Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

మై క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
My Cashless Health Insurance Policy

మీ కోసం రూపొందించబడిన ఒక పర్సనలైజ్డ్ హెల్త్ ప్లాన్

పాన్ కార్డ్ ప్రకారం పేరు ఎంటర్ చేయండి
/health-insurance-plans/individual-health-insurance-plans/buy-online.html ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

మీ అవసరాలకు అనుగుణంగా మీ ప్లాన్‌ను కస్టమైజ్ చేయడానికి సౌకర్యం

గది ప్రాధాన్యత మరియు వెయిటింగ్ పీరియడ్‌ల ఎంపిక

2x ఓపిడి ప్రయోజనం (ప్రీమియంకి రెండు రేట్లు)

ఉచిత వార్షిక నివారణ ఆరోగ్య పరీక్షలు

దేశవ్యాప్తంగా 18400+ నగదురహిత హాస్పిటల్స్

98%* క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

ఇన్-హౌస్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్

ఈ రోజుల్లో మన జీవనశైలి, సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవనవిధానం అనేది ఖచ్చితంగా విలాసవంతమైనది. మనలో చాలా మంది వారి దైనందిన జీవితంలోని అవసరాలను తీర్చుకోవడానికి, జీవనోపాధి కోసం ప్రాణాలను ఫణంగా పెడతారు. అయితే, జీవితం ఊహించలేనిది, ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఏదైనా ఊహించని వైద్య అత్యవసర పరిస్థితి అనేది మీ సేవింగ్స్‌ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు వ్యాధి తీవ్రతరం అయ్యే వరకు వారి ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, అది అత్యవసర హాస్పిటలైజెషన్‌కు దారితీస్తుంది. అలాంటి ఏదైనా పరిస్థితిలో, వైద్య బిల్లులను చెల్లించడం అనేది ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మరియు నివారించడానికి, నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

ఒక నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మరియు నెట్‌వర్క్ హాస్పిటల్ మధ్య నేరుగా హాస్పిటల్ బిల్లులు/ వైద్య ఖర్చులు సెటిల్ చేసే పాలసీ. అనగా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి నగదు రూపంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇటీవలి కాలంలో వైద్య ఖర్చుల్లో పెరుగుదల వలన ఉత్తమ వైద్య సౌకర్యాలను పొందడం అనేది ఒక పీడకలగా మారింది. ఉత్తమ నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీ సామాన్యులకు ఖర్చును గురించి చింతించకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర సంబంధిత సౌకర్యాలను పొందడంలో సహాయపడుతుంది.

కాలక్రమేణా, దాని కోసం డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. అనారోగ్యానికి గురికావడం లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో కుటుంబసభ్యులు ఖర్చులకు నిధులను సమకూర్చలేని సందర్భాలు కూడా ఉంటాయి. నగదురహిత ఇన్సూరెన్స్‌‌లో ఒక ఇన్సూరర్ ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఖర్చులను నేరుగా సెటిల్ చేసే సదుపాయం ఉంటుంది. నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా అటువంటి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, నగదురహిత హాస్పిటలైజేషన్ మరియు చికిత్స ప్రయోజనాన్ని అందించే ప్లాన్‌ను ఎంచుకోండి.

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

భారతదేశంలోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వివిధ ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ భాగస్వామ్య ఆసుపత్రులు నెట్‌వర్క్ ఆసుపత్రులుగా సూచించబడతాయి.

ఇన్సూరెన్స్ కంపెనీ ఒక నెట్‌వర్క్ హాస్పిటల్‌‌ను దాని సామర్థ్యం మరియు అది అందించే వైద్య సేవల గురించి తెలిపే విస్తృతమైన బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ తర్వాత ఎంచుకుంటుంది. టై-అప్‌లు ఎక్కువగా వార్షిక ప్రాతిపదికన ఉంటాయి మరియు ప్రతి సంవత్సరం లేదా రెన్యూవల్ తేదీ ప్రకారం రెన్యూవల్ చేయబడతాయి. కాబట్టి, ఆసుపత్రి మునుపటి ప్రమాణాలను నెరవేర్చకపోతే, రెన్యూవల్ పొడిగించబడకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంచుకునే ఈ ప్రక్రియ ముఖ్యం, ఎందుకంటే ఇది దాని విశ్వసనీయతను చూపుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుతో నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను పంచుకుంటుంది. సేవల నాణ్యత, వివిధ విధానాలు, రేట్లు మొదలైనవి తనిఖీ చేసిన తర్వాత ఇవి ఎంపిక చేయబడతాయి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము 18,400+ నెట్‌వర్క్ ఆసుపత్రులు* మరియు ఒక ఇన్-హౌస్ హెచ్ఎటి బృందం కలిగి ఉన్నాము.

అదే సమయంలో, నగదురహిత సదుపాయాన్ని కేవలం నెట్‌వర్క్ ఆసుపత్రిలో మాత్రమే పొందవచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం. కాబట్టి, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అడ్మిట్ అయితే, ప్లాన్‌ను బట్టి ప్రయోజనాన్ని పొందవచ్చు. టిపిఎ అని కూడా పిలువబడే థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్ కంపెనీ యొక్క ప్రతినిధి మరియు ఫార్మాలిటీలను జాగ్రత్తగా చూసుకోవడానికి బాధ్యత వహిస్తారు. టిపిఎ ఇన్సూరర్ మరియు మీ మధ్య సమన్వయం చేయడానికి బాధ్యత వహించే ఒక మధ్యవర్తి. హెల్త్ ఇన్సూరెన్స్ నగదురహిత క్లెయిమ్‌లు అవాంతరాలు లేకుండా సెటిల్ చేయబడతాయని టిపిఎ నిర్ధారిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములను అంగీకరించడం లేదా తిరస్కరించడంలో టిపిఎ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. 

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటంలోని ప్రాముఖ్యత

మెడికల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటంలోని ప్రాముఖ్యత గతంలో కంటే ఎక్కువగా అర్థం చేసుకోబడుతుంది. మనం మహమ్మారి పరిస్థితులు మరియు వైద్య ద్రవ్యోల్బణ కాలంలో ఉన్నాము, ప్రజలు ఎక్కడో ఒక చోట వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో నగదురహిత మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ఒక గొప్ప వరం. సరైన ప్లాన్ కలిగి ఉండటం వల్ల హెల్త్‌కేర్ సదుపాయానికి ప్రాప్యత పొందుతారు మరియు అత్యవసర ప్రాతిపదికన నగదు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ నగదురహిత ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం అందిస్తుంది. అనగా, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా ఖర్చులను చెల్లిస్తుంది. ఉత్తమ నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి, ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందేలాగా నిర్ధారించుకోండి. ఒక సరైన ప్లాన్‌ను కలిగి ఉండటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది, ఎందుకనగా మీరు నేరుగా ఆసుపత్రికి బిల్లులను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

భారతదేశంలో ఉత్తమ నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న అవసరాలను తీరుస్తుంది, ఇది పాలసీదారులకు అనేక రకాల ఎంపికలను అందిస్తుంది.

  • వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు:

    ✓ సింగిల్-పర్సన్ కవరేజ్ కోసం రూపొందించబడింది.
    ✓ వ్యక్తి కోసం సమగ్ర వైద్య సంరక్షణను నిర్ధారిస్తుంది.

  • ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు:

    ✓ ఒకే పాలసీ క్రింద అనేకమంది కుటుంబ సభ్యులను కవర్ చేస్తుంది.
    ✓ ఇన్సూర్ చేయబడిన సభ్యులందరికీ షేర్ చేయబడిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తుంది.

  • క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్లు:

    ✓ క్యాన్సర్ లేదా గుండె జబ్బు వంటి తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
    ✓ తీవ్రమైన ఆరోగ్య సంఘటనల సమయంలో ఆర్థిక రక్షణను అందిస్తుంది.

  • టాప్-అప్ ప్లాన్లు:

    ✓అదనపు ఆర్థిక మద్దతును అందించడం ద్వారా ప్రస్తుత కవరేజీని పెంచుతుంది.
    ✓ ప్రారంభ ఇన్సూరెన్స్ మొత్తం ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది.

  • సూపర్ టాప్-అప్ ప్లాన్లు:

    ✓ టాప్-అప్ ప్లాన్‌ల ద్వారా అందించబడే దానికి మించి విస్తృతమైన కవరేజీని అందిస్తుంది.
    ✓ అధిక వైద్య ఖర్చుల కోసం మరింత గణనీయమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది.

  • సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం:

    ✓ మీ నిర్దిష్ట హెల్త్‌కేర్ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా తగినంత రక్షణను నిర్ధారించుకోండి.

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడుతుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ వేర్వేరు ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో నగదురహిత ఇన్సూరెన్స్ సదుపాయం కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా, భారతదేశంలోని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, వేర్వేరు ప్లాన్ల కింది విభిన్న కవరేజీలను అందిస్తాయి. ఈ కవరేజీలు ఒక ఇన్సూరర్ నుండి మరొక ఇన్సూరర్‌కు మారవచ్చు. అంతేకాకుండా, నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో భాగంగా దిగువ కొన్ని ప్రామాణిక కవరేజీలు జాబితా చేయబడ్డాయి.
Cover for pre and post-hospitalization expenses for up to 60 and 90 days

60 నుండి 90 రోజుల వరకు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కోసం కవర్

60 నుండి 90 రోజుల వరకు ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కోసం కవర్

In-patient expenses cover

ఇన్-పేషెంట్ ఖర్చుల కవర్

ఇన్-పేషెంట్ ఖర్చుల కవర్

Ambulance service

అంబులెన్స్ సర్వీస్

అంబులెన్స్ సర్వీస్

Daycare treatment expenses

డేకేర్ చికిత్స ఖర్చులు

డేకేర్ చికిత్స ఖర్చులు

Medical check-ups/ physician fees/ doctors consultation fees

వైద్య పరీక్షలు/ డాక్టర్ ఫీజులు/ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు

వైద్య పరీక్షలు/ డాక్టర్ ఫీజులు/ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు

Room rent and boarding expenses cover

గది అద్దె మరియు వసతి ఖర్చుల కవర్

గది అద్దె మరియు వసతి ఖర్చుల కవర్

 

నగదురహిత హాస్పిటలైజేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల పూర్తి జాబితా

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము, మీ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ముందంజలో ఉన్నాము మరియు అనేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందజేస్తాము. ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్స ప్రయోజనాన్ని పొందడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా దిగువ ఇవ్వబడింది:

· ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సక్రమంగా ఫైల్ చేయబడిన మరియు సంతకం చేయబడిన నగదురహిత హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఫారం

· ఖర్చు యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు

· ఒరిజినల్ చెల్లింపు రసీదులు

· ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ డాక్యుమెంట్

· ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు

· ఇన్వాయిస్ కాపీ/ స్టిక్కర్లు/ బార్‌కోడ్ ఇంప్లాంట్స్ అయితే

· డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్

· మీ కస్టమర్‌ను తెలుసుకోండి ఫారం

· పాలసీహోల్డర్/ ప్రపోజర్ ద్వారా పూరించబడి, సంతకం చేయబడిన నెఫ్ట్ ఫారం

గమనిక: డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇన్సూరర్‌తో చెక్ చేయండి

ఒక నగదురహిత క్లెయిమ్ చేయడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

నగదురహిత క్లెయిమ్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇది ఒక కఠినమైన ప్రాసెస్ అని మీరు అనుకుంటున్నారా? సరే, ఇక చింతించకండి. మీరు నగదురహిత క్లెయిమ్ చేయడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సులభమైన చిట్కాలను మేము ఇక్కడ జాబితా చేసాము:

  • సాధ్యమైనంత త్వరగా తెలియజేయండి : అది ఒక ప్లాన్ చేయబడిన లేదా ప్లాన్ చేయబడని హాస్పిటలైజేషన్ అయినా, సాధ్యమైనంత త్వరగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. అలా చేయడం వలన ఇన్సూరర్ పాలసీని సమీక్షించడానికి మరియు క్లెయిమ్ అభ్యర్థనను ఆథరైజ్ చేయడానికి సహాయపడుతుంది. అత్యవసర చికిత్స విషయంలో ఒక మినహాయింపు చేయబడుతుంది.
  • వివరాలను అందుబాటులో ఉంచుకోండి : ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోండి. అత్యవసర హాస్పిటలైజేషన్ విషయంలో, మీరు ఒక ఇన్సూరర్‌ను సంప్రదించవచ్చు మరియు అవాంతరాలు లేని సహాయం పొందవచ్చు.
  • సరైన సమాచారం ఇవ్వండి : ప్రీ-ఆథరైజేషన్ కోసం రోగి యొక్క వైద్య చరిత్ర, ముందు నుండి ఉన్న అనారోగ్య పరిస్థితులు, ఖర్చులు మొదలైనటువంటి ముఖ్యమైన వివరాలు అవసరం. క్లెయిమ్‌లు సులభంగా మరియు సజావుగా ప్రాసెస్ చేయబడటానికి సరైన సమాచారాన్ని అందించడం నిర్ధారించుకోండి.
  • చేర్పులు మరియు మినహాయింపులను తెలుసుకోండి : పాలసీలో చేర్పులు మరియు మినహాయింపులను రెండింటినీ అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ ముఖ్యం. ఇది ఎల్లప్పుడూ అయ్యే ఖర్చులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు మీరు ముందుగానే వాటి కోసం సిద్ధంగా అవ్వచ్చు. ప్లాన్‌తో అప్‌టుడేట్‌గా ఉండటం వలన తర్వాత ఏదైనా గందరగోళం ఏర్పడే అవకాశన్ని నివారిస్తుంది.

 

సరైన నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి చిట్కాలు

మెడిక్లెయిమ్ పాలసీని ఎంచుకునేటప్పుడు విస్తృతమైన నెట్‌వర్క్ ఆసుపత్రులను కలిగిన మరియు నగదురహిత ఆరోగ్య చికిత్స ప్రయోజనాలను అందించే ఒక ఇన్సూరర్‌ను ఎంచుకోండి. సరైన నగదురహిత మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలను మేము క్రింద జాబితా చేసాము:

 

• పరిశోధన

వీటిలో ప్రధాన చిట్కా ఏమిటంటే, విస్తృతమైన పరిశోధన చేయడం మరియు ప్లాన్‌లో అందించబడే ఫీచర్లు, ప్రయోజనాలను సరిపోల్చడం. కొన్ని ఫీచర్లు సాధారణమైనవి మరియు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి కోసం కవర్‌ను అందిస్తాయి. అయితే, మీ అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవాల్సిందిగా ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది. మీరు చివరిగా ఒక ప్లాన్‌ను ఎంచుకోవడానికి ముందు, మీ అవసరాలను విశ్లేషించండి, తదనుగుణంగా తెలివైన నిర్ణయం తీసుకోండి.

 

• పెద్ద సంఖ్యలో నెట్‌వర్క్ ఆసుపత్రులు:

ఒక ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను చూడటాన్ని నిర్ధారించుకోండి. నగదురహిత ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాన్ని ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే పొందవచ్చు. నెట్‌వర్క్ ఆసుపత్రి భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉందని నిర్ధారించుకోండి. కాబట్టి, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళవచ్చు.

 

• విశ్వసనీయత

నగదురహిత మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకునే విషయానికి వస్తే, ఎన్నో ఏళ్లుగా స్థాపించబడిన మరియు మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి. ఒక కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అనేది అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల చెల్లింపు సామర్థ్యం గురించి మీకు స్పష్టతను అందిస్తుంది.

 

• పాలసీ డాక్యుమెంట్‌ను చదవండి:

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవకపోవడం అనేది మనలో చాలామంది చేసే సాధారణ తప్పు. మీరు ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి తుది చెల్లింపు చేయడానికి ముందు, ప్లాన్‌లో అందించబడిన ప్రతి నిబంధన మరియు షరతును అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా కస్టమర్ సపోర్ట్‌ ప్రతినిధులను సంప్రదించవచ్చు. ముందుగా చేసే ఇలాంటి చిన్న పనులు మీకు దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. ప్లాన్‌లో చేర్పులు మరియు మినహాయింపులను అర్థం చేసుకోవడం అనేది, కష్ట సమయాల్లో మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు.

 

• అవసరాలను గుర్తించండి

సరైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఒక తెలివైన మార్గం ఏమిటంటే, విభిన్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను గుర్తించడం. నగదురహిత ప్రయోజనాల పరిమితులను కూడా చూడవలసిందిగా సిఫార్సు చేయడమైనది. ప్రాధాన్యతలను గుర్తించడం మరియు అవసరాలను ఉత్తమంగా నెరవేర్చే ఒకదానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

 

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

 

నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీ గురించి పూర్తి వివరాలు

నేడు మనము అనుసరిస్తున్న జీవనశైలి వలన వివిధ జీవనశైలి వ్యాధులకు గురవుతాము అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్య ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ఒక వైపు వైద్య సదుపాయాలను పొందడం ముఖ్యమే అయినా, నాణేనికి అవతలి వైపు ఏముందో మనం గుర్తించలేము.

అలాటి ఏవైనా సందర్భాలను ఎదుర్కోవడానికి, ఉత్తమ నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం, నగదురహిత క్లెయిమ్‌లు ఊపందుకుంటున్నాయి. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే వ్యక్తులు, నగదురహిత ఆప్షన్లను పొందడాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. భారతదేశంలో నగదురహిత సదుపాయం గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను మేము జాబితా చేసాము:

 

· ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రులలో చికిత్స పొందినట్లయితే మాత్రమే నగదురహిత సదుపాయాన్ని పొందవచ్చు.

· నెట్‌వర్క్ ఆసుపత్రి పాలసీహోల్డర్‌కు లేదా ఇన్సూరర్‌కు పాలసీ స్థితిని మరియు చికిత్సను గురించి వివరిస్తుంది.

· ఇది నగదురహిత సదుపాయమా కాదా అనే దానితో సంబంధం లేకుండా, అన్ని ఆరోగ్య సంబంధిత డాక్యుమెంట్లు, వైద్య బిల్లులను సురక్షితంగా మరియు అందుబాటులో ఉంచుకోండి.

· మీరు ఒక ప్లాన్ పై తుది నిర్ణయం తీసుకునే ముందు, మెడిక్లెయిమ్ నగదురహిత సదుపాయం కోసం ఇన్సూరర్ యొక్క నిబంధనలు, షరతులను ఒకటికి రెండుసార్లు చదవండి.

· ఒకవేళ చికిత్స ఖర్చులు ఇన్సూరెన్స్ మొత్తాన్ని మించితే, మిగిలిన వ్యత్యాసాన్ని ఇన్సూర్ చేయబడిన వ్యక్తి భరించాలి. అలాంటి దృష్టాంతంలో పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదు.

 

నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీని కుటుంబం కోసం కొనుగోలు చేసేటపుడు మీరు తగినంతగా కవర్ చేయబడుతున్నారని నిర్ధారించుకోండి.

 

 

నగదురహిత మరియు రీయంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల మధ్య పోలిక

మనం జీవిస్తున్న ఈ కాలంలో, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. భారతదేశంలో సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్‌లో రెండు రకాల క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఉన్నాయి. ఇవి నగదురహిత మరియు రీయంబర్స్‌మెంట్ సెటిల్‌మెంట్‌లు. 

నగదురహిత చికిత్సకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, డిశ్చార్జ్ సమయంలో ఇన్సూరర్ బిల్లులను చెల్లిస్తారు. రీయంబర్స్‌మెంట్ విషయంలో మెడికల్ బిల్లులు ప్రాథమికంగా వ్యక్తి ద్వారా భరించబడతాయి. తర్వాత, అవసరమైన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఇన్సూర్ చేయబడిన వ్యక్తి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించడం ద్వారా క్లెయిమ్ చేయవచ్చు.

ఈ కింది పట్టికలు వివిధ పారామితుల ఆధారంగా నగదురహిత మరియు రీయంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల మధ్య వ్యత్యాసాన్ని చూపుతాయి: 

 

పారామీటర్లు

నగదురహిత ప్రాసెస్

రీయంబర్స్‌మెంట్ ప్రాసెస్

ఒక వ్యక్తి యొక్క బాధ్యత

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి, వైద్య బిల్లులు లేదా ఖర్చులను తానే స్వయంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా నెట్‌వర్క్ ఆసుపత్రితో బిల్లులను సెటిల్ చేస్తుంది

ప్రారంభంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వైద్య ఖర్చులను భరించాలి. డిశ్చార్జ్ తర్వాత ఆ వ్యక్తి బిల్లులను ఇన్సూరర్‌కు సమర్పించాలి మరియు క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి

నెట్‌వర్క్ హాస్పిటల్

ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద జాబితా చేయబడిన నెట్‌వర్క్ ఆసుపత్రులలో మాత్రమే నగదురహిత చికిత్స ప్రయోజనాన్ని పొందవచ్చు

ఏదైనా నెట్‌వర్క్ లేదా నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రులలో వైద్య చికిత్స పొందవచ్చు

క్లెయిమ్ ప్రాసెస్

ప్లాన్ చేయబడిన లేదా అత్యవసర హాస్పిటలైజేషన్ విషయంలో, ఇన్సూరెన్స్ కంపెనీకి సాధ్యమైనంత త్వరగా విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది

డిశ్చార్జ్ అయిన తర్వాత, ఇన్సూర్ చేసిన వ్యక్తి నేరుగా బిల్లులను చెల్లించాలి మరియు రీయంబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయాలి

క్లెయిమ్ సెటిల్‌మెంట్ టర్న్‌అరౌండ్

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చికిత్స ప్రాసెస్‌లో ఉన్నప్పుడు లేదా ఆసుపత్రిలో ఉన్నప్పుడు, బిల్లులు వెంటనే సెటిల్ చేయబడతాయి

నగదురహిత ప్రయోజనాలతో పోలిస్తే, రీయంబర్స్‌మెంట్ కోసం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది

 

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము ఒక ప్రత్యేకమైన ఫీచర్ అయిన హెల్త్ సిడిసి (డైరెక్ట్ సెటిల్‌మెంట్ ద్వారా క్లెయిమ్)ని కూడా అందిస్తాము. మా కేరింగ్లీ యువర్స్ మొబైల్ యాప్‌ను ఉపయోగించి రూ. 20,000 వరకు గల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తక్షణమే సెటిల్ చేయబడతాయి.

నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీ అనేది, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి/ పాలసీహోల్డర్‌కు అవసరమైన సమయాల్లో ఆర్థిక ఉపశమనం అందించాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించబడింది. ఫ్యామిలీ కోసం నగదురహిత మెడికల్ ఇన్సూరెన్స్ చాలా సహాయంగా ఉంటుంది, ఇన్సూరెన్స్ మొత్తం పూర్తయ్యే వరకు మీరు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వబడుతుంది. 

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తిరస్కరించడానికి కారణాలు

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎందుకు తిరస్కరించవచ్చో అర్థం చేసుకోవడం అనేది పాలసీదారులకు సాధారణ ప్రమాదాలను నివారించడానికి సహాయపడగలదు.

  • తిరస్కరణకు ఒక ప్రధాన కారణం అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో తప్పు లేదా అసంపూర్ణ సమాచారాన్ని అందిస్తోంది. ఇందులో వ్యక్తిగత వివరాలు, వైద్య చరిత్రలో తప్పులు లేదా ముందు నుండి ఉన్న పరిస్థితులను వెల్లడించడంలో విఫలమవడం ఉంటాయి.

  • అదనంగా, ఇన్సూరర్ నెట్‌వర్క్‌లో జాబితా చేయబడని ఆసుపత్రిలో చికిత్స కోరినట్లయితే నగదురహిత క్లెయిములను తిరస్కరించవచ్చు.

  • పాలసీదారులు తమ పాలసీలో పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్‌లకు కూడా కట్టుబడి ఉండాలి, ఎందుకంటే కొన్ని షరతుల కోసం ఈ వ్యవధిలో చేసిన క్లెయిమ్‌లు గౌరవించబడకపోవచ్చు. తిరస్కరణలను నివారించడానికి పాలసీ నిబంధనలు మరియు మినహాయింపులను మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

మెడికల్ ఎమర్జెన్సీ:

మరింత చదవండి

ఒకవేళ, ఆర్ధిక అవసరాల కోసం సరైన ప్లాన్ చేయకపోతే ఏ రకమైన వైద్య అత్యవసర పరిస్థితి కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. నగదురహిత క్లెయిమ్‌లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకనగా కుటుంబసభ్యులు నిధుల సేకరణ కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. హెల్త్ కార్డును నెట్‌వర్క్ ఆసుపత్రిలో చూపించడం ద్వారా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వెంటనే వైద్య చికిత్సను పొందడం ప్రారంభించవచ్చు.

మనశ్శాంతి

మరింత చదవండి

ఒకవేళ ఏదైనా అవసరం ఏర్పడితే, నగదురహిత మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి చాలా సులభంగా ఏదైనా నెట్‌వర్క్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడవచ్చు మరియు అవాంతరాలు-లేకుండా చికిత్స పొందవచ్చు. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి రికవరీపై దృష్టి పెట్టవచ్చు మరియు డబ్బు గురించి చింతించకుండా వేగంగా కోలుకోవచ్చు. 

కవర్ యొక్క శ్రేణి

మరింత చదవండి

ఒక నగదురహిత మెడిక్లెయిమ్ పాలసీ ఒపిడి కవర్, ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు మొదలైన వాటితో సహా విస్తృత శ్రేణి కవరేజ్ ఆప్షన్లను అందిస్తుంది. ఒక ప్లాన్‌లో అందించబడే ఫీచర్లు మరియు ప్రయోజనాల సంబంధిత సమాచారం కోసం, ఎప్పటికప్పుడు ఇన్సూరర్‌ను సంప్రదించాల్సిందిగా సిఫార్సు చేయడమైనది. 

పన్ను ప్రయోజనం

మరింత చదవండి

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చెల్లించబడిన ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రూ. 50,000 వరకు ప్రయోజనం పొందవచ్చు మరియు సీనియర్ సిటిజన్స్ రూ. 50,000 వరకు పొందవచ్చు. 

గమనిక: ప్రస్తుత చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనం అనేది మార్పుకు లోబడి ఉంటుంది. 

అంబులెన్స్ కవర్

మరింత చదవండి

ఆసుపత్రికి లేదా ఆసుపత్రుల మధ్య బదిలీ చేయడానికి అయ్యే ఖర్చుల కోసం కవర్ అందించబడుతుంది. ఇది ఒక నిర్దిష్ట పరిమితి వరకు హాస్పిటల్ అంబులెన్స్ ఖర్చును మరియు అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందించబడిన అంబులెన్స్ ఖర్చులను రెండింటినీ సూచిస్తుంది. 

ఆధునిక చికిత్సా విధానం

మరింత చదవండి

ఆధునిక చికిత్సా పద్దతులు మరియు టెక్నాలజీలోని పురోగతులు, ఇన్సూరెన్స్ మొత్తంలో 50% లేదా రూ. 5 లక్షల వరకు పరిమితం చేయబడతాయి. ఇందులో ఓరల్ కీమోథెరపీ, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు, బ్రాంకియల్ థర్మోప్లాస్టీ మొదలైనవి ఉంటాయి.*

*ఇది ఒక సమగ్ర జాబితా కాదు. మరింత సమాచారం కోసం దయచేసి ప్రోడక్ట్ బ్రోచర్‌ను చదవండి. 

1 ఆఫ్ 1

యుద్ధం: యుద్ధం కారణంగా చికిత్స అవసరమైతే నగదురహిత చికిత్స అందించబడదు. 

    అంతర్గత స్వీయ గాయం: ఒకవేళ, మీరు ఉద్దేశపూర్వకంగా స్వయంగా హాని కలిగించడానికి ప్రయత్నించినట్లయితే, దానికి చికిత్స చేయడానికి అయ్యే ఖర్చులు కూడా కవర్ చేయబడవు. 

దంత చికిత్స: క్యాన్సర్ లేదా తీవ్రమైన బాధాకరమైన గాయం కోసం అవసరమైతే తప్ప సమగ్రమైన చికిత్స కోసం అయ్యే ఖర్చులు కవర్ చేయబడవు. 

ఎక్స్‌టర్నల్ డివైస్లు: డెంచర్లు, హియరింగ్ ఎయిడ్స్, కాంటాక్ట్ లెన్సులు, క్రచ్‌లు మొదలైన వాటిని కలిగి ఉండే ఏదైనా ఖర్చు నగదురహిత మెడికల్ పాలసీ నుండి కూడా మినహాయించబడుతుంది. 

ప్లాస్టిక్ సర్జరీ: ఏదైనా కాలిన లేదా ప్రమాదం కారణంగా కలిగిన శారీరక గాయం కోసం చేసే చికిత్స లేదా క్యాన్సర్ చికిత్సలో భాగంగా అవసరమైతే తప్ప, ఏదైనా కాస్మెటిక్ సర్జరీ కవర్ చేయబడదు. 

1 ఆఫ్ 1

నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

1. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ కింద కోవిడ్-19 కవర్ చేయబడుతుందా?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లోని రీయంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను నిబంధనలు మరియు షరతుల ఆధారంగా త్వరితగతిన పరిష్కరించాలని IRDAI, ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. నగదురహిత చికిత్సకు ప్రీఆథరైజేషన్ మంజూరు మరియు ఇన్సూర్ చేయబడిన రోగి అంతిమ డిశ్చార్జ్, ఈ రెండింటి కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఒక టర్న్‌అరౌండ్ సమయాన్ని నిర్ణయించింది. ఏదైనా విషయంలో ఇన్సూరర్‌ను సంప్రదించవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది. 

2. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశం ఉందా?

అవును, ఈ క్రింది పరిస్థితులలో నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు:

· ఒకవేళ వైద్య పరిస్థితి/ చికిత్స ప్లాన్ క్రింద కవర్ చేయబడకపోతే.

· ఇన్సూరెన్స్ కంపెనీతో ఎంపానెల్ చేయబడని నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లయితే.

· నెట్‌వర్క్ హాస్పిటల్ అందించిన సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడు లేదా పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పుడు.

· ఒకవేళ ప్రీ-ఆథరైజేషన్ ఫారం సకాలంలో పంపబడకపోతే. 

3. నగదురహిత మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాలపరిమితి ఏమిటి?

నగదురహిత మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ వ్యవధి, ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు భిన్నంగా ఉండవచ్చు. కావున, మీరు ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలని మరియు పాలసీ సంబంధిత అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించడమైనది. 

4. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీలో ప్రతి సంవత్సరం ఎన్ని క్లెయిమ్‌లు అనుమతించబడతాయి?

ఇన్సూరెన్స్ మొత్తానికి లోబడి పాలసీ వ్యవధిలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అనేకసార్లు క్లెయిమ్ చేయవచ్చు. అందువల్ల, ఒక ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు అధిక ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవాలని మరియు సురక్షితంగా ఉండాలని సిఫార్సు చేయడమైనది. 

5. రీయంబర్స్‌మెంట్ ప్రాసెస్ కంటే నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ మెరుగైనదా?

రీయంబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్‌తో పోలిస్తే నగదురహిత క్లెయిమ్ ప్రాసెస్ ఎల్లప్పుడూ మెరుగైనది. నగదురహిత క్లెయిమ్ ప్రాసెస్ సులభమైనది, సౌకర్యవంతమైనది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది. హాస్పిటలైజేషన్ లేదా వైద్య చికిత్సకు దారితీసే ఏదైనా పరిస్థితి అనేది ఇన్సూర్ చేయబడిన వారి పైనే కాకుండా వారి పై ఆధారపడిన వ్యక్తుల పై కూడా ప్రభావం చూపుతుంది. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా రికవరీ పై దృష్టి పెట్టగలిగే సౌలభ్యాన్ని కూడా నగదురహిత ప్రయోజనం అందిస్తుంది. 

6. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కింద క్లెయిమ్ ఫైల్ చేయడానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా?

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందినప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీలు 30-రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను అందిస్తాయి. అది పాలసీ ప్రారంభ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అంటే, ఈ వ్యవధిలో యాక్సిడెంటల్ కేసుల మినహా ఎలాంటి క్లెయిములు అంగీకరించబడవు. అయితే, వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక ఇన్సూరర్ నుండి మరొక ఇన్సూరర్‌కు మరియు వైద్య పరిస్థితి/ అనారోగ్యానికి బట్టి వేరుగా ఉండవచ్చని గమనించాలి. రెన్యూవల్ కింద తదుపరి ప్లాన్ కోసం వెయిటింగ్ పీరియడ్ వర్తించదు.

7. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయడానికి అనుసరించాల్సిన విధానం ఏమిటి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, నగదురహిత చికిత్స కోసం అప్లై చేసే విధానం చాలా సులభం. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందడానికి దశలు కింద ఇవ్వబడ్డాయి:

1. వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయండి.

2. చికిత్స తీసుకోవాల్సిన నెట్‌వర్క్ ఆసుపత్రిని సందర్శించండి

3. నగదురహిత చికిత్స కోసం, నెట్‌వర్క్ ఆసుపత్రిలోని థర్డ్ పార్ట్ అడ్మినిస్ట్రేటర్ డెస్క్, ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తుంది.

మా వద్ద మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఆసుపత్రి అన్ని వివరాలను ధృవీకరిస్తుంది మరియు సక్రమంగా పూరించబడిన ప్రీ-ఆథరైజేషన్ ఫారం పంపుతుంది. మేము పాలసీ ప్రయోజనాలతో అన్ని వివరాలను ధృవీకరిస్తాము. మేము దాదాపుగా ఒక్క రోజులో మా నిర్ణయాన్ని తెలియజేస్తాము. నగదురహిత క్లెయిమ్ ఆమోదించబడిన 60 నిమిషాల్లో హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మొదటి ప్రతిస్పందన పంపబడుతుంది. నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స ఖర్చులు వేగంగా సెటిల్ చేయబడతాయి.

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

8. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి?

విభిన్న అంశాలు నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత విస్తృతంగా ఉంటే, ప్రీమియం కూడా అంత ఎక్కువగా ఉంటుందని గమనించగలరు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నేరుగా ప్రభావితం చేసే కొన్ని అంశాలు లింగం, వయస్సు, పొగాకు వినియోగం, జీవనశైలి అలవాట్లు, ముందు నుండి ఉన్న వ్యాధి, బాడీ మాస్ ఇండెక్స్ మరియు మొదలైనవి. 

9. నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద 'ఫ్రీ-లుక్ పీరియడ్' అంటే ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయంలో పాలసీహోల్డర్, పేర్కొన్న సమయంలో ఫ్రీ లుక్ వ్యవధి ప్రయోజనం పై సులభంగా ప్రతిస్పందించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్‌ను అందిస్తాయి. ఈ అవధి సమయంలో, ప్లాన్ తన అవసరాలను తీరుస్తుందో లేదో అనే దానిపై పాలసీహోల్డర్ అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకవేళ ప్లాన్ తన అవసరాలను తీర్చలేదని పాలసీహోల్డర్ భావిస్తే, అతను 15 రోజుల్లోపు పాలసీని రద్దు చేయవచ్చు. 15 రోజుల్లోపు ప్లాన్ రద్దు చేయబడితే ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండవు. అయితే, వ్యక్తి తుది నిర్ణయం తీసుకోవడానికి పట్టిన రోజుల కోసం ప్రీమియం వసూలు చేయబడుతుంది.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి