Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

వాహకాల ద్వారా వచ్చే వ్యాధుల కోసం కస్టమైజ్ చేసిన కవర్
M-Care Health Insurance Policy

ఎం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

Health insurance cover

 7 వెక్టర్ బోర్న్ వ్యాధులపై కవరేజ్

Tax gain plan

 సరసమైన ప్రీమియం వద్ద అనేక ప్రయోజనాలు

Ciritcal Illness Illness Lifetime

లైఫ్‌టైమ్ రెన్యూవల్ బెనిఫిట్

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి?

బజాజ్ అలియంజ్ తరపున ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెడుతున్నాము. డెంగ్యూ ఫీవర్, మలేరియా, చికెన్‌గున్యా, జికా వైరస్ వంటి దోమల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు ఇన్సూర్ చేసుకోండి.  

మీ నెలవారీ షాపింగ్ జాబితాలో ఎలక్ట్రిక్ మస్కిటో స్వాటర్లు లేదా ఫ్లై రిపెల్లెంట్ స్ప్రేలు స్థిరంగా ఉన్నా, గాలిలో వెక్టర్స్ కలిగించే ప్రమాదాల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనలాంటి వాతావరణం ఉన్న దేశంలో, రాత్రివేళల్లో మంచి నిద్ర అనేది ఈ చిన్న చిన్న జీవుల ఇష్టానికి లోబడి ఉంటుంది. సూపర్ మార్కెట్‌లో కొత్త దోమల నిరోధక ప్రోడక్ట్‌ని మీరు త్వరగా గుర్తించినప్పటికీ, వాటి నుండి లభించే ఫలితాలు మీరు ఖర్చు చేసే డబ్బు కన్నా విలువైనవి కాకపోవచ్చు.

ఈ పద్ధతులన్నీ కూడా శీఘ్ర పరిష్కారాలు మాత్రమే మరియు ఇవి మిమ్మల్ని వ్యాధి బారిన పడకుండా రక్షించలేవు. వాహకాల ద్వారా వచ్చే వ్యాధి కారణంగా మీరు అనారోగ్యానికి గురైతే, మీరు చెల్లించే చికిత్స ఖర్చులకు ఎలాంటి పరిమితులు ఉండకపోవచ్చు. అలాగే, సగటున ఒక హాస్పిటల్ స్టే ఖర్చు చాలా తొందరగా ఆరు సంఖ్యలకు చేరుతుంది!

బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది మరియు కొన్ని సార్లు మీరు మొదటిదశలోనే జయించవచ్చు! వెక్టర్ ద్వారా కలిగే వ్యాధుల చికిత్స వల్ల తలెత్తే ఆర్థిక ఎదురుదెబ్బలను తట్టుకునే ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మేము మీకు అందిస్తున్నాము. దోమ కాటుకు కొన్ని సెకన్ల పాటు బాధపడవచ్చు కానీ, దానివల్ల వచ్చే వైద్య ఖర్చులు, మీ వాలెట్ మరియు మనశ్శాంతిని చాలా పెద్ద కాటుకు గురిచేస్తాయి. బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు ఆందోళన నుండి నిజమైన స్వేచ్ఛను అనుభవించవచ్చు. ఇది మీరు వెతుకుతున్న మరియు మీ కుటుంబానికి అనువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ!

మీకు మలేరియా లేదా డెంగ్యూ ఉందని డాక్టర్ నిర్ధారించినపుడు, ఓదార్పు గీతంలా ఇది ప్రశాంతతను తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది. పాలసీ వ్యవధిలో రోగనిర్ధారణ జరిగితే, మీరు ఏలాంటి వైద్య ఖర్చుల నుండి అయినా కవర్ చేయబడతారు. మస్కిటో రిపెల్లెంట్‌లా కాకుండా, ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చక్కగా పనిచేస్తుంది!

మా నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బిల్లులను సులభంగా చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది, చికిత్స సమయంలో మరియు తర్వాత మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచే విధంగా, ప్రశాంతతను మరియు విశ్వాసాన్ని కలిగించి మీచేత ఔరా! అనిపించుకుంటుంది! కుటుంబం కోసం వెక్టర్ బోర్న్ వ్యాధులను ప్రత్యేకంగా కవర్ చేసే మొట్టమొదటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని మీరు ఆనందంగా మీ వాళ్లకు తెలియజేస్తారని భావిస్తున్నాము. 

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు

బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వాతావరణంతో సంబంధం లేకుండా మీరు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారిస్తుంది. వెక్టర్ బోర్న్ వ్యాధుల కారణంగా తలెత్తే వైద్య అత్యవసర పరిస్థితిలో, మీరు పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై డిస్కౌంట్‌ని అందిస్తాము! అంతేకాకుండా, ఒక భారాన్ని పంచుకుంటే అది సగానికి సగం అవుతుంది.

రోగ నిర్ధారణ నుండి రికవరీ వరకు, మీ వైపు ఉన్న బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు ఖచ్చితంగా వ్యత్యాసాన్ని అనుభూతి చెంతుదారు! మీ డాక్టర్‌తో కలిసి పనిచేస్తూ, ఈ రకమైన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సమగ్ర ప్రయోజనాలను అందించడంతో మిమ్మల్ని త్వరగా మీ కాళ్లపై నిలబడేలా చేస్తుంది:

 

  • Cover for all అందరికీ కవర్

    ప్రతిపాదకుడు/జీవిత భాగస్వామి/ఆధారపడిన పిల్లలు/ఆధారపడిన తల్లిదండ్రుల కోసం ఫ్లోటర్ పాలసీ 

  • Cashless facility నగదురహిత సదుపాయం

    క్యాష్‌లెస్ సదుపాయానికి సౌకర్యం (క్యాష్‌లెస్ ఆథరైజేషన్ మరియు ప్రయోజనాల పరిమితికి లోబడి)

  • 20% discount applicable 20% డిస్కౌంట్ వర్తిస్తుంది

    ఒక కస్టమర్ మా వెబ్‌సైట్ నుండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ వర్తిస్తుంది

  •  Lifetime renewal option లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్

     లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్ అందుబాటులో ఉంది

  • Free look period ఫ్రీ లుక్ కాలం

    15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్

  • Different sum insured options పలురకాల ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌లు

    ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌లు కనీసం రూ. 10, 000 మరియు గరిష్టంగా రూ. 75, 000

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? మరింత తెలుసుకోవాడానికి వీడియోను చూడండి

ఎం-కేర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్

నగదురహిత క్లెయిమ్ విధానం

 

మీ ఎం-కేర్ ప్లాన్‌పై క్లెయిములను ఫైల్ చేయడం చాలా సులభం మరియు శ్రమలేనిది. అంతేకాకుండా, టర్న్అరౌండ్ సమయం అనే నిబంధనతో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం అనేది మీకు ఇచ్చే హామీలలో ఒక కీలక అంశం!

క్యాష్‌లెస్ లేదా రీయింబర్స్‌మెంట్ విధానం ద్వారా క్లెయిమ్‌లను చేయవచ్చు. అది ఎలా పని చేస్తుందంటే

మొదటగా, క్యాష్‌లెస్ ఆథరైజేషన్ మరియు లిమిట్ ఆఫ్ బెనిఫిట్స్ వంటి మీ ఎం-కేర్ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి, క్యాష్‌‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సరే అయితే! క్యాష్‌లెస్ క్లెయిమ్‌ని ఫైల్ చేసే ప్రాసెస్ ద్వారా ముందుకు వెళదాం. మీరు చేయవలసింది:

 

 

  • మా నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లోని ఒక దానిలో చికిత్స/కన్సల్టేషన్ కోసం వెళ్లడానికి ముందు మాకు కాల్ చేసి, ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్ వివరాలను గురించి తెలుసుకోండి.
  • అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా మీరు హాస్పిటల్‌లో చేరినట్లయితే 24 గంటల్లో మాకు తెలియజేయండి.
  • మీరు సరిగ్గా పూరించి, సంతకం చేసిన ఫారమ్‌ అందిన 2 గంటల్లోనే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. ఆ వివరాల ఆధారంగా - అప్రూవల్, రిజెక్షన్ లేదా రిక్వెస్ట్ వంటి మరింత సమాచారాన్ని - సాధ్యమైనంత వరకూ ఉత్తమమైన చికిత్సను అందించడం లేదా ఇతర ప్రత్యామ్నాయాలను తెలియజేయడంలో మీకు త్వరగా సహాయపడతాము.
  • ఒరిజినల్ బిల్లులు, చికిత్స సాక్ష్యాలపై మేము, నేరుగా నెట్‌వర్క్ హాస్పిటల్‌తో క్లెయిమ్‌ని సెటిల్ చేస్తాము. ప్రీ-ఆథరైజేషన్ పొందినప్పటికీ, కవరేజ్ అనేది పాలసీలోని నిబంధనలు మరియు ప్రయోజనాల పరిమితి వంటి షరతులకు లోబడి ఉంటుందని దయచేసి గమనించండి. ఈ నిబంధనలు మరియు షరతులు సమీక్షకు లోబడి ఉంటాయి మరియు కంపెనీ యొక్క అభీష్టానుసారం మారవచ్చు.
  • చెల్లించవలసిన ప్రయోజనం మరియు ఫైనల్ హాస్పిటల్ బిల్లు మధ్యన ఏదైనా వ్యత్యాసం ఉంటే అది మీకు నేరుగా చెల్లించబడుతుందని గమనించండి. ఒకవేళ బిల్లు మొత్తం ఎక్కువగా ఉంటే, మీరు స్వతహా ఆ వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
  • అడ్మిషన్‌కు ముందు నెట్‌వర్క్ హాస్పిటల్‌లో, బజాజ్ అలియంజ్ వారు జారీ చేసిన ఆథరైజేషన్ లెటర్, ID కార్డ్, ఎం-కేర్ పాలసీ డాక్యుమెంట్ మరియు ఏదైనా ఇతర సమాచారం ఉంటే దానిని అందించండి.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్

 

మీరు రీయింబర్స్‌మెంట్ కోసం ఎంచుకోవచ్చు:

  • ఒకవేళ మా ద్వారా ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ తిరస్కరించబడినట్లయితే
  • మీరు మా నెట్‌వర్క్‌లో భాగం కాని ఆసుపత్రిని ఎంచుకుంటారు
  •  మీరు నగదు చెల్లింపుని ఎంచుకున్నారని అర్థం

 

మా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఇవ్వబడింది:

  • ఏదైనా లిస్టెడ్ వెక్టర్ బోర్న్ వ్యాధితో నిర్ధారించబడితే, 48 గంటల్లోపు దానిని మాకు వ్రాతపూర్వకంగా తెలియజేయండి.
  • వెంటనే మీ డాక్టర్‌ని సంప్రదించి, వారు సూచించిన చికిత్సను అనుసరించండి.
  • అవసరమైతే, మా ఎంపానెల్డ్ డాక్టర్‌ల పర్యవేక్షణలో అవసరమైనన్ని సార్లు పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరవచ్చు. ఖర్చులు, అవును వాస్తవానికి, అవి మేమే భరిస్తాయి.
  • వెక్టర్ బోర్న్ వ్యాధికి సంబంధించి రోగనిర్ధారణ/డిశ్చార్జ్ చేయబడిన 30 రోజుల్లోపు మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి.

 

క్లెయిమ్ ఫైల్ చేయడానికి సమర్పించవలసిన డాక్యుమెంట్లు:

i) హక్కుదారు సంతకం చేసిన NEFT ఫారమ్‌తో పాటు ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్.

ii) డిశ్చార్జ్ సారాంశం / డిశ్చార్జ్ సర్టిఫికేట్

iii) ఇన్‌డోర్ కేస్ పేపర్ల ధ్రువీకరించబడిన కాపీలు

iv) ఫైనల్ హాస్పిటల్ బిల్లు కాపీ

v) అవసరమైన అన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లు

vi)                  స్పెషలిస్ట్ నుండి మెడికల్ సర్టిఫికేషన్

vii)                ఏవైనా తప్పిదాలు జరిగిన సందర్భాల్లో, పైన పేర్కొన్న డాక్యుమెంట్లకు అదనంగా ఏదైనా ఇతర డాక్యుమెంట్(ల) కోసం మేము మీకు కాల్ చేస్తాము

viii)              IRDAI మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కాపీలు.

 

 

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను సులభతరం చేయడం

ఈ పాలసీలో ఎన్ని వ్యాధులు కవర్ చేయబడతాయి?

ఎం-కేర్ ఇన్సూరెన్స్ పాలసీ 7 వెక్టర్ బోర్న్ వ్యాధులను కవర్ చేస్తుంది, అవి:

    ✓ డెంగ్యూ ఫీవర్

    ✓ మలేరియా

    ✓ ఫైలేరియాసిస్ (జీవితకాలంలో ఒకసారి మాత్రమే చెల్లించబడుతుంది)

    ✓ కాలా అజర్

    ✓ చికెన్‌గున్యా

    ✓ జపనీస్ ఎన్సెఫాలైటిస్

    ✓ జికా వైరస్

ఈ కవర్‌ని కొనుగోలు చేయడానికి అర్హతా ప్రమాణాలు ఏంటి?

ఈ పాలసీ 18 నుండి 65 సంవత్సరాల మధ్య వారికి, ఎవరికైనా కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీలో మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లలను కూడా కవర్ చేయవచ్చు. 

ఈ పాలసీ వెక్టర్ బోర్న్ వ్యాధులను మొదటి రోజు నుండి కవర్ చేస్తుందా?

పాలసీ ప్రారంభమైన తేదీ నుండి మొదటి 15 రోజులలోపు, జాబితాలో ఉన్న ఏదైనా వెక్టర్ బోర్న్ వ్యాధి కవర్ చేయబడదు. మునుపటి పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌లు లేకుండా, మీ పాలసీ బ్రేక్ లేకుండా రెన్యూచేయబడినా ఈ మినహాయింపు తదుపరి సంవత్సరాలకు వర్తించదు.

ఏదైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా?

క్రింది సందర్భాల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది:

 ✓ జాబితాలో ఉన్న వెక్టర్-బోర్న్ వ్యాధుల్లో, ఏదైనా సంభవించిన తర్వాత పాలసీ కొనుగోలు చేయబడినట్లయితే:

 ✓ రెన్యూవల్ విషయంలో, మునుపటి పాలసీ వ్యవధిలో ప్రయోజనం చెల్లించబడినట్లయితే

ఈ రెండు సందర్భాల్లో అనగా, రోగ నిర్ధారణ/చికిత్స పొందిన నిర్దిష్ట వ్యాధికి (మునుపటి ప్రవేశం తేదీ నుండి) 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

నా ప్రస్తుత పాలసీలో ఏదైనా క్లెయిమ్ ఉంటే, నా పాలసీ రెన్యూవల్ సమయంలో ఏదైనా మినహాయింపు ఉంటుందా?

గతంలో చెల్లించిన క్లెయిమ్ యొక్క అడ్మిషన్ తేదీ నుండి 60 రోజులలోపు పాలసీ రెన్యూచేబడితే, రెన్యూచేయబడిన పాలసీలో అదే వ్యాధికి 60 రోజుల కూలింగ్ పీరియడ్ వర్తిస్తుంది. అయితే ఇతర లిస్టెడ్ వెక్టర్-బోర్న్ వ్యాధులకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు.

గతంలో చెల్లించిన క్లెయిమ్ యొక్క అడ్మిషన్ తేదీ నుండి 60 రోజుల తర్వాత పాలసీ రెన్యూచేబడితే, అన్ని లిస్టెడ్ వెక్టర్ బోర్న్ వ్యాధులకు 15 రోజుల తాజా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

రమా అనిల్ మాటే

మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.

సురేష్ కాడు

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

అజయ్ బింద్ర

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి అర్హతా ప్రమాణాలు

స్పష్టంగా చెప్పాలంటే , వెక్టర్ బోర్న్ వ్యాధులతో ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు. మీరు మరియు మీ కుటుంబం అటువంటి ఆరోగ్య ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవడానికి బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనువైనది. బాల్యం నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు, మా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ కష్టాలను సరళీకృతం చేయడంలో ఫైనాన్షియల్ ఇమ్యూనిటీని అందిస్తుంది. ఒకవేళ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నట్లు మీరు భావిస్తే, మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి దానితో ఏదైనా సంబంధం ఉండవచ్చు!

ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవరేజ్ కోసం అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

● ప్రపోజర్/ జీవిత భాగస్వామి/ ఆధారపడిన తల్లిదండ్రుల కోసం కనీస ప్రవేశ వయస్సు - 18 సంవత్సరాలు

● ప్రపోజర్/ జీవిత భాగస్వామి/ ఆధారపడిన తల్లిదండ్రుల కోసం గరిష్ట ప్రవేశ వయస్సు - 65 సంవత్సరాలు

● ఆధారపడిన పిల్లల కోసం కనీస ప్రవేశ వయస్సు - 0 రోజులు

కుటుంబం చిన్నది లేదా పెద్దది అయినప్పటికీ, వెక్టర్ బోర్న్ వ్యాధుల కారణంగా తలెత్తే వైద్య ఖర్చుల నుండి మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సాటిలేని మనశ్శాంతిని ఇస్తుంది.

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చార్ట్

 

కవర్ చేయబడే సభ్యులు ఇన్సూర్ చేయబడిన మొత్తం అనుమతించదగిన క్లెయిమ్‌ల సంఖ్య
10,000 15,000 25,000 50,000 75,000
1 సభ్యుడు 160 240 400 800 1200 1 క్లెయిమ్
2 సభ్యులకు-ఫ్లోటర్ 240 360 600 1200 1200 1 క్లెయిమ్
3 లేదా 4 సభ్యులకు-ఫ్లోటర్ 320 480 800 1600 2400 2 క్లెయిమ్‌లు
5 లేదా 6 సభ్యులకు-ఫ్లోటర్ 400 600 1000 2000 3000 2 క్లెయిమ్‌లు

 

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం అనేది వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని ప్రాసెస్. వెక్టర్-బోర్న్ వ్యాధుల నుండి మీ కవరేజీని సురక్షితం చేయడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి:

  • అధికారిక బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగానికి వెళ్ళండి.
  • మీకు కావలసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోండి మరియు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ అయినా మీ అవసరాలకు సరిపోయే పాలసీ రకాన్ని ఎంచుకోండి.
  • ఖచ్చితమైన వివరాలతో ప్రతిపాదన ఫారం నింపండి మరియు ధృవీకరణ కోసం అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • సురక్షితమైన ఆన్‌లైన్ చెల్లింపు చేయడం ద్వారా ప్రాసెస్‌ను పూర్తి చేయండి. ఒకసారి పూర్తయిన తర్వాత, మీ పాలసీని తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మనశ్శాంతిని పొందండి.

ఈ రోజు ఆన్‌లైన్ పాలసీ కొనుగోళ్ల సౌలభ్యం మరియు వేగం యొక్క ప్రయోజనాన్ని పొందండి!

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మలేరియా, డెంగ్యూ మరియు చికన్‌గున్యా వంటి వెక్టర్-బోర్న్ వ్యాధుల నుండి ఆర్థిక రక్షణను అందించే ఒక విశ్వసనీయమైన మరియు సమగ్ర ప్లాన్‌గా నిలిచింది. ఇది సరసమైనది, సులభమైన మరియు అసాధారణమైన సేవను కలిగి ఉంటుంది, ఇది లక్షలాది మంది పాలసీదారులకు ఇష్టపడే ఎంపికగా చేస్తుంది.

  • లక్షల ద్వారా విశ్వసనీయమైనది : బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందించే నమ్మకం మరియు ఆవిష్కరణకు సమానమైన పేరు.
  • పారదర్శక పాలసీలు : ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేకుండా, ఎం-కేర్ పాలసీ ప్రతి కస్టమర్‌కు స్పష్టత మరియు మనశ్శాంతిని నిర్ధారిస్తుంది.
  • విస్తృత హాస్పిటల్ నెట్‌వర్క్ : భాగస్వామ్య ఆసుపత్రుల విస్తృత నెట్‌వర్క్ ద్వారా అవాంతరాలు లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ల నుండి ప్రయోజనం.
  • ప్రత్యేక సీనియర్ సిటిజన్ సపోర్ట్ : ప్రత్యేక సర్వీస్ ఛానెళ్లు సీనియర్ సిటిజన్స్ కోసం సహాయంకు ప్రాధాన్యత ఇస్తాయి, వేగవంతమైన మరియు సమర్థవంతమైన సంరక్షణను నిర్ధారిస్తాయి.

 ఎం-కేర్ ఇన్సూరెన్స్: కొనుగోలు చేయడానికి ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

నేను ఏ కవరేజ్ పొందగలను?

బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వెక్టర్ బోర్న్ వ్యాధుల ఆర్థిక ప్రభావం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది..

మరింత చదవండి

తీవ్రమైన ఎండ నుండి కాపాడే ఒక పెద్ద టోపీ వలె వెక్టార్ బోర్న్ రోగాల వలన కలిగే ఆర్థిక ప్రభావం నుండి బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రక్షణ కలిపిస్తుంది, వెక్టార్ బోర్న్ రోగాల వలన కలిగే ఆర్థిక ప్రభావం నుండి బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు రక్షణ కలిపిస్తుంది. ఇది మీ నిర్దిష్ట అవసరాలను బట్టి అనేక కవరేజ్ ఎంపికలను అందించే ఒక రక్షణ కవచం. పాలసీ వ్యవధిలో మీరు రోగ నిర్ధారణ అయితే, అనేక వ్యాధుల నుండి మేము మిమ్మల్ని కవర్ చేస్తాము. అవి ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.

1 డెంగ్యూ ఫీవర్

2 మలేరియా

3 ఫైలేరియాసిస్ (జీవితకాలంలో ఒకేసారి చెల్లించబడుతుంది)

4 కాలా అజర్

5 చికెన్‌గున్యా

6 జపనీస్ ఎన్సెఫాలైటిస్

7 జికా వైరస్

ఫ్యామిలీ కవర్

ప్రతిపాదకుడు, జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రుల కోసం ఫ్లోటర్ పాలసీ.

1 ఆఫ్ 1

కవరేజ్ విభాగంలో పొందుపరిచిన లిస్టెడ్ వెక్టర్ బోర్న్ వ్యాధుల మినహా ఏదైనా చికిత్స.

24 గంటల కంటే తక్కువ సమయం హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉండటం.

భారతదేశం వెలుపల రోగనిర్ధారణ మరియు చికిత్స.

 అయితే, ఈ మినహాయింపు క్రింద ఇవ్వబడిన దేశాలలో వర్తించదు

మరింత చదవండి

 అయితే, ఈ మినహాయింపు క్రింద జాబితా చేయబడిన దేశాలలో వర్తించదు, అయితే, ఈ మినహాయింపు క్రింది జాబితాలోని దేశాలలో వర్తించదు

 

న్యూజిలాండ్ జపాన్
సింగపూర్ కెనడా
స్విట్జర్లాండ్ దుబాయ్
యుఎస్‌ఎ హాంగ్ కాంగ్
మలేషియా యూరోపియన్ యూనియన్ దేశాలు

ఒక ప్రపంచ స్థాయి పోల్ వాల్ట్ అథ్లెట్ లాగా

ఒక సంక్షిప్త నిర్వహణ తర్వాత ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వేగాన్ని అందుకుంటుంది! మీరు ఒక వెక్టర్-బోర్న్ వ్యాధితో నిర్ధారించబడితే

మరింత చదవండి

ఒక సంక్షిప్త నిర్వహణ తర్వాత ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వేగాన్ని అందుకుంటుంది! మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రారంభమైన తేదీ నుండి మొదటి 15 రోజుల్లోపు ఒక వెక్టర్-బోర్న్ వ్యాధితో నిర్ధారించబడితే, కవరేజ్ మినహాయించబడుతుంది. అయితే మీరు ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకున్నట్లయితే, మేము కవరేజీని ఆనందంగా అందిస్తాము. ఇక్కడ, ఒక మినహాయింపు ఉంది! గత సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్లు లేకపోతే కవరేజ్ వర్తించే అవకాశాలు ఉన్నాయి. 

ఒక 60 రోజుల వెయిటింగ్ పీరియడ్

 ముందుగా ఉన్న ఏవైనా అనారోగ్యాలకు ఒక 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది

మరింత చదవండి

ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడానికి ముందు, మీరు ఏవైనా అనారోగ్యాలకు ముందుగా చికిత్స పొందినట్లయితే ఒక 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. అయితే మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరుసటి సంవత్సరం రెన్యూ చేసినట్లయితే, ఇంతకుముందు క్లెయిమ్ చేసిన నిర్దిష్ట పరిస్థితికి ఆఖరి చికిత్స తేదీ నుండి 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. 

60 రోజుల కూలింగ్ ఆఫ్ పీరియడ్

 ఒకవేళ మీరు, మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆ తేదీ నుండి 60 రోజుల్లోపు రెన్యూ చేస్తే

మరింత చదవండి

చివరిసారిగా చెల్లించిన క్లెయిమ్ తేదీ నుండి 60 రోజులలోపు మీరు మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూచేస్తే, అదే వ్యాధికి రెన్యూవల్‌పై 60 రోజుల వరకు కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తిస్తుంది; అయితే, ఇతర వెక్టర్ బోర్న్ వ్యాధుల కోసం వెయిటింగ్ పీరియడ్ ఉండదు.

15 రోజుల వెయిటింగ్ పీరియడ్

ఒకవేళ మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అడ్మిషన్ తేదీ నుండి 60 రోజుల తర్వాత రెన్యూచేయబడితే

మరింత చదవండి

మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గతంలో చెల్లించిన క్లెయిమ్ అడ్మిషన్ తేదీ నుండి 60 రోజుల తర్వాత రెన్యూచేయబడితే, పాలసీ కింద జాబితా చేయబడ్డ వెక్టర్ బోర్న్ వ్యాధుల కోసం 15 రోజుల తాజా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.

1 ఆఫ్ 1

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు

మీ ప్రస్తుత పాలసీ గడువు ముగియబోతుందా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

4.75

(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

రమా అనిల్ మాటే

మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.

సురేష్ కాడు

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

అజయ్ బింద్ర

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి