ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ప్లాన్లు ఈ కింది వాటిని కవర్ చేస్తాయి:
- యాక్సిడెంట్లు లేదా ఆకస్మిక అనారోగ్యాలు లాంటి ఊహించని పరిస్థితుల నుండి తలెత్తే వైద్య ఖర్చులు.
- విమానాలు, హోటళ్లు మరియు ఇతర ఇంటర్మీడియట్ స్టాప్‌ల కోసం బుకింగ్ రద్దులు.
- లగేజీ నష్టం లేదా డ్యామేజీ.
- కొన్ని కారణాల వల్ల తక్షణ నగదు అవసరం.
అయితే, ముందు నుండి వైద్య పరిస్థితిని కలిగి ఉండటం వలన మీరు స్వీకరించడానికి అర్హత కలిగిన రక్షణ జాబితా కూడా మారవచ్చు, మీరు ఇలా చేసినప్పటికి కూడా-
ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ఆన్‌లైన్ కొనుగోలు.
ఎలాంటి వైద్య పరిస్థితులు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ప్రభావితం చేస్తాయి?
ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులలో వైద్య అత్యవసర పరిస్థితులకు దారితీసే అనారోగ్యాలు, వ్యాధులు లేదా ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. సాధారణంగా, దిగువ పేర్కొనబడిన పరిస్థితులు ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులుగా పరిగణించబడతాయి:
- క్యాన్సర్, హెచ్‌ఐవి, ఎయిడ్స్ లాంటి సంక్రమణ వ్యాధులు.
- ఇటీవలి అవయవ మార్పిడి లేదా శస్త్రచికిత్స.
- హాస్పిటలైజేషన్ లేదా శస్త్రచికిత్స అవసరమయ్యే వైద్య సమస్యలు.
- నిపుణుడిని క్రమం తప్పకుండా సందర్శించాల్సిన వైద్య పరిస్థితులు.
ఎలాంటి వైద్య పరిస్థితులు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి ఇలాంటి ఏదైనా స్వభావం కలిగి ఉండవచ్చు - మీకు దాని గురించి తెలుసు, దాని గురించి మీకు తెలియదు, దాని కోసం ఒక నిర్మూల చికిత్సా విధానాన్ని చేయించుకున్నారు లేదా దాని కోసం సర్జరీ లేదా నిర్మూల చికిత్సా విధానాన్ని ఎంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సంస్థ మీ ప్రయాణ సమయంలో అలాంటి అత్యవసర పరిస్థితి తీవ్రతరం అయ్యే ప్రమాదాన్ని, పెరిగే మీ వైద్య ఖర్చులు మరియు మీ సమూహం లేదా మీ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నప్పుడు వారికి కలిగే అసౌకర్యాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి గురించి మీరు మీ ఇన్సూరర్‌కు తెలియజేయడం తప్పనిసరా?
క్లుప్తంగా సమాధానం చెప్పాలంటే - అవును, మీరు మీ ప్రస్తుత వైద్య పరిస్థితిని గురించి మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి. ఇది ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇవ్వబడింది:
పూజ ఇటీవలే ఒక బ్యాంకర్‌గా తన మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఆమె తన తల్లిదండ్రులను ప్యారిస్ పర్యటనకు తీసుకెళ్లడానికి తగిన మొత్తాన్ని పొదుపు చేసింది, చిన్నతనంలోనే ఇలాంటి ఒక గొప్ప ఆలోచన చేసింది. పూజ టికెట్లు బుక్ చేసింది, ఆమె కుటుంబం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంది. దురదృష్టవశాత్తు, పర్యటనలో ఉన్నప్పుడు ఆమె తండ్రికి స్ట్రోక్ వచ్చింది, అతను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతను ఏదో ఒక విధంగా కోలుకున్నప్పటికీ, ఇది వారి పర్యటన ఖర్చును పెంచింది, ఆ కుటుంబాన్ని ఆందోళనలో నెట్టింది. తరువాత, పూజ క్లెయిమ్ ఫైల్ చేసారు, అప్పుడు ఆమె తన క్లెయిమ్ తిరస్కరించబడిందని తెలుసుకోని ఆశ్చర్యపోయారు. తరువాత ఆమె, కొన్ని నెలల క్రితం తన తండ్రికి మైనర్ అటాక్ వచ్చిందని తెలుసుకుంది - అయితే, ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆమెకు చెప్పలేదు.
అలాంటి సందర్భాలు మీరు ఊహించిన వాటి కంటే చాలా సాధారణం. మీ ఇన్సూరర్ ప్రతి దరఖాస్తుదారు యొక్క మెడికల్ బ్యాక్‌గ్రౌండ్‌ను పూర్తిగా విశ్లేషిస్తారు, ముఖ్యంగా గత 2 నుండి 3 నెలల ఇటీవలి వైద్య చరిత్రపై దృష్టి సారిస్తారు. ఇప్పుడు, ఈ విషయంలో పూజను తప్పుబట్టలేము. కానీ, ఆమెకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీల గురించి తెలిసి ఉండాలి. ఒకవేళ ఆమెకు ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి గురించి తెలిసి ఉంటే, ఆమె మరింత సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకునేది:
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పాటు ఒక యాడ్-ఆన్ లేదా రైడర్‌ను పొంది ఉంటే, అది ఆమె తండ్రికి రక్షణ కల్పించేది.
- తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు కొన్ని నెలల సమయం తీసుకునేది. ఆ తర్వాత, దృఢ నిరూపణ కోసం తగిన వైద్య పరీక్షలు చేయించి అతను వైద్యపరంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని మరియు ప్రమాదం నుండి బయటపడ్డారని తెలిసినప్పుడు ఆమె ట్రిప్ కోసం ప్లాన్ చేసేది.
- వైద్య పరిస్థితుల కోసం ఏ మెడికల్ ఇన్సూరెన్స్ ఉత్తమంగా సరిపోతుందో అనే దానిపై మరింత పరిశోధన చేసి ఉండవచ్చు కూడా. ఇది జరగకుండా చూసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే, తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడం అదేవిధంగా, కొనుగోలు సమయంలో అన్ని ప్రాథమిక చేర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
వైద్య పరిస్థితులకు ఏ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉత్తమంగా సరిపోతుంది?
మొదటి నుండి మీకు మీ ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితిని గురించి ఇన్సూరర్‌కు వెల్లడించడం అనేది ఒక సవాలుగా అనిపించవచ్చు. అయితే, ప్రారంభంలోనే అది దరఖాస్తు తిరస్కరణకు దారితీయదా? ఇన్సూరెన్స్ ప్లాన్ల పనితీరు ఈ విధంగా ఉండదు. మీరు బజాజ్ అలియంజ్ సలహాదారులలో ఒకరితో మాట్లాడాలి. మీకు ఈ విషయాలు తెలుస్తాయి:
- ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులను కవర్ చేసే యాడ్-ఆన్‌లను పొందడానికి మిమ్మల్ని అనుమతించే పాలసీలు.
- సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్: వృద్ధుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్లాన్లు.
- వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్లతో సంభావ్య వైద్య ఖర్చులను తగ్గించడానికి లేదా ట్రిప్ కోసం వేచి ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాలు.
ముందు నుండి ఉన్న పరిస్థితికి సంబంధించని ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితి కోసం మీరు ఇన్సూరెన్స్ పాలసీని బట్టి పరిహారం అందుకుంటారని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, పూజ తండ్రి దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై తన భుజం కోల్పోతే, అతను ఇన్సూరెన్స్ పాలసీ నుండి ఆ ఖర్చులకు కవర్‌ను ఆశించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
- డాక్యుమెంటేషన్ పూర్తి కావడానికి ముందు, మీరు మీ ఇన్సూరెన్స్ సంస్థకు ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితిని తెలియజేయాలా?
అవును. మీరు వైద్య పరిస్థితిని వివరంగా తెలపాలి, అలాగే డాక్యుమెంటేషన్‌కు ముందుగానే వ్యాధి సంబంధిత రిపోర్ట్‌లను అందజేయాలి. మీరు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసినప్పటికీ, అన్ని మినహాయింపులను గురించి తెలుసుకోవాలి.
- మీకు ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి ఉన్నప్పటికీ, మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అప్రూవల్ పొందుతారా?
అవును. ప్రత్యేక ప్రోడక్టులు లేదా యాడ్-ఆన్‌ల సహాయంతో, మీ ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి కోసం కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందడం సాధ్యమవుతుంది. అయితే, దానిని సకాలంలో వెల్లడించండి మరియు ఇన్సూరెన్స్ ప్రతినిధి మీకు మార్గనిర్దేశం చేస్తారు.
- మీరు మీ ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితిని వెల్లడించినప్పటికీ, మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుందా?
అవును. ఒక క్లెయిమ్ తిరస్కరించబడటానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. దానిని ముందుగానే వెల్లడించడం వలన అత్యవసర పరిస్థితుల్లో మీకు సహాయం అందించడానికి ఒక యాడ్-ఆన్ లేదా బ్యాకప్ ఉందని నిర్థారించుకోవచ్చు.
రిప్లై ఇవ్వండి