Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

 

కన్జ్యూమర్ డ్యూరబుల్ రిపేర్ మరియు రిప్లేస్‌మెంట్ కవర్

 

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కన్జ్యూమర్ డ్యూరబుల్ రిపేర్ మరియు రిప్లేస్‌మెంట్

దాదాపు ప్రతి కన్జ్యూమర్ డ్యూరబుల్ వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వస్తుంది. ఈ వారంటీ చాలా వరకు 6 నుండి 12 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. వారంటీ వ్యవధి వరకు తయారీ లోపాల కోసం రిపేర్ లేదా రిప్లేస్‌మెంట్ మరియు డ్యూరబుల్ పనిచేయకపోవడం అనేది మ్యానుఫ్యాక్చరర్ వారంటీతో కవర్ చేయబడుతుంది.

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్

వారంటీ వ్యవధి పూర్తయిన తర్వాత ప్రోడక్టును సర్వీసింగ్, రిపేర్ చేయించడం చాలా మందికి సవాలుగా ఉంటుంది. అయితే, పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్‌ను పొందడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌ను ఇప్పటికీ వారంటీతో ఉంచుకోవచ్చు.

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ వారంటీ గడువు ముగిసిన తర్వాత ఒక కస్టమర్ తీసుకోగల అదనపు వారంటీ. పొడిగించబడిన వారంటీలు సాధారణంగా లాంగ్‌టర్మ్ ప్లాన్‌లు, ఇవి 2 నుండి 10 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు మరియు చెల్లుబాటులో ఉంటాయి. అలాగే, పొడిగించబడిన వారంటీతో అందించబడిన కవరేజ్ వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఎఎంసి) కన్నా మరింత సమగ్రమైనది.

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ అనేది రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వంటి మీ నిత్యావసర గృహోపకరణాలలో ఉత్పన్నమయ్యే మెకానికల్ బ్రేక్‌డౌన్స్ కారణంగా తలెత్తే ఏదైనా తయారీ లోపం లేదా పనిచేయకపోవడం వంటి వాటికి రిపేరింగ్ మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చులను కవర్ చేస్తుంది.

ఎక్స్‌టెండెడ్ వారంటీ ఇన్సూరెన్స్‌తో మీ విలువైన డ్యూరబుల్స్ సర్వీసింగ్ ఖర్చు కూడా సంరక్షించబడుతుంది. ఈ వారంటీ ఎక్స్‌టెన్షన్ ప్లాన్ అనేది, మ్యానుఫ్యాక్చరర్ వారంటీ గడువు ముగిసిన తర్వాత, ఊహించని లోపాలు లేదా పేలవమైన పనితీరు ప్రోడక్ట్ నష్టానికి లేదా డ్యామేజీకి కారణమైతే, రిపేరింగ్ మరియు రిప్లేస్‌మెంట్ ఖర్చును కూడా కవర్ చేస్తుంది.

గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు

పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లోని ఇన్సూరెన్స్ మొత్తానికి లోబడి గరిష్ట క్లెయిమ్ చేయవచ్చు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగా, ఎక్స్‌టెండెడ్ వారంటీ కింద కంజ్యూమర్ డ్యూరబుల్స్ కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అనేది, నిర్దిష్ట ప్రోడక్ట్ ఇన్‌వాయిస్ విలువకు సమానంగా ఉంటుంది.

ఇన్సూరెన్స్ చేయబడిన వస్తువు యొక్క వినియోగం అనేది మ్యానుఫ్యాక్చరర్ సూచనలకు అనుగుణంగా ఉండాలని గమనించాలి. సరైన నిర్వహణ లేదా వినియోగం లేకపోవడం వలన దాని రిపేరింగ్ లేదా రిప్లేస్‌మెంట్ కోసం అయ్యే ఖర్చులను ప్లాన్ కవర్ చేయదు.

ఇన్సూరెన్స్ చేయబడిన కన్జ్యూమర్ డ్యూరబుల్ వస్తువుకు నష్టం లేదా డ్యామేజ్ జరిగిన సందర్భంలో, పాలసీదారు ముందుగా అంటే నష్టం లేదా డ్యామేజ్ జరిగిన రోజు నుండి రెండు వారాలలోపు దాని గురించి ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి.

పొడిగించబడిన వారంటీ ప్లాన్‌తో, మీరు ఇప్పుడు మీ గృహోపకరణాలు, ఇంటికి అవసరమయ్యే ఇతర ముఖ్యమైన ఉపకరణాలను ఎక్కువ కాలం పాటు ఉపయోగించవచ్చు, అదేవిధంగా రిపేరింగ్ మరియు రిప్లేస్‌మెంట్ కోసం చెల్లించాలనే ఆందోళనను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం, సందర్శించండి మా పొడిగించబడిన వారంటీ ఇన్సూరెన్స్ పేజీ.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం