Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సైబర్ ఇన్సూరెన్స్ కింద సైబర్ దోపిడి

సైబర్ దోపిడి అంటే ఏమిటి?

మీ కస్టమర్స్ గురించిన సమాచారం, బిజినెస్ రహస్యాలు మొదలైన వాటితో సహా మీ రహస్య డేటాను హ్యాకర్‌లు యాక్సెస్ చేయగలిగినప్పుడు సైబర్ దోపిడి జరుగుతుంది. ఈ డేటా చాలా విలువైనదని హ్యాకర్‌లకు తెలుసు కావున, వారు ఆ డేటాను తమ ‘నిర్బంధం’లో ఉంచి, దానికి బదులుగా కొంత అమౌంటును డిమాండ్ చేస్తారు. మీరు వారి డిమాండ్లను నెరవేర్చకపోతే దొంగిలించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారని బెదిరిస్తారు. 

మరొక రకమైన సైబర్ దోపిడీలో మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ డివైజ్‌ను ఇన్ఫెక్ట్ చేయడానికి, ఇన్నోసెంట్ ఇమెయిల్ అటాచ్‌మెంట్లతో పంపబడిన హానికరమైన సాఫ్ట్‌వేర్ లేదా మాల్‌వేర్‌ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ మాల్‌వేర్ మిమ్మల్ని పూర్తిగా లాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాల్‌వేర్‌ను తిరిగి నియంత్రించడానికి లేదా తీసివేయడానికి, మీరు హ్యాకర్‌ల డిమాండ్‌కు అనుగుణంగా వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. 

సైబర్ దోపిడి నేరాలను ఎలా తగ్గించాలి? 

ఎంపిక చేసుకునే యాక్సెస్ కంట్రోల్- మీరు సేకరించే మార్కెట్ వివరాలను బట్టి వ్యాపారంలో మీ మనుగడ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే, ప్రోడక్ట్ రీసెర్చ్ డేటా, సేల్స్ ఆదాయాలు లేదా కస్టమర్ వివరాలు వంటి గోప్యమైన సమాచారం మీ ఉద్యోగులకు కూడా వారి అవగాహన కోసం అందుబాటులో ఉండాలి.

ముఖ్యమైన డేటా కోసం బ్యాకప్‌లను క్రియేట్ చేయండి, దానిని గుప్తీకరించండి- మీరు ఎల్లప్పుడూ డేటా బ్యాకప్‌లను కలిగి ఉండటం ముఖ్యం. ఒక వేళ డేటా ఉల్లంఘన జరిగితే, మీరు హ్యాకర్‌లకు ఎలాంటి మొత్తాన్ని చెల్లించకుండానే మీ పూర్తి సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. అంతేకాకుండా, మీరు మీ బ్యాకప్ ఫైల్‌లను కూడా భద్రపరచుకోవాలి. 

మీ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి- మీరు ఎల్లప్పుడూ మీ ఎలక్ట్రానిక్ పరికరాలను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి నెలా ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ వస్తుంది, ఇది మీ పరికరాలకు అదనపు భద్రతను జోడిస్తుంది. 

రెగ్యులర్ సైబర్ ఆడిట్‌లు: సంభావ్య డేటా నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ నిపుణులచే ఐటి ఆడిట్‌లు అనేవి మీ వార్షిక వ్యాపార సమీక్షలలో భాగమై ఉండాలి.

అంతేకాకుండా గుర్తింపు దొంగతనం, సైబర్ దోపిడి మొదలైనటువంటి అన్ని రకాల ఇంటర్నెట్ దాడుల నుండి సురక్షితంగా ఉండటానికి, కొనుగోలు చేయండి ఒక సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ. 

తెలుసుకోండి సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

 

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం