Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

Travel Insurance For Vietnam

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ కోసం మీ వివరాలను అందించండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

విదేశీ ప్రయాణానికి అనగా వ్యాపారం లేదా వెకేషన్ కోసం సరైన ప్రణాళిక అవసరం. ఒంటరిగా ప్రయాణం చేసినా, స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసినా, మీరు ఎల్లప్పుడూ అవాంతరాలు లేని ట్రిప్‌ను కోరుకుంటారు.

మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా, అనేక అంశాలు మన నియంత్రణలో లేవు. మీ భద్రతను నిర్ధారించడానికి మీరు చేయగల అతి గొప్ప విషయం ఏంటంటే అన్ని జాగ్రత్తలు పాటించడం మరియు భారతదేశం నుండి వియత్నాం వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం, ఇది ఊహించిన వైద్య అత్యవసర పరిస్థితిలో మీకు సహాయపడగలదు. అందువల్ల, మీరు బయలుదేరే ముందు సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ‌లో కొనుగోలు చేయాలి, తద్వారా ఈ పరిస్థితులన్నింటినీ కవర్ చేయవచ్చు.

మీరు వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా పూర్తి మనశ్శాంతి మరియు భద్రతతో వియత్నాంకు ప్రయాణించవచ్చు, ఇది వివిధ ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మీకు భారతదేశం నుండి వియత్నాం కొరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

వియత్నాంలో చూడటానికి మరియు అన్వేషించడానికి చాలా ఉంది, మీరు నిస్సందేహంగా దేశంలోని అనేక ప్రాంతాలను పర్యటించవచ్చు మరియు ఈ ప్రాంతపు సహజ సౌందర్యం, అలాగే, గొప్ప సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడంలో మీరు నిమగ్నమైపోతారు. ఒక సంపూర్ణ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వియత్నాం పర్యటన సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అన్ని సంభావ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.

మీరు మొదటిసారి విదేశాలకు ప్రయాణిస్తున్నారా లేదా తరచుగా ప్రయాణిస్తున్నారా అనేదానితో సంబంధం లేకుండా, ఏవైనా అసౌకర్యాలు మీరు వేసుకున్న సరైన ప్లాన్‌కు అంతరాయం కలిగించవచ్చు. ఈ కారణంగా, వియత్నాం కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం ముఖ్యం. వియత్నాం కొరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఆర్థిక భద్రతా కవచంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును హరించివేయకుండా చూస్తుంది.

వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ అనేది ఆకస్మిక అనారోగ్య వైద్య ఖర్చులు, ట్రిప్ రద్దు, ట్రిప్ తగ్గింపుతో సహా విస్తృతమైన కోవిడ్-19 కవరేజీని అందిస్తుంది మరియు కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనే దాని ఆధారంగా ఆటోమేటిక్ పాలసీ పొడిగింపును కూడా ఇస్తుంది.

వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

వియత్నాం వివిధ సాంస్కృతిక, సహజ మరియు చారిత్రాత్మక ఆకర్షణలతో కూడిన ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వియత్నాంకు ప్రయాణిస్తున్నప్పుడు ఊహించని పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం ముఖ్యం. వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, వాటిలో కొన్ని కింది విధంగా ఉన్నాయి:

 

క్లెయిమ్ విధానం

వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక స్మార్ట్‌ఫోన్-ఆధారిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫీచర్ ఉంది, ఇది పాలసీదారులు ఆన్‌లైన్‌లో వారి క్లెయిమ్‌లను ఫైల్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ కాగితరహిత విధానంతో సమయాన్ని ఆదా చేస్తుంది, డాక్యుమెంటేషన్ ఇబ్బందులను తగ్గిస్తుంది.

 

క్లెయిమ్ సెటిల్‌మెంట్

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి పాలసీదారులకు 24x7 మద్దతును అందిస్తుంది, అవసరమైనప్పుడు సహాయం అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. అదనంగా, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారులకు క్లెయిమ్‌ నమోదు చేయడానికి మిస్డ్ కాల్ సర్వీస్‌ను అందిస్తాయి, ఇది ప్రాసెస్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

 

కవర్ చేయబడిన దేశాల సంఖ్య

బజాజ్ అలియంజ్ అందించే వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రపంచవ్యాప్తంగా 216 దేశాలు మరియు ద్వీపాలలో కవరేజీని అందిస్తుంది. అంటే పాలసీదారు తన ప్రయాణంలో పలు గమ్యస్థానాలకు ప్రయాణించినా కూడా పూర్తి రక్షణ పొందుతాడు.

 

విమాన ఆలస్యం కవరేజ్

విమాన ఆలస్యాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, అలాగే, అదనపు ఖర్చులకు కూడా దారితీయవచ్చు. వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో పాలసీదారులు పాలసీ నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన విమానాల కోసం రూ. 500 నుండి రూ. 1,000 వరకు పరిహారం పొందవచ్చు.

 

మినహాయింపులను చేర్చడం

మినహాయించదగిన మొత్తం అంటే ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ చెల్లించడానికి ముందు పాలసీదారు తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం. బజాజ్ అలియంజ్ నుండి వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏ మినహాయింపులు లేవు, అంటే పాలసీదారు ఎలాంటి అదనపు ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు.

చివరగా, వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏ ప్రయాణీకుల కోసం అయినా ఒక అవసరమైన పెట్టుబడి. ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, లగేజ్ నష్టం మరియు ట్రిప్ రద్దు లాంటి వివిధ ఊహించని సంఘటనల నుండి ఆర్థికపరమైన రక్షణను అందిస్తుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు మనశ్శాంతిని ఇస్తుంది, అవాంతరాలు లేని ట్రిప్‌ను నిర్ధారిస్తుంది.

మీరు దీని గురించి తెలుసుకోవాలి: వియత్నాం వీసా మరియు ప్రవేశ సమాచారం

మీరు వియత్నాం పర్యటనకు ప్లాన్ చేస్తున్న ఒక భారతీయ వ్యక్తులైతే, మీరు కింది రకాల వీసాల కోసం అప్లై చేసుకోవచ్చు:

 

వియత్నాం టూరిస్ట్ వీసా (డిఎల్)

సందర్శనా, పర్యాటకం లేదా వినోద ప్రయోజనాల కోసం వియత్నాంలోకి ప్రవేశించాలనుకునే విదేశీయులు మరియు పర్యాటకులకు వియత్నాం టూరిస్ట్ వీసా మంజూరు చేయబడుతుంది. ఈ వీసా వ్యాపార లేదా విద్యా సంబంధిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు.

 

వియత్నాం బిజినెస్ వీసా (డిఎన్)

మీరు కాన్ఫరెన్స్ లేదా సమావేశానికి హాజరు కావడం, అధికారిక ఒప్పందంపై సంతకం చేయడం లేదా పెట్టుబడిదారులతో సమావేశం లాంటి వ్యాపార సంబంధిత కారణాల కోసం వియత్నాంకు వెళ్లారని అనుకుందాం, అప్పుడు మీరు ఈ స్వల్పకాలిక వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే, ఈ వీసాతో మీకు ఫుల్-టైమ్ వర్క్ చేసుకోవడానికి అనుమతి లేదు.

 

వియత్నాం వర్క్ వీసా (డిఎన్/ఎల్‌డి)

మీరు వియత్నాంలో వ్యాపారం చేయాలనుకునే విదేశీయులైతే, వియత్నామీస్ సంస్థ కోసం పని చేయాలనుకుంటే లేదా రెండింటి కొరకు ఈ వీసాను అప్లై చేయవచ్చు.

 

వియత్నాం విద్యార్థి లేదా ఇంటర్న్‌షిప్ వీసా (డిహెచ్)

మీరు వియత్నామీస్ విశ్వవిద్యాలయం లేదా సంస్థలో చేరాలని చూస్తున్న విద్యార్థి అయితే లేదా అక్కడ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవలసిన వీసా ఇదే.

 

వియత్నాం డిప్లొమాటిక్ వీసా (NG1NG4)

విదేశీ దౌత్యవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వియత్నాం సందర్శకుడిగా ఈ వీసా పొందవచ్చు. ఈ వీసా వారి సందర్శనకు లేదా వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వబడుతుంది.

 

వియత్నాం ఇన్వెస్టర్ వీసా (డిటి)

వియత్నాంలో వ్యాపారం చేయాలనుకునే పెట్టుబడిదారులు ఈ రకమైన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఇది వ్యాపార వీసా నుండి భిన్నంగా ఉంటుంది.

 

వియత్నాం ట్రాన్సిట్ వీసా

మీరు విమానాశ్రయంలోని సౌకర్యాలను ఉపయోగించాలనుకుంటే లేదా వియత్నాం విమానాశ్రయంలో విమానాలను మారాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన వీసా ఇది.

దేశంలోకి ప్రవేశించడానికి ముందు వియత్నాం కోసం మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందారని నిర్ధారించుకోండి.

వియత్నాం వీసా కోసం అప్లై చేసేటప్పుడు అనుసరించవలసిన దరఖాస్తు ప్రక్రియ

వీసా కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

దశలవారీ సూచనలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇ-వీసా కోసం ఎలా అప్లై చేయాలో ఇక్కడ ఇవ్వబడింది.

 

దశ 1:

వియత్నాం ఇ-వీసా దరఖాస్తు కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లోని అప్లై చేయండి పై క్లిక్ చేయండి.

 

దశ 2:

మీ పాస్‌పోర్ట్ యొక్క ఫోటో మరియు దానిని వివరాల పేజీని స్కాన్ చేయండి. జెపిఇజి ఫార్మాట్‌లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి.

 

దశ 3:

మీ వ్యక్తిగత మరియు ట్రిప్ సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు ఫారంను పూరించవచ్చు.

 

దశ 4:

అంగీకరించబడే ఒక డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఉపయోగించి ఇ-వీసా ఖర్చును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

 

దశ 5:

ఫారంను విజయవంతంగా సమర్పించిన తర్వాత, మీకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోడ్ ఇవ్వబడుతుంది.

ఆన్‌లైన్ వియత్నాం వీసా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ ఆమోద లేఖను స్వీకరించడానికి మూడు పని దినాల సమయం పడుతుంది.

 

దశ 6:

వియత్నాం ఇ-వీసా కోసం అధికారిక వెబ్‌సైట్‌లో మీ అనుమతి లెటర్ కోసం చూడండి. దానిని యాక్సెస్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ కోడ్, పుట్టిన తేదీ మరియు ఇమెయిల్ చిరునామా నమోదు చేయండి.

ప్రయాణ సమయంలో లెటర్ ప్రింట్‌అవుట్స్ తీసుకొని వాటిని పిడిఎఫ్ ఫైల్‌గా సేవ్ చేసుకోండి. మీరు ఈ అనుమతి లెటర్‌ను సమర్పించాలి మరియు వియత్నాం చేరుకున్నప్పుడు నిర్దేశిత ప్రదేశం నుండి మీ వీసాను తీసుకోవాలి.

 

వీసా కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

మీరు ఆఫ్‌లైన్ వీసా దరఖాస్తు ప్రక్రియను కోరుకుంటే, ఈ విధానాన్ని అనుసరించండి:

 

దశ 1:

మీరు సమీపంలోని వీసా అప్లికేషన్ సెంటర్‌కు పాస్‌పోర్ట్ మరియు వీసా దరఖాస్తు ఫారం తీసుకెళ్లండి.

 

దశ 2:

మీ టోకెన్‌ను పొందండి మరియు వీసా అప్లికేషన్ సెంటర్ వద్ద క్యూలో వేచి ఉండండి.

 

దశ 3:

మీ టోకెన్ నంబర్ అందుకున్న తర్వాత, డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి పేర్కొన్న కౌంటర్‌ వద్దకు వెళ్లండి.

 

దశ 4:

పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మీ ట్రిప్ ప్రయోజనాన్ని వివరించే కవర్ లెటర్ మరియు మీ హోటల్ రిజర్వేషన్ల కాపీలు, మీ కన్‌ఫర్మ్ అయిన రిటర్న్ టిక్కెట్లతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో విఎఫ్ఎస్ అధికారికి మీ వీసా దరఖాస్తును సమర్పించండి. అదనంగా, గత మూడు నెలల మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను జతచేయండి. నియమించబడిన విఎఫ్ఎస్ అధికారికి మీ దరఖాస్తును సమర్పించే ముందు, మీ వీసా దరఖాస్తును సరిగ్గా రెండుసార్లు చెక్ చేయండి.

 

దశ 5:

సర్వీస్ ఛార్జ్ మరియు వీసా ఫీజు చెల్లించడానికి కొనసాగండి. మీరు సర్వీస్ ఫీజును నగదు రూపంలో చెల్లించాలని గుర్తుంచుకోండి.

 

దశ 6:

వీసా ఆమోదించబడిన తర్వాత, కొరియర్ ద్వారా దానిని పంపించేందుకు మీరు ఫీజు చెల్లించవచ్చు.

మీరు మీ వీసాను అందుకున్న తర్వాత, వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి మీరు అనుసరించవలసిన తదుపరి దశలు.

భారతదేశం నుండి వియత్నాంకు ప్రయాణించేటప్పుడు ఏయే ప్రయాణ డాక్యుమెంట్లు అవసరం?

వియత్నాం సందర్శించినప్పుడు అనేక కార్యకలాపాలు మీ సమయాన్ని మరియు శ్రద్ధను కోరుతాయి. అయితే, ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా మీ వెంట తీసుకెళ్లాలని, వాటిని భద్రంగా దాచుకోవాలని గుర్తుంచుకోండి:

  • ఒకవేళ మీరు భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే, మీ రాక తేదీ తర్వాత కనీసం ఆరు నెలల చెల్లుబాటును కలిగి ఉండే పాస్‌పోర్ట్‌తో ప్రయాణించండి.
  • కొత్త స్టాంపులను పొందడానికి మీ పాస్‌పోర్ట్‌లో ఎల్లప్పుడూ రెండు ఖాళీ పేజీలను ఉంచుకోండి.
  • అంతర్జాతీయంగా విమానయానం చేసే భారతీయ పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు మాత్రమే వీసా-ఆన్-అరైవల్ (విఒఎ) ఎంపిక అందుబాటులో ఉంటుంది. అందువల్ల, మీరు అవసరమైన కొన్ని అదనపు డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.
  • దయచేసి మీ వియత్నాం వీసాను తీసుకునేటప్పుడు రెండు పాస్‌పోర్ట్-సైజు ఫోటోలు మరియు పూర్తి చేసిన వీసా దరఖాస్తు ఫారం సిద్ధంగా ఉంచుకోండి.
  • మీరు వియత్నాంలోకి ప్రవేశించినప్పుడు మీ ట్రావెల్ ప్లాన్ మరియు మీ రిటర్న్ టికెట్‌ను కలిగి ఉండాలి.
  • మీరు తగినంత డబ్బును అందుబాటులో ఉంచుకోండి, అవసరమైతే దానికి రుజువు చూపించడానికి సిద్ధంగా ఉండండి.

మీ ప్రయాణ కారణాన్ని బట్టి, మీరు నెరవేర్చవలసిన అదనపు షరతులు మరియు తీసుకోవలసిన చర్యలు ఉండవచ్చు. అంతేకాకుండా, మీరు వియత్నాం పర్యటన వ్యవధిలో ఎల్లప్పుడూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అందుబాటులో ఉంచుకోండి, మీరు దేశంలోకి ప్రవేశించినప్పుడు మీ సామాను నష్టం లేదా ఆలస్యాలను కవర్ చేస్తుంది.

వియత్నాంకు ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భద్రతా చర్యలు

మీరు వియత్నాంలో పర్యటించేటప్పుడు ఇతర ప్రయాణికుల భద్రత మరియు మీ భద్రతను నిర్ధారించడానికి ఈ కింది మార్గదర్శకాలు లేదా భద్రతా ప్రమాణాలను గురించి తెలుసుకోవాలి:

  • వియత్నాంకు ప్రయాణించే ముందు, ఆ దేశ చట్టాలు, ఆచారాల గురించి తెలుసుకోండి.
  • ప్రయాణ సమయంలో ఎల్లప్పుడూ మీ పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల కాపీని అందుబాటులో ఉంచుకోండి.
  • మీ వీసా గడువు ముగియబోతున్నట్లయితే, వీలైనంత త్వరగా తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోండి, మీ వీసా గడువు దాటిపోయే వరకు నిర్లక్ష్యం చేయకండి
  • అధికారులు నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలను పాటించండి. మీకు సహాయం అవసరమైతే, అడగండి.
  • బహిరంగ ప్రదేశాల్లో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి, అలాగే, వాటిని గమనించకుండా వదిలేయండి.
  • మర్యాదగా ఉండండి, వారి ఆచారాలను గౌరవించండి మరియు అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండండి.
  • అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం నివారించండి మరియు దేశంలోని ఏ చట్టవిరుద్ధమైన వాణిజ్యం లేదా అభ్యర్థనలో పాల్గొనకుండా ఉండండి.
  • ముఖ్యంగా చీకటి పడిన తర్వాత నిషేధిత ప్రదేశాలకు వెళ్లడం మరియు ఒంటరిగా ఉండటం మానుకోండి.
  • మీ పరిచయస్తులకు, కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు మీరు ఎక్కడున్నారో, ఎప్పుడు హోటల్‌కు తిరిగి వస్తారో తెలియజేయండి. 

పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఏవైనా అదనపు అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి సాధ్యమైనంత ఉత్తమ పాలసీని పొందడానికి మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికలను పరిశీలించండి.

తెలుసుకోవలసిన ముఖ్యమైన సమాచారం: వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం

ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే మీ దేశం ఎంబసీ మీ మొదటి సంప్రదింపుగా ఉండాలి.

 

అడ్రస్:

భారత రాయబార కార్యాలయం, 58-60 ట్రాన్ హంగ్ దావో స్ట్రీట్, హోన్ కీమ్ జిల్లా, హనోయి

 

ప్రస్తుత రాయబారి:

శ్రీ ప్రణయ్ వర్మ, వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్‌కు భారతదేశపు ప్రస్తుత రాయబారి.

 

వెబ్‍సైట్:

భారత రాయబార కార్యాలయం

 

ఇమెయిల్:

cons.hanoi@mea.gov.in / pptvisa.hanoi@mea.gov.in

 

అత్యవసర టెలిఫోన్ నంబర్:

+84-913089165 / +84-915989065

 

పని గంటలు:

సోమవారం నుండి శుక్రవారం వరకు - 0900 గంటల నుండి 1730 గంటల వరకు

 

కాన్సులర్ సేవల కోసం పని గంటలు:

సోమవారం నుండి శుక్రవారం వరకు - 0930 to 1230 గంటల వరకు. శనివారం, ఆదివారం మరియు ప్రభుత్వ సెలవు దినాలలో రాయబార కార్యాలయం మూసివేయబడుతుంది

వియత్నాంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవి?

  • కాన్ థో అంతర్జాతీయ విమానాశ్రయం
  • కామ్ రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • డా నాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • ఫు బాయి అంతర్జాతీయ విమానాశ్రయం
  • నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయం

వియత్నాంకు ప్రయాణిస్తున్నప్పుడు తీసుకువెళ్లడానికి అవసరమైన కరెన్సీ మరియు విదేశీ మారకం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియత్నాం సంస్థ, దేశ అధికారిక కరెన్సీగా వియత్నామీస్ డాంగ్‌ను ఉపయోగిస్తుంది. వియత్నాంకు ప్రయాణిస్తున్నప్పుడు, అధికారిక కరెన్సీని ఉపయోగించి అత్యంత ముఖ్యమైన లావాదేవీలు జరుగుతాయని గుర్తుంచుకోండి ; అందువల్ల, తగినంత డబ్బును అందుబాటులో ఉంచుకోండి. అయితే, వియత్నామీస్ డాంగ్ (విఎన్‌డి) మరియు భారతీయ రూపాయి (రూ.) మధ్య కరెన్సీ రేటులో తరచుగా హెచ్చుతగ్గులు జరగడం కూడా దీనికి ప్రధాన కారణం.

వియత్నాంలో మీరు సందర్శించగల పర్యాటక ప్రదేశాలు

వియత్నాంలో చూడవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నాయి. మీరు సందర్శించాలనుకుంటున్న ప్రదేశాలకు వెళ్లడానికి ముందు,. అన్ని అవసరమైన డాక్యుమెంట్లు మరియు అధికారుల నుండి ఆమోదాలు క్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి.

మీ ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, దీనిని కొనుగోలు చేయండి ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ !

 

హోయ్ యాన్

చైనీయులు, జపనీయులు పట్టు వర్తకులు వాణిజ్య కేంద్రాలుగా పనిచేసిన 15వ శతాబ్దపు వ్యాపారుల ఇళ్లలో ప్రాచీన వాస్తుశిల్పానికి సంబంధించిన ఉదాహరణలు చూడగలిగే అద్భుతమైన నగరం "హోయ్ అన్"ను మీరు తప్పక సందర్శించాలి.

 

సాపా గ్రామీణ ప్రాంతం

మీరు కొండ ప్రాంతాలు మరియు ఆకుపచ్చని వాతావరణాన్ని ఇష్టపడినట్లయితే, మీరు మీ పర్యటనల జాబితాలో హోంగ్ లియెన్ పర్వతాలను కూడా చేర్చాలి. వియత్నాంలోని గియా, మోంగ్ మరియు రెడ్ జావోలతో సహా అనేక వర్గానికి చెందిన మైనారిటీలు దేశంలోనే ఎత్తైన వరి పొలాలకు ఆనుకుని ఉన్న ఫాన్సిపాన్ పర్వతం ద్వారా చుట్టుముట్టబడిన లోయల్లో నివసిస్తున్నారు.

 

హనోయి

దేశ రాజధాని ఎంత బిజీగా ఉన్నప్పటికీ, స్థానికులు మరియు సందర్శకులు నగరంలోని ఆకర్షణ ద్వారా ఆకర్షించబడకుండా ఉండలేరు, ఇక్కడ మీరు అత్యుత్తమ పట్టణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. వియత్నాం మ్యూజియం ఆఫ్ ఎథ్నాలజీ మరియు వియత్నాం ఫైన్ ఆర్ట్ మ్యూజియం దేశంలోని గొప్ప మరియు విభిన్న కళాత్మక సృష్టికి ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి.

వియత్నాంను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది?

మీరు వెచ్చని కానీ, ఆహ్లాదకరమైన వసంత ఋతువు ప్రారంభం (మార్చి నుండి ఏప్రిల్) లేదా ముగింపు (సెప్టెంబర్ నుండి నవంబర్) లో వెళ్ళవచ్చు కాబట్టి, మీ సెలవులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. హ్యూ మరియు హోయ్ యాన్ లాంటి ప్రదేశాలు కేంద్రీకృతమై ఉన్న వియత్నాంను సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి మరియు ఆగస్టు నెలలు, అలాగే, జూలై మరియు ఆగస్టు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

దక్షిణ వియత్నాంలో వాతావరణం జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం మినహా ఏడాది పొడవునా వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వరదలు అరుదుగా సంభవించినప్పటికీ, ఈ నెలల్లో వర్షాలు ప్రయాణాన్ని అంతగా ప్రభావితం చేయవు.

మీరు వియత్నాంను ఎప్పుడు సందర్శించినా, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం ఉత్తమం.

మీ వియత్నాం పర్యటన చింత లేకుండా ఉండేలా చూసుకోవడానికి, మీరు టికెట్లు బుక్ చేసుకున్న మరోక్షణమే వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ లగేజీ నష్టాన్ని కవర్ చేస్తుందా?

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు మీ లగేజ్ నష్టాన్ని లేదా లగేజ్ రాకలో ఆలస్యాలను కవర్ చేయవచ్చు. వియత్నాంలో మీ సామాను మీకు చేరడంలో ఆలస్యం జరిగితే, మీ వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ సామాను వచ్చే వరకు అవసరమైన అన్ని అవసరాలకు చెల్లిస్తుంది. 

వియత్నాంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరమా?

లేదు, భారతదేశం నుండి వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడం తప్పనిసరి అవసరం కాదు. అయితే, మీరు తెలియని ప్రాంతంలో ఎలాంటి ప్రయాణం లేదా వైద్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఒకదానిని కొనుగోలు చేయడం ఉత్తమం.

భారతదేశం నుండి వియత్నాం కోసం ఏ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉత్తమమైనది?

మీరు కొనుగోలు చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, మీరు విదేశాల్లో ఉన్నప్పుడు ఏదైనా సంక్షోభం లేదా అనూహ్య సంఘటనల నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తాయని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. మీ కోసం ఉత్తమ డీల్‌ను కనుగొనడానికి మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చవచ్చు.

ప్రముఖ దేశాల కోసం వీసా మార్గదర్శకాలు


డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం