులు మొదలైనవి ఇందులో చేర్చండి.
గమనిక: సురక్షితమైన మరియు అవాంతరాలు-లేని ప్రయాణం కోసం దయచేసి గమ్యస్థాన ప్రయాణ మార్గదర్శకాలను చూడండి.
ముగింపు
మీరు తిరిగి వచ్చిన తర్వాత, స్థానిక అధికారం/ప్రభుత్వం ద్వారా సూచించబడిన రోజుల వరకు మీరు మరియు మీతో ప్రయాణించిన వారు స్వీయ-క్వారంటైన్‌ను విధించుకోండి. ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే కోవిడ్-19 పరీక్ష చేయించుకోండి. బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. కొనసాగుతున్న మహమ్మారి ప్రయాణం పై పరిమితులు విధించడానికి దారితీసిందని అనే వాస్తవాన్ని కాదని అనలేము. ముందస్తు చర్యలు మరియు వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా ప్రయాణాలు చేయడం మెల్లగా తిరిగి ప్రారంభం అవుతుంది. మీకు తెలియకపోతే, ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి- కస్టమైజ్ చేయబడిన
సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్.
సరైన చర్యలు తీసుకోండి మరియు ఆందోళనలు లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. తెలివిగా మరియు సురక్షితంగా ప్రయాణించండి!
రిప్లై ఇవ్వండి