రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
హెల్త్ ఇన్సూరెన్స్, దానికి సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే, వీటిని విస్మరించడం వలన ఏదైనా ప్రయోజనాన్ని కోల్పోవచ్చు. స్వచ్ఛంద మినహాయింపు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం, ఇది క్లెయిమ్ సెటిల్‌మెంట్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
స్వచ్ఛంద మినహాయింపు అంటే ఏమిటి?
స్వచ్ఛంద మినహాయింపును అదనపు మొత్తంగా సూచిస్తారు, ఇది క్లెయిమ్‌లో భాగంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అమల్లోకి రావడానికి ముందు, మీరు స్వయంగా చెల్లించిన మొత్తాన్ని సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే, స్వచ్ఛంద మినహాయింపును మీరే (బీమా చేసినవారు) భరించాల్సి ఉంటుంది, మిగిలిన క్లెయిమ్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొవైడర్ చూసుకుంటారు.
ఉదాహరణకు
మీకు హామీ ఇవ్వబడిన మొత్తం రూ. 5 లక్షలు అయితే, స్వచ్ఛంద మినహాయింపు రూ. 1 లక్షగా నిర్ణయించబడుతుంది.
సందర్భం#1: మీరు రూ. 85,000 క్లెయిమ్‌ను ఫైల్ చేస్తారు. ఈ సందర్భంలో, క్లెయిమ్ విలువను పరిగణనలోకి తీసుకున్నపుడు అది స్వచ్ఛంద మినహాయింపు పరిమితిని మించదు కాబట్టి, ఆ పూర్తి మొత్తాన్ని మీరే భరించాలి.
సందర్భం#2: మీరు రూ. 2 లక్షల విలువగల క్లెయిమ్ ఫైల్ చేస్తారు. ఈ సందర్భంలో మీరు రూ. 1 లక్షను (స్వచ్చందంగా మినహాయించదగినది అని పరిగణనలోకి తీసుకుంటే) భరిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన రూ. 1 లక్షను భరిస్తుంది.
స్వచ్ఛంద మినహాయింపు ప్రాధాన్యత ఏంటి?
ఇన్సూరెన్స్ కంపెనీలు స్వచ్ఛంద మినహాయింపులను తక్కువగా మరియు తరచుగా చేసే క్లెయిమ్‌ల నుండి సంభావ్య రక్షణగా సెట్ చేస్తాయి. దీని వెనుకన ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు నిర్దిష్ట క్లెయిమ్ మొత్తంలో కొంత భాగాన్ని భరించవలసి ఉంటుందని మీకు తెలిస్తే, మీరు చిన్న చిన్న అనవసరమైన వాటికి క్లెయిమ్‌లను చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే, ఫైల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గిస్తుంది, తద్వారా మోసాలు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు కూడా తగ్గుతాయి.
స్వచ్ఛంద మినహాయింపుల ప్రయోజనాలు
✓ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద మినహాయింపులు, పాలసీ ప్రీమియంను తగ్గించడంలో సహాయపడతాయి
✓ మినహాయింపులు అనేవి అప్రధానమైన, అప్రయోజన క్లెయిమ్‌లను ఫైల్ చేయడం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేస్తాయి. అది, సంచిత బోనస్‌లను సంపాదించడంలో మీ అర్హతను నేరుగా ప్రభావితం చేస్తుంది (మీరు వరుస పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌ను ఫైల్ చేయనట్లయితే).
పెద్ద మొత్తంలోని స్వచ్ఛంద మినహాయింపు వలన కలిగే ఏకైక ప్రతికూలత ఏమిటంటే, అది మీ వద్ద తగిన ఆర్థిక వనరులు లేకపోయినా, మీ పొదుపును హరించివేస్తుంది, వైద్య ఖర్చుల కోసం చెల్లించాల్సి వస్తుంది.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి