Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ కొనండి/రెన్యూ చేసుకోండి

Renault Car Insurance

కార్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాన్ కార్డ్ ప్రకారం పేరును ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

రెనాల్ట్ అనేది ప్రసిద్ధి చెందిన మరియు బాగా స్థిరపడిన కార్ల తయారీదారు. రెనాల్ట్ కార్లు వాటి ప్రత్యేకమైన డిజైన్, ఉపయోగించిన మెటీరియల్స్ యొక్క ఉత్తమ నాణ్యత మరియు వాటి విభాగంలో తక్కువ-ఖర్చుతో కూడిన ధరల వద్ద తెలివైన ఫీచర్లను అందించడం కోసం ప్రసిద్ధి చెందాయి. 

ప్రస్తుతం, రెనాల్ట్ 3 రకాల కార్లను అందిస్తుంది: క్విడ్ , ట్రైబర్ మరియు కైగర్ . ఒక హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యువి మరియు ఎంయువి లాంటివి అందిస్తూ, రెనాల్ట్ వివిధ రకాల కారు యజమానులకు వారి కోరికలను నెరవేరుస్తుంది

రెనాల్ట్ కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ల రకాలు

వివరంగా చెప్పాలంటే, మీ రెనాల్ట్ కారు కోసం మీరు కొనుగోలు చేయగల రెండు రకాల కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. అవి ఇలా ఉన్నాయి:

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్

ప్రస్తుత చట్టాల ప్రకారం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి మరియు ఇది ప్రమాదాల ఫలితంగా ఉత్పన్నమయ్యే థర్డ్-పార్టీ బాధ్యతల నుండి పాలసీదారుని రక్షిస్తుంది. ఇది వారి వాహనం/ ఆస్తికి గాయాలు, మరణం లేదా నష్టం జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీకి పరిహారం అందిస్తుంది.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్

మీ రెనాల్ట్ కోసం సమగ్ర కారు ఇన్సూరెన్స్ అనేది థర్డ్ పార్టీ బాధ్యతలను మాత్రమే కాకుండా, ఇతర విషయాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు, అగ్ని మరియు దొంగతనాల నుండి కూడా కవరేజీని అందిస్తుంది. ఈ ప్లాన్ కింద అందించబడిన మరింత విస్తృతమైన కవరేజ్ కారణంగా, సమగ్ర కవరేజ్ కోసం రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ధర ఎక్కువగా ఉంటుంది.

రెనాల్ట్ కార్ల ముఖ్యాంశాలు

రెనాల్ట్ ద్వారా ప్రారంభించబడిన ప్రతి కారు దాని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది, అవి ఈ కింది వరుసలో పేర్కొనబడ్డాయి:

 

1.రెనాల్ట్ క్విడ్

ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉండే సొగసైన, స్పోర్టీ డిజైన్ సౌకర్యం సౌలభ్యాన్ని మరియు సామర్థ్యాన్ని ఇస్తుంది. మెరుగైన భద్రతా సాంకేతికత, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఒక ఎల్ఇడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఒక పెద్ద టచ్ స్క్రీన్ మీడియా ఎన్‌ఎవి అనేవి క్విడ్ యొక్క ఆకర్షణీయమైన ఫీచర్లు మాత్రమే.

 

2.రెనాల్ట్ ట్రైబర్

ఈ 7-సీటర్ ఎంయువి హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు, 625-లీటర్ బూట్ స్పేస్‌తో విశాలమైన సీటింగ్ సామర్థ్యం, సమర్థవంతమైన ఇంధన పనితీరు మరియు మరెన్నో అందిస్తుంది, అలాగే, ఇది ఒక చిక్ డ్యూయల్-టోన్ కలర్ ప్యాకేజీతో నిండి ఉంది.

 

3.రెనాల్ట్ కైగర్  

స్పోర్టీ, స్మార్ట్ మరియు స్టైలిష్ రూపంలో ఉండే కైగర్ దాని డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, రాజీపడని భద్రతా ఫీచర్లు, ఇతర అద్భుతమైన అంశాలతో పాటు డైనమిక్ పనితీరు కోసం అనేక అవార్డులను గెలుచుకుంది.

 

మీరు మీ మనస్సులో క్విడ్ , ట్రైబర్ లేదా కైగర్ కోరుకున్నా, మీరు రెనాల్ట్ కారుతో రాజీపడలేని ఒక విషయం- సరైన కారు ఇన్సూరెన్స్ పాలసీ

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1988 మోటార్ వాహనాల చట్టం భారతీయ రోడ్లపై ప్రయాణించే ప్రతి కారుకు కనీస థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండటం తప్పనిసరి చేస్తుంది. మీరు చేయాలనుకుంటే మీరు సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కూడా ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ కింది ప్రయోజనాలను పొందవచ్చు:

 

1.పేపర్‌వర్క్ లేదు

ఆన్‌లైన్‌లో రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేందుకు ఎలాంటి పేపర్‌వర్క్ అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజిన్ నంబర్, ఛాసిస్ వివరాలు, వ్యక్తిగత సమాచారం మొదలైనటువంటి వివరాలను ఒక ఆన్‌లైన్ ఫారంలో నమోదు చేసి దానిని డిజిటల్‌ రూపంలో సమర్పించండి.

 

2.వేగవంతమైన మరియు సులభమైన పాలసీ జారీ

మీరు రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు, చెల్లింపు చేసిన వెంటనే పాలసీ జారీ చేయబడినందున మీరు సమయాన్ని అలాగే శక్తిని ఆదా చేస్తారు. మొత్తం ప్రక్రియకు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. .

 

3.ప్లాన్‌లను సరిపోల్చడం మరియు ఇన్సూరెన్స్ సంస్థలను సమీక్షించడం సులభం  

ఇటువంటి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్, మీరు ప్లాన్‌లను సరిపోల్చవచ్చు మరియు కొన్ని సెకన్లలో కోట్‌లను జనరేట్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా లభించే విస్తృతమైన సమాచారం కారణంగా ఇన్సూరెన్స్ సంస్థ యొక్క కీర్తి మరియు విశ్వసనీయతను అంచనా వేయడం కూడా సులభం.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్‌లు

రెనాల్ట్ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద, కారు మొత్తం రక్షణను పెంచడానికి మీరు ఇతర వాటితో పాటు ఈ క్రింది యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు:

ఈ యాడ్-ఆన్‌లు రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ధరను పెంచుతాయి, కానీ దీర్ఘకాలంలో అవి విలువైనవిగా నిరూపించబడవచ్చు.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

రెనాల్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇన్సూరర్‌కు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ఉంటుంది. మీకు అవసరమైన కీలక డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • క్లెయిమ్ ఫారం :

    మీ ప్రొవైడర్ నుండి క్లెయిమ్ ఫారం పొందండి మరియు సంతకం చేయడం ద్వారా దానిని పూర్తి చేయండి.

  • పాలసీ డాక్యుమెంట్ :

    మీ రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్.

  • వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సి) :

    ఆర్‌సి బుక్ కాపీ అవసరం.

  • డ్రైవర్ లైసెన్స్ :

    చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్ కాపీ.

  • ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) :

    మీ క్లెయిమ్‌లు లేదా రెనాల్ట్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండడానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఫైల్ చేయడం ముఖ్యం.

  • వార్షికంగా కవరేజీని సమీక్షించండి :

    గ్యారేజ్ వంటి విషయాల కోసం సంబంధిత వ్యక్తి నుండి మరమ్మత్తు ఖర్చు కొటేషన్.

  • మెడికల్ రిపోర్ట్స్ :

    గాయాల మెడికల్ రిపోర్ట్ అవసరం.

  • ఒరిజినల్ బిల్లులు మరియు రసీదులు :

    మరమ్మత్తు సమయంలో అయ్యే ఏవైనా ఖర్చుల కోసం.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే కారణాలు

మీ రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి:

  • కారు మోడల్ మరియు వేరియంట్ :

    వివిధ మోడల్స్ వాటి వేరియంట్ల ఆధారంగా వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్లను కలిగి ఉంటాయి.

  • వాహనం వయస్సు :

    కొత్త కార్లకు అధిక ప్రీమియంలు మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు ఉంటాయి, ఎందుకంటే అవి మరింత విలువైనవి మరియు మరిన్ని మరమ్మత్తులు అవసరం.

  • స్థానం :

    అధిక ట్రాఫిక్ పరిధి మరియు ఇతర పరిస్థితుల ఆధారంగా పట్టణ ప్రాంతాల్లో ప్రీమియంలు ఎక్కువగా ఉండవచ్చు.

  • డ్రైవర్ ప్రొఫైల్ :

    చిన్న వయస్సు గల డ్రైవర్లు అధిక ప్రీమియం ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండవచ్చు.

  • నో-క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) :

    యాక్టివ్ వ్యవధిలో తమ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయని వారికి ఇవ్వబడే ఒక యాడ్-ఆన్ డిస్కౌంట్‌గా దీనిని పరిగణించండి.

  • యాడ్-ఆన్స్ :

    జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్షన్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది అధిక ప్రీమియం కలిగి ఉంటుంది కానీ యాడ్-ఆన్ సేవలను అందిస్తుంది.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ప్రాసెస్ ఈ కింది విధంగా ఉంటుంది:

  1. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు 'ఆన్‌లైన్‌లో పాలసీ కొనండి' ట్యాబ్‌కు వెళ్లండి.
  2. మీ రెనాల్ట్ కారుకు సంబంధించిన వివరాలను నమోదు చేయండి (తయారీ తేదీ, మేక్ మరియు మోడల్, రిజిస్ట్రేషన్ నగరం మొదలైనవి).
  3. మీ కవరేజ్ అవసరాల ఆధారంగా థర్డ్-పార్టీ లేదా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ నుండి ఎంచుకోండి..
  4. మీరు ఒక సమగ్ర ప్లాన్ కొనుగోలు చేస్తున్నట్లయితే, రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ధరను దృష్టిలో ఉంచుకుని మీకు యాడ్-ఆన్‌లు అవసరమా అని పరిగణించండి.
  5. ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రీమియం చెల్లించండి మరియు కొత్తగా జారీ చేయబడిన పాలసీని నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో పొందండి.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేసుకోవాలి?

  • బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు 'ఆన్‌లైన్‌లో పాలసీని రెన్యూ చేయండి' ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థించిన విధంగా వివరాలను నమోదు చేయండి (పాలసీ వివరాలు మరియు కార్ రిజిస్ట్రేషన్ నంబర్).
  • మీరు ఒకవేళ అర్హత కలిగి ఉంటే మీ నో-క్లెయిమ్ బోనస్‌ను సమీక్షించండి.
  • మీ ప్లాన్ కింద కవరేజీని సమీక్షించండి; మీ రెనాల్ట్ ఇన్సూరెన్స్ ధరను సర్దుబాటు చేయడానికి, కొత్త యాడ్-ఆన్‌లను ఎంచుకోవడాన్ని లేదా కొన్నింటిని తీసివేయడాన్ని పరిగణించండి.
  • మీరు పైన పేర్కొన్న సమాచారాన్ని నమోదు చేసి ధృవీకరించిన తర్వాత, మీ ప్లాన్ కోసం ఒక కోట్ అందుకోవడానికి దానిని సమర్పించండి.
  • సురక్షితమైన ఆన్‌లైన్ చెల్లింపు పోర్టల్‌లో చెల్లింపు చేయండి.
  • చెల్లింపు తర్వాత నిమిషాల వ్యవధిలో ఇమెయిల్ ద్వారా పాలసీని స్వీకరిస్తారు.

     

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి కారణాలు

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

  • చట్టపరంగా తప్పనిసరి :

    మోటార్ వాహన చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ముఖ్యం, ఎందుకంటే ఇది తప్పనిసరి.

  • ఆర్థిక రక్షణ :

    ఇది దొంగతనం, నష్టం లేదా ప్రమాదం వంటి ఏదైనా దురదృష్టకర సంఘటన నుండి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

  • రిపేర్ కవరేజ్ :

    మరమ్మత్తు పనులను కవర్ చేయడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నుండి మీ భద్రతను నిర్ధారించుకోండి.

  • థర్డ్-పార్టీ లయబిలిటీ :

    థర్డ్ పార్టీ గాయాలు, మరణం లేదా ఏదైనా నష్టం నుండి వచ్చే ఆర్థిక బాధ్యత నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

  • మనశ్శాంతి: :

    మీరు మీ కోసం ఒక ఆర్థిక ప్లాన్‌ను సురక్షితం చేసుకున్నారని తెలుసుకోవడం అనేది డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

రెనాల్ట్ ఆర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం క్లెయిమ్ ఎలా చేయాలి?

మీ కారుకు నష్టం జరిగిన సందర్భంలో మీ రెనాల్ట్ ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద క్లెయిమ్ చేయడానికి మీరు ఏమి చేయాలనేది ఇక్కడ ఇవ్వబడింది:

  1. నష్టాల గురించి ఇన్సూరర్‌కు తెలియజేయండి మరియు మీ క్లెయిమ్‌ను నమోదు చేయండి.
  2. మీరు నగదురహిత క్లెయిమ్ చేస్తున్నట్లయితే, మీరు రిపేర్స్ కోసం వాహనాన్ని నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్లడానికి ముందు ఇన్సూరెన్స్ సర్వేయర్ నష్టాలను చెక్ చేయవచ్చు
  3. నెట్‌వర్క్ గ్యారేజ్ రిపేర్స్ గురించి ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేస్తుంది మరియు చెల్లింపు అనేది ఆ రెండు పార్టీల మధ్య నేరుగా సెటిల్ చేయబడుతుంది.
  4. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ విషయంలో మీరు డ్యామేజ్ అయిన కారును రిపేర్ షాపుకు తీసుకెళ్లి రిపేర్ బిల్లులు చెల్లించాలి. అప్పుడు మీరు అవసరమైన వివరాలను ఇన్సూరర్‌తో పంచుకోవచ్చు. ఒకసారి క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, మీరు చెల్లింపు కోసం రీయింబర్స్‌మెంట్ అందుకుంటారు.
  5. మీరు అదనపు జేబు ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుందని గమనించగలరు

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

  • చేర్పులు

  • మినహాయింపులు

శారీరక హాని లేదా వైకల్యం, వాహనం లేదా ఆస్తికి జరిగిన నష్టం మరియు మరణంతో సహా థర్డ్-పార్టీ బాధ్యతలు 

రెనాల్ట్ కారు పూర్తి నష్టం

ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టం (భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు మొదలైనవి)

మానవ నిర్మిత విపత్తుల కారణంగా జరిగిన నష్టం .

1 ఆఫ్ 1

చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో సహా, డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు జరిగిన నష్టం

కారు సాధారణ అరుగుదల, తరుగుదల మరియు డిప్రిసియేషన్ 

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు

యుద్ధం, అణు కార్యకలాపాలు మరియు తిరుగుబాటు కారణంగా సంభవించిన నష్టం 

వాణిజ్య ప్రయోజనాల కోసం కారును ఉపయోగించినప్పుడు జరిగిన నష్టం

డ్రైవర్ మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు జరిగిన నష్టం లేదా డ్యామేజ్

1 ఆఫ్ 1

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా రెనాల్ట్ కారులో చేసిన మార్పులను కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుందా?

చాలా సందర్భాల్లో, కొత్తగా చేయబడిన మార్పులు ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద కవర్ చేయబడవు. మీరు ఈ సవరణల గురించి మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయవచ్చు మరియు అధిక రెనాల్ట్ ఇన్సూరెన్స్ ధర చెల్లించడం ద్వారా వాటిని ఇన్సూర్ చేయవచ్చో లేదోనని చెక్ చేయండి. 

నా రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీని నేను ఎలా నిర్ణయించుకోవాలి?

మీకు ఏ రకమైన కవరేజ్ అవసరమో అర్థం చేసుకోవడానికి, మీ కారు క్రింద ఉండే రిస్కులను మీరు సమీక్షించాలి. ఉదాహరణకు, మీరు వరదలకు గురయ్యే ప్రాంతంలో నివసిస్తుంటే, సమగ్ర కవరేజీ తప్పనిసరి. లేదా మీరు అనేకసార్లు క్లెయిమ్‌లు చేసే అవకాశం ఉంటే, అప్పుడు జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో నేను యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయవచ్చా?

లేదు, థర్డ్-పార్టీ కవరేజ్‌తో యాడ్-ఆన్‌లను ఎంచుకోలేరు. యాడ్-ఆన్‌లను దీనితో మాత్రమే కొనుగోలు చేయవచ్చు:‌ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ.

కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ద్వారా జనరేట్ చేయబడిన కోట్ తుది కోట్‌గా ఉంటుందా?

కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ద్వారా ఇవ్వబడిన కోట్ కేవలం ఒక అంచనా మాత్రమే. ఇది మీ చివరి కోట్ ఏమిటి అనే దాని గురించి మీకు ఒక అవగాహన కల్పిస్తుంది, అలాగే ఇది అనేక ప్రధాన అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అయితే, రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ ఖర్చులను అర్థం చేసుకోవడానికి కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఒక ఉపయోగకరమైన సాధనం.

ఆన్‌లైన్ రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుతుందా?

అవును, మీ రెనాల్ట్ కారు కోసం ఒక ఆన్‌లైన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన పాలసీ వలె చెల్లుబాటు అవుతుంది. 

నేను నా రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోగలను?

సులభమైన దశలలో మీ రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని డౌన్‌లోడ్ చేసుకోండి; బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 'ఆన్‌లైన్‌లో పాలసీని రెన్యూ చేయండి' ట్యాబ్‌ను కనుగొనండి మరియు మీ పాలసీ వివరాలు మరియు కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. చెల్లింపు తర్వాత, మీరు మీ ఇన్సూరెన్స్ వివరాలను ఇమెయిల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటారు.

నా రెనాల్ట్ కారు కోసం ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ ఖర్చు యొక్క వివరాలను ఎలా పొందాలి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీరు మీ రెనాల్ట్ ఇన్సూరెన్స్ వివరాలను కనుగొనవచ్చు. వివరణాత్మక సమాచారాన్ని పొందడానికి రిజిస్ట్రేషన్ నంబర్, మోడల్ మరియు లొకేషన్ వంటి వివరాలను పూరించండి.

రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

ఆన్‌లైన్‌లో మీ రెనాల్ట్ కార్ ఇన్సూరెన్స్ కోసం రెన్యూవల్ ప్రాసెస్ చాలా సులభం. మీరు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి, కవరేజ్ ఎంపికలను సమీక్షించాలి మరియు చెల్లింపు చేయాలి. ప్రాసెస్ తర్వాత, మీరు మీ రెన్యూవల్ ప్రాసెస్ యొక్క నిర్ధారణ మెయిల్ పొందుతారు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం