Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance for Germany

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

జర్మనీ సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?? జర్మనీ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ మిస్ చేయకూడదని మీరు నిర్ధారించుకోవాలి! ప్రపంచంలో అత్యంత చక్కనైన, నచ్చిన ప్రయాణ గమ్యస్థానాల్లో జర్మనీ ఒకటి. ఇక్కడి వైవిధ్యమైన భూప్రదేశాలు మరియు ఈ దేశపు విలక్షణమైన చరిత్ర ఇందుకు కారణాలు. మ్యూజియంలు మొదలుకొని మెమోరియల్స్ వరకు మరియు ఆర్కిటెక్చరల్ అద్భుతాల నుండి ఆర్ట్ గ్యాలరీల వరకు విభిన్న సామాజిక-ఆర్థిక నేపథ్యాలు మరియు దేశాలకు చెందిన ప్రజలను ఆకర్షించగల ఏదో ఒకటి ఈ దేశంలో ఉంది.

ఈ అందమైన గమ్యస్థానానికి మీ ప్రయాణం అనేది ఆర్థిక రక్షణ కలిగి ఉందనే హామీ కోసం, జర్మనీకి ట్రిప్ కోసం ప్లాన్ చేసే ప్రతిఒక్కరూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయాల్సిందిగా సలహా ఇవ్వడమైనది.

జర్మనీ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందే ప్రక్రియ అత్యంత సులభమైనది మరియు అవాంతరాలు-లేనిది.

 

భారతదేశం నుండి జర్మనీ వెళ్లడానికి మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

మీరు మీ జీవితంలో దేనికోసమైనా సరే, ఎంత జాగ్రత్తగా సిద్ధమైనప్పటికీ, మీ ప్రణాళికను దెబ్బతీయగల అనిశ్చిత పరిస్థితులనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. విదేశంలో మీ సెలవు ప్రణాళికను రక్షించుకోవడం కోసం విశ్వసనీయమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీని మీరు కొనుగోలు చేయాలి.

స్నేహితులు మరియు బంధువులతో సహా, ప్రయాణం చేసే అందరికీ అవసరమైన భద్రత అందుకోవడంలో భాగంగా, జర్మనీ ప్రయాణం కోసం తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడమైనది. జర్మనీ ప్రయాణం కోసం పాలసీ ఎంచుకునేటప్పుడు ఆ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో హెల్త్ కవరేజీ కూడా ఉందని నిర్ధారించుకోండి..

జర్మనీకి ప్రయాణించే సమయంలో విమానాశ్రయాల్లో మీరు ఏదైనా లగేజీ పోగొట్టుకున్నా లేదా ఆలస్యం జరిగినా, ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అగ్రశ్రేణి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను భారతదేశం నుండి అందుకోవడం ద్వారా, మీ బడ్జెట్ మరియు ఇన్సూరెన్స్ అవసరాల ఆధారంగా మీరు మీ రక్షణ స్థాయి ఎంచుకోవచ్చు మరియు ప్రయాణ సమయంలో ఊహించని సంఘటనల నుండి మీ ఫైనాన్సులను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

జర్మనీ ప్రయాణం కోసం బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు ఎలాంటి ఆందోళనలు లేకుండా ఒక ఉత్తేజకరమైన సాహసాన్ని అనుభవించవచ్చు. మా జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది, వాటిలో ఇవి కూడా భాగంగా ఉంటాయి:

  • తక్షణ సహాయం -

    మీరు ఒకే ఒక మిస్డ్ కాల్‌తో జర్మనీలో ఎక్కడినుండైనా తక్షణ ఫోన్ సహాయం అందుకోవచ్చు.

  • పాలసీ రకాలు -

    మా విస్తృత శ్రేణి ప్లాన్‌ల నుండి మీ అవసరాలకు సరిపోయే పాలసీని మీరు ఎంచుకోవచ్చు. అదనంగా, విద్యార్థులు మరియు సీనియర్ సిటిజన్లు వారి ప్రత్యేక అవసరాలు తీర్చే కస్టమైజ్డ్ కవర్‌ ఎంచుకోవచ్చు.

  • సమర్థవంతమైన క్లెయిమ్‌ల ప్రక్రియ -

    బజాజ్ అలియంజ్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రాసెస్ సజావుగా మరియు సమర్థవంతంగా ఉండడంతో పాటు మీ క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ చేయబడుతాయని నిర్ధారిస్తుంది.

  • సమగ్రమైన కవరేజ్

    బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది సమగ్ర కవరేజీ అందిస్తుంది. హాస్పిటలైజేషన్, ట్రిప్ రద్దు, బ్యాగేజీ నష్టం, ట్రిప్ తగ్గింపు మరియు మరెన్నో ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

జర్మనీ వీసా మరియు ప్రవేశ సమాచారం


సెంట్రల్ యూరోప్‌లోని జర్మనీలో భారతీయులు పర్యటించాలనుకుంటే క్రింది రకాల జర్మన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చు:


  • టూరిస్ట్ వీసా:

    విశ్రాంతి కోసం మీరు ఆ దేశానికి వెళ్తుంటే, జర్మనీకి పర్యాటక వీసా కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు. షెంజెన్ టూరిస్ట్ వీసా గరిష్ట చెల్లుబాటు మూడు నెలలుగా ఉంటుంది. భారతదేశంలోని జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్లలో మీరు షెంజెన్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భాషా కోర్సు వీసా:

    ఆ దేశం భాషను క్షుణ్ణంగా నేర్చుకోవడం కోసం మీరు ఆ దేశానికి ప్రయాణిస్తుంటే, జర్మనీలోకి ప్రవేశించడం కోసం మీరు ఒక లాంగ్వేజ్ కోర్సు వీసా కోసం దరఖాస్తు చేయవచ్చు. మీరు ఎంచుకున్న కోర్సు వ్యవధి కనీసం 3 నుండి 12 నెలల వరకు ఉండాలి మరియు వారానికి కనీసం 18 గంటలు బోధనా సమయంగా ఉండాలని తప్పక గుర్తుంచుకోండి.
  • స్టూడెంట్ అప్లికెంట్ వీసా:

    జర్మన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేయడంతో పాటు ఆ దరఖాస్తు అంగీకరించబడే సంభావ్యత కలిగిన భారతీయ జాతీయులు స్టూడెంట్ అప్లికేషన్ వీసా కోసం అభ్యర్థించవచ్చు. పైన పేర్కొన్న వీసా అనేది జర్మనీలో ముఖ్యమైన ప్రీ-అడ్మిషన్ పరీక్షలు, ఇంటర్వ్యూలు మరియు ఇతర ప్రక్రియల్లో పాల్గొనడానికి ఆ అభ్యర్థికి వీలు కల్పిస్తుంది.
  • విద్యార్థి వీసా:

    ఏదైనా అకడమిక్ ప్రోగ్రామ్‌ కోసం మీరు అంగీకరిస్తే, మీరు తప్పనిసరిగా ఒక స్టూడెంట్ వీసా టూ జర్మనీ కోసం దరఖాస్తు చేయాలి. జర్మనీలో మీరు ఉండబోయే వ్యవధి 3 నెలల కంటే ఎక్కువగా ఉంటే, మీ స్టూడెంట్ వీసాతో పాటు 3 నెలలకు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా రెసిడెన్స్ పర్మిట్ కూడా ఉండాలి.
  • బిజినెస్ వీసా:

    జర్మనీలో వ్యాపారం చేయాలనుకునే భారత జాతీయుల కోసం ఒక తక్కువ కాలపు షెంజెన్ వీసా అవసరం. జర్మన్ బిజినెస్ వీసాతో జర్మనీలో 90-రోజుల వరకు బస కోసం అనుమతించబడుతుంది. అది గరిష్టంగా ఆరు నెలల వరకు పొడిగించబడుతుంది.
  • ఎంప్లాయిమెంట్/వర్కింగ్ వీసా:

    జర్మనీలో పనిచేయడం కోసం మీరు ఆ దేశానికి ప్రయాణిస్తే, జర్మనీ వర్కింగ్/ఎంప్లాయిమెంట్ వీసా కోసం మీరు దరఖాస్తు చేయాలి. ఇది ఒక దీర్ఘకాలిక వీసా మరియు దాని చెల్లుబాటు అనేది మీ ఉపాధి ఒప్పందం ఎంత కాలం ఉంటుందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మీ ఉపాధి పరిస్థితి మారకపోతే, ఉపాధి వీసా పొడిగింపు కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు.

 

ఇప్పటికే పేర్కొన్న వాటికి అదనంగా, క్రింది వీసా కేటగిరీల్లో ఒకదాని కోసం కూడా జర్మనీకి ప్రయాణించే భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చు:

  • ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా
  • గెస్ట్ సైంటిస్ట్ వీసా
  • మెడికల్ ట్రీట్మెంట్ వీసా
  • ట్రేడ్ ఫెయిర్ మరియు ఎగ్జిబిషన్ వీసా
  • ట్రైనింగ్/ఇంటర్న్‌షిప్ వీసా

జర్మనీ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియ


మీ సందర్శన కారణం మీద ఆధారపడి, భారతీయుల కోసం ఒక నిర్దిష్ట జర్మనీ వీసా కోసం మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో బిజినెస్ వీసాలు, ట్రాన్సిట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు మరియు మరిన్ని ఉంటాయి. జర్మన్ వీసా కోసం మీరు దరఖాస్తు చేయడానికి ముందు, మీరు ఏ కేటగిరీకి అర్హత కలిగి ఉన్నారో ఖచ్చితంగా ధృవీకరించుకోవాలి. వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు మీ అప్లికేషన్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. పాస్‌పోర్ట్ మరియు వీసా అప్లికేషన్ల కోసం ఫోటోలు మరియు ఇతర వివరాలు కూడా మీకు అవసరమవుతాయి.

మీరు మీ అప్లికేషన్‌ను ఎంచుకున్న ప్రాంతం (క్రింద పేర్కొన్న విధంగా)లోని జర్మన్ కాన్సులేట్ లేదా ఎంబసీ వారికి ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. కాన్సులేట్ లేదా ఎంబసీలో మీ వీసా అప్లికేషన్ సమీక్షించబడుతుంది మరియు అవసరమైతే, మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.

 

భారతదేశం నుండి జర్మనీకి ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రయాణ డాక్యుమెంట్లు అవసరం?

 

మీరు జర్మనీకి ప్రయాణిస్తున్నప్పుడు మీ వద్ద తప్పనిసరిగా ట్రావెల్ మరియు గుర్తింపు డాక్యుమెంట్లు ఉండాలి. అదనంగా, మీరు ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్.

 

  • పది సంవత్సరాల కంటే ఎక్కువ పాతది కాని, ప్రస్తుత, మూడు నెలల చెల్లుబాటు కలిగిన భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి
  • ఇటీవలి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • చెల్లుబాటు అయ్యే షెంజెన్ వీసా
  • మీ పాస్‌పోర్ట్ డేటా పేజీ కాపీ
  • ఒక విశ్వసనీయమైన జర్మనీ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
  • ట్రిప్ షెడ్యూల్ కలిగిన పరిచయం లేఖ
  • అవసరమైతే, విమానాలు మరియు రైళ్ల కోసం బుక్ చేసిన టిక్కెట్లతో సహా ప్రయాణ డాక్యుమెంటేషన్
  • జర్మనీ వెళ్లడం వెనుక మీ ఉద్దేశ్యాన్ని ప్రదర్శించే ఒక డాక్యుమెంట్
  • పే స్టబ్‌లు ఇన్కమ్ టాక్స్ రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు మరియు ఆదాయ ధృవీకరణ లాంటి మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తెలియజేసే సాక్ష్యం
  • మీ యజమాని నుండి లెటర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (సంబంధితంగా ఉంటే)
  • మీ విశ్వవిద్యాలయం నుండి లెటర్ ఆఫ్ అప్రూవల్ (అవసరమైతే)
  • మీ పౌర స్థితిని రుజువు చేసే డాక్యుమెంట్లు (వివాహ లైసెన్స్, జీవిత భాగస్వామి మరణ సర్టిఫికెట్ లేదా పిల్లల జనన సర్టిఫికెట్ లాంటివి కొన్ని ఉదాహరణలు)

జర్మనీ-నిర్దిష్ట కోవిడ్-19 ప్రయాణ డాక్యుమెంట్లు


  • 48 గంటల కంటే పాతది కాని నెగటివ్ RT-PCR టెస్ట్ ఫలితం మరియు/లేదా కోవిడ్-19 ఇమ్యూనైజేషన్ డాక్యుమెంటేషన్

కెనడాకు ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు మరియు భద్రతా నియమాలు


  • మీ పాస్‌పోర్ట్‌ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోండి
  • మీ పాస్‌పోర్ట్‌లోని అనుమతించదగిన వ్యవధి పరిమితిని ధృవీకరించండి
  • దేశం యొక్క నియమాలు మరియు చట్టాలను పరిశీలించండి
  • ప్రైవేట్ డ్రైవర్‌ను ఎంచుకోవడానికి బదులుగా అధికారిక వాణిజ్య రవాణా ఉపయోగించండి
  • మీ వీసా గడువు ముగిసిన తర్వాత ఆ దేశంలో ఉండకండి
  • ముఖ్యంగా రాత్రివేళల్లో, నిర్మాణుష్య లేదా అపరిచిత ప్రదేశాలకు వెళ్లకండి
  • ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనవద్దు
  • మాటలు, చేతలు లేదా రెండింటి మిశ్రమం ద్వారా, ఇతరులకు కోపం తెప్పించకండి
  • దురదృష్టకర సంఘటనల నుండి మీ ఫైనాన్సులు రక్షించుకోవడం కోసం, జర్మనీ ప్రయాణం కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోండి

కోవిడ్-19 కోసం నిర్దిష్ట భద్రతా సలహా


  • ప్రత్యేకించి, ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణించే సమయాల్లో, మీ నోరు మరియు ముక్కు కప్పి ఉంచేలా మాస్క్ ధరించండి.
  • భౌతిక దూరం పాటించండి.
  • మీకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే, మీరు ఏకాంతంలో ఉండడంతో పాటు పరీక్ష చేయించుకోండి. ఆ తర్వాత, ఆ ప్రక్రియను పునరావృతం చేయండి.
  • మీరు సుదూరంలో ఉన్నప్పుడు భారతదేశం నుండి జర్మనీ ప్రయాణం కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండడం మీకు సహాయపడుతుంది.

తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం


మీ ట్రిప్‌లో మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే, మీ దేశపు ఎంబసీ అనేది మీరు సంప్రదించే మొదటి కాంటాక్ట్‌గా ఉండాలి. వివరాలు ఇక్కడ అందించబడ్డాయి.

 

ఎంబసీ సంప్రదింపు వివరాలు:

ది ఎంబసీ ఆఫ్ ఇండియా, టైర్‌గార్టెన్‌స్ట్రాబే17, 10785 బెర్లిన్, జర్మనీ

వెబ్‌సైట్: ఎంబసీ ఆఫ్ ఇండియా, బెర్లిన్, జర్మనీ
ఇమెయిల్: dcm.berlin@mea.gov.in
టెలిఫోన్ నంబర్: +49 - 30 - 257950
ఫ్యాక్స్ నంబర్: +49 - 30 - 26557000
పని గంటలు: సోమవారం నుండి శుక్రవారం వరకు, 9:00 AM నుండి 5:30 PM వరకు

కాన్సులర్ సర్వీసుల పని గంటలు:

డాక్యుమెంట్లు సమర్పించడం: సోమవారం నుండి శుక్రవారం వరకు, 09:30 AM నుండి 12:30 PM వరకు
డాక్యుమెంట్ల సేకరణ: సోమవారం నుండి శుక్రవారం వరకు, 4:00 PM నుండి 5:00 PM వరకు
కాన్సులర్ సర్వీసెస్ టెలిఫోన్ నంబర్: +49 - 30 25795 820

 

జర్మనీలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవి?

 

  • ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం, ఫ్రాంక్‌ఫర్ట్
  • మ్యూనిచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మ్యూనిచ్
  • హాంబర్గ్ విమానాశ్రయం, హాంబర్గ్
  • బెర్లిన్ టెగెల్ విమానాశ్రయం, బెర్లిన్
  • డసెల్‌డార్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డసెల్‌డార్ఫ్

జర్మనీకి ప్రయాణించడం కోసం నగదు మరియు ఫారిన్ ఎక్ఛేంజ్


యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాల్లో 19 దేశాలకు అధికారిక కరెన్సీగా ఉన్న యూరో (€) అనేది జర్మనీకి చెందిన యూనిట్ ఆఫ్ ఎక్ఛేంజ్‌గా ఉంటుంది. యూరో (€) మరియు ఇండియన్ నేషనల్ రూపీ (₹) మధ్య ఎక్స్చేంజ్ రేటు అనేది రోజూ మారుతూ ఉంటుంది. కాబట్టి, మీరు జర్మనీకి ప్రయాణించే ముందు ప్రస్తుత ఎక్స్చేంజీ రేటు గురించి పరిశీలించాలి. అంతేకాకుండా, మీ ప్రయాణ సమయంలో పైన పేర్కొన్న కరెన్సీలో మీరు తగినంత మొత్తం కలిగి ఉండాలి.

జర్మనీలో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు


జర్మనీ ప్రయాణం కోసం మీ వద్ద తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే, ఆ దేశంలోని ఉత్తమ గమ్యస్థానాలకు మీరు చేరుకోవచ్చు మరియు వాటిని ఆస్వాదించవచ్చు. చరిత్రతో లోతైన సంబంధంతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఉనికి కలిగిన జర్మనీ, దాని ఆధునిక ఆర్కిటెక్చరల్ అద్భుతాలతో పాటు చారిత్రక ల్యాండ్‌మార్క్‌లకు కూడా ప్రసిద్ధి చెందిన దేశంగా ఉంటోంది.

సెంట్రల్ యూరప్‍‌లోని ఈ దేశానికి మీరు ప్రయాణిస్తుంటే, క్రింద పేర్కొన్న ప్రదేశాలు మీ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి:

  • బెర్లిన్:

    జర్మనీ రాజధాని మరియు యూరోపియన్ యూనియన్‌లో ప్రముఖ సాంస్కృతిక కేేంద్రాల్లో ఒకటైన బెర్లిన్. చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌లు మరియు సాంస్కృతిక సమ్మేళనంతో ఉండే ఈ నగరం ఆధునిక లగ్జరీతో పాటు పురాతన ఆకర్షణ కూడా కలిగి ఉంటుంది. బెర్లిన్‌లో ఉన్నప్పుడు, మీరు బ్రాండెన్‌బర్గ్ గేట్, మ్యూజియం ఐల్యాండ్, జర్మన్ హిస్టారికల్ మ్యూజియం మరియు చార్లటెన్‌బర్గ్ ప్యాలెస్‌ను తప్పక చూడాలి.
  • మ్యూనిచ్:

    జర్మనీలోని ప్రధాన పట్టణాల్లో ఒకటి మరియు పర్యాటకులు గొప్పగా ఇష్టపడే మ్యూనిచ్ నగరం అనేది బవేరియన్ ఆల్ప్స్ అంచు మీద కొలువై ఉంది. అద్భుతమైన చర్చిలతో కొలువుదీరిన ఈ నగరం, గొప్ప మతపరమైన మరియు సాంస్కృతిక చరిత్రకు ప్రసిద్ధి చెందినది. మీరు మ్యూనిచ్‌లో ఉన్నప్పుడు, రెనైసెన్స్ ఆశ్చర్యంగా ఉండే మైకాహెల్స్‌కిర్చ్, మరియు నగరం మధ్యలోని ఓపెన్ స్పేస్‌గా ఉండే మేరియన్‌ప్లాట్జ్‌ను తప్పక చూడాలి. మ్యూనిచ్‌లో, మీరు అనేక ఆర్ట్ గ్యాలరీలు మరియు మ్యూజియంలు సందర్శించవచ్చు.
  • కొలోన్:

    వ్యాపారం మరియు వాణిజ్యం కేంద్రంగా ప్రసిద్ధి చెందిన జర్మన్ సిటీ ఆఫ్ కొలోన్‌లో కేథడ్రల్స్, కేఫ్స్ మరియు గ్యాలరీలకు కొరత లేదు. రోమన్ సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఈ నగరంలో రోమన్ ఆర్కిటెక్చర్ మరియు ఆ సంస్కృతికి చెందిన అనేక స్మారకాలు ఉన్నాయి. కొలోన్‌లోని అత్యంత ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ అద్భుతాల్లో క్యాథడ్రల్ ఒకటి.

మీ ఉద్దేశాలతో సంబంధం లేకుండా, భారతదేశం నుండి జర్మనీ వెళ్లడం కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయాలని నిర్ధారించుకోండి. తద్వారా, మీరు ఎల్లప్పుడూ కవర్ కలిగి ఉంటారు.

జర్మనీ సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?


జర్మనీ ప్రయాణం కోసం మార్చి నుండి మే వరకు నెలలు ఉత్తమంగా ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడ వసంతకాలం ఉంటుంది. అలాగే, ఇక్కడ శరత్కాలం ఉండే అక్టోబర్ మరియు నవంబర్ నెలలు కూడా ఉత్తమంగా ఉంటాయి. జర్మనీలో, ఈ రెండు సీజన్లలో ఉష్ణోగ్రతలు తరచుగా 19 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయి. సాధారణంగా, ఈ దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వేసవికాలం ఉండడంతో పాటు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు కాబట్టి, మీ పర్యటనకు అది తగిన సమయం కాదు. మీ అవసరాలకు చక్కగా సరిపోయే ఒకదానిని ఎంచుకోవడానికి వీలుగా, జర్మనీ పాలసీలను సరిపోల్చడానికి మా వెబ్‌సైట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

భారతదేశం నుండి జర్మనీకి ప్రయాణించడం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా, మీరిప్పుడు జర్మనీని సందర్శించవచ్చు మరియు మీ విదేశీ పర్యటనను ఆర్థికంగా సురక్షితమైనదిగా చేసుకోవచ్చు.

Frequently Asked Questions

తరచుగా అడిగే ప్రశ్నలు

జర్మన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని నేను ఏవిధంగా కొనుగోలు చేయగలను?

మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు మరియు జర్మనీ ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రోడక్టుల విభాగం క్రింద అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఎంచుకోవచ్చు. మీరు మీ వ్యక్తిగత సమాచారం నమోదు చేసి, క్రింది పేజీలో మీకు కావలసిన కవరేజీ స్థాయిని ఎంచుకోవాలి. జర్మనీ ప్రయాణం కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు మీరు క్రింది అదనపు ప్రయోజనాలు కూడా జోడించవచ్చు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం:

-వైద్య రక్షణ

-బ్యాగేజ్ రక్షణ

మీ జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం కవరేజీ ఎంచుకున్న తర్వాత మరియు దాని కోసం చెల్లించిన తర్వాత మీరు మీ పాలసీ కొనుగోలు పూర్తి చేయవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజీ వెంటనే జారీ చేయబడుతుంది మరియు మీ ఇమెయిల్ అకౌంట్‌కు డెలివరీ చేయబడుతుంది.

జర్మన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను ఎంత ఖర్చు చేయాలి?

జర్మనీ ప్రయాణం కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ధర అనేది మీ బస కొనసాగే వ్యవధి మరియు పాలసీ కొనుగోలు చేసే సమయంలో మీరు ఎంచుకునే సమ్ అస్యూర్డ్ లాంటి కొన్ని చరరాశుల ఆధారంగా మారుతుంది. మీరు మీ కుటుంబంతో సహా జర్మనీని సందర్శించాలని ప్లాన్ చేస్తే, ట్రిప్ సమయంలో మీ అందరి కోసం తగినంత కవరేజీ ఉండేలా ఆమోదయోగ్యమైన సమ్ అస్యూర్డ్ ఎంచుకోవాల్సిందిగా మీకు సలహా ఇవ్వడమైనది.

మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ జర్మనీ ప్లాన్‌ కొనుగోలు చేయడం అవసరమా?

అవును, షెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే, జర్మనీ కోసం ప్రస్తుతం మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అవసరం. కాబట్టి, దురదృష్టకర పరిస్థితుల నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షించుకోవడం కోసం జర్మనీ కోసం తగిన మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవాలి.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం