Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్: ఎక్స్‌ట్రా కేర్ పాలసీ

అదనపు సంరక్షణ కోసం టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్

Extra care top up health insurance policy

తగిన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని నిర్ధారించే సరళమైన మరియు సరసమైన పరిష్కారం

మీ ప్రయోజనాలను పొందండి

హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత కవర్

ఇబ్బందులు-లేని ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

అంబులెన్స్ కవర్

బజాజ్ అలియంజ్ ఎక్స్‌ట్రా కేర్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?

వైద్య ఖర్చులు పెరగడంతో అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా జరిగే ఖర్చులకు, మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సరిపోదు. వైద్య ఖర్చులు పెరిగేకొద్దీ, మీ ప్రాధమిక హెల్త్ ఇన్సూరెన్స్ మీ ప్రస్తుత అవసరాలకు సరిపోదని మీరు తెలుసుకున్నారు. సంక్లిష్టమైన వైద్య పరిస్థితి, మీ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ని ఒకేసారి తినేస్తుంది. అందువల్ల, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో అందుబాటులో ఉండే టాప్-అప్ ప్లాన్‌ను ఎంచుకోవడం అనేది అదనపు సంరక్షణ మరియు రక్షణను అందిస్తుంది.

మా ఎక్స్‌ట్రా కేర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హాస్పిటలైజేషన్ మరియు వైద్య చికిత్సల కారణంగా తలెత్తే ఖర్చులను భరిస్తుంది. ఈ పాలసీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను పొడిగిస్తుంది మరియు మీ బేస్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ముగిసినప్పటికీ మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారని నిర్ధారిస్తుంది.

ఎక్స్‌ట్రా కేర్ విషయానికి వస్తే మేము చాలా ఎక్కువ అందిస్తున్నాము

ముఖ్యమైన ఫీచర్లు

మా ఎక్స్‌ట్రా కేర్ పాలసీ, క్రింది ఫీచర్లతో అదనపు రక్షణను అందిస్తుంది:

  • టాప్-అప్ కవర్

    ఇది మీ రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని మెరుగుపరచే ఒక యాడ్-ఆన్ ప్లాన్.

  • ఫ్లోటర్ ఎంపిక

    మీ కుటుంబం మొత్తానికి ఒకే ప్రీమియం మరియు ఒకే ఇన్సూరెన్స్ మొత్తం. మీరు, మీ జీవిత భాగస్వామి, గరిష్టంగా మీ 3 పిల్లలు మరియు తల్లిదండ్రులు కుటుంబ ఫ్లోటర్ ఆప్షన్ కింద కవర్ చేయబడతారు.

  • వివిధ వయసుల వారికి

    ఈ పాలసీ 3 నెలల నుండి 70 సంవత్సరాల మధ్య వయసు గల సభ్యులను కవర్ చేస్తుంది.

  • మెడికల్ టెస్టులు లేవు

    ఈ పాలసీ కింద, క్లీన్ ప్రపోజల్ ఫారమ్‌ కారణంగా 55 సంవత్సరాల వయస్సు వరకు ప్రీ-మెడికల్ పరీక్షల అవసరం లేదు.

  • అంబులెన్స్ కవర్

    ఈ పాలసీ రూ 3,000 వరకు అత్యవసర అంబులెన్స్ కవర్‌ని అందిస్తుంది.

  • హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత కవర్

    ఈ పాలసీ ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులను 30 రోజుల వరకు మరియు హాస్పిటల్‌లో చేరిన తర్వాత 60 రోజుల వరకు ఖర్చులను కవర్ చేస్తుంది.

బజాజ్ అలియంజ్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి వీడియో చూడండి.

Video

సులభమైన, అవాంతరాలు-లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

క్యాష్‌లెస్ క్లెయిమ్ ప్రాసెస్ (నెట్‌వర్క్ హాస్పిటల్‌లో చికిత్స కోసం మాత్రమే వర్తిస్తుంది):

నెట్‌వర్క్ హాస్పిటల్‌లో క్యాష్‌లెస్ సదుపాయం 24x7, ఈ సేవలో ఎటువంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. హాస్పిటల్‌లో చేరేముందు మీరు తప్పనిసరిగా హాస్పిటల్స్ జాబితాను చెక్ చేయాలి. క్యాష్‌లెస్ సెటిల్‌మెంట్‌ని అందించే హాస్పిటల్‌లు, ఎటువంటి నోటీసు లేకుండా వారి పాలసీని మార్చడంలో బాధ్యత వహిస్తాయి. అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్‌తో అందుబాటులో ఉంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.

మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్‌లను ఎంచుకున్నప్పుడు, కింది దశలను అనుసరించండి:

  • చికిత్స చేసే డాక్టర్/హాస్పిటల్ ద్వారా నింపబడిన మరియు సంతకం చేయబడిన ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌ని హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ వద్ద పొందండి.
  • నెట్‌వర్క్ హాస్పిటల్, HAT కు ఆ రిక్వెస్ట్‌ని ఫ్యాక్స్ చేస్తుంది.
  • పాలసీ మార్గదర్శకాల ప్రకారం HAT వైద్యులు, ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ ఫారమ్‌ను పరిశీలించి నగదురహిత లభ్యతను నిర్ణయిస్తారు.
  • ఇన్సూరెన్స్ ప్లాన్ మరియు దాని ప్రయోజనాలను బట్టి ఆథరైజెషన్ లెటర్/తిరస్కరణ లెటర్/అదనపు అవసరాల గురించి లెటర్ 3 గంటల్లో జారీ చేయబడుతుంది.
  • డిశ్చార్చ్ సమయంలో, హాస్పిటల్ ఫైనల్ బిల్లు మరియు డిశ్చార్జ్ వివరాలను HAT తో షేర్ చేస్తుంది మరియు వారి అంచనా ఆధారంగా, ఫైనల్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ చేయబడుతుంది.

గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు

  • ప్లాన్‌ చేసుకున్న హాస్పిటలైజేషన్ సందర్భాల్లో, నెట్‌వర్క్ హాస్పిటల్ విధానం ప్రకారం ముందస్తు అడ్మిషన్ కోసం మీ అడ్మిట్‌ని రిజిస్టర్/రిజర్వ్ చేసుకోండి.
  • నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ప్రవేశం, బెడ్ లభ్యతకు లోబడి ఉంటుంది.
  • క్యాష్‌లెస్ సదుపాయం ఎల్లప్పుడూ మీ పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.
  • ఈ పాలసీ కింది వాటిని కవర్ చేయదు: టెలిఫోన్ ఛార్జీలు బంధువుల కోసం ఆహారం మరియు పానీయాలు టాయిలెట్లు వంటి సేవల కోసం అయ్యే ఖర్చును మీరు భరించాల్సి ఉంటుంది మరియు డిశ్చార్జీకి ముందు నేరుగా హాస్పిటల్‌కు చెల్లించాలి.
  • ఇన్-రూమ్ రెంట్ నర్సింగ్ ఛార్జీలు కూడా చేర్చబడ్డాయి. అయితే, అధిక విలువతో కూడిన గదిని ఉపయోగించినట్లయితే, పెరుగుతున్న ఛార్జీలను మీరు భరించాల్సి ఉంటుంది.
  • పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం చికిత్స కవర్ చేయబడకపోతే, మీ క్లెయిమ్—క్యాష్‌లెస్ లేదా రీయింబర్స్‌మెంట్ తిరస్కరించబడుతుంది.
  • సరైన వైద్య సమాచారం అందించని సందర్భంలో, క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం ప్రీ-ఆథరైజేషన్‌ రిక్వెస్ట్ తిరస్కరింపబడవచ్చు.
  • క్యాష్‌లెస్ సౌకర్యాన్ని తిరస్కరించడం అంటే ట్రీట్‌మెంట్‌ని తిరస్కరించినట్టు కాదు మరియు అవసరమైన వైద్య సహాయం లేదా ఆసుపత్రిలో చేరకుండా మిమ్మల్ని ఏ విధంగానూ అడ్డుకోవడం కూడా కాదు.

హాస్పిటల్‌లో చేరడానికి ముందు/తరువాత ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్:

పాలసీ ప్రకారం అడ్మిట్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, సంబంధిత వైద్య ఖర్చులు తిరిగి చెల్లించబడతాయి. వైద్య సేవలకు సంబందించిన ప్రిస్క్రిప్షన్లను మరియు బిల్లులు/రశీదులను, సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారంతో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ వారికి సమర్పించాలి.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్

  • హాస్పిటలైజేషన్ గురించి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌కు తెలియజేయండి. మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆఫ్‌లైన్‌లో రిజిస్టర్ చేయడానికి, దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి: 1800-209-5858.
  • డిశ్చార్జ్ తరువాత, మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను 30 రోజుల్లోపు HAT కి సమర్పించాలి: మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ IDతో పాటు సరిగ్గా నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్. ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు మరియు చెల్లింపు రశీదు. < span3> ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ డిశ్చార్జ్ కార్డు ప్రిస్క్రిప్షన్లు మందులు మరియు సర్జరీ వస్తువుల బిల్లులు హాస్పిటలైజేషన్‌కు ముందు ఖర్చుల వివరాలు (ఏవైనా ఉంటే ) అవసరమైతే రోగి డాక్యుమెంట్లు.
  • తదుపరి ప్రాసెసింగ్ కోసం అన్ని డాక్యుమెంట్లు HAT కి పంపబడతాయి మరియు వారి అంచనా ఆధారంగా, ఫైనల్ సెటిల్‌మెంట్ 10 పనిదినాలలోపు జరుగుతుంది.
  • హాస్పిటలైజెషన్ తర్వాత క్లెయిమ్ డాక్యుమెంట్లు, డిశ్చార్జ్ తేదీ నుండి 90 రోజుల్లోపు పంపబడాలి.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

  • సరైన సంతకం మరియు ముద్రణ వేయబడిన ఒరిజినల్ ప్రీ-నంబర్‌తో కూడిన హాస్పిటల్ చెల్లింపు రశీదు.
  • ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్లు మరియు ఫార్మసీ బిల్లులు.
  • ఒరిజినల్ కన్సల్టేషన్ పేపర్‌లు (ఏవైనా ఉంటే).
  • హాస్పిటల్ లోపల మరియు వెలుపల జరిపిన దర్యాప్తు కోసం ఒరిజినల్ బిల్లులు మరియు చెల్లింపు రశీదుతో పాటు, ఒరిజినల్ దర్యాప్తు మరియు విశ్లేషణ రిపోర్ట్‌లు.
  • మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్ అర్హతను పొంది, దానిని వినియోగించుకోనట్లయితే అది పేర్కొంటూ, హాస్పిటల్ నుండి ఒక లెటర్.
  • సంఘటన వివరాలను ప్రస్తావిస్తూ ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి ఒక లెటర్ (ప్రమాదం జరిగిన సందర్భంలో).
  • లెటర్‌హెడ్‌‌పై హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు హాస్పిటల్‌లోని మౌలిక సదుపాయాలు ఉండాలి.
  • IFSC కోడ్ మరియు ఇన్సూరెన్స్ చేయబడిన వారి పేరును కలిగి ఉన్న క్యాన్సెల్ చెక్.
  • ఇండోర్ కేస్ పేపర్ కాపీ, హాస్పిటల్‌లో చేరిన తేదీ నుండి డిశ్చార్జ్ అయిన తేదీ వరకు వివరణాత్మక వైద్య వివరాలతో మరియు టెంపరేచర్, పల్స్ మరియు శ్వాసక్రియ చార్ట్‌లతో డాక్టర్ నోట్‌లు.
  • X-ray (ఫ్రాక్చర్ సందర్భంలో).
  • ట్రీట్‌మెంట్ చేసే డాక్టర్ నుండి ప్రసూతి వివరాలు (ప్రసూతి సందర్భంలో).
  • FIR కాపీ (యాక్సిడెంట్ సందర్భంలో).
  • కొన్ని ప్రత్యేక సందర్భాలలో అదనపు అవసరాలు: కంటిశుక్లం ఆపరేషన్ విషయంలో, లెన్స్ స్టిక్కర్‌తో పాటు బిల్లు కాపీ. సర్జరీ విషయంలో, ఇంప్లాంట్ స్టిక్కర్‌తో పాటు బిల్లు కాపీ. గుండె సంబంధిత చికిత్స విషయంలో, స్టెంట్ స్టిక్కర్‌తో పాటు బిల్లు కాపీ

అన్ని ఒరిజినల్ క్లెయిమ్ డాక్యుమెంట్లను క్రింది చిరునామాకు పంపించాలి:

ఆరోగ్య పరిపాలన బృందం

బజాజ్ అలియంజ్ హౌస్, విమానాశ్రయం రోడ్, ఎరవాడ, పూణే- 411006

ఎన్వలప్‌పై మీ పాలసీ నంబర్, హెల్త్ కార్డ్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ను స్పష్టంగా పేర్కొనండి.

గమనిక: మీ రికార్డు కోసం డాక్యుమెంట్ల ఫోటోకాపీ మరియు కొరియర్ రిఫరెన్స్ నంబర్‌ని ఉంచండి.

హెల్త్ ఇన్సూరెన్స్‌ని సరళంగా చూద్దాం

టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా మెడిక్లెయిమ్ పాలసీ ఉన్నవారికి, టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అదనపు కవరేజీని అందిస్తుంది. అయితే, మీరు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఇన్సూర్ చేయబడకపోయినా, మీరు దానిని ఒక స్వతంత్ర కవర్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌ట్రా కేర్ పాలసీ కోసం అర్హత ప్రమాణాలు ఏంటి?

ఎక్స్‌ట్రా కేర్ పాలసీ కోసం అర్హతా ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి:

ప్రపోజర్ కోసం ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు. ఈ పాలసీని జీవితకాలానికి రెన్యూవ్ చేసుకోవచ్చు.

తల్లిదండ్రులు ఇద్దరూ మా వద్ద ఇన్సూర్ చేయబడినట్లయితే, 3 నెలల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను కవర్ చేయవచ్చు.

తల్లిదండ్రులు ఇద్దరూ మా వద్ద ఇన్సూర్ చేయబడినట్లయితే, 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు పిల్లలను కవర్ చేయవచ్చు.

18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు పిల్లలను సెల్ఫ్ - ప్రపోజర్‌గా లేదా డిపెండెంట్‌గా కవర్ చేయవచ్చు.

ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో లేనట్లయితే నేను ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ఇన్సూర్ చేయబడకపోయినా, ఎక్స్‌ట్రా పాలసీని కొనుగోలు చేయవచ్చు అయితే, ప్రతి హాస్పిటలైజేషన్‌ కోసం మినహాయించదగిన పరిమితి వరకు ఖర్చులను మీరు భరించాలి.

పన్నుని ఆదా చేయడానికి ఈ పాలసీ ఎలా సహాయపడుతుంది?

మీరు చెల్లించే ప్రీమియంలకు వ్యతిరేకంగా, ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80 D కింద రూ. 1 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవడానికి బజాజ్ అలియంజ్ ఎక్స్‌ట్రా కేర్ పాలసీ మీకు సహాయపడుతుంది. మీరు పన్నును ఎలా ఆదా చేసుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:

మీరు మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులకు చెల్లించే ప్రీమియం పై, మీరు మీ పన్నులకు వ్యతిరేకంగా తగ్గింపుగా సంవత్సరానికి రూ. 25,000 పొందవచ్చు (మీరు 60 సంవత్సరాలకు పైబడి లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.

తొలగింపు అంటే ఏమిటి?

మినహాయింపు అంటే, పాలసీ వ్యవధిలో చేసిన ప్రతి హాస్పిటలైజేషన్ క్లెయిమ్‌కు సంబంధించి, మీ పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని మీరు భరిస్తారు అని అర్థం. పాలసీ క్రింద ప్రతీ ఒక్క క్లెయిమ్ కోసం, ఏదైనా చెల్లింపు చేయడానికి మా బాధ్యత మినహాయింపు కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతి హాస్పిటలైజేషన్ ఒక ప్రత్యేక క్లెయిమ్‌గా పరిగణించబడుతుంది (45 రోజుల్లోపు రీలాప్స్ మినహా, ఇది అదే క్లెయిమ్‌గా పరిగణించబడుతుంది).

మినహాయింపు టేబుల్

ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం (రూ. లలో)

మినహాయించదగిన మొత్తం (రూ. లలో)

10లక్ష

3లక్ష

12లక్ష

4లక్ష

15లక్ష

5లక్ష

క్లెయిమ్ మొత్తం అనేది మినహాయింపు కంటే ఎక్కువగా ఉంటే, ఆ మినహాయించదగిన మొత్తంపై ఉన్న మొత్తం, మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం వరకు చెల్లించబడుతుంది.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఆశీష్ జుంజున్వాలా

2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...

సునీత ఎం అహూజా

లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

రేని జార్జ్

నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...

ఎక్స్‌ట్రా కేర్ పాలసీతో మిమ్మల్ని మీరు సురక్షితం చేసుకోండి మరియు మీ వైద్య ఖర్చుల గురించి ఎప్పుడూ చింతించకండి.

individual-one-roof

55 సంవత్సరాల వయస్సు వరకు మెడికల్ టెస్ట్ మాఫీ.

అంతే కాకుండా, మీ ఎక్స్‌ట్రా కేర్ పాలసీతో వచ్చే అదనపు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి

మేము ఈ క్రింది ప్రయోజనాలతో మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా విస్తృత కవరేజీని అందిస్తాము:

తక్కువ ప్రీమియం

ఈ పాలసీ రూ. 2,500 నుండి ప్రారంభమయ్యే సరసమైన ప్రీమియం రేట్లను అందిస్తుంది.

రెన్యువబిలిటీ

మీరు మీ ఎక్స్‌ట్రా కేర్ పాలసీని లైఫ్‌టైం కోసం రెన్యూచేసుకోవచ్చు.

Consumable expenses

అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌మెంట్

మా వద్ద త్వరిత, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారించే ఒక ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం ఉంది.

మా వద్ద త్వరిత, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారించే ఒక ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం ఉంది. అలాగే, మేము భారతదేశ వ్యాప్తంగా 6,500+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. 

Engine Protector

ట్యాక్స్ సేవింగ్

ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి. * మరింత చదవండి

ట్యాక్స్ సేవింగ్

ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి. *

*మీకోసం, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం ఎక్స్‌ట్రా కేర్ పాలసీని ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నులకు వ్యతిరేకంగా సంవత్సరానికి రూ. 25,000 వరకు మినహాయింపుని పొందవచ్చు (మీరు 60 సంవత్సరాలకు పైగా లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. ఒక పన్ను చెల్లింపుదారుగా, అందువల్ల, మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద మొత్తం రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని గరిష్టంగా పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం, అప్పుడు, రూ 1 లక్ష ఉంటుంది.

ఎక్స్‌ట్రా కేర్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

విస్తృతమైన కవరేజీ

ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం వరకు వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.

అంబులెన్స్ కవర్

రూ 3000 వరకు అంబులెన్స్ ఛార్జీలను కవర్ చేస్తుంది.

హాస్పిటలైజేషన్ కవర్

హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తరువాతి ఖర్చులను కవర్ చేస్తుంది.

1 ఆఫ్ 1

పాలసీ జారీ చేయడానికి ముందు లేదా పాలసీ సమయానికి 4 సంవత్సరాల వ్యవధిలో ఇప్పటికే ఉన్న అన్ని వ్యాధులు/అనారోగ్యాలు.

పాలసీ ప్రారంభించిన మొదటి 30 రోజులలో ఏవైనా వ్యాధులు సంక్రమిస్తే.

పుట్టుకతో వచ్చే వ్యాధులు మరియు రుగ్మతలు

నాన్-అలోపతిక్ మందులు.

ఒక ప్రమాదం కారణంగా కాకుండా ఇతర జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంటాయి.

AIDS మరియు సంబంధిత వ్యాధుల కారణంగా తలెత్తే అన్ని ఖర్చులు.

కాస్మెటిక్ మరియు సౌందర్య చికిత్సలు.

మద్యం లేదా మద్యం వినియోగం కారణంగా ఏవైనా వైద్య సమస్యలు.

ఏదైనా ఫెర్టిలిటీ, సబ్-ఫెర్టిలిటీ, ఇంపోటెన్స్, అసిస్టెడ్ కాన్సెప్షన్ ఆపరేషన్ లేదా స్టెరిలైజేషన్ విధానం.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ మునుపటి పాలసీ గడువు ఇంకా ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Satish Chand Katoch

సతీష్ చంద్ కటోచ్

పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

Ashish Mukherjee

ఆశీష్ ముఖర్జీ

ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.

Prashanth Rajendran

ప్రశాంత్ రాజేంద్రన్

బజాజ్ అలియంజ్ అందించే ఆన్‌లైన్ పాలసీ సౌకర్యం నచ్చింది

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 1st  మార్చి 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి