Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్

మీరు ఇష్టపడే వాటిని మేము రక్షిస్తాము
My Home Insurance Policy Online in India

మీ కోసం తగిన ప్లాన్‌ను సృష్టిద్దాం.

పాన్ కార్డ్ ప్రకారం పేరు ఎంటర్ చేయండి
మాకు కాల్ చేయండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

 అగ్నిప్రమాదం, దోపిడీ మరియు ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టం నుండి మీ ఇంటిని కవర్ చేస్తుంది

ఆభరణాలు , విలువైన వస్తువులు, కళాకృతులు కోసం కవర్

1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు కవరేజ్ టర్మ్ ఎంపికలు

హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

 

మీరు ఇల్లు కొనేశారు, ఫర్నిచర్ కూడా సెట్ చేసేశారు మరియు సరైన వాల్‌పేపర్ అతికించడం కూడా కొంతవరకు పూర్తి చేసేశారు! ఇదంతా కలలా అనిపించడంతో పాటు అభినందనలు కూడా వచ్చేస్తున్నాయా. అయితే, అభినందనలతో పాటు మీకు మేము ఒక చిన్న సలహా కూడా ఇవ్వాలనుకుంటున్నాము.

మీరు మీ అతిపెద్ద ఆస్తుల్లో ఒకదానిని కొనుగోలు చేశారు - అదే మీ కలల గృహం. దానికి ఎదురయ్యే ఏదైనా ప్రమాదాల నుండి రక్షించడానికి మీకొక ఆర్థిక అండ కావాలి. హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఆ అండ అందిస్తుంది. ఇన్సూరెన్స్ ఉండడం ఒక సంతోషకరమైన విషయమే అయినప్పటికీ, దానికోసం అవసరమైన ప్రీమియంను లెక్కించడం కష్టమైన పనిగా ఉంటుంది! ఈ లెక్కల కారణంగానే మీరు హోమ్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉంటే, ఎలాంటి ఆందోళన లేకుండా, ప్రశాంతంగా కూర్చోండి! మీకు ఆ లెక్కలు అందించడానికి బజాజ్ అలియాంజ్ అందించే హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉంది.

పేరుకు తగ్గట్టుగానే, హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ హోమ్ ఇన్సూరెన్స్ కోసం వర్తించే ప్రీమియంలను తక్షణమే లెక్కించడానికి మీకు అవకాశం కల్పించే ఒక ఆన్‌లైన్ సాధనం. ఇది సరళమైనది, వేగవంతమైనది మరియు సమర్థవంతమైనది; మా హోమ్ ఇన్సూరెన్స్ ఇండియా ప్రీమియం క్యాలిక్యులేటర్ మీకు 10 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అంచనాలు అందిస్తుంది!

మా హోమ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌తో ప్రయోజనాలు

హోమ్ ఇన్సూరెన్స్ లాంటి ఒక ముఖ్యమైన అంశం కోసం ప్రీమియంలు లెక్కించాల్సినప్పుడు, ఆ క్యాలిక్యులేటర్ సరళమైనది మరియు సమర్థవంతమైనదిగా ఉండాలి. సులభంగా అర్థం అయ్యే ఇంటర్ఫేస్‌తో ఒక సరళమైన డిజైన్ కలిగి ఉన్న మా హోమ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌:

  • దీనిని సులభంగా ఉపయోగించవచ్చు

    సరళంగా ఉండడమనేది అతిగొప్ప సౌకర్యం కాబట్టి, మా హోమ్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ మీకు చాలా సులభంగా అనిపిస్తుంది. మా పేజీని సందర్శించడం, క్యాలిక్యులేటర్ తెరవడం మరియు మీ వివరాలు పూరించడం అనే సులభమైన దశలతో మీ ప్రీమియం గురించి సులభంగా తెలుసుకోవచ్చు. నిమిషాల్లోనే మీ ప్రీమియం వివరాలు తెలుసుకోండి! 

  • అద్దె మరియు సొంత ఆస్తి కోసం ఇది ప్రీమియంలు లెక్కిస్తుంది

    అద్దెకు ఇచ్చినా లేదా సొంతంగా నివసిస్తున్నా, మీ ఇల్లు ఎల్లప్పుడూ మీకు ప్రత్యేకమైనది. కాబట్టే, అద్దె మరియు సొంత ఇంటి కోసం ప్రీమియంలు లెక్కించడానికి ఒకే క్యాలిక్యులేటర్‌ని ఉపయోగించవచ్చు.

  • భవనం, అందులోని వస్తువులు లేదా రెండింటినీ ఇన్సూర్ చేయడానికి ప్రీమియంలను తెలియజేస్తుంది

    మా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ ఆస్తి మీద వర్తించే ప్రీమియంకు సంబంధించిన సమగ్ర వీక్షణను మీకు అందిస్తుంది. ఒక భవనం, అందులోని అంశాలు లేదా రెండింటినీ ఇన్సూర్ చేసే సమయంలో చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని లెక్కించడాన్ని మీరు ఎంచుకోవచ్చు. 

 

నా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ణయించే అంశాలేమిటి? 

 

మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చును అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మీరు ఒక కొత్త ఇంటికి యజమాని అయ్యారా లేదా మీ పాత ఇంటి కోసం ప్రీమియం వివరాలు తెలుసుకుంటున్నారా; మీరు పర్వతాల మీద లేదా తీరప్రాంతంలో నివసిస్తున్నారా; మీరు కళాఖండాల సేకర్తగా ఉన్నారా లేదా గాడ్జెట్‌లు ఇష్టపడే వారుగా ఉన్నారా; లాంటి విషయాలన్నీ మీ ప్రీమియం లెక్కింపు సమయంలో పరిగణనలోకి తీసుకోబడుతాయి.

 

●        స్థానం

ప్రైమ్ లొకేషన్‌లలో నిర్మించబడిన గృహాలకు అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైన సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని ప్రైమ్ లొకేషన్‌గా నిర్వచించవచ్చు, ఆ ప్రదేశం కనెక్టివిటీతో పాటు భూమి ధర కూడా మరో అంశంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం రేటును నిర్ణయించగల అంశాల్లో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం కూడా ఒకటిగా ఉంటుంది. రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.

 

●        వయస్సు మరియు నిర్మాణ సామగ్రి

వయసు పెరిగిన శరీరానికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగానే, పాత ఇంటికి నష్టాలు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లుగా భావించబడుతుంది కాబట్టి, ఈ అంశం ప్రీమియం మొత్తాన్ని పెంచుతుంది. ఇంటి వయస్సు మాత్రమే కాకుండా, ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి సైతం ప్రీమియం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.

 

●        మీ ఇంట్లోని వస్తువులు

ఇల్లు మాత్రమే కాకుండా, మీ ఇంట్లోని వస్తువులు సైతం మీ ప్రీమియం ధరను నిర్ణయిస్తాయి. మీ ఇంట్లో ఖరీదైన పెయింటింగ్‌లు మరియు శిల్పాలు ఉంటే, లేదా మీ లాకర్‌లో బంగారం మరియు వజ్రాల ఆభరణాలు ఉంటే, అది మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం విలువను పెంచుతుంది. 

హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించడానికి అవసరమైన వివరాలు

బజాజ్ అలియాంజ్ వారి హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది లెక్కింపు ప్రక్రియను సులభంగా మరియు సజావుగా చేయడానికి రూపొందించబడింది కాబట్టి, ఎక్కువ వివరాలు అందించాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్లలోని విషయాలను పరిశీలిస్తూ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు మరియు లెక్కలేనన్ని వివరాలు పూరించాల్సిన అవసరం కూడా లేదు.

  • అద్దె ఆస్తుల కోసం ప్రీమియంలు లెక్కించడం

    వస్తువుల కోసం మాత్రమే రక్షణ అవసరమైన అద్దె ఆస్తుల కోసం ప్రీమియంలు లెక్కించే సమయంలో, మీరు మీ వస్తువులు మరియు ఆభరణాల మొత్తం విలువను తెలియజేస్తే చాలు. క్యాలిక్యులేటర్ మీకు సెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది. 

  • యాజమాన్య ఆస్తుల కోసం ప్రీమియంలు లెక్కించడం

    అయితే, సొంత ఆస్తుల కోసం ప్రీమియం అనేది కొంచెం భిన్నంగా లెక్కించబడుతుంది. సొంత ఆస్తుల విషయంలో, నిర్మాణం మరియు దానిలోని వస్తువులు రెండూ పరిగణనలోకి తీసుకోబడుతాయి. మీరు ఈ వివరాలు అందించాలి:

    1 భవనం వయస్సు

    2 నిర్మాణం కవర్ కోసం ఎంచుకున్న వేరియంట్ - అంగీకరించబడిన విలువ, రీఇన్‌స్టేట్‌మెంట్ విలువ, నష్టపరిహారం ప్రాతిపదిక

    3 ఆభరణాలు లేదా ఇంటిలోని వస్తువుల విలువ

     

    ఈ వివరాలే కాకుండా, లెక్కింపు సమయంలో పేరు, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి లాంటి మీ వ్యక్తిగత సమాచారం కూడా అందించాలి. 

  • భవనం, అందులోని వస్తువులు లేదా రెండింటినీ ఇన్సూర్ చేయడానికి ప్రీమియంలను తెలియజేస్తుంది

    మా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ ఆస్తి మీద వర్తించే ప్రీమియంకు సంబంధించిన సమగ్ర వీక్షణను మీకు అందిస్తుంది. ఒక భవనం, అందులోని అంశాలు లేదా రెండింటినీ ఇన్సూర్ చేసే సమయంలో చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని లెక్కించడాన్ని మీరు ఎంచుకోవచ్చు. 

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం