రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీ వివరాలను తెలియజేయండి
కార్ ఇన్సూరెన్స్ అనేది వాహన యాజమాన్యంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది ఊహించని ప్రమాదాలు మరియు నష్టాల నుండి ఆర్థిక రక్షణను అందిస్తుంది. అయితే, అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఒకే స్థాయిలో రక్షణను అందించవు. వాహన యజమానులలో ఎక్కువ ప్రజాదరణ పొందిన ఒక యాడ్-ఆన్ కవర్ జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్. డిప్రిసియేషన్ కోసం మినహాయింపులు లేకుండా పాలసీదారు పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని అందుకునేలా ఈ యాడ్-ఆన్ నిర్ధారిస్తుంది, ఆ విధంగా ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు.
ఈ పోస్ట్‌లో, మేము జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాలు, అది ఎలా పనిచేస్తుంది మరియు కొత్త మరియు ఖరీదైన కారు యజమానులకు ఇది ఎందుకు తప్పనిసరిగా ఉండాలి అనే వివరాలను అందిస్తాము. ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు, అది ఏమి కవర్ చేస్తుంది మరియు ఉత్తమ జీరో డిప్రిసియేషన్ పాలసీని ఎంచుకునే చిట్కాలను కూడా మేము పరిశీలిస్తాము.
జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్‌ను నిల్ డిప్రిసియేషన్ లేదా బంపర్-టు-బంపర్ కవరేజ్ అని కూడా పిలుస్తారు - క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో ఎటువంటి తరుగుదల మినహాయించబడదు. రీప్లేస్‌మెంట్ లేదా రిపేర్ అవసరమైన భాగాల విలువను లెక్కించేటప్పుడు స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు డిప్రిసియేషన్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా, పాలసీదారు తరచుగా మరమ్మత్తు ఖర్చులలో కొంత భాగాన్ని తమ స్వంత డబ్బుతో చెల్లించవలసి ఉంటుంది.
జీరో డిప్రిషియేషన్ కవరేజ్‌తో, ఇన్సూరెన్స్ కంపెనీ విడిభాగాల వయస్సు లేదా అరుగుదల మరియు తరుగుదలతో సంబంధం లేకుండా భర్తీ చేయబడిన పూర్తి ఖర్చును కవర్ చేస్తుంది. ఆ విధంగా క్లెయిమ్‌ల సమయంలో వారి ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న ఎవరికైనా జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ఒక ఉత్తమమైన యాడ్-ఆన్‌గా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా రీప్లేస్‌మెంట్ ఖర్చులు గణనీయంగా ఉండే కొత్త కార్లు లేదా విలాసవంతమైన వాహనాల కోసం సిఫార్సు చేయబడుతుంది.
* ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే నిర్ణయం అనేక అంశాల పై ఆధారపడి ఉంటుంది:
మీరు ఇప్పుడే ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే, ముఖ్యంగా ఒక ఖరీదైన కారు, జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా యాజమాన్య ప్రారంభ సంవత్సరాల్లో ఏదైనా రీప్లేస్‌మెంట్ భాగాల పూర్తి విలువను పొందేలాగా నిర్ధారిస్తుంది.
మీరు చిన్న చిన్న ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో- లేదా జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, జీరో డిప్రిసియేషన్ మీకు గణనీయమైన మరమ్మత్తు ఖర్చులను ఆదా చేస్తుంది.
మొదటిసారి కార్ నడిపే లేదా అనుభవం లేని డ్రైవర్లు వారి కార్లకు నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ మరమ్మత్తు ఖర్చులు తక్కువగా ఉండేలాగా నిర్ధారిస్తుంది.
ఈ యాడ్-ఆన్ అందించే ఆర్థిక ప్రయోజనాలు మరియు మనశ్శాంతిని బట్టి, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కారు ఉన్న ఎవరైనా పరిగణనలోకి తీసుకోవడానికి తగినది.
మీరు ఒక స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసినప్పుడు, క్లెయిమ్ సెటిల్ చేసే సమయంలో ఇన్సూరర్ మీ కారు భాగాల వయస్సు మరియు తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే, పాత విడిభాగాలు లేదా అరుగుదల మరియు తరుగుదలకు లోబడి ఉన్న భాగాలు తక్కువ విలువను కలిగి ఉంటాయి మరియు మరమ్మత్తు ఖర్చులలో కొంత భాగాన్ని కవర్ చేయడానికి మీరు బాధ్యత వహించాలి.
అయితే, జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్‌తో ఇన్సూరర్ కారు భాగాల తరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా క్లెయిమ్‌ను సెటిల్ చేస్తారు. అంటే పాలసీదారు గణనీయంగా అధిక మొత్తం అందుకుంటారు, ఇది దాదాపుగా మరమత్తులు లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చును కవర్ చేస్తుంది.
ఉదాహరణకు, ప్రమాదం కారణంగా మీరు మీ కారు బంపర్‌ను రీప్లేస్ చేయవలసి వస్తే, సాధారణంగా ఇన్సూరర్ బంపర్ వయస్సు ఆధారంగా తరుగుదల రేటును వర్తింపజేస్తారు. అయితే, జీరో డిప్రిసియేషన్‌తో, పూర్తి రీప్లేస్‌మెంట్ ఖర్చు కవర్ చేయబడుతుంది, వ్యత్యాసాన్ని కవర్ చేయడానికి మీరు మీ పొదుపు నుండి ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.
జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఎంపిక అనేక స్పష్టమైన ప్రయోజనాలతో వస్తుంది:
ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే మీరు డిప్రిసియేషన్ కోసం ఎటువంటి మినహాయింపులు లేకుండా పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని అందుకుంటారు. మీ వ్యక్తిగత ఖర్చులు తగ్గించబడేలా నిర్ధారిస్తూ, ఇన్సూరర్ విడిభాగాల రీప్లేస్‌మెంట్ కోసం అయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తారు,.
జీరో డిప్రిషియేషన్ కవర్ ముఖ్యంగా ఖరీదైన భాగాలు ఉండే లగ్జరీ కార్లు వంటి వాహనాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. బంపర్‌లు, గ్లాస్, ఫైబర్ మరియు రబ్బరు భాగాలతో సహా అనేక భాగాలు వాటి తరుగుదల విలువను పరిగణనలోకి తీసుకోకుండా పూర్తిగా కవర్ చేయబడతాయి.
మరమ్మత్తుల సమయంలో మీరు తరుగుదల ఖర్చులను భరించాల్సిన అవసరం లేనందున, కాలక్రమేణా మీ కారు మంచి నిర్వహణ స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కారును మెరుగైన స్థితిలో ఉంచడమే కాకుండా దాని రీసేల్ విలువ తగ్గకుండా సహాయపడుతుంది.
మీరు సరైన రోడ్‌లు లేని లేదా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, ప్రమాదాలు మరింత ఎక్కువగా జరగవచ్చు. అటువంటి సందర్భాల్లో, తరచుగా వచ్చే మరమ్మత్తు ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ఒక విలువైన సాధనంగా మారుతుంది.
ముఖ్యంగా, కొత్త కారు యజమానులు మరియు విలాసవంతమైన వాహనాలు ఉన్నవారు జీరో డిప్రిసియేషన్ కవర్ నుండి ప్రయోజనం పొందవచ్చు. ఖరీదైన విడిభాగాల వలన, చిన్న మరమ్మత్తులకు కూడా ఎక్కువ ఖర్చు కావచ్చు. జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్ అనేది 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కొత్త కార్లకు అయ్యే ఖర్చులకు మీకు పూర్తి పరిహారం అందించబడేలా నిర్ధారిస్తుంది.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
*మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఏర్పాటు చేయబడిన నిబంధనలు మరియు షరతులకు క్లెయిములు లోబడి ఉంటాయి.
ఈ పాలసీ క్రింద, డిప్రిషియేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను ప్రభావితం చేయదు మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి పూర్తి పరిహారం అందించబడుతుంది.
3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల కార్లు మాత్రమే చేర్చబడ్డాయి మరియు కొత్త కారు యజమానులు మాత్రమే దీనిని కొనుగోలు చేయవచ్చు.
జీరో-డిప్రిషియేషన్ కవర్ సాధారణ అరుగుదల, తరుగుదల మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్‌లను కవర్ చేయదు. ప్రతి పాలసీదారు తప్పనిసరిగా పాలసీ అదనపు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.
A జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్ వార్షికంగా కొన్ని క్లెయిమ్ పరిమితులను కలిగి ఉంటుంది, అయితే ఇది ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి మారవచ్చు.
ఫైబర్, గ్లాస్, రబ్బర్ మరియు ప్లాస్టిక్ భాగాలకు జరిగిన ఏదైనా నష్టాన్ని ఇన్సూరర్ భరిస్తారు.
సాధారణ కార్ ఇన్సూరెన్స్ కవర్‌తో పోలిస్తే జీరో-డిప్రిషియేషన్ కవర్లు సాధారణంగా అధిక ప్రీమియంలను కలిగి ఉంటాయి.
ఈ యాడ్-ఆన్ అందించే ఆర్థిక ప్రయోజనాలు మరియు మనశ్శాంతిని బట్టి, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కారు ఉన్న ఎవరైనా పరిగణనలోకి తీసుకోవడానికి తగినది.
సాధారణంగా జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం స్టాండర్డ్ కారు ఇన్సూరెన్స్ పాలసీల కంటే ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది అనేక అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది:
సాధారణంగా జీరో డిప్రిషియేషన్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కారు వయస్సు పెరిగే కొద్దీ, ఈ కవర్ కోసం ప్రీమియం పెరుగుతుంది.
ఖరీదైన భాగాలు మరియు మరమ్మత్తు ఖర్చుల కారణంగా విలాసవంతమైన లేదా ఖరీదైన వాహనాలను ఇన్సూర్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
మీరు ప్రమాదాలు లేదా విధ్వంసాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, మీ ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు.
మీకు తరచుగా క్లెయిమ్‌లు చేసే చరిత్ర ఉంటే, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం పెరగవచ్చు.
స్టాండర్డ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పటికీ, క్లెయిమ్ సెటిల్‌మెంట్ల పరంగా జీరో డిప్రిసియేషన్ ప్రయోజనాలు ఆ అదనపు ఖర్చుకు తగినట్లుగా ఉంటాయి.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
*మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఏర్పాటు చేయబడిన నిబంధనలు మరియు షరతులకు క్లెయిములు లోబడి ఉంటాయి.
డిప్రిషియేషన్ అనేది కాలక్రమేణా అరుగుదల మరియు తరుగుదల, వయస్సు మరియు వినియోగం కారణంగా కారు విడిభాగాల విలువలో వచ్చే తగ్గుదల. ఒక స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో, క్లెయిములను సెటిల్ చేసేటప్పుడు ఇన్సూరర్లు వివిధ భాగాలకు డిప్రిషియేషన్ రేటును అప్లై చేస్తారు. కార్ భాగాల కోసం సాధారణ డిప్రిషియేషన్ రేట్లు క్రింద ఇవ్వబడ్డాయి:
ఈ డిప్రిసియేషన్ రేట్లు క్లెయిమ్ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తాయి, అందుకే జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఒక విలువైన యాడ్-ఆన్. ఈ డిప్రిసియేషన్ రేట్ల ప్రభావాన్ని తొలగించడం ద్వారా, పాలసీదారు చాలా ఎక్కువ సెటిల్‌మెంట్ మొత్తాన్ని అందుకుంటారు.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
మీరు జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి:
జీరో డిప్రిసియేషన్ కవర్ కోసం మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్లు అర్హత కలిగి ఉంటాయి. కారు వయస్సు పెరిగే కొద్దీ, డిప్రిషియేషన్ రిస్క్ పెరుగుతుంది, ఇది ప్రీమియంను పెంచుతుంది.
ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లు మరింత ఖరీదైన భాగాలను కలిగి ఉంటాయి, కాబట్టి అటువంటి వాహనాలపై జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ప్రీమియం సహజంగా ఎక్కువగా ఉంటుంది.
మీరు ప్రమాదాలు ఎక్కువగా జరిగే లేదా రోడ్డు పరిస్థితులు సరిగ్గా లేని ప్రాంతాలలో నివసిస్తున్నట్లయితే, మీరు జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ కోసం అధిక ప్రీమియంలను చెల్లించవలసి ఉంటుంది.
గతంలో మీరు చేసిన క్లెయిమ్‌ల సంఖ్యతో సహా మీ డ్రైవింగ్ చరిత్ర మీ ప్రీమియంను ప్రభావితం చేయవచ్చు. ఒక మంచి డ్రైవింగ్ రికార్డ్ ఖర్చును తగ్గించడంలో సహాయపడగలదు.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర కార్ ఇన్సూరెన్స్ రెండూ విస్తృతమైన కవరేజీని అందిస్తున్నప్పటికీ, రెండింటి మధ్య కీలక వ్యత్యాసాలు ఉన్నాయి:
ఈ రకమైన ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ బాధ్యతలు, ఓన్-డ్యామేజ్ మరియు దొంగతనాన్ని కవర్ చేస్తుంది. అయితే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో, డిప్రిషియేషన్ పరిగణించబడుతుంది, ఇది క్లెయిమ్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
ఇది ఒక సమగ్ర పాలసీతో తీసుకోగల ఒక యాడ్-ఆన్ కవర్. ఇది డిప్రిషియేషన్ మినహాయించబడలేదని నిర్ధారిస్తుంది, అంటే మరమ్మత్తుల సమయంలో మీరు విడిభాగాల కోసం పూర్తి విలువను పొందుతారు.
ఉదాహరణకు, మీ కారు బంపర్‌ను భర్తీ చేయవలసి ఉంటే, సమగ్ర ఇన్సూరెన్స్ డిప్రిసియేషన్‌ను కలిగి ఉంటుంది, అయితే జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ ఎటువంటి మినహాయింపులు లేకుండా బంపర్ యొక్క మొత్తం ఖర్చును కవర్ చేస్తుంది.
ఆన్‌లైన్‌లో జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ పొందడం సులభం మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా ఈ యాడ్-ఆన్‌ను అందిస్తుంది. మొదట, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ బేస్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి మరియు తరువాత జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్‌ను ఎంచుకోండి. మీ అవసరాలను తీర్చుకోవడానికి పాలసీ నిబంధనలు మరియు షరతులను చదవండి.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీ జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం అనేది ఒక సరళమైన ప్రక్రియ.
మీ పాలసీ గడువు ముగియడానికి కొన్ని వారాల ముందు, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి మరియు రెన్యూవల్ ఎంపికను ఎంచుకోండి. మీరు జీరో డిప్రిషియేషన్ యాడ్-ఆన్‌ను మళ్ళీ ఎంచుకున్నారని నిర్ధారించుకోండి, ఎందుకంటే రెన్యూవల్ సమయంలో ఇది ఆటోమేటిక్‌గా కొనసాగకపోవచ్చు. రెన్యూవల్‌ను నిర్ధారించడానికి ముందు అప్‌డేట్ చేయబడిన పాలసీ నిబంధనలు మరియు ప్రీమియంలను సమీక్షించండి.
జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్ వివిధ కారు భాగాలకు విస్తృతమైన రక్షణను అందిస్తుంది, మీరు క్లెయిమ్ సమయంలో పూర్తి పరిహారం పొందేలా నిర్ధారిస్తుంది:
డిప్రిసియేషన్‌కు అధికంగా గురయ్యే ఈ మెటీరియల్స్ పూర్తిగా జీరో డిప్రిసియేషన్ కింద కవర్ చేయబడతాయి.
విండ్‌షీల్డ్ మరియు విండోస్ వంటి భాగాలు చేర్చబడ్డాయి, తరుగుదలతో సంబంధం లేకుండా రీప్లేస్‌మెంట్ ఖర్చులకు కవరేజ్ అందించబడుతుంది.
భర్తీ చేయడానికి ఖరీదైన, ఇవి కూడా జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కింద కూడా కవర్ చేయబడతాయి.
ప్రమాదం కారణంగా మరమ్మత్తు చేయవలసిన లేదా భర్తీ చేయవలసిన కారులోని ఏదైనా మెటాలిక్ భాగం తరుగుదల మినహాయింపులు లేకుండా కవర్ చేయబడుతుంది.
జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్ సమగ్ర రక్షణను అందిస్తున్నప్పటికీ, కొన్ని మినహాయింపులు ఉన్నాయి:
వాహనం యొక్క సాధారణ వినియోగం ఫలితంగా జరిగిన ఏదైనా నష్టం కవర్ చేయబడదు.
కారు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ పనితీరుకు సంబంధించిన సమస్యలు చేర్చబడవు.
ప్రమాదాల ఫలితంగా రాని నష్టాలు అంటే సహజ వయస్సు కారణంగా వచ్చే అరుగుదల మరియు తరుగుదల వంటి నష్టాలు పాలసీ నుండి మినహాయించబడతాయి.
సాధారణంగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వాహనాలు జీరో డిప్రిషియేషన్ కవర్‌కు అర్హత కలిగి ఉండవు.
సాధారణంగా జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ సులభంగా మరియు సరళంగా ఉంటుంది. క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు మరమ్మత్తు ఖర్చులను లెక్కిస్తుంది. క్లెయిమ్ ఫైల్ చేసిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు మరమ్మత్తు ఖర్చులను లెక్కిస్తుంది. భర్తీ చేయబడుతున్న భాగాల పూర్తి విలువను మీరు అందుకుంటారు, ఇది మీ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
అయితే, చాలామంది ఇన్సూరర్లు ప్రతి సంవత్సరంలో ఒక పాలసీకి అనుమతించబడిన జీరో డిప్రిషియేషన్ క్లెయిముల సంఖ్యపై గరిష్ట పరిమితిని విధిస్తాయి అని గమనించడం ముఖ్యం, కాబట్టి మీ పాలసీ నిబంధనలు మరియు షరతులను తప్పక చూడండి.
మీరు ఉత్తమ జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
చాలామంది ఇన్సూరర్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్లకు మాత్రమే జీరో డిప్రిషియేషన్ కవర్ అందిస్తారు. మీ కారు పాతది అయితే, కొనుగోలు చేయడానికి ముందు అది ఇప్పటికీ ఈ యాడ్-ఆన్ కోసం అర్హత కలిగి ఉందని నిర్ధారించుకోండి.
అవాంతరాలు-లేని మరియు పారదర్శకమైన క్లెయిమ్ ప్రక్రియను కలిగి ఉన్న ఇన్సూరర్ కోసం చూడండి. క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఎటువంటి సవాళ్లను ఎదుర్కోకుండా ఇది సహాయపడుతుంది.
మీరు ఉత్తమ డీల్ పొందుతున్నారని నిర్ధారించడానికి వివిధ ప్రొవైడర్లు అందించే జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలను సరిపోల్చండి.
పాలసీలో ఏమి కవర్ చేయబడుతుందో మరియు ఏమి మినహాయించబడుతుందో అర్థం చేసుకోవడానికి ఫైన్ ప్రింట్ చదవండి.
భారతదేశంలోని ప్రముఖ జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి. మా పాలసీలు ఆకర్షణీయమైన ప్రీమియంలు మరియు నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌తో లభిస్తాయి, ఇవి క్లెయిమ్ ప్రక్రియను వేగంగా మరియు సౌకర్యవంతంగా చేస్తాయి. అదనంగా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అద్భుతమైన కస్టమర్ సర్వీస్‌ని అందిస్తుంది, ఇది మీ అవసరాలు త్వరగా మరియు సమర్థవంతంగా నెరవేర్చబడేలా నిర్ధారిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా మీ కారు పూర్తి రక్షణ కలిగి ఉంటుందని మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో మీరు డిప్రిషియేషన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని నిర్ధారిస్తుంది. ఈ యాడ్-ఆన్‌తో, మీ వాహనం సమగ్రంగా కవర్ చేయబడుతుందని తెలుసుకుని మీరు ఆత్మవిశ్వాసంతో డ్రైవ్ చేయవచ్చు.
తరుగుదల యొక్క ఆర్థిక ప్రభావం నుండి తమ కారును రక్షించాలని చూస్తున్న ఎవరికైనా జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్ అనేది ఒక విలువైన యాడ్-ఆన్. డిప్రిసియేషన్ కోసం ఎటువంటి మినహాయింపులు లేకుండా మీరు పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని అందుకునేలా నిర్ధారించడం ద్వారా, ఈ కవర్ మీ కారు విలువ తగ్గకుండా మరియు మరమ్మత్తుల సమయంలో అధిక ఖర్చులను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. మీరు ఒక కొత్త కారు యజమాని లేదా యాక్సిడెంట్-ప్రభావిత ప్రాంతంలో నివసిస్తున్న వారైనా, జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ సమగ్ర రక్షణ మరియు మనశ్శాంతిని అందిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఈ యాడ్-ఆన్ ద్వారా, మీ కారు పూర్తిగా రక్షణ పొందేలా నిర్ధారించడం సులభం. కాబట్టి, మీ తదుపరి కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోండి మరియు ఈ రోజే మీ వాహన భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.
మీరు జీరో డిప్రిషియేషన్ కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడాన్ని ఎందుకు పరిగణించాలి అంటే ఇది విడిభాగాల తరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా పూర్తి మరమ్మత్తు ఖర్చులను చెల్లించడం ద్వారా సమగ్ర కవరేజీని అందిస్తుంది. ఇది ముఖ్యంగా కొత్త లేదా ఖరీదైన వాహనాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే తరుగుదల చేయబడిన భాగాల కోసం మీరు అదనపు ఖర్చులను భరించాల్సిన అవసరం లేకుండా సహాయపడుతుంది. ఇది మీ కారు విలువను సమర్థవంతంగా రక్షిస్తుంది మరియు క్లెయిమ్‌ల సమయంలో ఆర్థిక నష్టాన్ని తగ్గిస్తుంది.
అవును, మీరు పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిములు చేయకపోతే, జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) పొందడానికి అర్హత కలిగి ఉంటారు. క్లెయిమ్-రహిత సంవత్సరాల కోసం ఎన్‌సిబి ఒక రివార్డ్‌గా వస్తుంది మరియు పాలసీని రెన్యూ చేసేటప్పుడు మీ ప్రీమియంను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్‌తో కూడా, ఎన్‌సిబి ప్రయోజనాలు అలాగే ఉంటాయి.
జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి) అనేది మీ వాహనం పూర్తి నష్టం లేదా దొంగిలించబడిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే గరిష్ట మొత్తాన్ని సూచిస్తుంది. ఇది డిప్రిషియేషన్ మినహాయించి, మీ కారు యొక్క ప్రస్తుత మార్కెట్ విలువను సూచిస్తుంది. పూర్తి నష్టం క్లెయిమ్‌ల సమయంలో మీ ప్రీమియం మరియు పరిహారం నిర్ణయించడంలో ఐడివి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మీ కార్ ఇన్సూరెన్స్‌లో జీరో డిప్రిషియేషన్ కవరేజ్ ఉందో లేదో ధృవీకరించడానికి, మీరు ఇన్సూరర్ అందించిన పాలసీ డాక్యుమెంట్‌ను, ముఖ్యంగా యాడ్-ఆన్ కవర్‌లను వివరించే సెక్షన్‌ను సమీక్షించవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు మీ ఇన్సూరర్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ పాలసీ వివరాలను తనిఖీ చేయవచ్చు. మీకు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియకపోతే, మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను నేరుగా సంప్రదించడం ద్వారా కవరేజ్ మీ పాలసీలో భాగంగా ఉందా అని స్పష్టంగా తెలుస్తుంది.
లేదు, జీరో డిప్రిసియేషన్ కవరేజీని చేర్చడానికి థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాదు. జీరో డిప్రిషియేషన్ అనేది సమగ్ర లేదా ఓన్-డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీలతో మాత్రమే అందుబాటులో ఉన్న ఒక యాడ్-ఆన్. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ నష్టాలు మరియు గాయాలకు మాత్రమే బాధ్యతను కవర్ చేస్తుంది. జీరో డిప్రిసియేషన్ కవరేజ్ పొందడానికి, మీరు ఓన్-డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో కూడిన సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి.
అవును, జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్‌ను తరచుగా బంపర్-టు-బంపర్ కవరేజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకనగా, ఇది భాగాల తరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా, బంపర్‌లతో సహా వాహనంలోని దాదాపుగా అన్ని భాగాలను కవర్ చేస్తుంది. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా కాకుండా, జీరో డిప్రిషియేషన్ అనేది పూర్తి మరమ్మత్తు ఖర్చు కవర్ చేయబడుతుందని నిర్ధారిస్తుంది, ఇది ప్రమాదం జరిగిన సందర్భంలో మీకు గరిష్ట ఆర్థిక రక్షణను అందిస్తుంది.
జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ కింద మీరు చేయగల క్లెయిముల సంఖ్య ఇన్సూరర్ ద్వారా మారుతుంది, కానీ సాధారణంగా చాలా పాలసీలు ప్రతి పాలసీకి సంవత్సరానికి పరిమిత సంఖ్యలో రెండు క్లెయిములను అనుమతిస్తాయి,. కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ నిబంధనల ఆధారంగా ఎక్కువ లేదా తక్కువ క్లెయిమ్‌లను అందించవచ్చు. మీ ప్లాన్ కింద అనుమతించబడిన క్లెయిమ్‌ల ఖచ్చితమైన సంఖ్యను తెలుసుకోవడానికి మీ పాలసీ డాక్యుమెంట్‌ను సమీక్షించడం ముఖ్యం.
అవును, టైర్లు జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతాయి, అంటే మీ టైర్ పాడైపోయి, రీప్లేస్ చేయడం అవసరమైతే, తరుగుదల కోసం మినహాయింపు లేకుండా పూర్తి ఖర్చును ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. వేగంగా అరిగిపోయే మరియు ఈ యాడ్-ఆన్ లేకుండా రీప్లేస్ చేయడానికి ఎక్కువ ఖర్చయ్యే టైర్లు వంటి విడిభాగాలకు జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్‌ను అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి