Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్

Contactless Insurance: Online General Insurance Plans by Bajaj Allianz

బజాజ్ అలియంజ్ అందిస్తున్న కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్

ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఒక్క రాత్రిలో పరిస్థితులు ఎలా తలక్రిందులు అవగలవో ఇటీవలి కరోనా మహమ్మారి తెలియజేసింది. ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యతను ఈ అనిశ్చితి పరిస్థితి ప్రస్ఫుటం చేసింది.

కానీ, ఈ అనిశ్చితి పరిస్థితులలో కూడా, ఒక విషయం మాత్రం మారలేదు అదే, శ్రద్ధ. సామాజిక దూరం ఉన్నప్పటికీ, మీ స్నేహితుని నుండి ఒక వాట్సాప్ సందేశం రూపంలో, లేదా ఒక వీడియో కాల్‌లో మీకు ఇష్టమైన కిచిడీ రెసిపీ నేర్పించడం, లేదా ఒక దుకాణంకి వెళ్ళకుండా ఆన్‌లైన్‌లో అవసరమైన కిరాణా సరుకులను ఆర్డర్ చేయడం వంటి వాటి రూపంలో ఇంకొకరు మన పై చూపే శ్రద్ధ ఎల్లప్పుడూ ఉంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మా కాంటాక్ట్‌లెస్ ఆఫరింగ్స్ ద్వారా శ్రద్ధను కాంటాక్ట్‌లెస్‌గా చేశాము. బజాజ్ అలియంజ్ కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మరింత చదవండి.

Scroll

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత

కోవిడ్-19 మహమ్మారి తీసుకువచ్చిన అతి పెద్ద మార్పు, సామాజిక దూరం ఒక కట్టుబాటు లాగా మారడం. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరాన్ని పాటించడం ఒక సమర్థవంతమైన మార్గంగా నిలిచింది. ఈ మహమ్మారి కారణంగా, బాహ్య ప్రపంచంలో సంబంధాలు నెరిపేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్లోవ్స్, మాస్కులు ధరించి, పరిశుభ్రత పాటించినప్పటికీ, వైరస్ బారిన పడతారేమో అని మీరు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆందోళనను దూరం చేయడానికి కాంటాక్ట్‌లెస్‌గా ఉండడం ఉత్తమ మార్గం.

మీకు మనశ్శాంతిని అందించే బాధ్యతను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము స్వీకరించాము. ఇన్సూరెన్స్ యొక్క సంరక్షణను అందించడానికి ఒక కాంటాక్ట్-రహిత మార్గం కంటే ఉత్తమమైనది ఇంకేది ఉంది? మా కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ ద్వారా మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాము. సరిపోల్చి చూడడం, కొనుగోలు చేయడం మరియు క్లెయిమ్స్ చేయడం కూడా కాంటాక్ట్‌లెస్‌గా మార్చాము.

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్: ఎలా కొనుగోలు చేయాలి?

కోవిడ్-19 మహమ్మారి ఇంత పెద్ద స్థాయిలో ఆరోగ్య విపత్తును సృష్టించడంతో, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌తో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు అని మేము మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇన్సూరెన్స్‌ని కాంటాక్ట్ లేకుండా ఎలా పొందాలి అని మీరు ఆలోచిస్తుంటే, మేము అందించే కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ దానికి పరిష్కారం చూపుతుంది.

కాంటాక్ట్-ఫ్రీ మార్గంలో మీరు మా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి:

 

  • ✓   కేరింగ్లీ యువర్స్ యాప్: మా కేరింగ్లీ యువర్స్ యాప్ ఉపయోగించి, మీకు సరిపోయే పాలసీని ఎంచుకొని మిమ్మల్ని సురక్షితం చేసుకోవడానికి మీరు కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు.

  • ✓   వెబ్‍సైట్: మీరు మీ ఇంటి సౌకర్యం నుండి మా వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేయవచ్చు మరియు మీ ఆన్‌లైన్ పాలసీ కాపీని పొందడానికి కాంటాక్ట్‌లెస్ చెల్లింపును పూర్తి చేయవచ్చు.

  • ✓   బోయింగ్: మీరు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక చాట్‌బాట్‌ను ఉపయోగించాలనుకుంటే, మీ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడంలో మీకు సహాయపడే BOING మా వద్ద ఉంది.

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ చెల్లింపు

ఇన్సూరెన్స్ చెల్లింపులు చేయడానికి ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చి చెక్కులు సేకరించే రోజులు పోయాయి. మీ ప్రీమియం కోసం చెల్లింపులు చేయడానికి ఇప్పుడు మీరు పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. 

మీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం కాంటాక్ట్‌లెస్ చెల్లింపును సులభంగా మా వెబ్‌సైట్ లేదా మా యాప్ ద్వారా చేయవచ్చు. కాల్ ద్వారా మా ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడి మేము మీకు పంపిన లింక్ ద్వారా చెల్లింపు చేయడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో కూడా జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు అది సులభంగా మరియు సురక్షితంగా అనిపించడంలేదూ? మా కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్‌తో మేము కోరుకున్నది ఖచ్చితంగా అదే!

బజాజ్ అలియంజ్ అందించే జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగల వివిధ రకాల కాంటాక్ట్‌లెన్స్ ఇన్సూరెన్స్‌లు ఏవి ఉన్నాయి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మీకు అందించడానికి మా వద్ద ఉన్న ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి చదవండి:

  • హెల్త్ ఇన్సూరెన్స్

    మీ సమగ్ర వ్యక్తిగత పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంపికలు, క్రిటికల్ వ్యాధి ప్లాన్లు, పర్సనల్ యాక్సిడెంట్ ప్లాన్లు, సీనియర్ సిటిజన్స్ కోసం పాలసీలు ఇంకా పన్ను ఆదా చేయడానికి మీకు సహాయపడే ప్లాన్ల నుండి మా వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు శ్రేణి ఉంది.

  • మోటార్ ఇన్సూరెన్స్

    మా సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ మరియు కార్ ఇన్సూరెన్స్ పాలసీలు విస్తృత శ్రేణి కవరేజ్‌తో వస్తాయి మరియు మీ రక్షణను బలోపేతం చేయడానికి అనేక యాడ్-ఆన్‌లను కూడా అందిస్తాయి.

  • సైబర్ ఇన్సూరెన్స్

    మీరు చేపడుతున్న అన్ని డిజిటల్ కార్యకలాపాలతో, మీ ఆన్‌లైన్ ఉనికిని సురక్షితం చేయడం కూడా ముఖ్యం. మేము మిమ్మల్ని మా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీతో కవర్ చేసాము.

  • హోమ్ ఇన్సూరెన్స్

    ఈ మహమ్మారి సమయంలో మీ ఇల్లు అక్షరాలా మీ కోట అయి ఉంది. మా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలతో, మీ ఇల్లు మరియు వస్తువుల కోసం పూర్తి ఇన్సూరెన్స్ తో మీ సురక్షితమైన కోట రక్షించబడి ఉండేలాగా మీరు నిర్ధారించుకోవచ్చు.

  • ట్రావెల్ ఇన్సూరెన్స్

    ప్రయాణం చేయడం మీ మనస్సులో ఉండకపోయినా, మా కాంటాక్ట్‌లెస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తెలియని (మరియు తెలిసిన) ప్రాంతాల్లో మీ బ్యాకప్‍గా పనిచేస్తుంది.

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

ఒక ఇన్సూరెన్స్ కంపెనీగా, క్లెయిమ్ కోసం అయ్యే సమయం మా సామర్థ్యానికి మా నిజమైన పరీక్ష. మరియు అందువల్ల, మా కస్టమర్ల కోసం కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ యొక్క ప్రయోజనాన్ని మేము అందిస్తున్నాము. మీరు మాతో మీ క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి మా కేరింగ్లీ యువర్స్ యాప్, మా వెబ్‌సైట్ మరియు వాట్సాప్ పై మా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. మీరు మీ డాక్యుమెంట్లను అప్‍లోడ్ చేసి, క్లెయిమ్స్ ఫారం నింపి, మా శాఖలను సందర్శించకుండా క్లెయిమ్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు - పూర్తిగా కాంటాక్ట్‌లెస్‌గా!

కేరింగ్లీ యువర్స్ యాప్ యొక్క కాంటాక్ట్‌లెస్ లక్షణాలు

కేరింగ్లీ యువర్స్ యాప్ అనేది కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లతో మీ అన్ని ఆన్‌లైన్ జనరల్ ఇన్సూరెన్స్ అవసరాలకు ఒక కేంద్ర బిందువు. మా యాప్‌లో కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ కోసం కేంద్రమైన అనేక ఫీచర్లు ఉన్నాయి. 

  • కొనండి

    జనరల్ ఇన్సూరెన్స్ ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను పూర్తి చేయడానికి మీరు కేరింగ్లీ యువర్స్ యాప్‌ను ఉపయోగించవచ్చు

  • రెన్యూ

    ఆన్‌లైన్ పాలసీ రెన్యూవల్ కూడా చాలా సులభం అవుతుంది, ఇక్కడ మా యాప్ కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లను పూర్తి చేయడాన్ని మిమ్మల్ని అనుమతించడం మాత్రమే కాక మీకు రెన్యువల్ రిమైండర్లను కూడా అందిస్తుంది

  • క్లెయిమ్

    కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చినప్పుడు, క్లెయిమ్ ప్రాసెస్ ఖచ్చితంగా హీరో అవుతుంది. మా కేరింగ్లీ యువర్స్ యాప్‌లో, మీరు మీ క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో మాతో రిజిస్టర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు మరియు మీ క్లెయిమ్‌ను ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‍కు మా విప్లవాత్మక మోటార్ OTS మరియు హెల్త్ CDC క్లెయిమ్ ప్రాసెస్ కూడా ఉంది, ఇది మీ మోటార్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములను* కొద్ది గంటల్లో సెటిల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • సంప్రదింపు వివరాలలో మార్పు

    మా కేరింగ్లీ యువర్స్ యాప్ ఉపయోగించి కేవలం కొన్ని క్లిక్స్ తో మీరు మీ సంప్రదింపు వివరాలను సులభంగా మార్చవచ్చు

  • పాలసీలను నిర్వహించండి

    కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ల ద్వారా కొనుగోలు చేసిన కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని మీరు పొందిన తర్వాత, మీ అన్ని పాలసీలను ఒకే చోట మేనేజ్ చేసుకోవడానికి మీరు సులభంగా మా యాప్‌ను ఉపయోగించవచ్చు. 

  • ఇన్స్టా సెల్ఫ్ చెక్

    కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ కు గురి కావడానికి మీకు గల రిస్క్ యొక్క ఒక స్వీయ-అంచనా తీసుకోవడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ రెన్యువల్

మీరు మాతో మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవాలని చూస్తున్నట్లయితే, దానికి కూడా వద్ద కాంటాక్ట్‌లెస్ పరిష్కారం ఉంది. మా ఆన్‌లైన్ పాలసీ రెన్యువల్ ఎంపికలు మీ ఇన్సూరెన్స్ పాలసీలను రెన్యూ చేసుకోవడానికి మీకు ఒక పూర్తి డిజిటల్ మార్గాన్ని అందిస్తాయి.

కేవలం మా వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి, లేదా మీ ఆన్‌లైన్ పాలసీ రెన్యువల్ కోసం కేరింగ్లీ యువర్స్ యాప్‌ను ఉపయోగించండి.

బజాజ్ అలియంజ్ ద్వారా డిజిటల్ కార్యక్రమాలు

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము మా కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ సౌలభ్యం మరియు భద్రతను అందించాలనుకుంటున్నాము. మరియు ఈ చోట మా డిజిటల్ కార్యక్రమాలు మా నైపుణ్యం ప్రదర్శించడానికి సహాయపడుతున్నాయి. మాతో, మీరు మీ ఆన్‌లైన్ జనరల్ ఇన్సూరెన్స్ అవసరాలను కాంటాక్ట్‌లెస్ మార్గంలో నెరవేర్చుకోగల అనేక ఎంపికలు మీకు ఉంటాయి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

  • కేరింగ్లీ యువర్స్ యాప్

    మా ఆల్-ఇన్-వన్ యాప్, ఒకే యాప్ ద్వారా మీ పాలసీలను కొనుగోలు చేయడానికి, రెన్యూ చేసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీనికి ఆన్‌లైన్ క్లెయిమ్‌లు మరియు మోటార్ OTS మరియు హెల్త్ CDC రూపంలో క్లెయిమ్ సహాయం కూడా ఉంది, ఇది మీ క్లెయిమ్‌లను డిజిటల్ మార్గంలో రిజిస్టర్ చేసుకోవడానికి మరియు సెటిల్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

  • వెబ్‍సైట్

    మా పాలసీల గురించి తెలుసుకోవడానికి, మీ అవసరాలకు తగినది కొనుగోలు చేయడానికి మా వెబ్‌సైట్ ఒక గొప్ప మార్గం. మీరు మా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు మరియు మీ పాలసీ జారీ చేయించుకోవటానికి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు కూడా చేయవచ్చు. మీరు మీ ఆన్‌లైన్ పాలసీ రెన్యువల్ కూడా చేయవచ్చు, మరియు మీ క్లెయిములను ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు కూడా.

  • చాట్‍బాట్

    మా చాట్‌బాట్, బొయింగ్ మీ కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చుకోవడానికి మీకు సహాయపడే మా డిజిటల్ ఆఫరింగ్‌లలో మరొకటి.

  • వాట్సాప్ సర్వీసులు

    వాట్సాప్ మీకు ఇష్టమైన కమ్యూనికేషన్ మార్గం అయితే, మేము దాని పై కూడా ఉన్నాము. మమ్మల్ని సంప్రదించడానికి 75072 45858 పై మాకు 'హాయ్' అని ఒక సందేశం పంపండి. 

  • మిస్డ్ కాల్ సౌకర్యం

    మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యల కోసం, మీరు 80809 45060 పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. సహాయం చేయడానికి మేము మీకు వెంటనే కాల్ చేస్తాము.

  • SMS షార్ట్ కోడ్

    మీరు ఒక మెసేజ్ ద్వారా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే, 575758కు WORRY’ అని SMS చేయండి. మీకు మా కాంటాక్ట్‌లెస్ సంరక్షణను విస్తరించడానికి ఇది మరొక మార్గం.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

మిస్టర్ నవీన్ వర్మ

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు కస్టమర్ కేంద్రిత ఆన్‌లైన్ ప్రాసెస్

సతీష్ చంద్ కటోచ్

పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

శాంతారాం ఎస్.

వెబ్‌సైట్‌లో కార్ ఇన్సూరెన్స్ చాలా సులభం; అత్యంత సరళంగా మరియు సౌకర్యవంతమైనదిగా చేయబడింది.

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్‌ను సులభతరం చేద్దాం

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుంది?

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ రెగ్యులర్ ఇన్సూరెన్స్ లాగానే పనిచేస్తుంది, అయితే అది మీరు కొనుగోలు, రెన్యూ చేసుకోవడం, క్లెయిమ్ చేయడం లేదా మీకు ఉన్న ఏదైనా ఇతర పాలసీ సంబంధిత అవసరాలను పూర్తిగా కాంటాక్ట్-ఫ్రీగా చేసుకోవడానికి అనుమతిస్తుంది. సులభంగా చెప్పాలంటే, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లతో సహా ఎటువంటి భౌతిక ట్రాన్సాక్షన్లు లేకుండా డిజిటల్ లేదా వర్చువల్ మార్గాల ద్వారా మీ ఇన్సూరెన్స్ అవసరాలు నెరవేర్చబడినప్పుడు అది కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ అవుతుంది.

నేను అన్ని జనరల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చా?

మీ మోటార్, ఆరోగ్యం, సైబర్, ప్రయాణం మరియు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

అసాధారణమైన సందర్భాలకు మాత్రమే, మీరు ఒక ఆఫ్‌లైన్ ప్రాసెస్‍కు సూచించబడవచ్చు, ఇక్కడ మీ అవసరాలు లేదా ప్రతిపాదనను చర్చించడానికి కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదించవచ్చు. 

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు నేను మెడికల్ చెక్-అప్ చేయించుకోవాలా?

మీకు ఒక నిర్దిష్ట వయస్సు లోపు ఉండి మరియు ఒక స్వచ్ఛమైన వైద్య చరిత్ర ఉంటే మెడికల్ చెకప్‍లు అవసరం లేదు. మీ కేసుకు అది అవసరం ఉంటే, లేదా మీరు ఒక నిర్దిష్ట వయస్సుకు మించి ఉంటే మీరు ఒక మెడికల్ చెకప్ చేయించుకోవలసి ఉంటుంది. దాని కోసం మీ ఇన్సూరెన్స్ కంపెనీతో తనిఖీ చేయడం ఉత్తమమైనది. 

అయితే, కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, మెడికల్ చెక్-అప్‌లను కూడా ఆన్‌లైన్‌లో చేయడానికి చాలా కంపెనీలు మార్గాలను గుర్తిస్తున్నాయి.

పాలసీ జారీ చేయబడడానికి ముందు నా వాహనం ఇన్స్పెక్షన్ చేయబడుతుందా?

మీ మునుపటి ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే పాలసీ జారీ చేయడానికి ముందు మీ వాహనం ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా, ఇన్సూరెన్స్‌ను నిజంగా కాంటాక్ట్‌లెస్ చేస్తూ, మా ఐ-పిన్ వంటి యాప్స్ తో స్వీయ-ఇన్స్పెక్షన్‌కు వీలు కల్పించే వినూత్న మార్గాలను అందిస్తున్నాయి.

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి మీకు కావలసిన డాక్యుమెంట్లు అనేవి ఏవైనా ఇతర మార్గాల ద్వారా మీ ఇన్సూరెన్స్ పొందేటప్పుడు మీకు అవసరం ఉండేవే. మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న ఇన్సూరెన్స్ ఆధారంగా మీరు అందించవలసిన డాక్యుమెంట్లు భిన్నంగా ఉండవచ్చు, ఉదాహరణకు మీ వాహనం కోసం, మీకు మీ RC కాపీ అవసరం ఉంటుంది. డాక్యుమెంట్లు మీ నిర్దిష్ట కేసు పై కూడా ఆధారపడి ఉండవచ్చు.

చాలావరకు అయితే, కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి మీరు కేవలం ప్రాథమిక డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలి. క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో డాక్యుమెంట్ల అధిక పరిమాణంలో అవసరం. 

నేను నా పాలసీ డాక్యుమెంట్‌ను ఎలా అందుకుంటాను?

కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మీ పాలసీ మీతో డిజిటల్‌గా షేర్ చేసుకోబడుతుంది. మీరు మీ కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఎంచుకున్న ప్లాట్‌ఫామ్ ఆధారంగా (అంటే యాప్, వెబ్‌సైట్ మొదలైనవి), మీ పాలసీ సాఫ్ట్ కాపీ డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉంటుంది, ఇమెయిల్ ద్వారా మీకు పంపబడుతుంది లేదా ఒక ఇ-కార్డ్ లాగా యాప్‍లో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మా వాట్సాప్ సర్వీసులను ఉపయోగించి వాట్సాప్ పై కూడా మీ పాలసీ పిడిఎఫ్ పొందవచ్చు.

నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆన్‌లైన్‌లో సెటిల్ చేయబడుతుందా?

అవును, ఇది చాలావరకు ఖచ్చితంగా చేయబడుతుంది. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లతో, మా క్లెయిమ్ ప్రాసెస్ మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడం మరియు ట్రాక్ చేసే ప్రాసెస్ పూర్తి చేస్తుంది మరియు క్లెయిమ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు పంపబడుతుంది. క్యాష్‍లెస్ క్లెయిముల సందర్భాల్లో, మీరు మీ జేబు నుండి చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు. మేము నేరుగా నెట్‍వర్క్ హాస్పిటల్‌తో డీల్ చేసి మీ క్లెయిమ్ సెటిల్ చేయడాన్ని నిర్ధారిస్తాము.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మాకు మోటార్ OTS మరియు హెల్త్ CDC రూపంలో మీ క్లెయిమ్ కోసం ఇతర మార్గాల కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ ప్రాసెస్‌లు మా యాప్ ద్వారా మీ ఆరోగ్యం మరియు మోటార్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి, మరియు మీరు దానిని ఆమోదించిన తర్వాత క్లెయిమ్ మొత్తం మీ అకౌంట్‌కు చేరుతుంది. కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ ఏమైనా మరింతగా కాంటాక్ట్-ఫ్రీ అవగలదా?

నేను నా మొబైల్ నుండి ఇన్సూరెన్స్ ఎలా కొనుగోలు చేయగలను?

ఆన్‌లైన్ జనరల్ ఇన్సూరెన్స్‌ను మీ మొబైల్ నుండి సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీ కాంటాక్ట్‌లెస్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడానికి మా వద్ద అనేక ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మీరు మా వెబ్‌సైట్, మా కేరింగ్లీ యువర్స్ యాప్, వాట్సాప్ పై మా సర్వీసులు, మా చాట్‌బాట్ బొయింగ్ ఉపయోగించవచ్చు మరియు మీ మొబైల్ ఫోన్ ఉపయోగించి సులభంగా ఆన్‌లైన్‌లో జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి