రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
యమహా అనేది జపాన్‌కు చెందిన ఒక టూ-వీలర్ తయారీ సంస్థ. ఇది 1955 లో స్థాపించబడిన ఈ యమహా అనేది, మోటో జిపి లాంటి అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో మొదట ఒక రీజనల్ ప్లేయర్‌గా అడుగుపెట్టింది. ఇది కొంత కాలంలోనే వారికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. యమహా 1985 లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది మరియు అప్పటి నుండి దాని విజయగాథను నిర్మించుకోగలిగింది.
వేగం మరియు సౌకర్యంతో అనుబంధం కలిగిన ఒక బ్రాండ్‌గా, యమహా బైక్‌లు ఇలాంటి ఫీచర్లతో నిండి ఉన్నాయి:
యమహా బైక్ సరసమైనది అయినప్పటికీ, ప్రమాదం జరిగిన తర్వాత దానిని రిపేర్ చేయడం అనేది ఖర్చుతో కూడుకున్నది. ఒక యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన, అది మీ తరపున నష్టాల కోసం నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. ఇది కేవలం పాలసీ పరిధిలోకి వచ్చే బైక్‌ను మాత్రమే కాదు, పాలసీదారుగా ఉన్న మిమ్మల్ని కూడా ఆర్థికంగా కవర్ చేస్తుంది.
భారతదేశంలో యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీలతో వివిధ యాడ్-ఆన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సాధారణ యాడ్-ఆన్‌లలో భాగంగా ఉండేవి:
ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మరియు మీరు ఎంచుకున్న నిర్దిష్ట పాలసీ ఆధారంగా, యాడ్-ఆన్‌ల లభ్యత మరియు ఖర్చులో మార్పు ఉండవచ్చని గమనించండి.
మీరు ఒక సరికొత్త యమహా బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఎఫ్‌జెడ్ , ఆర్15, రే-జెడ్ మరియు ఫ్యాసినో అనేవి యమహా అందించే కొన్ని మోడల్స్.
మీ యమహా బైక్‌ను ఇన్సూర్ చేయాలనుకుంటే, ప్రధానంగా రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి - థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర ఇన్సూరెన్స్.
భారతదేశ రోడ్ల మీద మీరు చట్టపరంగా మీ యమహా బైక్ నడపడానికి మీరు కలిగి ఉండవలసిన అత్యంత ప్రాథమిక మరియు తప్పనిసరి రకం ఇన్సూరెన్స్ పాలసీ ఇది. యమహా కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదం జరిగిన సందర్భంలో థర్డ్-పార్టీ వాహనాలు, ఆస్తి లేదా వ్యక్తులకు జరిగిన నష్టాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది. అంటే, మీరు ప్రమాదవశాత్తూ వేరొక వాహనం లేదా వ్యక్తిని ఢీకొట్టినప్పుడు, మీరు థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రమాదంలో థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలు లేదా వైద్య ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది..
A సమగ్ర ఇన్సూరెన్స్ యమహా కోసం పాలసీ అనేది థర్డ్-పార్టీ నష్టాలు మరియు మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టాలను కవర్ చేసే మరింత విస్తృతమైన మరియు సమగ్రమైన పాలసీ. థర్డ్-పార్టీ నష్టాలను కవర్ చేయడంతో పాటు, వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మరియు దొంగతనం, అల్లర్లు మొదలైన మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా సంభవించే నష్టాలను కూడా సమగ్ర యమహా ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. యమహా బైక్ రైడర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా ఇది అందిస్తుంది.
అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, యమహా కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది మీరు భారతదేశపు రోడ్ల మీద చట్టపరంగా మీ బైక్‌ను నడపడానికి అవసరమైన ఒక ప్రాథమిక మరియు తప్పనిసరి ఇన్సూరెన్స్ పాలసీ. అయితే, ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ అనేది విస్తృత శ్రేణి ప్రమాదాలు మరియు నష్టాల నుండి మీ యమహా బైక్‌కు మెరుగైన కవరేజీ మరియు రక్షణ అందిస్తుంది.
యమహా బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడమనేది ఒక సులభమైన మరియు సౌకర్యవంతమైన ప్రక్రియగా ఉంటుంది. ఈ దశలను అనుసరించండి:
విభిన్న ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే వివిధ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను శోధించడం మరియు వాటిని పోల్చడం ద్వారా ప్రారంభించండి. మీకు అవసరమైన కవరేజీ అందించే ప్లాన్‌ల కోసం వెతకండి మరియు ప్రతి ప్లాన్ ప్రీమియంలు మరియు ఫీచర్లను సరిపోల్చండి.
2. ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి:
మీరు ప్లాన్‌లను సరిపోల్చిన తర్వాత, సరసమైన ప్రీమియంతో ఉత్తమ కవరేజీ అందించే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి.
మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీ యమహా టూ-వీలర్ తయారీ మరియు మోడల్, తయారీ సంవత్సరం, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పేరు, చిరునామా మరియు సంప్రదింపు నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ బైక్ వివరాలు పూరించండి.
మీ యమహా బైక్ కోసం మీకు కావలసిన కవరేజ్ రకం ఎంచుకోండి. మీరు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేదా సమగ్ర ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవచ్చు.
అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్ల కోసం తనిఖీ చేయండి మరియు మీకు అవసరమైన వాటిని ఎంచుకోండి. కొన్ని ప్రముఖ యాడ్-ఆన్ కవర్లలో జీరో డిప్రిసియేషన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, పిలియన్ రైడర్ కవర్ మొదలైనవి ఉంటాయి. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌ల సంఖ్య ఆధారంగా మీ యమహా ఇన్సూరెన్స్ పాలసీ ధర మారవచ్చు.
సురక్షితమైన చెల్లింపు గేట్‌వే ఉపయోగించి ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆన్‌లైన్‌లో చెల్లించండి.
చెల్లింపు విజయవంతమైన తర్వాత, మీ యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేయబడుతుంది మరియు అది మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడుతుంది.
మీరు యమహా ఇన్సూరెన్స్ పాలసీ ధర తెలుసుకోవాలనుకుంటే, మీరు మీ పాలసీ కోసం ఒక అంచనా వేయబడిన కోట్‌ను పొందడానికి టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు.
యమహా ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేయడమనేది ఒక సౌకర్యవంతమైన మరియు అవాంతరాలు-లేని ప్రక్రియగా ఉంటుంది. యమహా ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1. మీ ప్రస్తుత యమహా ఇన్సూరెన్స్ పాలసీని అందించిన ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. వెబ్‌సైట్ యొక్క "రెన్యూవల్" విభాగానికి నావిగేట్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మీ ప్రస్తుత పాలసీ గడువు తేదీ లాంటి మీ యమహా బైక్ గురించిన అవసరమైన వివరాలు నమోదు చేయండి.
4. మీరు రెన్యూవల్ చేయాలనుకుంటున్న యమహా ఇన్సూరెన్స్ పాలసీ రకం ఎంచుకోండి.
5. పాలసీ వివరాలను సమీక్షించండి మరియు ఏవైనా మార్పులు అవసరమేమో తనిఖీ చేయండి.
6. మీరు మీ పాలసీలో చేర్చాలనుకుంటున్న ఏవైనా యాడ్-ఆన్ కవర్లు ఎంచుకోండి.
7. సురక్షిత చెల్లింపు గేట్‌వే ద్వారా, మీ రెన్యూవల్ చేయబడిన పాలసీ కోసం ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి.
8. చెల్లింపు విజయవంతమైన తర్వాత, మీరు మీ యమహా ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్‌కి సంబంధించి ఒక రసీదు అందుకుంటారు.
క్లెయిమ్ సందర్భంలో ఏవైనా జరిమానాలు లేదా సమస్యలు నివారించడం కోసం, గడువు తేదీకి ముందే మీ యమహా ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేసుకోండి.
రెన్యూవల్ సమయంలో మీరు మీ పాలసీని కస్టమైజ్ చేసినట్లయితే, మీ యమహా ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధరలో వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు. ఇది యాడ్-ఆన్‌లను చేర్చడం లేదా మినహాయించడం కారణంగా కావచ్చు.
పాలసీ రకాన్ని బట్టి, మీరు మీ యమహా బైక్ ఇన్సూరెన్స్ కోసం రీయింబర్స్‌మెంట్ లేదా నగదురహిత క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. మీరు అనుసరించదగిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
మీ బైక్‌కు ప్రమాదం లేదా నష్టం జరిగిన సందర్భంలో, వెంటనే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయండి. కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మీ ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా, మీరు ఈవిధంగా చేయవచ్చు.
మీ బైక్‌కు జరిగిన ప్రమాదం లేదా నష్టం వివరాలు, పాలసీ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర సంబంధిత వివరాలను మీరు అందించాలి.
మీరు నగదురహిత క్లెయిమ్‌ను ఎంచుకుంటే, మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీకు నెట్‌వర్క్ గ్యారేజీలు ల జాబితాను అందజేస్తారు, ఇక్కడ మీరు మీ బైక్‌ను ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా రిపేర్ చేసుకోవచ్చు. ఇన్సూరర్ నేరుగా గ్యారేజీకి రిపేర్ బిల్లులను సెటిల్ చేస్తారు.
ఒకవేళ మీరు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను ఎంచుకుంటే, మీరు మీకు నచ్చిన గ్యారేజీలో మీ బైక్‌ను రిపేర్ చేయించుకోవచ్చు మరియు వాటి కోసం బిల్లులకు మీరే చెల్లించాలి. ఆ తర్వాత, ఇతర సంబంధిత డాక్యుమెంట్లతో పాటు ఆ బిల్లులను మీరు మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు సమర్పించవచ్చు.
కొన్ని సందర్భాల్లో, క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ముందు బైక్ సర్వే అవసరం కావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ నియమించిన సర్వేయర్ నష్టాన్ని అంచనా వేసి, నివేదిక అందిస్తారు.
ఒకసారి క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, ఇన్సూరర్ నేరుగా గ్యారేజీకి (నగదురహిత క్లెయిమ్ విషయంలో) చెల్లింపు చేస్తారు లేదా రీయింబర్స్‌మెంట్ ద్వారా క్లెయిమ్ మొత్తం సెటిల్ చేస్తారు.
ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మరియు పాలసీ రకం మీద ఆధారపడి, రీయింబర్స్‌మెంట్ లేదా నగదురహిత క్లెయిమ్ ఫైల్ చేసే ప్రక్రియలో మార్పు ఉండవచ్చని గమనించడం ముఖ్యం. పాలసీ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదవడం మరియు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందే క్లెయిమ్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవడం మంచిది.
భారతదేశంలో యమహా బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి సాధారణంగా అవసరమైన డాక్యుమెంట్లు క్రింద ఇవ్వబడ్డాయి:
· ఇన్సూరెన్స్ పాలసీ కాపీ
· బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ
· రైడర్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
· ఎఫ్ఐఆర్ (దొంగతనం లేదా థర్డ్-పార్టీ నష్టం సందర్భంలో)
· మెడికల్ సర్టిఫికెట్ (రైడర్ లేదా వెనుక కూర్చున్న వ్యక్తి గాయపడిన సందర్భంలో)
· మరమ్మత్తు బిల్లులు మరియు చెల్లింపు రసీదులు (రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ విషయంలో)
· నగదురహిత క్లెయిమ్ ఫారమ్ (నగదురహిత క్లెయిమ్ విషయంలో)
· క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమయ్యే ఏదైనా ఇతర డాక్యుమెంట్
దాఖలు చేయబడుతున్న క్లెయిమ్ రకం మరియు ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దిష్ట అవసరాల ఆధారంగా, అవసరమైన డాక్యుమెంట్ల ఖచ్చితమైన జాబితాలో మార్పు ఉండవచ్చని గమనించడం ముఖ్యం. సులభమైన మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు నిర్ధారించుకోవడం కోసం ఇన్సూరర్‌తో తనిఖీ చేయవలసిందిగా లేదా పాలసీ డాక్యుమెంట్ చూడవలసిందిగా ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతోంది.
|
బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అనేది బైక్ తయారీ మరియు మోడల్, బైక్ వయస్సు, వినియోగ ఉద్దేశ్యం, బైక్ ఇంజిన్ సామర్థ్యం, రిజిస్ట్రేషన్ చేసిన ప్రదేశం మరియు ఇన్సూరెన్స్ పాలసీ రకం వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
అవును, మీరు మీ బైక్‌ను విక్రయించినట్లయితే, మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని వేరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. అయితే, ఆ బదిలీ గురించి మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి మరియు బదిలీ కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం పట్టే సమయం అనేది క్లెయిమ్ సంక్లిష్టత మరియు ఇన్సూరెన్స్ కంపెనీ విధానాల ఆధారంగా మారుతుంది. అయితే, చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుకున్న 30 రోజుల లోపు క్లెయిమ్‌లను సెటిల్ చేయడం లక్ష్యంగా కలిగి ఉంటాయి.
బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లలో క్లెయిమ్ ఫారమ్, బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, దొంగతనం లేదా థర్డ్-పార్టీ నష్టాల విషయంలో ఎఫ్‌ఐఆర్ కాపీ మరియు మరమ్మత్తు బిల్లులు మరియు రసీదులు ఉంటాయి.
లేదు, సాధారణంగా, మీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కవర్ చేయబడిన భౌగోళిక ప్రాంతానికి వెలుపల సంభవించిన నష్టాల కోసం మీరు క్లెయిమ్ ఫైల్ చేయలేరు. కొన్ని భౌగోళిక పరిమితుల్లో, నిర్దిష్ట ప్రమాదాలను కవర్ చేయడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలు రూపొందించబడ్డాయి మరియు ఈ పరిమితులనేవి సాధారణంగా పాలసీలో పేర్కొనబడుతాయి.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 22nd మే 2024
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి