రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ప్రయాణించాలనే కోరిక మీలో బలంగా ఉండడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రయాణించడం అనేది మిమ్మల్ని సేద తీర్చడానికి మరియు పునరుత్తేజం కలిగించడానికి, సాహసాల వైపు అడుగేయడానికి లేదా మీ సంతోషంలో అదొక కేంద్ర భాగం కావడం లాంటిది ఏదైనా కావచ్చు, మేము దానిని అర్థం చేసుకున్నాము.
ప్రయాణించే సమయంలో ఆనందాలతో పాటు ఇంటి నుండి దూరంగా ఉండే ఆ సమయంలో, ప్రమాదాలకు దారితీయగల విషయాల గురించి కూడా అనుభవం కలిగిన ఒక ప్రయాణికుడిగా మీరు అప్రమత్తంగా ఉండాలి. అటువంటి ప్రమాదావకాశాలు మరియు అనిశ్చిత పరిస్థితులేవీ ప్రయాణించాలనే మీ స్ఫూర్తిని ప్రయాణం పట్ల మీ ప్రేమను తగ్గించలేవనే విషయాన్ని మేము గౌరవిస్తాము మరియు ప్రశంసిస్తున్నాము. ఆ కారణంగానే, మేము మీ కోసం ప్రత్యేకంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు రూపొందించాము!
వస్తువులు పోగొట్టుకోవడం, వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితులు మరియు విమానం ఆలస్యం లేదా రద్దు కావడం లాంటి ప్రయాణ సంబంధిత సమస్యలు మీరు విదేశంలో ఉన్నప్పుడు ఆర్థికంగా మీకు పెను భారం కలిగించవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు ఆర్థిక కవర్ అందించడంతో పాటు అటువంటి నష్టాల నుండి మిమ్మల్ని రక్షించడం కోసం రూపొందించబడ్డాయి.
అయితే, అలాంటి ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ రక్షణ పొందాలనుకున్నప్పుడు ప్రీమియం గురించిన అనిశ్చితి మిమ్మల్ని వెనుకంజ వేసేలా చేస్తూ ఉంటే, అలాంటప్పుడు మా ట్రావెల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది.
ట్రావెల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై ఒక అంచనాను మీకు అందిస్తుంది. దీనిద్వారా, మీరిప్పుడు వివిధ ఇన్సూరెన్స్ ఎంపికల కోసం ప్రీమియంను లెక్కించవచ్చు మరియు మీకు ఉత్తమంగా సరిపోయే దానిని ఎంచుకోవచ్చు.
ఇది ఒక మంచి ప్రశ్న. ట్రావెల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ గొప్ప సహాయంగా ఉండగలదని రుజువు చేయగల కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి
మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రీమియం అనేది మీ సందేహాల్లో మొదటిదిగా ఉంటుంది కదా? అయితే, కొనుగోలు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికోసం ఎంత వెచ్చించాలనేది కీలకమైన ప్రశ్నగా ఉంటుంది.
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ సహాయంగా ఉన్నప్పుడు, మీరు అనేక మందితో మాట్లాడవలసిన అవసరం ఉండదు లేదా ఇంటర్నెట్‌లో శోధన పేరుతో మీరు అనిశ్చితి పరిస్థితిలో లేదా తప్పుడు మార్గనిర్దేశనం జరిగే ఉండదు. దీనితో మీరు కొన్ని నిమిషాల్లోనే ఖచ్చితమైన సమాచారం కనుగొనవచ్చు మరియు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు.
మీరు మీ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మీరు టిక్ చేయవలసిన అనేక విషయాలు మీ ట్రావెల్ చెక్‌లిస్ట్‌లో ఉన్నాయని మాకు తెలుసు. మీకు అవసరమైన అన్నింటినీ ప్యాక్ చేయడం నుండి ఒక మంచి ప్రయాణ ప్రణాళిక కలిగి ఉండటం వరకు, ఏవైనా అప్రియమైన పరిస్థితులు నివారించడానికి మీరు మీ ప్రయాణంలోని ప్రతి సాధ్యమైన అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
కాబట్టే, అత్యంత వేగంగా పనిచేసేలా మేము మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను డిజైన్ చేసాము. తద్వారా, అది మీ విలువైన సమయాన్ని ఏమాత్రం వృధా చేయదు. మీరు మీ ప్రయాణ ప్రణాళిక సమయంలో, చిన్నపాటి కాఫీ బ్రేక్ తీసుకున్న సమయంలో వివిధ పాలసీల ఎంపికల కోసం ప్రీమియం మొత్తం ఎంత ఖర్చు అవుతుందో మీరు కనుగొనవచ్చు.
దాంతోపాటు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీకు మీరే లెక్కించుకోవాల్సిన అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అలాంటి ఒక అవకాశం ఎల్లప్పుడూ ఒక అనుకూలమే కదా?
నిజానికి, వెకేషన్ సమయంలో విమాన టిక్కెట్లు మరియు వసతి అవసరాలే కాకుండా, మీరు వెచ్చించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉంటాయి. మీరు ట్రిప్‌కు వెళ్లే ముందు షాపింగ్ చేయడం మొదలుకుని, మీరు ట్రిప్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం బహుమతులు తీసుకురావడం వరకు ప్రయాణం అనేది చాలా వేగంగా పూర్తి చేయాల్సిన ఒక ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. అందుకే, బడ్జెట్‌ను సరిచూసుకోవడం చాలా ముఖ్యం.
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ రక్షణను మీరు సొంతం చేసుకోవడానికి అవసరమైన మొత్తం ఎంతో తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ప్రయాణ బడ్జెట్‌ను విజయవంతంగా ప్లాన్ చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవడానికి మాకు కొన్ని ప్రాథమిక వివరాలు చాలు, ఈ వివరాలతో మేము మీ అవసరాలను అర్థం చేసుకొని మీకు తగినటువంటి కవర్ అందజేస్తాము.
● ప్రయాణ రకం - ఒంటరిగా లేదా బృందంగా
● ట్రిప్ ఉద్దేశం - పనిలో భాగం, సేదతీరడానికి లేదా విద్యా సంబంధితం
● వయస్సు
● లింగం
● ప్రయాణ గమ్యస్థానం
● రోజుల సంఖ్య
● ఇన్సూర్ చేయబడిన మొత్తం ఎంపిక
మీ ప్రయాణ గమ్యస్థానం నిర్ణయించే ముందు మీరు పరిగణనలోకి తీసుకునే అంశాలు అనేకం ఉంటాయి, నిజమే కదా? నిజానికి, ఇదొక ముఖ్యమైన నిర్ణయం. మీరు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం నిర్ణయించడానికి మేము కూడా అనేక విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటాము.
వయస్సు అనేది ఒక అంకె మాత్రమే. ఎందుకంటే, అన్ని వయస్సుల వ్యక్తులు ప్రయాణ ఆనందం అనుభవించాలని మేము విశ్వసిస్తున్నాము. మీ వయస్సుతో సంబంధం లేకుండా మీ అవసరాలు తీర్చే అనేక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మా వద్ద ఉన్నాయి. అయితే, ప్రీమియం మొత్తం నిర్ణయించడంలో మీ వయస్సు ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
ఉదాహరణకు, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే, ఆ వయసులో ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.
వివిధ దేశాలకు విమాన టిక్కెట్ల ధర భిన్నంగా ఉన్నట్లుగానే, మీ ప్రయాణ గమ్యస్థానాన్ని బట్టి మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఒకదానిని మీరు ఎంచుకోవచ్చు:
● USA మరియు కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా
● USA మరియు కెనడా మినహాయించి ప్రపంచవ్యాప్తంగా
ఇతర అంశాలతో పాటు, వివిధ దేశాల్లోని ఆరోగ్య సంరక్షణ ఖర్చులు సైతం భిన్నంగా ఉంటాయనే వాస్తవం కోసం ఈ వ్యత్యాసం చెల్లించవలసి ఉంటుంది.
మీరు 7 రోజుల చిన్న ట్రిప్‌కు వెళ్ళాలనుకోవచ్చు లేదా 3 నెలల సుదీర్ఘ విరామం కోసం ప్రయాణించాలనుకోవచ్చు. మీ ఎంపిక ఏదైనప్పటికీ, మేము మిమ్మల్ని కవర్ చేయడానికి ఇక్కడ ఉన్నాము. మీ కలల గమ్యస్థానంలో మీరు ఖర్చు చేయాలనుకుంటున్న రోజుల సంఖ్య అనేది మీ ప్రీమియంను నిర్ణయించడంలో సహాయపడుతుంది.
మీ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది ముఖ్యమైన పాత్ర పోషించే మరొక అంశంగా ఉంటుంది. సాధారణంగా, ప్లాన్‌లో మెడికల్ కవరేజీ ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం అనేది అంత ఎక్కువగా ఉంటుంది.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి