రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
జీరో మినహాయింపు
24/7 మిస్డ్ కాల్
సదుపాయం
98% క్లెయిమ్ సెటిల్‌మెంట్
రేషియో
నేపాల్ భారతదేశం యొక్క అత్యంత స్నేహపూర్వకమైన పొరుగు దేశాల్లో ఒకటి. అనేక మంది భారతీయులు నేపాల్‌ను సందర్శించాలని ఎంచుకుంటున్నారు, కావున, నేపాల్ పర్యటనను ప్లాన్ చేయడానికి ముందు సంబంధిత వీసా అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాక, ఇది ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది కాబట్టి, భారతదేశం కోసం నేపాల్ ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.
సాధారణంగా, నేపాల్ పర్యటనకు ప్లాన్ చేయడానికి ముందు ఒకరు, ఆ దేశంలో ప్రవేశించడానికి వారి అర్హతను నిర్థారించుకోవడం తప్పనిసరి.
ప్రతి సంవత్సరం, అనేక మంది భారతీయులు ఆధ్యాత్మిక అవగాహన కోసం, ప్రసిద్ధి చెందిన నేపాలీ ఆతిథ్యం స్వీకరించేందుకు మరియు/లేదా హిమాలయాలను అధిరోహించాలానే ఉత్సాహంతో నేపాల్‌ను సందర్శిస్తుంటారు. నేపాల్‌లోకి ప్రవేశించడానికి ఇతర దేశీయులకు తప్పనిసరిగా పర్యాటక వీసా ఉండాలి, భారతీయులకు ఈ అవసరం నుండి మినహాయింపు ఉంటుంది. భారత ప్రభుత్వం మంజూరు చేసిన ఆధారాలను భారతీయులు కలిగి ఉన్నంత వరకు, వారు వీసా లేకుండానే నేపాల్‌లోకి ప్రవేశించవచ్చు. నేపాల్ వెళ్లేందుకు వీసా కోసం అప్లై చేసుకోవడాన్ని గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
1950లో భారత్-నేపాల్ మధ్య జరిగిన శాంతి మరియు స్నేహపూర్వక ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యక్తులు మరియు ఉత్పత్తుల యొక్క అనియంత్రిత కదలిక సాధ్యమైంది. అయితే, ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్‌కు మీ పర్యటన కోసం మీకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మరియు పేపర్లను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని గమనించండి. మీరు ప్రయాణించే పూర్తి సమయానికి మీ పాస్‌పోర్ట్ చెల్లుబాటు అయ్యేలా చూసుకోండి. రెండవది, భారతీయుల కోసం నేపాల్ వీసాల గురించి ఏదైనా కొత్త సమాచారం కోసం త్వరగా శోధించండి. చివరగా, మీరు నేపాల్ కోసం రూపొందించబడిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి.
లేదు, భారతీయులకు నేపాల్ వీసా ఆన్ అరైవల్ లేదా ఎలక్ట్రానిక్ వీసా అవసరం లేదు, ఎందుకంటే భారతీయ పౌరులకు నేపాల్‌లోకి ప్రవేశించడానికి ఇవన్నీ అవసరం లేదు.
భారతీయ పౌరులు తమ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్లను చూపడం ద్వారా ఖాట్మండు విమానాశ్రయంతో సహా ఏదైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్లో నేపాల్‌లోకి ప్రవేశించవచ్చు.
నేపాల్‌కు వెళ్లే భారతీయులు వారి చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌లను తీసుకెళ్లడం చాలా ముఖ్యం. అయితే, భారతదేశం నుండి నేపాల్‌కు వెళ్లే పాస్‌పోర్ట్ లేని పర్యాటకులు, దేశంలోకి ప్రవేశించడానికి బదులుగా కొన్ని ఇతర డాక్యుమెంట్లను సమర్పించవచ్చు.
నేపాల్‌లోకి ప్రవేశించడానికి భారతీయ పౌరులకు వీసా అవసరం లేదు. అయితే, అలా చేయడానికి వారు ఈ కింది డాక్యుమెంట్లను అందించాలి.
భారతీయ ప్రజల కోసం ఈ కింది నేపాల్ ప్రవేశ ప్రమాణాలను గమనించడం ముఖ్యం.
తమ వాహనంలో రోడ్డు మార్గంలో నేపాల్‌లోకి వెళ్లే భారతీయ పౌరులు వారి పౌరసత్వ రుజువుతో పాటు, తప్పనిసరిగా నేపాల్ సరిహద్దు వద్ద ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించాలి:
నేపాలీ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం భారతీయ పౌరులు దేశంలోకి ప్రవేశించడానికి చెల్లుబాటు అయ్యే ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండవలసిన అవసరం లేదు. అయితే, హైకింగ్ కోసం ఆ దేశానికి వెళ్లే ఎవరైనా తప్పనిసరిగా నేపాల్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి.
ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అత్యవసర సమయంలో తక్షణ మద్దతునిస్తుంది మరియు నేపాల్‌కు వెళ్లేటప్పుడు ఊహించని ఖర్చుల ఆర్థిక నిర్వహణ కోసం సహాయం చేస్తుంది. ప్రయాణ సమయంలో విమాన ఆలస్యాలు మరియు అలాంటి ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చు, అయితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ సహాయంతో వాటిని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు. ప్రయాణికులు వారికి తెలియని విదేశీ దేశానికి వెళ్లినప్పుడు, వివిధ రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు.
భారతదేశం నుండి మీరు ఒక టూ-వీలర్ లేదా ఫోర్-వీలర్‌పై నేపాల్‌కు వెళ్లవచ్చు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు అవసరమైన అన్ని పర్మిట్‌లు అవసరం. నేపాల్‌లో నమోదిత ఆటోమొబైల్స్ ప్రవేశానికి సంబంధించి మీరు ఈ కింది వాటిని వివరంగా తెలుసుకోవాలి:
ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం, నేపాల్‌ను సందర్శించడానికి భారతీయ పౌరులకు ట్రావెల్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. నేపాల్‌కు వెళ్లే చాలా మంది భారతీయ పర్యాటకులు అక్కడి భూభాగం మరియు సంస్కృతి వైవిధ్యం, సారూప్యతను చూసి ఆశ్చర్యపోతుంటారు. అందువల్ల, కొన్నిసార్లు వారు వారి బసను మార్చాలి లేదా పొడిగించాలని అనుకుంటారు. దీనివల్ల వారికి మరింత డబ్బు ఖర్చవుతుంది. ఇలాంటి సందర్భంలో నేపాల్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగకరంగా ఉండవచ్చు.
మీరు నేపాల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు విమాన రద్దు, సామాను ఆలస్యం లేదా నష్టం, హోటల్ వసతి రద్దు మరియు ఇతర సాధ్యమయ్యే పరిస్థితుల వంటి వైద్య మరియు వైద్యేతర పరిస్థితుల కోసం కవర్ చేయబడతారు. అనేక ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు విదేశీ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తున్నారు.
మా అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ మీకు మరియు మీ తోటి ప్రయాణికులకు వైద్యపరమైన లేదా ఇతర సమస్యల విషయంలో ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.
మీరు వివిధ రకాల వైద్యేతర అత్యవసర పరిస్థితుల కోసం అనగా మీ డాక్యుమెంట్లు కోల్పోవడం (మీ పాస్‌పోర్ట్ లాంటిది), హోటల్ రిజర్వేషన్లు లేదా విమానాల రద్దు కావడం లాంటి పరిసితుల కోసం నేపాల్ కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో కవర్ చేయబడతారు.
నేపాల్ సందర్శన సమయంలో ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా జరిగే గాయం కోసం ఈ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. ట్రిప్ సమయంలో ఒక ప్రయాణికుడు కోవిడ్-19 వైరస్ బారిన పడినట్లయితే, వారు ఆర్థిక సహాయం కోసం అర్హులు కావచ్చు.
అంతర్జాతీయ ప్రయాణం తరచుగా సామాను ఆలస్యం లేదా నష్టానికి దారితీస్తుంది. మీ సామాను పోగొట్టుకున్నా లేదా రవాణాలో ఆలస్యం అయినా, నేపాల్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అధీకృత ఛార్జీల చెల్లింపును అందిస్తుంది.
మీరు భారతదేశం నుండి నేపాల్‌కు వెళ్లాలనుకుంటే, ఈ కింది ప్రవేశ అవసరాలు చాలా ముఖ్యం:
గత పదేళ్లలో జారీ చేయబడిన ప్రస్తుత భారతీయ పాస్‌పోర్ట్ మరియు మీరు నేపాల్‌కు చేరుకున్న తేదీ తర్వాత కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది
నేపాల్ వెళ్లేందుకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఓటరు గుర్తింపు కార్డు అవసరం.
నేపాల్‌లో అనేక కోవిడ్ సంబంధిత పరిమితులు సడలించబడినప్పటికీ, సందర్శకులు ఈ కింది వాటిని భరించాలి:
నేపాల్ దాదాపు 147,181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు మూడు వైపులా భారతదేశానికి సరిహద్దుగా ఉంది. ఈ వైవిధ్యభరితమైన ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు, సబ్-ఆల్పైన్ చెట్లతో కూడిన కొండలు మరియు ఎవరెస్ట్ పర్వతంతో సహా ప్రపంచంలోని పది ఎత్తైన పర్వతాల్లో ఎనిమిది ఇక్కడే ఉన్నాయి. నేపాల్ పర్యటన, మనోహరమైన ట్రెకింగ్ ప్రదేశాల నుండి విశ్రాంతి తీసుకునే ధ్యాన విరమణల వరకు వివిధ అనుభవాలను అందిస్తుంది.
మీరు నేపాల్‌కు వెళ్తున్నట్లయితే ఈ కింది దర్శనీయ ప్రదేశాలు మీ బకెట్ లిస్ట్‌లో తప్పక ఉండాలి.
ప్రతి యాత్రికుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో పర్యటించడానికి ముందు, నేపాల్ రాజధాని ఖాట్మండులో దిగవచ్చు. ఖాట్మండు ఆధునిక జీవితం మరియు పురాతన స్మారక చిహ్నాలు, విగ్రహాల సమన్వయ కలయికను అందిస్తుంది.
సాగర్‌మాత నేషనల్ పార్క్ నేపాల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇది దాని విలక్షణమైన వృక్షజాలం మరియు జంతు సంరక్షణ కోసం ప్రసిద్ధి చెందింది మరియు ఇది యునెస్కో యొక్క ప్రపంచ చారిత్రాత్మక ప్రదేశం. ఎర్రని పాండాలు మరియు మంచు చిరుతలు రెండూ ఇక్కడ కనిపిస్తాయి.
అన్నపూర్ణ-I, ధౌలగిరి మరియు మనస్లు పర్వత శ్రేణులు నేపాల్‌లోని ఈ రెండవ అతిపెద్ద నగరాన్ని చుట్టుముట్టాయి. ఇది అన్నపూర్ణ సర్క్యూట్ పర్వతం యొక్క ప్రవేశ మార్గంగా సూచించబడుతుంది.
భారతీయులకు నేపాల్ వీసా అవసరం లేదు. 1950లో భారతదేశం మరియు నేపాల్ మధ్య జరిగిన శాంతి మరియు స్నేహపూర్వక ఒప్పందం ఇరు దేశాల మధ్య పరిమితం కానీ వాణిజ్యాన్ని మరియు ప్రయాణాన్ని అనుమతిస్తుంది. ఫలితంగా, మీరు వీసా లేకుండా నేపాల్‌కు ప్రయాణించవచ్చు.
మీరు ఎల్లప్పుడూ మీ గుర్తింపును రుజువు చేసే ప్రభుత్వం జారీ చేసిన ఒక ఐడిని కలిగి ఉండాలి.
లేదు, నేపాల్‌లోకి ప్రవేశించడానికి భారతీయులకు నేపాల్ వీసా అవసరం లేదు. దేశంలోకి ప్రవేశించడానికి వ్యక్తులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లాంటి వారి జాతీయతను చూపించే గుర్తింపు డాక్యుమెంట్‌ను సమర్పించాలి.
నేపాల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి హామీ మొత్తం మరియు రెండవది దేశంలో మీ బస వ్యవధి.
మీరు బయలుదేరడానికి ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లో కొనుగోలు చేయండి, మీ ట్రిప్ షెడ్యూల్‌కు తగిన హామీ మొత్తం మరియు ఫీచర్లు కలిగి ఉండేలా చూసుకోండి.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి