Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్
Health Insurance Premium Calculator

మీ కోసం పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్

దీనితో మీకు కలిగే లాభం?

హాస్పిటల్‌లో చేరడానికి ముందు మరియు తరువాతి ఖర్చులను కవర్ చేస్తుంది

ఇన్సూరెన్స్ మొత్తం కోసం అనేక ఎంపికలు

తల్లిదండ్రులు, అత్తమామలు మరియు తోబుట్టువులతో సహా ఇతర కుటుంబ సభ్యులని కవర్ చేస్తుంది

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ వెబ్‌సైట్ల ద్వారా అందించబడే ఒక సౌకర్యవంతమైన ఆన్‌లైన్ సాధనం. వివిధ అంశాల ఆధారంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క సుమారు ఖర్చును అంచనా వేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీ గురించి, మీకు కావలసిన కవరేజ్ మరియు మీ లొకేషన్ వివరాలను నమోదు చేయడం ద్వారా, వివిధ అంశాలు ప్రీమియం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి క్యాలిక్యులేటర్ ఒక ప్రారంభ పాయింట్‌ను అందిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ప్రయోజనాలు మరియు ఫీచర్లు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి:

  • సులభమైన పోలికలు:

    అనేక ఇన్సూరర్ల నుండి అంచనా వేయబడిన ప్రీమియంలను త్వరగా పొందండి, ఏజెంట్లను సంప్రదించడానికి ముందు ఖర్చులు మరియు కవరేజ్ ఎంపికలను సరిపోల్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • తెలివైన నిర్ణయాలు:

    మీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలకు కవరేజ్ మరియు అఫోర్డబిలిటీ మధ్య సరైన బ్యాలెన్స్‌ను ఎంచుకోవడానికి విలువైన సమాచారాన్ని పొందండి.

  • సమయం ఆదా చేస్తుంది:

    కోట్స్ పొందడానికి సుదీర్ఘమైన కాల్స్ లేదా ఏజెంట్ సందర్శనలను నివారించండి. మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ ఇన్సూరెన్స్ ఖర్చులను అంచనా వేయండి.

  • పారదర్శకత:

    వివిధ అంశాలు ప్రీమియంను ముందుగానే ఎలా ప్రభావితం చేస్తాయో చూడటానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా ధరలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. కొన్ని క్యాలిక్యులేటర్లు ఇటువంటి అదనపు ఫీచర్లను అందిస్తాయి:


    ✓ ఐడివి సర్దుబాటు (కొన్ని క్యాలిక్యులేటర్ల కోసం): అధిక లేదా తక్కువ ఇన్సూర్ చేయబడిన మొత్తం ప్రీమియం ఖర్చును ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం చాలా సులభం:


1. ఒక వ్యక్తిగత లేదా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్య ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి.


2. మీరు పాలసీలో ఎవరిని చేర్చాలనుకుంటున్నారో పేర్కొనండి: మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైనవి.:


3. మీరు కవర్ చేస్తున్న ప్రతి వ్యక్తి వయస్సును ఎంచుకోండి.


4. 1 లక్ష నుండి 50 లక్షల వరకు మీకు అవసరమైన ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని ఎంచుకోండి.


5. మీరు భారతదేశ వ్యాప్తంగా కవరేజ్ కావాలనుకుంటున్నారా అని నిర్ణయించండి.


6. మీ సంప్రదింపు వివరాలను అందించండి: పేరు, ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్.


7. మీ అంచనా వేయబడిన ప్రీమియంను తక్షణమే అందుకోండి.


8. మీ పాలసీ కోసం టర్మ్ ఎంపికలు 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటాయి.


హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఎందుకు ఉపయోగించాలి?

మీ ఆరోగ్యం చాలా విలువైనది మరియు ఎవరూ దానికి వెల కట్టలేరు, అలాగే దానిని కాపాడుకోవడం, అవసరమైన రక్షణను అందించడం ఖర్చుతో కూడుకున్నది. మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో, వైద్య ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ఖర్చును మేము కవర్ చేయాలనుకుంటున్నాము.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎంత ఖర్చవుతుందోనని మీరు ఆలోచిస్తున్నట్లయితే - అనారోగ్యం లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాస్తవ వైద్య ఖర్చులో కొంత మాత్రమే ఖర్చవుతుంది - మీరు మా ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ సహాయంతో ఈ ప్రశ్నకు తక్షణ సమాధానాన్ని పొందవచ్చు.

మా ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది ఉపయోగించడానికి వీలుగా ఉండే ఒక సులభమైన సాధనం, మీరు అందించిన వివరాల ఆధారంగా ప్రీమియం మొత్తాన్ని క్షణాల్లో లెక్కిస్తుంది. వేగవంతమైనది, సమర్థవంతమైనది మరియు విశ్వసనీయమైనది, ఇది స్వీయ (వ్యక్తిగత) మరియు కుటుంబ సభ్యుల కోసం పాలసీ ప్రీమియంను లెక్కించడంలో మీకు సహాయపడుతుంది.

అది ఒక మంచి ప్రశ్న! క్యాలిక్యులేటర్ యొక్క ప్రాథమిక ఉద్దేశం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు యొక్క మొదటి దశని మీ కోసం చాలా వేగవంతంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.

తెలివైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది

మీరు ఏదైనా పెద్ద కొనుగోలును చేయడానికి ముందు ఖర్చు-ప్రయోజనం విశ్లేషణను జరపడం చాలా అవసరం అని మాకు తెలుసు, మా హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అది చేయడంలో మీకు సహాయపడుతుంది. మీకు నచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ప్రీమియం గురించి తక్షణమే ఒక అంచనా వేయవచ్చు, అలాగే, మా సమగ్ర హెల్త్ కవర్ ఎంత సరసమైనదో తెలుసుకోవచ్చు.

మీ వద్ద అంకెలు సిద్ధంగా ఉన్నప్పుడు, మీరు ఒక తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు మరియు ఆ నిర్ణయం గురించి నిశ్చింతగా ఉండవచ్చు.

వేగవంతమైనది మరియు అవాంతరాలు లేనిది

ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ పొరుగువారిని, సహోద్యోగులను సలహా కోరే రోజులు పోయి ఇప్పుడు చాలా కాలం అవుతోంది. బదులుగా, మీరు మా వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, మీకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది వేగవంతమైనది, ఖచ్చితమైనది మరియు అవాంతరాలు లేనిది.

ఇంటర్నెట్‌లోని బ్లాగ్‌లు లేదా 'స్నేహపూర్వక' సలహాలతో తప్పుదారి పట్టకూడదు. అలాగే, మా హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ మీ స్వంత ప్రీమియంలను లెక్కించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక గణిత శాస్త్రవేత్తగా మారాల్సిన అవసరాన్ని నివారిస్తుంది.

బడ్జెట్‌లో సహాయం చేస్తుంది

దేశానికి బడ్జెట్‌ల మాదిరిగానే మనకు బడ్జెట్‌లు చాలా ముఖ్యం అని అందరికీ తెలుసు, ఎందుకనగా, మీకు కూడా స్వంత లక్ష్యాలు మరియు సవాళ్ళు ఉన్నాయి. మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ప్రీమియం మొత్తాన్ని తక్షణమే అందిస్తుంది, కావున, మీరు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవడానికి ముందు మీకు, మీ కుటుంబానికి రక్షణ కవచంగా అవసరమైన హెల్త్ కవర్‌ను పరిగణలోకి తీసుకోవాలి.

పాలసీ ప్రీమియం లెక్కింపు కోసం ఏ సమాచారం అవసరం?

ఆరోగ్యంలో శారీరక, మానసిక మరియు భావోద్వేగం వంటి అనేక అంశాలు ఉన్నట్లే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించే అంశాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • వయస్సు

    ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ముందుగానే కొనుగోలు చేయడం వలన అనేక ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. చిన్న వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ముందు నుండి ఉన్న-వ్యాధులకు అవకాశాలు తక్కువ కావున, అది ప్రీమియం మొత్తంలో తగ్గింపుకు కారణమవుతుంది.

    చిన్న వయస్సులో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వలన తక్కువ ప్రీమియంను చెల్లించడమే కాకుండా, అధిక ఇన్సూరెన్స్ మొత్తానికి మరియు అనుకూలమైన నిబంధనలు, షరతులకు మీరు అర్హత పొందుతారు. 

  • వైద్య చరిత్ర

    గతంలో అనారోగ్యాలు లేని వైద్య చరిత్ర మీకు ఉన్నట్లయితే, ఆ అంశం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలులో మీకు చాలా అనుకూలంగా మారుతుంది. ఒక మంచి ట్రాక్ రికార్డ్ ప్రీమియం మొత్తాన్ని తగ్గించడమే కాకుండా, పూర్తి ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

    మరోవైపు, మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైద్య చరిత్రను కలిగి ఉన్నట్లయితే, అది ప్రాణాంతకమైన లేదా ఇతరత్రా కావచ్చు, అప్పుడు మీ ప్రీమియం మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది.

  • జీవనశైలి అలవాట్లు

    మీరు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటారా? మీ సమాధానం అవును అయితే, మీ కోసం ఒక శుభవార్త ఉంది. ధూమపానం చేసేవారు చెల్లించే ప్రీమియం, ధూమపానం చేయని వారి కన్నా ఎక్కువగా ఉంటుంది.

    ఎందుకనగా ఈ అలవాట్లను కలిగిన పాలసీదారులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఎక్కువ రిస్క్‌ను కవర్ చేస్తాయి, అలాగే, వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. 

  • ఇన్సూర్ చేయబడిన మొత్తం

    ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందించే కవరేజ్ మొత్తాన్ని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ కవరేజ్ మొత్తాన్ని మించిన వైద్య ఖర్చులను మీరే భరించాలి. ప్రీమియంలు మరియు ఇన్సూర్ చేయబడిన మొత్తం మధ్య అనులోమసంబంధం ఉంటుంది. అనగా, ఇన్సూరెన్స్ మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. 

  • కవర్ రకం

    మీరు మీ కోసం స్టాండ్‌అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు లేదా కుటుంబ సభ్యులను కవర్ చేసే వేరే పాలసీని తీసుకోవచ్చు. ఇండివిడ్యువల్ పాలసీ విషయంలో ప్రీమియం మొత్తం మీ వయస్సు, వృత్తి, ఆదాయం, జీవనశైలి అలవాట్లు మరియు వైద్య చరిత్రపై ఆధారపడి ఉంటుంది.

    మరోవైపు, కుటుంబంలోని సభ్యులందరినీ కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, ప్రీమియం కవర్ చేయబడిన అతిపెద్ద సభ్యుని వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలా తగ్గించుకోవాలి?

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సంభావ్యంగా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించండి:

    క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు పొగాకు ఉపయోగాన్ని నివారించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కొంతమంది ఇన్సూరర్లకు తక్కువ ప్రీమియంలకు దారితీస్తుంది.

  • అధిక మినహాయింపును ఎంచుకోండి:

    అధిక మినహాయింపును ఎంచుకోవడం మీ ప్రీమియంను తగ్గిస్తుంది కానీ క్లెయిమ్ సందర్భంలో మీరు మరింత ముందుగానే చెల్లిస్తారు అని అర్థం.

  • మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచుకోండి (బడ్జెట్ అనుమతిస్తే):

    అధిక ఇన్సూరెన్స్ మొత్తం ప్రీమియంను పెంచినప్పటికీ, ప్రధాన వైద్య ఖర్చుల విషయంలో ఇది మెరుగైన ఆర్థిక రక్షణను అందిస్తుంది.

  • డిస్కౌంట్లను పొందండి:

    అనేక ఇన్సూరెన్స్ సంస్థలు యువకులకు, ఆరోగ్యవంతమైన వ్యక్తులకు లేదా నగదురహిత ఆసుపత్రి నెట్‌వర్క్‌లను ఎంచుకునే వారికి తగ్గింపులను అందిస్తాయి.

ప్రీమియం లెక్కింపు కోసం అవసరమైన సమాచారం


ఏదైనా ఫర్వాలేదా! మీరు దేని కోసం వెతుకుతున్నారో తెలుసుకోవడానికి మాకు కొంత ప్రాథమిక సమాచారం కావాలి, తద్వారా తగిన సహాయం అందించగలము.


● మీరు ఇండివిడ్యువల్ పాలసీ లేదా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వీటిలో దేని కోసం వెతుకుతున్నారో ముందుగా మాకు తెలియజేయాలి


● అప్పుడు మీరు కవర్ చేయాలనుకుంటున్న సభ్యులను గురించి మాకు తెలియజేయండి - మీకోసం, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, మనవరాళ్లు, అత్త, అత్తమామలు మొదలైనవారు.


● ఆ తర్వాత, వయస్సును ఎంచుకోండి


● ఆ తరువాత మీరు ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలి. మేము 1 లక్ష నుండి 50 లక్షల వరకు అనేక ఆప్షన్‌లను అందిస్తాము. కావున, మీరు మీ అవసరాలకు సరిపోయే మొత్తాన్ని ఎంచుకోవచ్చు


● మీకు పాన్-ఇండియా కవర్ కావాలనుకుంటే మాకు తెలియజేయండి


● చివరగా, పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి మీ సంప్రదింపు సమాచారాన్ని ఎంటర్ చేయండి 


ఇదిగో! మీరు అంచనా వేసుకున్న ప్రీమియం, 1 నుండి 3 సంవత్సరాల వరకు గల కాలపరిమితుల ఆప్షన్‌లతో మీ ముందు ఉన్నాయి.

Frequently Asked Questions

తరచుగా అడిగే ప్రశ్నలు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

నమోదు చేయబడిన సమాచారం ఆధారంగా ఒక వ్యక్తి రిస్క్ ప్రొఫైల్‌ను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్లు అంచనా వేస్తాయి. వయస్సు, లొకేషన్, కావలసిన కవరేజ్ మరియు వైద్య చరిత్ర (అందించినట్లయితే) వంటి అంశాలు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సంభావ్య ఖర్చును లెక్కించడానికి పరిగణించబడతాయి.

హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ద్వారా లెక్కించబడిన ప్రీమియంను ఏ అంశాలు నిర్ణయిస్తాయి?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేసే అంశాల్లో వయస్సు, లొకేషన్, కావలసిన కవరేజ్ రకం (వ్యక్తిగత లేదా కుటుంబం), కవరేజ్ పరిధి (ఇన్‌పేషెంట్ లేదా అవుట్‌పేషెంట్), ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం, ఆప్షనల్ యాడ్-ఆన్ కవర్లు మరియు ముందు నుండి ఉన్న పరిస్థితులు వంటి వైద్య చరిత్ర ఉంటాయి.

నా ఇన్సూరెన్స్ ఖర్చులను అంచనా వేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఖచ్చితమైనదా?

ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ సరైన అంచనాను అందిస్తుంది, కానీ ఇది హామీ ఇవ్వబడిన కోట్ కాదు. అనేక అంశాలు వాటి అండర్‌రైటింగ్ ప్రాసెస్ మరియు ప్రస్తుత ప్రమోషన్లతో సహా ఇన్సూరర్ అందించే తుది ప్రీమియంను ప్రభావితం చేయవచ్చు. అయితే, వివిధ కవరేజ్ ఎంపికల వ్యాప్తంగా ఖర్చులను పోల్చడానికి ఇది ఒక విలువైన సాధనం.

వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చడానికి నేను హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చా?

అవును, అనేక క్యాలిక్యులేటర్లు అనేక ఇన్సూరెన్స్ సంస్థల నుండి కోట్‌లను సరిపోల్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది వివిధ ప్లాన్ల ద్వారా అందించబడే అంచనా వేయబడిన ప్రీమియంలు, కవరేజ్ వివరాలు మరియు ఫీచర్లను సరిపోల్చడానికి మీకు వీలు కల్పిస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడానికి ఏవైనా అదనపు ఫీజులు లేదా ఛార్జీలు ఉన్నాయా?

లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం అనేది బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు అగ్రిగేటర్ వెబ్‌సైట్ల ద్వారా అందించబడే ఉచిత ఆన్‌లైన్ సేవ.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం