Loader
Loader

ఇంగ్లాండ్

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద అవయవ దాత ఖర్చులు

అవయవ దాత ఖర్చులు

కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో అవయవ దాతకు అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.

అత్యంత తీవ్రమైన అనారోగ్య సందర్భాల్లో వ్యక్తి శరీరం నుండి దెబ్బతిన్న లేదా పూర్తిగా పనిచేయని అవయవాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది, లేకపోతే అది ప్రాణాంతకంగా మారవచ్చు. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా అలాంటి వైద్య విధానాన్ని కవర్ చేస్తుంది. అయితే, మన హెల్త్ ప్లాన్‌లో అవయవ దాతకు అయ్యే మెడికల్ ఖర్చు ఎంత మేరకు కవర్ చేయబడుతుందోనని తెలుసుకోవడం తరచుగా మరచిపోతాము.

అయితే, అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అవయవ దాతకు అయ్యే ఖర్చును కవర్ చేయవు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

సాధారణంగా అవయవ దాతకు అయ్యే వైద్య ఖర్చులు ఈవిధంగా ఉంటాయి -

1)      కంపాటిబిలిటీ టెస్ట్: దాత యొక్క అవయవం గ్రహీత యొక్క శరీర వ్యవస్థ అనుకూలత కోసం పరీక్షించబడుతుంది.

2)      హాస్పిటలైజేషన్ ముందు ఖర్చులు: దాత అవయవం అనుకూలంగా ఉన్నట్లు గుర్తించబడినట్లయితే, అతను/ ఆమె సాధారణంగా హాస్పిటల్‌లో చేరడానికి ముందు నిర్దుష్టమైన ఔషధాలు మరియు చికిత్సను తీసుకుంటారు.

3)      హాస్పిటలైజేషన్ ఖర్చులు: హాస్పిటలైజేషన్ ఖర్చులో గది అద్దె, నర్స్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు ఉంటాయి.

4)      అవయవ మార్పిడి సర్జరీ: సర్జన్ ఫీజులు మరియు అవయవం సేకరణ కోసం ప్రక్రియ ఖర్చులు కవర్ చేయబడతాయి.

5)      సర్జరీ తర్వాత సంరక్షణ మరియు రికవరీ: ఒకరి శరీరం నుండి ఒక అవయవాన్ని సర్జరీ ద్వారా తొలగించినప్పుడు సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అందువలన, దాత ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. పూర్తిగా కోలుకోవడానికి అతనికి/ ఆమెకు శస్త్రచికిత్స అనంతర చికిత్స కూడా అవసరం కావచ్చు.

6)      హాస్పిటలైజేషన్ తర్వాత ఖర్చులు: దాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఔషధాలను కొనసాగించవలసిన పరిస్థితి ఉండవచ్చు. దాతకు తరచుగా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.

దాతకు కవరేజీని అందించే అవయవ గ్రహీత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, నిబంధనలు మరియు షరతులలో పేర్కొన్న మేరకు మాత్రమే దాత సర్జరీ ఖర్చులను కవర్ చేస్తాయి.

అందువలన, మీకు ఎప్పుడైనా అవయవ దాత అవసరం తలెత్తవచ్చు, కావున పాలసీలో అవయవ దాతకు సంబంధించిన పరిమితులను, పరిధిని చెక్ చేయడం చాలా ముఖ్యం.

తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • Select
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం