రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
జీరో మినహాయింపు
24/7 మిస్డ్ కాల్
సదుపాయం
98% క్లెయిమ్ సెటిల్‌మెంట్
రేషియో
పర్యాటకులను ఆకర్షించడం కోసం చాలా దేశాలు వాటి ట్రావెల్ విధానాలకు సడలింపులు చేశాయి. కాబట్టి, మీరు మీ కుటుంబాన్ని విదేశాలకు తీసుకు వెళ్లాలని ఆలోచిస్తుంటే, ఆవిధంగా చేయడానికి ఇదే సరైన సమయం! అలాగే, మారిషస్ వెళ్లాలని మీరు ఆలోచిస్తుంటే, మీరిప్పుడు తప్పకుండా వెళ్లవచ్చు! మారిషస్ ఒక అద్భుతమైన దేశం కాబట్టి, ఇక్కడ మీరు అడుగుపెట్టగానే ఒక గొప్ప ఆతిధ్యం అందుకుంటారు. అలాగే, ప్రతి దేశానికి వెళ్లేటప్పుడు చేసినట్లుగానే, మారిషస్‌కు మీరు ఏ రకమైన సెలవు కోసం వెళ్తున్నప్పటికీ, మీరు ఒక సరైన ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవాలి.
మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ఆన్‌లైన్ కొనుగోలు, ఇది చాలా సహేతుకమైనది.
మీ మారిషస్ ప్రయాణం కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఆవశ్యకత మీద మేము దృష్టి పెట్టడానికి కారణమేమిటి? ఇది చాలా సులభమైనది. ఏ అంతర్జాతీయ ప్రయాణమైనప్పటికీ, అది ఆందోళనతో నిండినదై ఉంటుంది. ఉదాహరణకు, ప్రయాణ సమయంలో మీకు ఏవైనా ఊహించని సంఘటనలు సంభవిస్తే, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో మీకు తెలియదు.
మీకు ఏదైనా ఒక ప్రమాదం ఎదురు కావచ్చు లేదా అనారోగ్యానికి గురికావచ్చు. మీరు మీ బ్యాగులు, పాస్‌పోర్ట్ పోగొట్టుకోవచ్చు లేదా కనెక్టింగ్ విమానం మిస్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మారిషస్ వీసా అనేది మారిషస్ ప్రభుత్వపు ఇమ్మిగ్రేషన్ విభాగం అందించే ఒక అధికారిక డాక్యుమెంట్, లెటర్ లేదా స్టాంప్. భారతీయులతో సహా విదేశీ పౌరుల కోసం మారిషస్ ఎంబసీలు మరియు కాన్సులేట్లు చట్టపరంగా వీసాలు మంజూరు చేయవచ్చు.
వీసా చట్టాల్లో పేర్కొన్న మేరకు, మారిషస్ వీసా కలిగిన వ్యక్తి ఆ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు.
భారతీయ సందర్శకుల కోసం, వీసా-ఆన్-అరైవల్ ఎంపికను మారిషస్ అందిస్తోంది. మారిషస్ చేరుకున్న తర్వాత, ఈ వీసా 60 రోజుల పాటు చెల్లుతుంది. ఈ వీసా ఉచితం మరియు ఒకసారి ప్రవేశాన్ని మాత్రమే అనుమతిస్తుంది. ప్రతి భారతీయ ప్రయాణికుడు మారిషస్ చేరుకున్న తర్వాత, మారిషస్ విమానాశ్రయంలో భారతీయుల కోసం ఇమ్మిగ్రేషన్ డెస్క్ వద్ద కొన్ని ముఖ్యమైన ప్రయాణ డాక్యుమెంట్లు సమర్పించాలి.
కాబట్టి, మీరు మీ హనీమూన్ కోసం లేదా స్నేహితులు మరియు కుటుంబంతో కలసి మారిషస్ వెళ్తుంటే, మీ వద్ద తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే మారిషస్ వీసా ఉండాలి. మారిషస్‌కు పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేయడానికి డ్రా అవుట్ ప్రాసెస్ అవసరం లేదు.
మారిషస్ వెళ్లాలనుకునే భారత జాతీయుల కోసం, మూడు ప్రధాన రకాల వీసాలు ఉన్నాయి:
మీరు ఒక పర్యాటకుడిగా మారిషస్ వచ్చినప్పుడు, ఈ దేశంలో అడుగుపెట్టగానే మీకు ఈ వీసా జారీ చేయబడుతుంది.
మారిషస్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ చదవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు ఈ ద్వీప దేశంలోకి రావడం కోసం స్టూడెంట్ వీసాకి దరఖాస్తు చేసుకోవచ్చు.
మారిషస్ ప్రభుత్వం తమ నిబంధనలన్నీ వ్యాపార-అనుకూలంగా ఉండేలా నిర్ధారించింది. కాబట్టి, మీరు అక్కడికి వెళ్లడానికి మరియు అక్కడ మీ సొంత కంపెనీ తెరవడానికి ఒక బిజినెస్ వీసా పొందాలి.
ప్రయాణ సంబంధిత ప్రయోజనాల కోసం మారిషస్ చేరుకున్న భారతీయులు మారిషస్ వీసా కోసం ఫీజు చెల్లించడం నుండి మినహాయించబడతారని ఇమిగ్రేషన్ నిబంధనల విభాగం పేర్కొంటోంది. మారిషస్ పర్యాటక వీసా కోసం ఖర్చు ఏమీ ఉండదు.
ఆన్-అరైవల్ వీసా కలిగిన భారతీయులు మారిషస్‌లో అడుగుపెట్టిన రోజు నుండి గరిష్టంగా 60 రోజుల పాటు అక్కడ ఉండవచ్చు. మీరు మీ బసని పొడిగించాలనుకుంటే, ఇమిగ్రేషన్ విభాగాన్ని సంప్రదించాలి. అవసరమైన విధానాలు పూర్తి చేసిన తర్వాత, మీరు మీ బసను పొడిగించవచ్చు, అదే రోజున మీరు ఇలా చేయవచ్చు. సురక్షితంగా ఉండడం కోసం, వీసా గడువు ముగిసే రెండు లేదా మూడు రోజుల ముందే సంబంధిత విభాగాన్ని సంప్రదించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.
భారతీయుల కోసం మారిషస్ వీసాకి అర్హత సాధించాలంటే, క్రింద జాబితా చేయబడిన అవసరాలను భారత జాతీయులు నిస్సందేహంగా నెరవేర్చాలి:
ప్రయాణ తేదీ తర్వాత ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి
మారిషస్‌లో లాడ్జింగ్ ఆధారం
వీసా ఇంకా చెల్లుబాటులో ఉండగానే, 60 రోజుల్లో ఉపయోగించగల నిర్ధారించబడిన రిటర్న్ టిక్కెట్లు కలిగి ఉండాలి
బస చేసే ప్రతి రోజు కోసం సుమారుగా రూ. 3,600 నుండి రూ. 7,200 విలువ గల డబ్బు ఉండాలి
సెలవు కోసం మారిషస్‌కు ప్రయాణించే భారత జాతీయులు డ్రాన్-అవుట్ మరియు కష్టమైన వీసా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి చేయడానికి ప్రీ-రిజిస్ట్రేషన్ విధానం కూడా అవసరం లేదు. మీరు మీ ప్రయాణ సమయంలో అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలి మరియు విమానాశ్రయం లోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేయాలి.
మారిషస్ పర్యాటక అవకాశాలు అనుభవించడం కోసం, ఈ ద్వీపాన్ని సందర్శించే భారతీయ పౌరులు వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. విమానాశ్రయంలో, ఆన్-అరైవల్ వీసా ఎంపిక ప్రయోజనాన్ని వారు అందుకోవచ్చు. ఇతర వీసాలకు మారడం కోసం భారతీయులు సెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మారిషస్ వీసా ఖర్చు అనేది వీసా కేటగిరీ ప్రకారం మారుతుంది.
ఇమిగ్రేషన్ విభాగం నిబంధనల ప్రకారం, ప్రయాణ సంబంధిత ప్రయోజనాల కోసం వచ్చిన భారతీయ పౌరులకు వీసా కోసం ఫీజు చెల్లించడం నుండి మినహాయింపు అందించబడుతుంది. మారిషస్ పర్యాటక వీసా కోసం ఖర్చు ఏమీ ఉండదు.
క్రింది పరిస్థితుల్లో, విమానాశ్రయంలో మీకు భారతీయ వీసా మంజూరు చేయబడకపోవచ్చు:
వీసా-ఆన్-అరైవల్ అప్లికేషన్ ఫారమ్‌లో తప్పుడు సమాచారం లేదా అవసరమైన సమాచారం లోపించడం
మారిషస్ వదలి రావడానికి లేదా తిరుగు ప్రయాణం గురించి ఎలాంటి విచక్షణాత్మక కారణం పేర్కొనలేకపోవడంతో సహా, మీ ప్రయాణ ప్రణాళికల గురించి ఎలాంటి ఖచ్చితమైన సాక్ష్యం లేకపోవడం
గతంలో లేదా ఇదివరకు ఉన్న నేర కార్యకలాపాల్లో ఇమిగ్రేషన్-సంబంధిత నేరాలు ఉండడం
భారతీయులకు మారిషస్ వీసా కోసం మీరు చేసిన దరఖాస్తుకు మద్దతుగా ఉండే సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం
ప్రతికూల పరిస్థితి అనేది ఎప్పుడూ చెప్పి రాదు. విదేశంలో ఉన్నప్పుడు మీరు అనారోగ్యానికి గురికావచ్చు లేదా హాస్పిటల్‌లో చేరాల్సిన లాంటి ప్రమాదం ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, భారతదేశంతో పోలిస్తే హాస్పిటలైజేషన్ ఖర్చులు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి.
మారిషస్ ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఏవైనా అత్యవసర ఖర్చుల నుండి మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితం చేస్తుంది.
మారిషస్‌ను సందర్శించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి కాదు. అయితే; మీ అవసరానికి సరిపోయే వివిధ రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల నుండి ఎంచుకోవాలని సిఫార్సు చేయబడింది. మీ మారిషస్ ట్రిప్‌ని అనేక అంశాలు పాడుచేయవచ్చు.
వివిధ రకాల మారిషస్ వీసాల గురించి తెలుసుకున్న తర్వాత, భారతీయ పౌరుల మారిషస్ వీసా కోసం దరఖాస్తు చేయడం కోసం అవసరమైన పేపర్‌వర్క్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. డాక్యుమెంట్ల జాబితా క్రింద పేర్కొనబడింది:
సంబంధిత పూర్తి సమాచారంతో సరిగ్గా నింపబడిన వీసా ఫారమ్‌లు
మారిషస్‌లో లాడ్జింగ్ గురించిన సమాచారం
మారిషస్‌లో ప్రవేశం తేదీ తర్వాత కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉండడం మంచిది
మీరు మారిషస్ నుండి ఏదైనా ఇతర దేశానికి వెళ్లాలనుకుంటే, మీరు సందర్శించాలనుకునే ఆ దేశానికి వెళ్లడం కోసం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే వీసా
మీ బసతో పాటు ఏవైనా ఊహించని ఖర్చులు కవర్ చేయడం కోసం మీ వద్ద తగినంత డబ్బు ఉందనే ఆధారం
నిర్ధారించబడిన రిటర్న్ విమాన టిక్కెట్ కాపీలు
మీ సెలవు కోసం మారిషస్ పౌరులు ఎవరైనా నిధులు సమకూరుస్తుంటే, వారి నుండి ఒక మద్దతు లేఖ. వారి చిరునామా మరియు వారితో మీ అనుబంధం గురించిన వివరాలు కూడా మీ వద్ద ఉండాలి
పాస్‌పోర్ట్ (లు)ల్లో సరిపోయే విధంగా, ప్రయాణికుడి ఇటీవలి రెండు ఫోటోలు
ఇటీవలి బ్యాంక్ స్టేట్‌మెంట్ (కొన్ని పరిస్థితుల కోసం)
సందర్శకుల కోసం మారిషస్ కోవిడ్-19 అవసరాలన్నీ ఎత్తివేయబడ్డాయి. దేశంలో పర్యాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, 72 గంటల ముందు పొందిన నెగెటివ్ ఆర్‌టి-పిసిఆర్ టెస్ట్ ఫలితాన్ని సందర్శకులు ఇకపై సమర్పించవలసిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
మారిషస్‌లో పర్యాటక ప్రదేశాలు
బీచ్‌లు మొదలుకొని అందమైన ద్వీపాల వరకు, మ్యూజియంలు మొదలుకొని స్మారక చిహ్నాల వరకు, ఆర్కిటెక్చరల్ అద్భుతాలు మొదలుకొని రిటైల్ డిస్ట్రిక్ట్‌ల వరకు మరియు మరెన్నో అందాలతో మారిషస్ మీకు అద్భుతాలను పరిచయం చేస్తుంది. మారిషస్‌కు వెకేషన్ సమయంలో మీరు మరికొన్ని విషయాలను కూడా తనిఖీ చేయవచ్చు. అలా చేయడం ద్వారా, అత్యంత అద్భుతమైన ప్రయాణ జ్ఞాపకాలతో మీరు ఇంటికి తిరిగి వస్తారు:
● బెల్లే మేర్ ప్లేజ్‌లో, పచ్చదనం మధ్యలో అత్యద్భుతమైన సూర్యోదయ దృశ్యాన్ని ఆస్వాదించండి.
● పెరీబెర్‌లో, ఉత్సాహభరిత వాటర్ యాక్టివిటీల్లో భాగమవ్వండి.
● లా క్యాంబస్‌లో, స్విమ్మర్‌లు తమకు ఇష్టమైన లోతుల్లోకి వెళ్లవచ్చు, వారి అభిరుచిని సంతృప్తిపరచుకోవచ్చు.
● ఐలాట్ గాబ్రియల్ బీచ్‌లో క్రూయిస్ కోసం కొంచెం సమయం వెచ్చించండి.
మారిషస్‌కు వెళ్లాలనుకునే భారత జాతీయులు అక్కడికి చేరుకున్న తర్వాత వీసా పొందవచ్చు. మారిషస్ ట్రిప్‌కి వెళ్లడానికి ముందే, ఆ పర్యటన కోసం పర్యాటక వీసాకి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత, మారిషస్ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ నుండి భారతీయ ప్రయాణీకులు వీసా పొందవచ్చు.
మారిషస్ ప్లాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది క్రింది కవరేజీలు అందిస్తుంది:
● మెడికల్ ఇన్సూరెన్స్
● కోవిడ్-19
● హైజాకింగ్
● బ్యాగేజీ నష్టం
● వ్యక్తిగత బాధ్యత
● అనారోగ్యం
● ప్రమాదాలు
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి