Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సమగ్ర ఇన్సూరెన్స్

Comprehensive Insurance

సమగ్ర ఇన్సూరెన్స్

డ్రైవింగ్ గొప్ప స్వేచ్ఛానుభూతిని అందిస్తుంది. అదే సమయంలో వాహనం మీ నియంత్రణలో ఉన్నందున ఇతరులకు లేదా వారి ఆస్తికి హాని లేదా నష్టం జరగకుండా మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే, వారి చుట్టూ ఉన్న ఇతర వాహనాల గురించి తెలుసుకోవడం వివేకం. వీటితో పాటు సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా నడపడం కూడా చాలా ముఖ్యం. 

భారతదేశంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక చట్టపరమైన ఆదేశం. ప్రతికూలతలు ఎలాంటి ముందస్తు నోటీసుతో రావు. మీరు ఒక వాహన యజమాని అయితే, సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. సమగ్రమైన అవగాహనను తెలుసుకుందాం మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.

Scroll

సమగ్ర ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ప్రమాదవశాత్తు వాహనానికి నష్టం జరిగిన సందర్భంలో ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఏదైనా ఆస్తి నష్టం లేదా ఏదైనా శారీరక గాయం జరిగిన సమయంలో థర్డ్ పార్టీకి కూడా కవరేజ్ అందించబడుతుంది.

సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన స్వంత వాహనానికి జరిగిన నష్టం మాత్రమే కాకుండా, ప్రమాదంలో పాల్గొన్న థర్డ్ పార్టీ బాధ్యతలకు కూడా భద్రతను పొందవచ్చు. మరణం సందర్భంలో ఇన్సూరెన్స్ సంస్థ నష్టపరిహారంగా క్లెయిమ్‌ను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రమాదం కారణంగా మరణం సంభవించిన సందర్భంలో, నామినీకి మోటార్ యాక్సిడెంట్స్ కేస్ ట్రిబ్యునల్ (ఎంఎసిటి) ద్వారా నష్టపరిహారం చెల్లించబడుతుంది.

 

సమగ్ర ఇన్సూరెన్స్‌లో ఏమి కవర్ చేయబడుతుంది?


భారతదేశంలో, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అయితే, సమగ్ర ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి కాదు. అయితే, అవసరానికి అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోవడం వాహన యజమానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, తగిన ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవాలని మరియు ఆర్థికంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సిఫార్సు చేయబడుతుంది.

రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనం ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు, నష్టం జరిగే సంభావ్యత ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని సార్లు జరిగిన నష్టాల కోసం రిపేర్ ఖర్చులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు తద్వారా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. అందువల్ల, సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు

సమగ్ర కవరేజీకి సంబంధించిన పూర్తి ఇక్కడ వివరాలు ఇవ్వబడ్డాయి:

  • థర్డ్-పార్టీ కవర్

    సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ బాధ్యతను కూడా కవర్ చేస్తుందని గమనించడం ముఖ్యం. థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉండటం అనేది థర్డ్ పార్టీకి లేదా వారి ఆస్తికి జరిగిన నష్టాల నుండి రక్షణను అందిస్తుంది

  • ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన నష్టం

    ప్రకృతి వైపరీత్యం కారణంగా ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగితే దాని కోసం కవర్ అందించబడుతుంది. విపత్తుల్లో సాధారణంగా తుఫానులు, వరదలు మొదలైనవి ఉంటాయి. కవర్ అనేది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు

  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్

    ఒక వ్యక్తి శాశ్వత వైకల్యం లేదా మరణం సందర్భంలో వాహన యజమాని లేదా డ్రైవర్, థర్డ్ పార్టీకి పరిహారం అందిస్తారు

  • యాడ్-ఆన్ కవర్లు

    బేస్ పాలసీకి యాడ్-ఆన్‌లను చేర్చడం ద్వారా ఇప్పటికే ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ భద్రతను కూడా మెరుగుపరచుకోవచ్చు. మీరు కన్జ్యూమబుల్స్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ మొదలైన యాడ్-ఆన్ ప్రయోజనాలను చేర్చడం గురించి ఆలోచించవచ్చు.

మీ ఎలాంటి వాహనాన్ని కలిగి ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా, ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం మంచిది. తగినంతగా కవర్ చేయబడటం వలన మీరు ప్రశాంతంగా ఉండవచ్చు మరియు ఆర్థిక బాధ్యతల గురించి నిశ్చింతగా ఉండవచ్చు.

*ఇది ఒక సమగ్ర జాబితా కాదు. దయచేసి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి?

ఏవైనా ఆర్థిక బాధ్యతలను దూరంగా ఉంచడానికి, ఇన్సూరెన్స్‌లో సమగ్ర కవరేజీని ఎంచుకోవలసిందిగా సిఫార్సు చేయడమైనది. దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి ఒకసారి దిగువన చూడండి:

  • ఓన్ డ్యామేజ్ కవర్

     సమగ్ర కవర్ కలిగి ఉండటం అనేది ఒక అవాంఛనీయ సంఘటన కారణంగా తలెత్తే వాహనం యొక్క స్వంత నష్టం పూర్తిగా కవర్ చేయబడుతుందని సూచించబడుతుంది. ఉదాహరణకు, ఒక సందర్భంలో మీరు కారుతో చెట్టును ఢీకొడితే, వాహనానికి జరిగిన నష్టాలకు మరమ్మత్తులు చేయాల్సి ఉంటుంది. సమగ్ర కవర్‌ను కలిగి ఉండటం వలన మీరు ఏ సమయంలోనైనా ఆర్థికంగా బలంగా ఉంటారు.

  • సౌలభ్యం

    మీరు ఆన్‌లైన్‌లో చాలా సులభంగా సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు. బజాజ్ అలియంజ్ జిఐసి నుండి మోటార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం సులభం మరియు వేగవంతమైనది. మీ అవసరాలను తీర్చే ఒక ప్లాన్‌ను ఎంచుకోండి. ఒకసారి కొనుగోలు పూర్తయిన తర్వాత, పాలసీ సంబంధిత డాక్యుమెంట్లు మెయిల్ ద్వారా మీతో పంచుకోబడతాయి

  • నెట్‌వర్క్ గ్యారేజీలు

    నెట్‌వర్క్ గ్యారేజీలు అనేవి సర్వీస్ స్టేషన్లు, ఇందులో మీరు సేవలు పొందవచ్చు మరియు వాహనం కోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. రిపేరింగ్ ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా సెటిల్ చేస్తుంది. మా వద్ద భారతదేశ వ్యాప్తంగా 6500+ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. 

  • క్లెయిమ్ సెటిల్‌మెంట్

    మేము పరిశ్రమలోనే అత్యుత్తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉన్నాము, అది 98%*. అదే సమయంలో మేము 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందజేస్తాము. మీరు మా మోటార్ ఆన్-ది-స్పాట్ సర్వీస్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు, ఇది కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఫైల్ చేసే మరియు సెటిల్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు మా కేరింగ్లీ యువర్స్ మొబైల్ యాప్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో* రూ. 20,000 లోపు మరియు రూ. 30,000 మొత్తం వరకు కార్ల కోసం క్లెయిమ్ సెటిల్ చేయబడుతుంది.

సమగ్ర ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడని అంశాలు ఏవి?


ఇప్పుడు, సమగ్ర కవరేజ్ కింద మినహాయించబడినది అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం:

  • అరుగుదల మరియు తరుగుదల

    సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా వాహనం వయస్సు కారణంగా పర్యవసాన నష్టం జరిగినప్పుడు అది కవర్ చేయబడదు.

  • మద్యం ప్రభావం

    ఒక దుర్ఘటన జరిగినప్పుడు, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని లేదా మరేదైనా మత్తు ప్రభావంలో ఉన్నట్లు గుర్తించబడితే, ఎలాంటి క్లెయిమ్ అందించబడదు. డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత మరియు సురక్షితమైన డ్రైవింగ్ తప్పనిసరి.

  • చట్టవిరుద్ధమైన డ్రైవింగ్

    మీరు భారతదేశంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు కనుగొనబడితే, సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ రద్దు చేయబడుతుంది.

  • యుద్ధం లాంటి పరిస్థితులు

    అణు దాడులు, తిరుగుబాటు మొదలైన యుద్ధ-వంటి పరిస్థితుల కారణంగా ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి నష్టం లేదా డ్యామేజ్ జరిగినట్లయితే, అది నియంత్రించలేనిది.

*ఇది ఒక సమగ్ర జాబితా కాదు. దయచేసి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

 

సమగ్ర మరియు థర్డ్ పార్టీ పాలసీల మధ్య గల తేడా ఏమిటి?

 

ఈ కింది పట్టిక సమగ్ర కవరేజ్ మరియు థర్డ్-పార్టీ పాలసీ మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది:

 

పారామీటర్లు సమగ్ర ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్

కవరేజ్

ఇది ఇన్సూర్ చేయబడిన వాహనానికి కవరేజ్ అందిస్తుంది మరియు ఏదైనా శారీరక గాయం లేదా ఆస్తి నష్టం నుండి థర్డ్ పార్టీ బాధ్యతను కవర్ చేస్తుంది

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం లేదా శారీరక గాయం కారణంగా తలెత్తే ఏదైనా బాధ్యతలకు మాత్రమే కవర్ అందించబడుతుంది

ప్రీమియం

ఇక్కడ ప్రీమియం అనేది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారుతుంది. వాహనం మేక్ మరియు మోడల్, వయస్సు, భౌగోళిక ప్రదేశం, యాడ్-ఆన్‌లు మొదలైనటువంటి వివిధ అంశాలు మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి.

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది IRDAI ద్వారా నిర్ణయించబడుతుంది

సిఎన్‌జి కిట్ కవర్

దీనిని యాడ్ ఆన్‌గా పొందవచ్చు

ఇది అందుబాటులో లేదు

డిప్రిసియేషన్ మరియు ఇంజిన్ ప్రొటెక్షన్

ఈ రెండూ కూడా సమగ్ర ఆటో కవరేజీని కలిగి ఉన్నాయి

ఇది మినహాయించబడింది

*ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు. ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

సమగ్ర ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

పాత కారు కోసం నాకు సమగ్ర ఇన్సూరెన్స్ అవసరమా?

కాలం గడిచే కొద్దీ కారు విలువ తగ్గుతుంది. కాబట్టి, కారు కాలం చెల్లించబడిందని మీరు భావిస్తే, సమగ్ర కవరేజీని ఎంచుకోకపోవడం ఉత్తమం. అయితే, అనిశ్చిత పరిస్థితులు ఏ సమయంలోనైనా సంభవించవచ్చు కాబట్టి, ఇన్సూరెన్స్ లేకుండా ఉండటం సరైన నిర్ణయం కాదు. అంతేకాకుండా, పాత వాహనం ఒక యాక్సిడెంట్ లేదా డ్యామేజీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా థర్డ్-పార్టీ ఆస్తికి నష్టం కలిగించవచ్చు. కావున, మీరు ఒక తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు, సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకపోవడం వలన కలిగే లాభాలు మరియు నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి.

సమగ్ర ఇన్సూరెన్స్ దొంగతనాన్ని కవర్ చేస్తుందా?

మోటారు వాహనాలకు సంబంధించి అత్యంత సాధారణ అపాయాలలో ఒకటి దొంగతనం. ఏదైనా ముప్పు, విధ్వంసం లేదా మానవ నిర్మిత కార్యకలాపాల నుండి సురక్షితంగా ఉండటానికి పాలసీహోల్డర్‌కు సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ అండగా ఉంటుంది. అంతేకాకుండా, ARAI ద్వారా ధృవీకరించిన యాంటీ-థెఫ్ట్ పరికరాల ఇన్‌స్టాలేషన్ తక్కువ-ఖర్చుతో కూడిన మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం వద్ద ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది.

నాకు ఎంత సమగ్ర ఇన్సూరెన్స్ మొత్తం అవసరం?

మీరు ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్‌ను పూర్తిగా అయిపోజేయడానికి ముందు మీ అవసరాన్ని విశ్లేషించడం ముఖ్యం. అవసరాలు మీకు తెలిసిన తర్వాత, దానిని సరిగ్గా అదేవిధంగా నెరవేర్చే మరియు మీ జేబుపై భారం కలిగించని ఒక ప్లాన్‌ను ఎంచుకోండి. 

మీరు కేవలం సమగ్ర ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండవచ్చా?

భారతదేశంలో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఒక చట్టపరమైన ఆదేశం. అయితే, ఎల్లప్పుడూ విస్తృతమైన మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాల్సిందిగా సిఫార్సు చేయబడుతుంది. ఒక సమగ్ర ప్లాన్ కలిగి ఉండటం అనేది ఏదైనా థర్డ్-పార్టీ బాధ్యత కోసం కూడా కవర్‌ను అందిస్తుంది. 

మీరు సమగ్ర ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయవచ్చా?

మోటార్ వాహనాల చట్టం, 2019 ప్రకారం, సరైన ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా భారతీయ రోడ్లపై డ్రైవ్ చేయడం చట్టవిరుద్ధం. భారతీయ రోడ్లపై నడుస్తున్న అన్ని మోటార్ వాహనాలకు థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సమగ్ర ఇన్సూరెన్స్ కోసం ఎంత ఖర్చు అవుతుంది?

సమగ్ర కవరేజీని కలిగి ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ కవర్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఆప్టిమమ్ ప్రొటెక్షన్ చాలా ముఖ్యమైనది మరియు ప్రీమియం అనేది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు భిన్నంగా ఉంటుంది. 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం