Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

యూరోప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance for Europe

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

యూరోప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

ఇప్పటికిప్పుడు యూరప్ వెళ్లడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా?? మీ ట్రిప్‌ రక్షణ కోసం, మీ వద్ద తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. యూరప్ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడానికి, చదవండి!

మొట్టమొదటగా, యూరప్‌ ప్రయాణం కోసం ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు, తగిన కవరేజీతో మీరు ఒక అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయాలి. మా వెబ్‌సైట్‌లో, మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చవచ్చు మరియు మీ అవసరాలను ఉత్తమంగా తీర్చగల పాలసీని ఎంచుకోవచ్చు.

యూరప్ ప్రయాణం కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక క్లెయిమ్ సబ్మిట్ చేయడం మరియు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా రక్షణ కలిగిన యూరప్‌ దేశాల్లో ప్రయాణించే సమయంలో అయ్యే ఏవైనా ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ చాలా సులభంగా మరియు వేగంగా అందుకోవచ్చు.

భారతదేశం నుండి యూరప్‌ ప్రయాణం కోసం మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఏదైనా అంతర్జాతీయ ప్రదేశానికి ట్రిప్ కోసం సిద్ధమైనప్పుడు అత్యంత ప్లానింగ్ మరియు సంసిద్ధత అవసరం. వేరొక దేశంలో ఉన్నప్పుడు మీకు ఒత్తిడితో కూడిన సందర్భం ఎదురైనప్పుడు, మీరు తగినంత రక్షణతో సురక్షితంగా ఉండాలనుకోవడం లేదా?? కాబట్టి, యూరప్‌కు మీ ప్రయాణం ప్రారంభించే ముందు, జాగ్రత్తగా ప్లాన్ చేయడం, పరిశోధన చేయడం మరియు అంతర్జాతీయ వినియోగం అనేవి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కీలకం.

యూరప్‌ ప్రయాణం కోసం తక్కువ-ఖర్చుతో వచ్చే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను మీరు కొనుగోలు చేయకపోవడమే మంచిది. భారతదేశం నుండి యూరప్ ప్రయాణం కోసం, మేము అందించే సరసమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు ఎంచుకుంటే, అది మీకు తగినంత కవరేజీ అందిస్తుంది.

యూరప్ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు

ప్రయాణం అనేది మీ పరిధిని విస్తరించడానికి మరియు మీ ఆత్మను పునరుద్ధరించడానికి ఒక గొప్ప మార్గం అయినప్పటికీ, మీ ప్రయాణాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం మీరు ఒత్తిడి లేకుండా ఉండడం కూడా అవసరం. ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు మీకు తగినంత రక్షణ ఉంటుందనే మనశ్శాంతిని అందిస్తుంది. యూరప్ ప్రయాణం కోసం బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ప్రయాణాలు ఒత్తిడి లేకుండా ఉండేలా నిర్ధారించడానికి అనేక ప్రయోజనాల అందిస్తుంది:

 

1. సమర్థవంతమైన క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ : 

బజాజ్ అలియంజ్ జిఐసి అనేది వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం క్లెయిమ్‌లను తక్షణమే సెటిల్ చేయడంలో ప్రతిష్ట కలిగినదిగా ఉంటోంది.

 

2. తక్షణ సహాయం : 

యూరప్‌లో ఎక్కడినుండైనా సరే, కేవలం ఒక మిస్డ్ కాల్‌తో మీరు మా స్నేహపూర్వక కస్టమర్ సర్వీస్ బృందం నుండి తక్షణ కాల్-బ్యాక్ సహాయం అందుకోవచ్చు.

 

3. ప్రత్యేకంగా రూపొందించబడిన పాలసీలు : 

మీరు జంటగా, కుటుంబంతో లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పటికీ, మీ నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ఒక యూరోపియన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి.

 

4. ప్రత్యేక కవరేజ్ :  

విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్స్ ఎంచుకోవచ్చు ప్రత్యేక ట్రావెల్ ఇన్సూరెన్స్ వారి ప్రత్యేక అవసరాలను తీర్చే పాలసీ.

 

5. సమగ్రమైన కవరేజ్ :  

అనారోగ్యం, హాస్పిటలైజేషన్, ట్రిప్ రద్దు, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడం మరియు బ్యాగేజీ దొంగతనం లాంటి వివిధ సంఘటనలకు మా పాలసీ కవరేజీ అందిస్తుంది.

 

యూరప్ వీసా మరియు ప్రవేశ సమాచారం

చాలామంది యూరోపియన్ దేశాలనేవి షెంగన్ ప్రాంతంలో ఒక భాగంగా ఉంటాయి. ఈ ఖండంలో ఆంక్షలు లేని ప్రయాణానికి అనుమతించే ఒక ప్రాంతం ఇది.

 

యూనిఫార్మ్ షెంగన్ వీసా

 

మీరు యూరప్‌ కోసం ప్లాన్ చేసిన ట్రిప్ 90 రోజుల కంటే తక్కువగా ఉంటే, యూనిఫార్మ్ షెంగన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాలో క్రింది ఉప వర్గాలు ఉన్నాయి, అవి: 

  • టైప్ ఏ షెంగన్ వీసా - షెంగన్ ప్రాంతంలోని ఏదైనా విమానాశ్రయం ద్వారా ప్రయాణించడానికి (24 గంటలకు మించని వ్యవధి కోసం చెల్లుతుంది) 
  •  టైప్ సి షెంగన్ వీసా - షెంగన్ దేశానికి తక్కువ కాలం సందర్శన కోసం (90/180 నిబంధన తర్వాత - ఇది షెంగన్ ప్రాంతంలో 90 రోజులు మరియు ఈ ప్రాంతంలోకి మొదటగా వచ్చిన సమయం నుండి ఆరు నెలల వరకు చెల్లుతుంది). ఈ వీసా కోసం సింగిల్-ఎంట్రీ, డబుల్-ఎంట్రీ మరియు మల్టిపుల్-ఎంట్రీ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.
  • డి షెంగెన్ వీసా, నేషనల్ షెంగెన్ వీసా రకం లేదా రెండూ - అకడమిక్ ప్రోగ్రామ్ కోసం, కెరీర్ అవకాశం అందుకునే సౌలభ్యం కోసం లేదా అక్కడి ఏదైనా దేశంలో శాశ్వత వలసదారుగా ఉండిపోవాలనే ఆలోచనతో సుదీర్ఘ కాలం కోసం మీరు యూరప్‌కు ప్రయాణిస్తుంటే. ఒక సింగిల్-ఎంట్రీ లేదా మల్టిపుల్-ఎంట్రీ నేషనల్ షెంగెన్ వీసా కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

షెంగెన్ ప్రాంతంలోని దేశాన్ని మీరు ఎందుకు సందర్శించాలనుకుంటున్నారనే దాని మీద ఆధారపడి, వివిధ షెంగెన్ వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీసాల జాబితా క్రింద ఇవ్వబడింది: 

  • బిజినెస్ షెంగెన్ వీసా
  • షెంగెన్ సందర్శకుల వీసా
  • అధికారిక సందర్శనల కోసం షెంగెన్ వీసా
  • స్టూడెంట్ షెంగెన్ వీసా
  • షెంగెన్ మెడికల్ వీసా
  • ట్రాన్సిట్ షెంగెన్ వీసా
  • టూరిస్ట్ షెంగెన్ వీసా
  • సాంస్కృతిక, క్రీడలు మరియు మతపరమైన ఈవెంట్లు మరియు సినిమా సిబ్బంది కోసం షెంగెన్ వీసా

ప్రయాణించే సమయంలో, మీకు యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందని నిర్ధారించుకోండి.

 

యూరప్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్

మీరు యూరప్‌ను సందర్శించాలనుకుంటున్న భారతీయ పౌరులు అయితే, షెంగెన్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి క్రింద జాబితా చేయబడిన దశలు అనుసరించండి: 

  • మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న షెంగెన్ వీసా రకం ఎంచుకోండి - కేటగిరీ A, C, లేదా D.
  • మీరు వెళ్లాలనుకుంటున్న షెంగన్ దేశం మరియు ఆ వీసాతో మీరు సందర్శించాలనుకుంటున్న షెంగన్ దేశాల ఆధారంగా, మీకు సింగిల్-ఎంట్రీ వీసా లేదా మల్టిపుల్-ఎంట్రీ వీసాలో ఏది అవసరమో నిర్ణయించుకోండి.
  • మీరు ఎంచుకున్న వీసా కేటగిరీ కోసం ఏ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో దరఖాస్తు చేయాలనే సమాచారం తెలుసుకోండి.
  • మీరు ఎంచుకున్న యూరోపియన్ పర్యటన కోసం కనీసం పదిహేను రోజుల ముందు షెంగన్ వీసా కోసం దరఖాస్తు చేయండి. అయితే, ఆరు నెలల కంటే ముందే దరఖాస్తు చేయకండి.
  • షెంగన్ వీసా కోసం, సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్‌‌లో మీ ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోండి. షెంగన్ దేశం వీసా కోసం లేదా మీరు వెళ్లాలనుకుంటన్న దేశాల వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చా, లేదా అనే విషయం ధృవీకరించుకోండి.
  • అవసరమైన అన్ని పేపర్‌వర్క్‌తో నియమిత సమయంలో ఎంచుకున్న ఎంబసీ లేదా కాన్సులేట్‌ను సందర్శించండి.
  • షెంగన్ వీసా ఫీజు చెల్లించండి మరియు మీ వీసా ఇంటర్వ్యూ ఫలితాల కోసం వేచి ఉండండి. ఈ వివరాలు ఒక నెలలో తెలియజేయబడుతాయి.
  • ఆర్థికంగా సురక్షితమైన సెలవు ప్రయాణాన్ని నిర్ధారించడం కోసం, మీ షెంగన్ వీసాకు అదనంగా ఉత్తమ యూరోపియన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ కొనుగోలు చేయండి

 

భారతదేశం నుండి యూరప్‌కు ప్రయాణించే సమయంలో ఏ ప్రయాణ డాక్యుమెంట్లు అవసరమవుతాయి?

షెంగన్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి భారతీయ పౌరులకు అవసరమయ్యే పేపర్‌వర్క్:

  • సరిగ్గా పూర్తి చేయబడి మరియు సంతకం చేసిన వీసా అప్లికేషన్ ఫారమ్ ప్రింటెడ్ వెర్షన్
  • లైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • భారతదేశంలో జారీ చేయబడిన పాస్‌పోర్ట్ అనేది 10 సంవత్సరాల కంటే పాతదిగా ఉండకూడదు మరియు మీరు యూరప్‌కు చేరుకునే తేదీ తర్వాత కనీసం మూడు నెలల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి
  • షెంగన్ వీసాల కోసం దరఖాస్తు చేసే భారతీయ పౌరుల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో €30,000 కంటే ఎక్కువ మెడికల్ కవరేజీ మరియు వైద్య తరలింపు మరియు స్వదేశానికి తిరిగి రావడం కోసం కవరేజీ ఉంటాయి
  • యూరప్ వెళ్లడానికి మరియు తిరిగిరావడానికి ఎంచుకున్న విమాన వివరాల డాక్యుమెంట్లు
  • యూరప్‌కు మీ ప్రయాణ సమయంలో మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్న వసతుల రుజువు
  • యూరప్‌లో మీ బసను కవర్ చేయడానికి మీకు అవసరమైన డబ్బు ఉందనే రుజువు
  • మీరు యూరప్‌కు ఎందుకు ప్రయాణించాలనుకుంటున్నారో పేర్కొంటూ ఒక కవర్ లెటర్
  • మీ వివాహ సర్టిఫికెట్ మరియు వర్తించిన పక్షంలో, మీ పిల్లల పుట్టిన సర్టిఫికెట్లు లాంటి మీ పౌర స్థితి రుజువులు

యూరప్ వీసా కోసం అప్లికేషన్ ప్రాసెస్

మీరు యూరప్‌ను సందర్శించాలనుకుంటున్న భారతీయ పౌరులు అయితే, షెంగెన్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి క్రింద జాబితా చేయబడిన దశలు అనుసరించండి: 

  • మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న షెంగెన్ వీసా రకం ఎంచుకోండి - కేటగిరీ A, C, లేదా D.
  • మీరు వెళ్లాలనుకుంటున్న షెంగన్ దేశం మరియు ఆ వీసాతో మీరు సందర్శించాలనుకుంటున్న షెంగన్ దేశాల ఆధారంగా, మీకు సింగిల్-ఎంట్రీ వీసా లేదా మల్టిపుల్-ఎంట్రీ వీసాలో ఏది అవసరమో నిర్ణయించుకోండి.
  • మీరు ఎంచుకున్న వీసా కేటగిరీ కోసం ఏ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో దరఖాస్తు చేయాలనే సమాచారం తెలుసుకోండి.
  • మీరు ఎంచుకున్న యూరోపియన్ పర్యటన కోసం కనీసం పదిహేను రోజుల ముందు షెంగన్ వీసా కోసం దరఖాస్తు చేయండి. అయితే, ఆరు నెలల కంటే ముందే దరఖాస్తు చేయకండి.
  • షెంగన్ వీసా కోసం, సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్‌‌లో మీ ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోండి. షెంగన్ దేశం వీసా కోసం లేదా మీరు వెళ్లాలనుకుంటన్న దేశాల వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చా, లేదా అనే విషయం ధృవీకరించుకోండి.
  • అవసరమైన అన్ని పేపర్‌వర్క్‌తో నియమిత సమయంలో ఎంచుకున్న ఎంబసీ లేదా కాన్సులేట్‌ను సందర్శించండి.
  • షెంగన్ వీసా ఫీజు చెల్లించండి మరియు మీ వీసా ఇంటర్వ్యూ ఫలితాల కోసం వేచి ఉండండి. ఈ వివరాలు ఒక నెలలో తెలియజేయబడుతాయి.
  • ఆర్థికంగా సురక్షితమైన సెలవు ప్రయాణాన్ని నిర్ధారించడం కోసం, మీ షెంగన్ వీసాకు అదనంగా ఉత్తమ యూరోపియన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ కొనుగోలు చేయండి

 

యూరప్‌కు ప్రయాణిస్తున్నప్పుడు చేపట్టవలసిన భద్రత మరియు జాగ్రత్త చర్యలు

యూరప్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ కొన్ని భద్రత మరియు నివారణ జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలి, అవి క్రింద జాబితా చేయబడ్డాయి:

● అన్ని సమయాల్లోనూ మీ పాస్‌పోర్ట్‌ను మీతో ఉంచుకోండి

● ప్రత్యేకించి, జనం ఎక్కువగా ఉండే పర్యాటక గమ్యస్థానాలు మరియు ప్రముఖ పర్యాటక గమ్యస్థానాల్లో మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి

● మీరు మీ వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం యూరప్‌లో ఉండబోవడం లేదని నిర్ధారించుకోండి

● ముఖ్యంగా రాత్రి సమయంలో, నిర్మాణుష్య లేదా అపరిచిత ప్రదేశాలకు వెళ్లడం నివారించండి

● అక్కడి ప్రజలకు అనుచితమైన లేదా చట్టవిరుద్ధ చర్యల్లో పాల్గొనడం లేదా అలాంటి భాష ఉపయోగించడం చేయకండి

● వివిధ దురదృష్టకర పరిస్థితుల నుండి మీ ట్రిప్ తగినంతగా కవర్ చేయబడుతుందని హామీ ఇచ్చేలా, యూరప్ కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి

 

కోవిడ్-19కి నిర్దిష్టమైన భద్రత కోసం మార్గదర్శకాలు

● ప్రత్యేకించి, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించే సమయంలో, మీ నోరు మరియు ముక్కు మూసి ఉండేలా ఒక మాస్క్ ధరించండి

● సోషల్ ఐసోలేషన్‌లో పాల్గొనడం

● సంబంధిత కోవిడ్-19 ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా, స్థానిక ప్రభుత్వం మరియు నియమితమైన అధికారులకు సహాయపడడం

● మీలో ఏవైనా Covid-19 లక్షణాలు కనిపిస్తే, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుని, పరీక్ష చేయించుకోవాలి మరియు తర్వాత ప్రక్రియను పునరావృతం చేసుకోవాలి

● చివరిగా, ఆర్థికంగా మరియు భౌతికంగా సురక్షితమైన ట్రిప్ కోసం యూరప్ ప్రయాణానికి అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి.

 

తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం : ప్రతి ముఖ్యమైన యూరోపియన్ దేశం భారతదేశంలో ఒక ఎంబసీని కలిగి ఉంది. మీరు సందర్శించాలనుకుంటున్న యూరోపియన్ దేశానికి లేదా దేశాలకు సంబంధించిన భారత ఎంబసీ వివరాలను మీరు తప్పక తనిఖీ చేయాలి. మీకు ప్రయాణంలో ఎప్పుడైనా సహాయం అవసరమైతే లేదా ఆన్‌లైన్ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్.

 

 

యూరప్‌లో ఏయే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి?

● యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఉండే హీత్రూ విమానాశ్రయం

● ఫ్రాన్స్‌లోని ప్యారీస్‌లో ఉండే చార్లెస్ డి గోల్ విమానాశ్రయం

● నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉన్న షిపోల్‌లో ఉండే ఆమ్‌స్టర్‌డ్యామ్‌ విమానాశ్రయం

● జర్మనీలోని బెర్లిన్‌లో ఉండే బెర్లిన్ టెగెల్ విమానాశ్రయం

● టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉండే ఇస్తాంబుల్ విమానాశ్రయం

యూరప్‌కు ప్రయాణించే సమయంలో కరెన్సీ మరియు ఫారిన్ ఎక్ఛేంజీ వివరాలు

యూరో (€) అనేది చాలా యూరోపియన్ దేశాల్లో అధికారిక కరెన్సీగా ఉంటోంది. యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 19 దేశాలు ఈ కరెన్సీని అధికారికంగా వినియోగిస్తున్నాయి. యూరో (€) మరియు ఇండియన్ నేషనల్ రూపీ (₹) మధ్య ఎక్స్చేంజ్ రేటు ప్రతిరోజూ మారుతుందనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీరు యూరప్‌కు ప్రయాణించడానికి ముందే ప్రస్తుత కరెన్సీ రేటును తనిఖీ చేయాలి.

మీరు యూరప్‌లో సందర్శించగల పర్యాటక ప్రదేశాలు

మీరు యూరప్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, మీ భద్రత కోసం భారతదేశం నుండి యూరప్ ప్రయాణ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని నిర్ధారించుకోండి. మీ యూరోపియన్ విహారయాత్ర కోసం క్రింది ప్రదేశాలను మీ అజెండాలో చేర్చుకోవచ్చు:

 

1. రోమ్ :

రోమ్ అనే ఇక్కడి శాశ్వత నగరం మహాసామ్రాజ్యాల స్థాపనలు మరియు కుప్పకూలిన నేపథ్యాల్లో అనేక హింసాత్మక యుగాలను చవిచూసింది. ప్రాచీన కొలోజియం, రోమన్ ఫోరమ్, ది పాంథియన్ మరియు పొరుగున ఉండే వాటికన్ నగరంతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ల్యాండ్‌మార్క్‌ల్లో కొన్నింటికి రోమ్ నిలయంగా ఉంటోంది. ఫౌంటెన్లు, విస్తృత ప్రదేశాలు, సాంప్రదాయక ఇటాలియన్ వంటకాలు మరియు చార్మింగ్ కేఫ్‌ల కోసం రోమ్ ప్రసిద్ధి చెందింది.

 

2. ప్యారిస్ :

ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన నగరాల్లో ప్యారిస్ ఒకటి. సీన్ నది ఒడ్డున ఈ నగరం కొలువై ఉంది. ప్యాలెస్ ఆఫ్ వెర్సెయిల్స్, ఐఫిల్ టవర్ మరియు బిబ్లియోథెక్ నేషనల్ లాంటి ఈ సిటీ ఆఫ్ లైట్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు. స్నేహపూర్వక ఆతిథ్యం మరియు అంతర్జాతీయ సంస్కృతికి ఇవి ప్రసిద్ధి చెందాయి.

యూరప్‌ సందర్శనకు ఏ సమయం ఉత్తమమైనది?

జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలోని వేసవి నెలలు యూరప్‌ పర్యటనకు అనువైనవి. ఈ నెలల్లో ఈ ఖండంలోని బీచ్‌లు మరియు పర్వతాలు ప్రయాణానికి ఉత్తమమైనవి. ఎందుకంటే, చాలా యూరోపియన్ నగరాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి. యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఎంచుకున్న తర్వాత, మీరు వెంటనే యూరప్‌కు మీ సెలవు ప్రయాణం కోసం ప్లాన్ చేయడం ప్రారంభించవచ్చు.

మీరు అత్యుత్తమమైనది ఎంచుకోవచ్చు ట్రావెల్ ఇన్సూరెన్స్ భారతదేశం నుండి యూరప్ ప్రయాణం కోసం మా ప్రత్యేక ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపిక అనేది యూరప్ ప్రయాణం కోసం అన్ని సమయాల్లో రక్షణ అందిస్తుంది.

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

తరచుగా అడిగే ప్రశ్నలు

యూరప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ నాకు ఎక్కడ లభిస్తుంది?

మా వెబ్‌సైట్‌ సందర్శించడం ద్వారా మరియు ప్రోడక్ట్స్ విభాగం కింద ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ యూరప్‌ ఎంచుకోవడం ద్వారా, యూరప్ కోసం మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. తదుపరి పేజీలో, అవసరమైన వ్యక్తిగత సమాచారం పూరించండి మరియు మీకు కావలసిన కవరేజీ ఎంచుకోండి.

మీ యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు ఎంచుకోగల క్రింది అదనపు కవరేజ్ ఎంపికలు ఉన్నాయి:

  • మెడికల్ ఇన్సూరెన్స్
  • బ్యాగేజి ఇన్సూరెన్స్

యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను ఎంత ఖర్చు చేయాలి?

మీరు ఎంచుకున్న సమ్ ఇన్సూర్డ్ మరియు మీరు ఏ దేశం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ కొనుగోలు చేశారనే దానిమీద ఆధారపడి, యూరప్ ప్రయాణం కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కోసం ఖర్చును ప్రభావితం చేస్తుంది. మీరు కుటుంబంతో యూరప్‌కు ప్రయాణిస్తున్నట్లయితే, ప్రతి ఒక్కరికీ తగినంత ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండడం అనేది అధిక మొత్తంలో హామీ అందిస్తుంది. 

మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ యూరప్ పాలసీ కొనుగోలు చేయడం అవసరమా?

అవును, యూరప్ ప్రయాణం కోసం మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి షెంగన్ వీసా పొందడం మరియు అక్కడికి ప్రయాణం చేయడం అవసరం. కాబట్టి, యూరప్‌కు మీ సెలవు ప్రయాణం అనేది అనేక సంభావ్య ఊహించని పరిస్థితుల నుండి ఆర్థికంగా రక్షించబడుతుందని నిర్ధారించడం కోసం మీ యూరప్ ప్రయాణం కోసం మీరు ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవాలి. 

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం