రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేవి ప్రత్యేకించి వయో వృద్ధులకు ప్రయాణాన్ని సులభతరం మరియు సురక్షితం చేయడానికి రూపొందించబడ్డాయి.
మీరు ప్రయాణిస్తున్న సమయంలో మీ జీవితంలోని అత్యంత ఆకర్షణీయ అనుభవాలు మీకు లభించగలవు కానీ, ప్రత్యేకించి వయో వృద్ధుల విషయంలో ఇది అనేక రకాల రిస్కులు మరియు ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది. వీటిలో ప్రాథమికంగా వయస్సు సంబంధిత అనారోగ్యాలే కాకుండా, సాధారణ ప్రయాణ అత్యవసర పరిస్థితులు కూడా కవర్ చేయబడుతాయి.
కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, వీటి వలన బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందించే సీనియర్ సిటిజన్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అవి ఇలా ఉన్నాయి:
విదేశంలో ఎదురయ్యే ఒక అత్యవసర పరిస్థితి అనేది మిమ్మల్ని తక్షణం వెనక్కు తీసుకురావాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. ఉదాహరణకు, ప్రకృతి వైపరీత్యం లేదా ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితి వలన మీరు మీ ప్రయాణాన్ని రద్దు చేసుకుని తక్షణం స్వదేశం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇలాంటి పరిస్థితులలో అక్కరకు రాగలదు. ఎందుకంటే, ఇది మీ అత్యవసర తరలింపు కోసం అవసరమైన ఖర్చులను కవర్ చేయడమే కాకుండా, ప్రాసెస్‍ను వేగవంతం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది.
ఈ పాలసీలనేవి వృద్ధులకు అదివరకే ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ అందిస్తాయి. అదివరకే ఉన్న ఏదైనా అనారోగ్యం అనేది ట్రిప్ సమయంలో అకస్మాత్తుగా తిరగబెట్టిన సందర్భంలో, ఆర్థిక అవసరాల గురించి మీరు ఆందోళన చెందే పరిస్థితి లేకుండా మీరు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు పొందడానికి మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ మీకు సహాయపడుతుంది.
వ్యక్తి మరణించడం లేదా వైకల్యానికి గురికావడానికి దారితీయగల రీతిలో ట్రిప్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆ పాలసీదారునికి లేదా వారి నామినీకి ముందుగా నిర్ణయించబడిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ట్రిప్ సమయంలో మరణించిన పక్షంలో, ఆ వ్యక్తికి నిర్ణీత సమయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించలేనప్పుడు, అతను/ఆమె అస్తికలను స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను కూడా ఇది కవర్ చేయగలదు.
పైన పేర్కొన్న ప్రయోజనాలు మాత్రమే కాకుండా, ఒక సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్యాగేజీ కోల్పోవడం లేదా పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం, ట్రిప్ రద్దు కావడం మొదలైన సాధారణ ప్రతికూలతలను కూడా కవర్ చేస్తుంది. అయితే, ఒక సాధారణ పాలసీ లాగా కాకుండా, సీనియర్ సిటిజన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వ్యక్తులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు వేరుగా ఉండవచ్చు.
తెలుసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వైద్య అత్యవసర పరిస్థితులు, అత్యవసర తరలింపులు, ప్రమాదం కారణంగా మరణం లేదా గాయం, బ్యాగేజ్ కోల్పోవడం మరియు ట్రిప్ రద్దు అవ్వడం సహా అనేక రకాల ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది. ప్రయాణ సమయంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఇది సమగ్ర రక్షణను నిర్ధారిస్తుంది.
అవును, సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితులు కవర్ చేయబడతాయి. వృద్ధుడైన ఒక ప్రయాణికుడు ట్రిప్ సమయంలో ముందు నుండి ఉన్న అనారోగ్యానికి ఆకస్మికంగా గురి అయితే, అవసరమైన ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం గరిష్ట ట్రిప్ వ్యవధి ఇన్సూరర్ ప్రకారం మారుతుంది. సాధారణంగా, పాలసీ కింద కవర్ చేయబడిన రోజుల సంఖ్యను ఇన్సూరర్లు పరిమితం చేస్తారు, ఇది ప్రయాణం అంతటా తగినంత కవరేజీని నిర్ధారిస్తుంది.
అవును, అంతర్జాతీయ ప్రయాణాల కోసం సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. ఇది తమ స్వదేశానికి వెలుపల గమ్యస్థానాలను అన్వేషించే వృద్ధులకు రక్షణ మరియు మనశ్శాంతిని అందిస్తుంది.
నిర్దిష్ట వైద్య పరిస్థితులు లేదా కార్యకలాపాల కోసం కవరేజ్ పరిమితులు వంటి మినహాయింపులు మరియు పరిమితులు సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలకు వర్తించవచ్చు. మినహాయించబడినది ఏమిటో అర్థం చేసుకోవడానికి పాలసీ వివరాలను సమీక్షించడం ముఖ్యం.
సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం అందుబాటులో ఉన్న గరిష్ట కవరేజ్ మొత్తం ఇన్సూరర్ మరియు ఎంచుకున్న ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఆర్థిక రక్షణను అందించే కవరేజ్ మొత్తాలు మారవచ్చు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి