రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
యజమాని-డ్రైవర్ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తప్పనిసరి. అయితే, మీ కారులో ప్రయాణించే పెయిడ్ డ్రైవర్ లేదా ప్యాసింజర్లకు అయినా జరిగే ప్రమాదాలకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో ఇన్సూరెన్స్ చేయడానికి ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఒకవేళ, మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న కార్ యజమాని అయితే, మీ కారు ఇన్సూరెన్స్ పాలసీ క్రింద తప్పనిసరిగా మీరు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కలిగి ఉండాలి. మీ పేరు మీద రిజిస్టర్ చేయబడిన వెహికల్‌కు సంబంధించి నేరుగా జరిగే దురదృష్టవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వైకల్యం సందర్భంలో ఇది మీకు కవరేజీని అందిస్తుంది. *
షరతు: పాలసీదారు లేదా అతని/ఆమె చట్టపరమైన వారసునికి మాత్రమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించబడుతుంది. యాక్సిడెంట్ సమయంలో వారు యజమాని అని భావించినప్పటికీ మరియు కారును డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఏ ఇతర వ్యక్తి కూడా క్లెయిమ్ చేయలేరు.
మరొక దృష్టాంతంలో, మీరు కారును కలిగి ఉండవచ్చు, కానీ దానిని నడిపించడానికి మరొక వ్యక్తిని నియమించుకుంటారు. అతనిని/ ఆమెను కూడా కవర్ చేయడానికి కావలసిన యాడ్-ఆన్ కోసం కొంత అదనపు ప్రీమియం చెల్లించే అవకాశం మీకు ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌ను పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అని పిలుస్తారు. *
షరతు: యాడ్-ఆన్ ప్రతిపాదన అప్లికేషన్‌లో పెయిడ్ డ్రైవర్‌గా ప్రకటించబడిన వ్యక్తికి మాత్రమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించబడుతుంది. ఆ నిర్దిష్ట కారును డ్రైవ్ చేయడానికి వారికి చెల్లించినప్పటికీ ఏ ఇతర వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరు.
కారు యజమానిగా, మీ వాహనంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మీ ప్రయాణీకులు ఎదుర్కొనే ఏవైనా గాయాలకు మీరు చెల్లించవలసి ఉంటుంది. ఈ యాడ్-ఆన్‌ను తీసుకోవడంతో, మీ ప్రయాణీకుల జీవితాలకు ఇన్సూరెన్స్ చేసే అధికారం మీకు ఉంటుంది- పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ప్రయాణీకుల కోసం. ఒకవేళ, మీ కారులో మూడు ప్యాసింజర్ సీట్లు ఉంటే, మీరు ముగ్గురు ప్రయాణీకులకు ఇన్సూర్ చేయడానికి ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకోవచ్చు. *
షరతు: యాక్సిడెంట్ సమయంలో, చట్టపరంగా అనుమతించబడిన దాని కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండకూడదు.
ఒక ప్రామాణిక సమగ్ర పాలసీ ప్రమాదం జరిగిన సందర్భంలో మీ కారు కోసం ఆర్థిక రక్షణను నిర్ధారిస్తుంది. దానికి అదనంగా, మీ సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఒక భాగంగా ఉండే పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ప్రమాదం కారణంగా గాయం లేదా మరణం సంభవించినట్లయితే యజమాని-డ్రైవర్‌కు రక్షణను అందిస్తుంది. ఒక పెయిడ్ డ్రైవర్ విషయానికి వస్తే, పాలసీహోల్డర్ పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కొనుగోలు చేయవచ్చు. అయితే, మీ కారులోని ప్రయాణీకులకు ఎటువంటి కవరేజ్ అందుబాటులో లేదు. అప్పుడు మీరు ఒక ప్యాసింజర్ ప్రొటెక్షన్ కవర్‌ను ఎంచుకోవాలి. పేర్కొనబడని ప్రయాణీకుల కోసం ప్యాసింజర్ ప్రొటెక్షన్ కవర్ అని కూడా పేర్కొనబడుతుంది. *
ప్యాసింజర్ ప్రొటెక్షన్ కవర్ అనేది ప్రయాణీకుల వైద్య ఖర్చులు మరియు ప్రమాదం సందర్భంలో బాధ్యత క్లెయిములను కవర్ చేసే స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క యాడ్-ఆన్. ఇన్సూర్ చేయబడిన వాహనంలో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సహా ప్రయాణికులందరికీ కవర్ పొడిగించవచ్చు. ప్రమాదం జరిగిన సందర్భంలో, ప్యాసింజర్ ప్రొటెక్షన్ కవర్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు మరియు ఇతర సంబంధిత ఖర్చులతో సహా వైద్య ఖర్చులకు పరిహారం అందిస్తుంది. *
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో డ్రైవర్ మరియు ప్రయాణీకుల రక్షణ కవర్ కలిగి ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మొదట, ఇది మీ కారులో గాయపడిన ప్రయాణీకులకు వైద్య చికిత్స కోసం కవరేజ్ అందిస్తుంది. రెండవది, మీ కారులోని ప్రయాణీకుల దురదృష్టకర సంఘటనలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మూడవది, ఇది ప్రయాణీకులకు వైకల్యం కవరేజ్ అందిస్తుంది.
అన్ని ఇన్సూరెన్స్ పాలసీల లాగానే, పేర్కొనబడని ప్యాసింజర్ కవర్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
✓ ప్రయాణికులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి వెళ్లినట్లయితే ఇన్సూరర్ ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయం అందించబడదు. *
✓ తయారీదారు పేర్కొన్న విధంగా కారు యొక్క గరిష్ట సీటింగ్ సామర్థ్యానికి ప్యాసింజర్ కవర్ పరిమితం చేయబడింది. అందువల్ల, ప్రయాణికుల సంఖ్య తయారీదారు నిర్దేశించిన సంఖ్యను మించితే, ఎటువంటి కవరేజ్ అందుబాటులో లేదు. *
✓ ఆత్మహత్యాయత్నం లేదా స్వతహా-చేసుకున్న గాయం కారణంగా ప్రయాణికులకు జరిగిన గాయాలు పేర్కొనబడని ప్రయాణికుల కవర్ ద్వారా మినహాయించబడతాయి. *
✓ మద్యం లేదా మత్తు కలిగించే ఏదైనా ఇతర పదార్థాల ప్రభావంలో డ్రైవర్ ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగితే కవరేజ్ అందించబడదు. *
డ్రైవర్ మరియు ప్యాసింజర్ కవర్ కింద ఆన్‌లైన్‌లో ఒక కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం చాలా సులభమైన మరియు అవాంతరాలు లేని ప్రక్రియ. మీరు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ప్యాసింజర్ కవర్ కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మొట్టమొదటి మరియు ముఖ్యమైన విషయం మీ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయడం. ప్రమాదం మరియు ప్రయాణికులకు కలిగిన గాయాల గురించి మీరు ఇన్సూరర్‌కు వివరించే సందర్భం ఇది.
తదుపరి దశ ఆ ప్రాంత అధికార పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేయడం. మీరు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఇది ఒక కీలకమైన దశ. అందువల్ల, ఈ దశను స్కిప్ చేయకండి.
ప్రమాదంలో థర్డ్ పార్టీ ఉన్నట్లయితే, అటువంటి థర్డ్ పార్టీ యొక్క వివరాలను కూడా ఖచ్చితముగా పేర్కొనండి.
మీరు మరియు మీ కారు ప్రయాణీకులు గాయాల కోసం చికిత్స అందుకుంటున్న ఆసుపత్రి వివరాలను పేర్కొనండి.
మీ కారుకు జరిగిన నష్టాలను మూల్యాంకన చేయడానికి మరియు తదనుగుణంగా సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది.
ఇన్సూరెన్స్ కంపెనీ ప్రయాణీకులు మరియు యజమాని-డ్రైవర్ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. పాలసీ యొక్క షరతులు మరియు నిబంధనల ఆధారంగా, మరణం సందర్భంలో బాధితుల కుటుంబానికి ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వాహనంలోని ప్రయాణీకులందరికీ సమగ్ర రక్షణను అందించే ఏదైనా కార్ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక అవసరమైన యాడ్-ఆన్. మీరు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి పాలసీలోని చేర్పులు మరియు మినహాయింపులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాదం జరిగిన సందర్భంలో, క్లెయిమ్ ప్రాసెస్ చాలా సులభం మరియు పాలసీ నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది. అందువల్ల, ప్రయాణీకుల భద్రత మరియు రక్షణను నిర్ధారించడానికి మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్యాసింజర్ కవర్‌ను చేర్చవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
* ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి