Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance for the UAE

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

అద్భుతమైన ఎడారుల నుండి మంత్రముగ్దుల్ని చేసే అరేబియా సముద్రం వరకు యుఎఇ అనేక భూభాగాల కలయికతో కూడిన ప్రాంతం, ఇది ఎల్లప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. దుబాయ్, రాస్ అల్ ఖైమా, అబుదాబి, షార్జా, ఫుజైరా, ఉమ్మ్ ఆల్ కువైన్ మరియు అజ్మాన్‌లతో సహా ఏడు అరబ్ ఎమిరేట్స్‌ కలుపుకొని ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి.

అంతేకాకుండా, ఈ తీరాలకు తరలివచ్చే వలస జాతి పక్షులు ప్రపంచ వ్యాప్తపు పక్షి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చాలా మంది సందర్శకులు ఈ ఎమిరేట్స్ దేశానికి బయలుదేరే ముందు యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తారు.

తీవ్రమైన వేడి కారణంగా పర్యాటకులు వేడి అలసట లేదా హీట్ స్ట్రోక్ నుండి బాధపడే అవకాశం ఉంది, ఇది ఊహించని వైద్య ఖర్చులకు దారితీయవచ్చు. అదనంగా, ఎడారిలో సఫారీలు లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.

అందువల్ల, వెకేషన్ కోసం బయలుదేరే ముందు, భారతీయులందరూ ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తారు, ముఖ్యంగా వారు దుబాయ్ సందర్శించాలనుకుంటే అది తప్పకుండా తీసుకుంటారు.

 

భారతదేశం నుండి యుఎఇ కోసం మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

యుఎఇలోని అందమైన బీచ్‌లు మరియు భారీ స్కైస్క్రాపర్లు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి, కానీ ఈ దేశంలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో యుఎఇకి వచ్చే ఏ యాత్రికుడికైనా, ప్రయాణికుడికైనా అనారోగ్యం, దోపిడీ, ప్రమాదం లాంటివి పొంచి ఉంటాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి పరిస్థితులలో మీకు సహాయపడుతుంది.

అంతేకాకుండా, మీరు యుఎఇలో పర్యటించాలనుకుంటే లేదా అక్కడ వైద్యసేవ పొందాలనుకుంటే, తప్పకుండా మీరు యుఎఇ కోసం హెల్త్ లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ యుఎఇ అనేది మిమ్మల్ని ఎలాంటి ఊహించని పరిస్థితుల నుండైనా కాపాడుతుంది. హాస్పిటలైజేషన్, పాస్‌పోర్ట్ నష్టం, వైద్య సదుపాయం కోసం ఆసుపత్రికి తరలింపు, వ్యక్తిగత ప్రమాదం మరియు వ్యక్తిగత బాధ్యతల వంటి ఆకస్మిక పరిస్థితుల కారణంగా సంభవించే ఏవైనా ఊహించని ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి యుఎఇ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనాలు

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రయాణీకులకు వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు, సామాను నష్టం లేదా దొంగతనం లాంటి ఊహించని పరిస్థితుల నుండి ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయి. బజాజ్ అలియంజ్ భారతదేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటి, ఇది యుఎఇ ప్రయాణీకులకు సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. బజాజ్ అలియంజ్ నుండి యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • బజాజ్ అలియంజ్ యుఎఇ కోసం రూ. 206 నుండి ప్రారంభమయ్యే సరసమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది, ఇది తమ బడ్జెట్‌ మించిపోయిందని ఆందోళన చెందకుండా ఒక ట్రిప్‌ను ప్లాన్ చేసుకునే వారికి సరసమైన ఎంపికగా మారుతుంది.

  • బజాజ్ అలియంజ్ ఒక 24x7 క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను అందిస్తుంది, ఇందులో మిస్డ్ కాల్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించడానికి ప్రయాణికులకు వీలు కల్పిస్తుంది, అలాగే, వారి క్లెయిమ్‌లు వెంటనే పరిష్కరించబడతాయి.

  • బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా 216 దేశాలు మరియు ద్వీపాలలో కవరేజీని అందిస్తాయి, ఇది ప్రయాణికులకు వారి గమ్యస్థానంతో సంబంధం లేకుండా సమగ్ర రక్షణను అందిస్తుంది.

  • బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు, ఇది ప్రయాణీకులకు వారి సొంత జేబు నుండి ఖర్చు చేయకుండా మరియు ఆ పూర్తి మొత్తాన్ని ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుందని హామీ ఇస్తుంది.

  • బజాజ్ అలియంజ్ సంస్థ ఇతరులతో పోలిస్తే అడ్వెంచర్ స్పోర్ట్స్ కవర్, హాస్పిటలైజేషన్ కవర్, చెక్-ఇన్ బ్యాగేజ్ ఆలస్యం, పాస్‌పోర్ట్ కోల్పోవడం, అత్యవసర నగదు అడ్వాన్స్ మరియు ట్రిప్ రద్దు కవరేజ్ లాంటి అనేక యాడ్-ఆన్ ప్రయోజనాలతో ప్రయాణికులకు అదనపు రక్షణను అందిస్తుంది. అలాగే, వారిని విస్తృత శ్రేణి సంఘటనల నుండి రక్షిస్తుంది.

     

    చివరగా, యుఎఇకి ప్రయాణిస్తున్నప్పుడు బజాజ్ అలియంజ్ నుండి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తెలివైన నిర్ణయం. ఇది ప్రయాణీకులకు ఆర్థిక రక్షణ మరియు మనశ్శాంతిని అందిస్తుంది, ఏవైనా ఊహించని పరిస్థితులలో వారు కవర్ చేయబడతారని తెలియజేస్తుంది.

మీరు దీని గురించి తెలుసుకోవాలి: యుఎఇ వీసా మరియు ప్రవేశ సమాచారం


యుఎఇలో ప్రయాణించడానికి, ప్రవేశించడానికి లేదా ఉండటానికి భారత పౌరులు ప్రస్తుత యుఎఇ వీసాను కలిగి ఉండాలి. అది కుడా వారు భారతదేశాన్ని వదిలి వెళ్లడానికి ముందుగానే వీసాను పొంది ఉండాలి. అయితే, భారతీయులకు యుఎస్ గ్రీన్ కార్డ్ లేదా యుఎస్ విజిటర్ వీసా ఉంటే, వారికి అరైవల్ వీసా కోసం అర్హత ఉంటుంది. భారతదేశం నుండి వచ్చే ప్రయాణికులందరూ యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే, ఇది వారు స్వదేశం నుండి దూరంగా వెళ్లినప్పుడు తలెత్తే ఏవైనా అనూహ్య పరిస్థితులను కవర్ చేస్తుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఇతర దేశాల సందర్శకులకు ఆరు విభిన్న రకాల వీసాలను అందిస్తుంది. మీ ఉద్దేశించిన ప్రయాణ లక్ష్యాల ఆధారంగా యుఎఇ వీసాను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి:


  • టూరిస్ట్ వీసా
  • విద్యార్థి వీసా
  • ట్రాన్సిట్ వీసా
  • రోగి సహచరుడి యొక్క ప్రవేశ అనుమతి
  • రోగి ప్రవేశ అనుమతి
  • వర్క్ పర్మిట్

యుఎఇ వీసా కోసం అప్లై చేసుకునేటప్పుడు దరఖాస్తు విధానం

యుఎఇ కోసం వీసాలు తరచుగా 24 గంటల కంటే తక్కువ సమయంలో ఆమోదించబడతాయి, అయితే, హాలిడే లేదా వీకెండ్ కోసం అప్లై చేస్తే, ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అలాగే, మీరు యుఎఇ ఎంబసీ పర్యాటక వీసాలు ఇవ్వదని దయచేసి తెలుసుకోండి. ప్రయాణం చేయడానికి ముందు మీరు యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడాన్ని నిర్ధారించుకోండి. పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి యుఎఇ ఎంబసీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.

 

భారతదేశం నుండి యుఎఇకి ప్రయాణించేటప్పుడు అవసరమైన ప్రయాణ డాక్యుమెంట్లు ఏవి?

 

ఆన్‌లైన్ యుఎఇ వీసా కోసం అప్లై చేయడానికి మీరు మీ వీసా దరఖాస్తు ఫారంతో పాటు మరికొన్ని అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందించాలి. ఈ కింది డాక్యుమెంట్ల జాబితా అవసరం:

 

  • పాస్‌పోర్ట్ లేదా వీసా సైజు ఫోటోలు.
  • సరిగ్గా పూర్తి చేసిన వీసా దరఖాస్తు ఫారం.
  • మీ పాస్‌పోర్ట్ యొక్క ముందు మరియు వెనుక పేజీల కాపీ.
  • స్వదేశానికి తిరిగి వచ్చే విమాన టికెట్లు.

 

మీ మొత్తం ప్రయాణ సమయంలో రక్షణ మరియు భద్రత కోసం యుఎఇ కొరకు తగిన మొత్తంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి.

యుఎఇకి ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన భద్రత ప్రమాణాలు మరియు జాగ్రత్త చర్యలు


పర్యాటకులు స్థానిక చట్టాలు, ఆచారాలను పాటిస్తూ, అలాగే ఈ కింది కొన్ని సూచనలను, సరైన మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కూడా సులువుగా ప్రయాణించవచ్చు:

  • సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెలల్లో యుఎఇకి ప్రయాణించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
  • కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితిలో దుబాయ్ పోలీస్ నుండి 8 నిమిషాల్లో పోలీస్ హెలికాప్టర్‌ మీకు పంపబడుతుందని హామీ ఇవ్వబడుతుంది.
  • ఈ ప్రాంతంలో నేరాలు తక్కువగా ఉన్నప్పటికీ, సందర్శకులు మరియు ప్రయాణికులు వారి వస్తువులను, ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్లలో, ప్రజా రవాణాలో లేదా బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి.
  • చాలా ప్రాంతాల్లో ఫోటోగ్రఫీకి అనుమతి ఉంటుంది, కానీ ముస్లిం మహిళలు, ప్రభుత్వ నిర్మాణాలు, సైనిక స్టేషన్లు మొదలైన వాటి ఫోటోలను తీయకుండా ఉండండి.
  • మద్యం సేవించడం చట్టబద్ధం అయినప్పటికీ, వీధులు మరియు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి. మత్తులో ఉన్నప్పుడు డ్రైవింగ్ అనుమతించబడదు.

మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం: యుఎఇలోని భారత రాయబార కార్యాలయం


యుఎఇలో మీ బస సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కోసం సహాయం అవసరమైతే, మీరు యుఎఇలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

ఎంబసీ/ కాన్సులేట్ సంప్రదింపు వివరాలు వెబ్‍సైట్
భారత రాయబార కార్యాలయం, అబుదాబి +971 2 4492 700 http://www.indembassyuae.gov.in/
భారత కాన్సులేట్ జనరల్, దుబాయ్ +971 4 3971 222/ 333 https://www.cgidubai.gov.in/
పని గంటలు (ఆదివారం – గురువారం - 8:30 AM – 5 PM).

 

యుఎఇలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవి?

ఎయిర్‌పోర్ట్ నగరం
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం అబుదాబి
ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం అల్-ఫుజైరా
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్
రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం రస్ ఆల్ ఖైయిమా
షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం షార్జా

యుఎఇ ప్రయాణం కోసం తీసుకెళ్లాల్సిన కరెన్సీ మరియు విదేశీ మారకం


యుఎఇలో ఉపయోగించే కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం (ఎఇడి). మీరు ఎంత డబ్బును తీసుకెళ్లవచ్చు, మార్చుకోవచ్చు మరియు దాని మార్పిడి రేటును తెలుసుకోవాలంటే, దయచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో నవీకరించబడిన మార్పిడి రేటును చూడండి.

యుఎఇలో మీరు సందర్శించగల పర్యాటక ప్రదేశాలు


ఈ ప్రదేశాలను సందర్శించినప్పుడు మీరు తగినంత ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందారని నిర్ధారించుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొలువుదీరిన అద్భుతమైన నిర్మాణాల నుండి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయబడిన బహిరంగ ప్రదేశాల వరకు కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించండి:

  • ది బుర్జ్ ఖలీఫా

    ఇది ప్రపంచంలోనే ఎత్తైన భవనం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యంత గుర్తించదగిన స్మారక చిహ్నం. ఇది దుబాయ్ యొక్క విశాల దృశ్యాలను అందించే ఒక అబ్జర్వేషన్ డెక్, నిరంతరం పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
  • షేక్ జాయెద్ మసీదు

    ఇది కొత్త మసీదు అయినప్పటికీ, షేక్ జాయెద్ మసీదు అబుదాబిలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంటుంది. ఈ మసీదు దాని అద్భుతమైన రూపకల్పన మరియు దాని మార్బుల్ ఫ్రేమ్‌వర్క్‌ పై మొజాయిక్, బంగారం, అలాగే గాజు పని యొక్క విపరీతమైన ఉపయోగానికి ప్రసిద్ధి చెందింది.
  • దుబాయ్ ఎడారి

    దుబాయ్ ఎడారిని అన్వేషించకుండా మీ ఎమిరేట్స్ పర్యటన పూర్తికాదు. పర్యాటకులు ఒక రోజు లేదా రెండు రోజులు ఎడారిలో శాండ్‌బోర్డింగ్, ఒంటె ట్రెక్కింగ్, ఎడారి సఫారీలు మరియు మరిన్నింటిలో పాల్గొంటారు. మీ ప్రయాణాన్ని ఒక ఆరోగ్యకరమైన అనుభవంగా మార్చుకోవడానికి, ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సరళమైన, అవాంతరాలు లేని పద్ధతిలో కొనుగోలు చేయడాన్ని గుర్తుంచుకోండి.

యుఎఇని సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?


అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు యుఎఇని సందర్శించడానికి అనువైన సమయం. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం కొంత చల్లగా ఉంటుంది, కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి మీకు తేలికపాటి జాకెట్ లేదా స్వెటర్ అవసరం. అయితే, మీరు బీచ్‌లను సందర్శించాలనుకుంటే అక్టోబరు, మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మీ యాత్రను షెడ్యూల్ చేసుకోండి. యుఎఇలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నెలలు వేడిగా, తేమగా ఉంటాయి. ఈ వేసవి నెలలలో మీరు ఈ దేశానికి ట్రిప్‌ను షెడ్యూల్ చేస్తే, స్కూబా డైవింగ్‌కు వెళ్లవచ్చు.

కాబట్టి, ఇప్పుడు యుఎఇ పర్యటన నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు అనే దానిపై మీకు ఒక మంచి అవగాహన ఉంది, యుఎఇ ప్లాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని సంఘటనల నుండి రక్షించుకోవాలి.

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల ఆన్‌లైన్ పోలికలు మీ యుఎఇ పర్యటన కోసం మీకు అత్యంత ఆర్థిక రక్షణను అందించేదాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

Frequently Asked Questions:

తరచుగా అడిగే ప్రశ్నలు:

యుఎఇ కోసం మాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరమా?

అవును, యుఎఇ సందర్శకుల కోసం చెల్లుబాటు అయ్యే ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. కోవిడ్-19, ప్రమాదాలు, గాయాలు మరియు పాస్‌పోర్ట్‌ నష్టం, విమానాల రాకపోకల్లో ఆలస్యం లేదా విమానాల రద్దు మరియు ఇతర ఆర్థిక సమస్యల వంటి వైద్య అత్యవసర పరిస్థితుల నుండి వారిని రక్షించుకోవడానికి తగినంత కవరేజీని అందించే ఒక ప్లాన్‌ను బయలుదేరే మరియు వచ్చే ప్రయాణికులు కలిగి ఉండాలి.

నేను యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా పొందగలను?

మీరు ప్లాన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లి, మీరు యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో త్వరగా కొనుగోలు చేయవచ్చు. అత్యుత్తమ కవరేజీతో కూడిన ఒక ప్లాన్‌ను ఎంచుకోవడానికి, ముందుగా కొన్నింటిని సరిపోల్చాలి.

యుఎఇకి ఏ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉత్తమంగా సరిపోతుంది?

యుఎఇ కోసం అత్యుత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల నుండి మీ బడ్జెట్‌లో మీ అన్ని అవసరాలను తీర్చే, మీకు తగినవిధంగా సరిపోయే ఒక దానిని ఎంచుకోండి. అలాగే, ఇది ఊహించని వైద్య ఖర్చులకు కవరేజ్, ట్రిప్ ఆలస్యాలు మరియు రద్దు, పాస్‌పోర్టులు కోల్పోవడం మరియు మరెన్నో ముఖ్యమైన వాటిని కవర్ చేస్తుందని నిర్ధారించుకోండి.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం