రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
అంగీకరించిన విలువ ప్రాతిపదికన అనేది హోమ్స్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిబంధన. ఇన్సూరెన్స్ పాలసీల ముఖ్యోద్దేశ్యం ఇన్సూర్ చేసిన వ్యక్తికి ద్రవ్య నష్టాల నుండి నష్టపరిహారాన్ని అందించడం. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందడంతో పాలసీదారు అతను/ ఆమె ప్రమాదానికి ముందు ఉన్న ఆర్థిక స్థితిని యథాతథంగా మేనేజ్ చేయగలరు.
అన్ని సంభావ్యతలతో మీ ఇల్లు మీకు అత్యంత ప్రధానమైన, విలువైన ఆస్తి. ఒక విపత్కరమైన ప్రకృతి వైపరీత్యం మీ ఇంటిని నివసించడానికి వీలు లేని స్థితిలోకి మార్చగలదు. మరొక సందర్భంలో దొంగతనం లేదా ఇంటిని బద్దలు కొట్టడం వంటి కారణాల వలన మీ ఆస్తికి పెద్ద నష్టం జరగవచ్చు. ఒక హోమ్ ఇన్సూరెన్స్‌తో మీరు అలాంటి ఆర్థిక పరమైన నష్టాల నుండి సురక్షితం చేయబడతారు.
హోమ్ ఇన్సూరెన్స్ నిబంధనలు
హోమ్ ఇన్సూరెన్స్ కింద అందించబడే కవరేజ్ అమౌంట్ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. సాధారణంగా, హోమ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన కవరేజ్ పరిమితి అనేది కోఇన్సూరెన్స్ వంటి చేరికలు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
కోఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ చేసిన మొత్తం నష్టాన్ని పూడ్చనటువంటి సమయంలో ఇన్సూర్ చేయబడిన గృహయజమాని క్లెయిమ్ కోసం చెల్లించాల్సిన అమౌంట్ మొత్తాన్ని సూచిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ చేయబడిన ఆస్తి విలువలోని శాతం మొత్తాన్ని సూచిస్తుంది. పాలసీదారులు తగిన కవరేజీని కొనుగోలు చేసేందుకు కోఇన్సూరెన్స్ నిబంధన పొందుపరచబడింది. ఒకవేళ, పాలసీదారు అతని/ ఆమె ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తే, కోఇన్సూరెన్స్ నిబంధనను అనుసరించి అతను/ ఆమె నష్టంలో కొంత భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
అంగీకరించిన విలువ ప్రాతిపదికన
అంగీకరించిన విలువ ప్రతిపాదన అనేది మరొక హోమ్ ఇన్సూరెన్స్ నిబంధన, ఇది కోఇన్సూరెన్స్ నిబంధన సాధ్యతను నిలిపివేస్తుంది. ఈ నిబంధన ప్రకారం, పాలసీ వ్యవధి ప్రారంభంలో కవరేజ్ క్లెయిమ్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి మరియు ఇన్సూరర్ సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించేవిధంగా ఒప్పందం కుదుర్చుకుంటారు.
అంగీకరించిన విలువ అనేది ఇన్సూరెన్స్ చేయబడిన ఆస్తి యొక్క విక్రయించదగిన విలువపై ఆధారపడి ఉంటుంది. విక్రయించదగిన విలువ మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చు ఈ రెండు వేర్వేరు అంశాలు అని గుర్తుంచుకోండి. ఇచ్చిన పాయింట్ వద్ద రీప్లేస్‌మెంట్ ఖర్చు నుండి డిప్రిసియేషన్‌ను తీసివేయడం ద్వారా విక్రయించదగిన విలువ లెక్కించబడుతుంది.
అంగీకరించిన విలువ నిబంధనను చేర్చడానికి, పాలసీదారు ఆస్తి విలువల స్టేట్‌మెంట్‌పై సంతకం చేసి దానిని ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. ఆస్తి విలువ ఆధారంగా ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి, ఇన్సూరెన్స్ సంస్థ ఇద్దరూ అంగీకరించిన కవరేజ్ అమౌంట్‌ను, ఇన్సూర్ చేసిన వ్యక్తి ఎప్పుడూ మార్చలేరు లేదా దానిపై ఎలాంటి వివాదాన్ని సృష్టించలేరు.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి