ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఆసియా దేశాలను సందర్శించే ప్రయాణీకులను రక్షించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన పాలసీ. ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, వ్యక్తిగత బాధ్యత, చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం, ఆలస్యాలు మరియు హైజాక్ సంఘటనలకు కూడా కవరేజ్ అందిస్తుంది. ఈ పాలసీలో ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో, మీరు ఊహించని ఖర్చుల నుండి రక్షించబడతారు, ఇది మీ ట్రిప్ నుండి మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి వీలు కలిపిస్తుంది.
రోజువారీ రొటీన్ నుండి విరామం తీసుకుని ప్రపంచంలో ఉత్సాహవంతంగా ప్రయాణించడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు? ప్రయాణం అనేది ఒత్తిడిని తగ్గించి ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుంది. ప్రయాణం చేయాలని మీకు కోరిక కలిగినప్పుడు, మీరు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. ఒక ట్రిప్ పై బయలుదేరే ముందు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండడం మంచి నిర్ణయం. ఏదైనా ఊహించని సంఘటన జరిగినప్పుడు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండడం వలన పరిస్థితులు ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి.
అంతర్జాతీయ ప్రయాణికులకు ఆసియా ఇష్టమైన గమ్యస్థానంగా మారుతుంది మరియు అందుకు కారణం కూడా ఊహించగలం. దక్షిణ కొరియాలోని చెర్రీ బ్లాసమ్ పిక్నిక్స్ నుండి వియత్నాంలో శాండ్ డ్యూన్ సర్ఫింగ్ వరకు, ఇంటికి దగ్గరగా ఉన్న దేశాలు వినూత్నమైన మరియు అందమైన అనుభవాలను అందిస్తాయి.
అందులో కొన్నింటిని మీరు చూడాలని ప్రణాళిక వేసుకొని ఒక ఆసియా దేశానికి ట్రిప్ పై వెళితే, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరాలను బజాజ్ అలియంజ్ తీరుస్తుంది.
జపాన్ మినహా మీరు ఏ ఆసియా దేశానికి అయినా ప్రయాణం చేసినప్పుడు బజాజ్ అలియంజ్ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక మరియు వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుండి రక్షణను అందిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని ఖరీదు చాలా తక్కువ, దీని అర్థం మీరు మీకు ఇష్టమైన షాపింగ్ మరియు స్ట్రీట్ ఫుడ్‌ని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు.
ట్రావెల్ ప్రైమ్ ఆసియా ఫ్లెయిర్ మరియు ట్రావెల్ ప్రైమ్ ఆసియా సుప్రీమ్ రెండూ విస్తృతమైన కవరేజ్ అందించే సమగ్ర పాలసీలు, ఇవి మీ ప్రయాణాన్ని సులభంగా మరియు ఇబ్బందులు లేకుండా చేస్తాయి.
బజాజ్ అలియంజ్ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ వలన మరణం మరియు శాశ్వత పూర్తి వైకల్యం సంభవిస్తే ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని కవర్ చేస్తుంది.
విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు అనారోగ్యం కారణంగా లేదా గాయం కారణంగా ఏదైనా అత్యవసరమైన వైద్య పరిస్థితి ఎదురైతే, ఈ ప్లాన్ ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తిని కవర్ చేస్తుంది. ఒక వేళ, తదుపరి చికిత్స కోసం ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తిని భారతదేశానికి తరలించే పరిస్థితి ఏర్పడితే, ఆ వైద్యపరమైన తరలింపు కోసం అయ్యే ఖర్చు కూడా ఈ ప్లాన్‌లో కవర్ చేయబడుతుంది.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి $500 వరకు ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ చికిత్స కోసం కూడా కవర్ చేయబడతారు
విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణిస్తే, భౌతిక కాయాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడుతుంది.
విదేశాల్లో ఉన్నప్పుడు రైలు, బస్సులు, ట్రామ్లు లేదా విమానాలు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం కారణంగా మరణం మరియు శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు, బజాజ్ అలియంజ్ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ వాటి పై కవరేజ్ అందిస్తుంది.
ఒకవేళ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ట్రిప్ సమయంలో తన పాస్‍పోర్ట్‌ను కోల్పోతే, ఈ ప్లాన్ డూప్లికేట్ పాస్‍పోర్ట్ పొందటానికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు శారీరక గాయం లేదా ఆస్తికి జరిగిన నష్టం కారణంగా ఏర్పడే థర్డ్ పార్టీ క్లెయిమ్‌ను సెటిల్ చేయడానికి ఈ పాలసీ కవరేజ్ అందిస్తుంది.
పాలసీ అమలులో ఉన్న సమయంలో ఒక ట్రిప్ జాప్యం పై ఈ ప్లాన్ పరిహారం అందిస్తుంది. ఇది భారతదేశం నుండి విదేశానికి లేదా విదేశం నుండి భారతదేశానికి ప్రయాణం అయి ఉండవచ్చు. ఒక కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవ్వడం వలన మీరు ఆలస్యం అయితే, మీరు కంగారు పడనక్కర్లేదు.
బహుశా అనుకోని సంఘటనలో ఒకవేళ ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తిని హైజాకర్లు నిర్బంధిస్తే, షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం బజాజ్ అలియంజ్ ఏకమొత్తంలో డబ్బును చెల్లిస్తుంది.
ఒకవేళ మీరు చెక్ ఇన్ చేసిన బ్యాగేజ్ 12 గంటల కంటే ఎక్కువ సమయం పాటు ఆలస్యం అయితే, అత్యవసర మందులు, టాయిలెట్రీస్ మరియు దుస్తులు కొనుగోలు చేసే ఖర్చును పాలసీ కవర్ చేస్తుంది.
సామాను దోచుకోబడటం, చోరీ, నిలిచిపోవడం లేదా ప్రకృతి వైపరీత్యం వంటి కారణాల వలన ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తికి అత్యవసరంగా డబ్బు అవసరం అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ అత్యవసర సహకారాన్ని అందిస్తుంది.
1. మీరు మీ విదేశీ ప్రయాణాన్ని కవర్ చేయడానికి ఒక ట్రావెల్ ప్రైమ్ లేదా ట్రావెల్ ఇలైట్ పాలసీని ఎంచుకున్నట్లయితే, బజాజ్ అలియంజ్ నుండి మీకు ఒక ఉత్తేజకరమైన ఆఫర్ ఉంది. విదేశాలలో మీ పర్యటన సమయంలో ఏదైనా యునైటెడ్ స్టేట్స్ గోల్ఫర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన గోల్ఫ్ కోర్సు వద్ద హోల్-ఇన్-వన్ జరుపుకోవడానికి అయ్యే ఖర్చులను మేము తిరిగి చెల్లిస్తాము.
2 మీరు మీ విదేశీ ప్రయాణంలో ఉన్నప్పుడు, ట్రావెల్ ఎలైట్ పాలసీ మీ ఇంటికి కూడా రక్షణను కలిపిస్తుంది. మీ ఇంట్లో దొంగతనం కారణంగా జరిగిన నష్టానికి ఇది కవరేజ్ అందిస్తుంది.
3 బజాజ్ అలియంజ్ మీకు ప్రపంచంలో ఎక్కడైనా ఆన్-కాల్ సపోర్ట్ సౌకర్యాన్ని అందిస్తుంది. +91-124-6174720 పై ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే యాక్సెస్ లభిస్తుంది.
1 ఇది ఆసియాలో ప్రయాణం కోసం అందించబడే అత్యంత సమగ్రమైన ప్లాన్లలో ఇది ఒకటి, ఇది దాదాపుగా, విదేశీ ప్రయాణంతో సంబంధం ఉన్న అన్ని ప్రమాదాలను కవర్ చేస్తుంది
2 మీ అవసరానికి అనుగుణంగా, మీరు 1 నుండి 30 రోజుల వరకు ఒక పాలసీ టర్మ్ ఎంచుకోవచ్చు
3 ఇది హాస్పిటలైజేషన్, బ్యాగేజ్ కోల్పోవడం మరియు ఇతర ఆకస్మిక ఖర్చులను కవర్ చేస్తుంది
4 ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ చాలా వేగంగా మరియి ఇబ్బందులు లేకుండా పూర్తి అవుతుంది. మేము ఒక అంతర్జాతీయ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా కలిగి ఉన్నాము, అవసరం ఏర్పడినప్పుడు మీరు దీనికి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు మరియు రెండు నిమిషాలలోపు మీరు మా నుండి కాల్ అందుకుంటారు.
జపాన్ మినహా అన్ని ఇతర ఆసియా దేశాలకు ప్రయాణించే వారి అవసరాలను తీర్చడానికి బజాజ్ అలియంజ్ ట్రావెల్ ప్రైమ్ ఆసియా ప్రత్యేకంగా రూపొందించబడింది. తీర్థయాత్రలు లేదా ప్రయాణంలో ప్రమాదాలు ఉండే దేశాలకు వెళ్ళినప్పుడు బజాజ్ అలియంజ్ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ చెల్లదు.
ట్రావెల్ ప్రైమ్ ఆసియా క్రింద ప్లాన్లు ఈ విధంగా ఉన్నాయి:
1 ట్రావెల్ ప్రైమ్ ఆసియా ఫ్లెయిర్
2 ట్రావెల్ ప్రైమ్ ఆసియా సుప్రీమ్
ట్రావెల్ ప్రైమ్ ఆసియా ఫ్లెయిర్ $15,000 వరకు కవరేజ్ అందిస్తుంది, మరియు ట్రావెల్ ప్రైమ్ ఆసియా సుప్రీమ్ $25,000 వరకు అధిక కవరేజ్ అందిస్తుంది.
జపాన్ మినహా ఇతర ఆసియా దేశాలకు చేసే ప్రయాణాన్ని కవర్ చేయడానికి బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఆసియా పాలసీ ప్రత్యేకంగా రూపొందించబడింది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఏ దేశంలో ఉన్నా మా ఆన్ కాల్ సపోర్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే మా సేవలు మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, విదేశీ ప్రయాణంతో ముడిపడి ఉన్న అనేక రిస్కులను పాలసీ కవర్ చేస్తుంది.
బజాజ్ అలియంజ్ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ సరసమైన రేట్ల వద్ద విస్తృతమైన కవరేజ్ అందిస్తుంది, అందుకే ఇది ఆసియా కోసం ఉన్న ఉత్తమ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకటిగా నిలిచింది
భారతీయ పాస్‍పోర్ట్ కలిగి ఉండి 30 రోజులు లేదా అంతకంటే తక్కువ అవధి కోసం విదేశాలకు ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరైనా ట్రావెల్ ఆసియా పాలసీని కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు కూడా ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు అర్హత కలిగి ఉంటారు.
0.6 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తికైనా ఈ పాలసీ కవరేజ్ అందిస్తుంది.
అవును, బజాజ్ అలియంజ్ ఆసియా ప్రైమ్ ఫ్యామిలీ పాలసీ మీ కుటుంబం యొక్క ఇన్సూరెన్స్ అవసరాల బాధ్యతను తీసుకుంటుంది. పాలసీ మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామిని (60 సంవత్సరాల వయస్సు వరకు) మరియు 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 2 పిల్లలను కవర్ చేస్తుంది. మీరు $50,000 లేదా $1,00,000 ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఇన్సూర్ చేసిన మొత్తం పూర్తి కుటుంబానికి ఫ్లోటింగ్ ప్రాతిపదికన ఉంటుంది, కానీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ విడిగా ఉంటుంది.
కేవలం గుడ్ హెల్త్ డిక్లరేషన్ ఫారం పై సంతకం చేయడం ద్వారా ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ వ్యవధిని పొడిగించవచ్చు. ఇప్పటికే ఉన్న పాలసీ గడువు ముగియడానికి 7 రోజుల ముందు పొడిగింపు కోసం అభ్యర్థన అందజేయాలి. కానీ, పొడిగింపులతో సహా గరిష్ట పాలసీ వ్యవధి 30 రోజులకు మించకూడదు.
30 రోజుల కంటే ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు జారీ చేయబడవు. ప్లాన్ చేయబడిన ట్రిప్ ప్రారంభం అవ్వడానికి ముందు 30 రోజుల్లోపు మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయవచ్చు.
వైద్య ఖర్చులు మరియు తరలింపు | $ 100 |
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ | $ 100 |
చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం | 12 గంటలు |
పర్యటన ఆలస్యం | 12 గంటలు |
పాస్‌పోర్ట్ నష్టం | $15 |
వ్యక్తిగత బాధ్యత | $ 100 |
అవును, పాలసీ అమలు తేదీ నుండి 15 రోజుల గడువు ముగిసిన తర్వాత మీరు పాలసీని రద్దు చేయవచ్చు. మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వ్రాతపూర్వకంగా ఒక రద్దు లేఖను సమర్పించాలి మరియు ప్లాన్ చేయబడిన ట్రిప్ ప్రారంభం అవ్వలేదని మీరు కంపెనీకి రుజువును అందించవలసి ఉంటుంది.
షెడ్యూల్‌లో చూపబడిన ప్రారంభ తేదీ నుండి 14 రోజుల్లోపు ప్లాన్ చేయబడిన ప్రయాణం ఆరంభం అవ్వకపోతే ప్లాన్ రద్దు చేయబడుతుంది. కనీస ఛార్జీకి లోబడి కంపెనీ కాన్సిలేషన్ స్కేల్ ప్రకారం రద్దు ఛార్జీలను మినహాయించడానికి అర్హత కలిగి ఉంటుంది.
మీరు ప్లాన్ వ్యవధి గడువు ముగియడానికి ముందు తిరిగి వచ్చినట్లయితే, మీరు ప్రీమియం మొత్తంలో కొంత శాతం రిఫండ్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు, అయితే పాలసీ పై ఎటువంటి క్లెయిమ్ లేకుండా ఉండాలి. రిఫండ్ మొత్తం అనేది పాలసీ ప్రారంభమైన తర్వాత గడిచిన సమయం పై ఆధారపడి ఉంటుంది.
ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్ విషయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి లేదా సన్నిహితులు బజాజ్ అలియంజ్‍కు తెలియజేయాలి మరియు పాలసీ వివరాలను పంచుకోవాలి. మేము ఆసుపత్రితో మాట్లాడి బిల్లును నేరుగా సెటిల్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. అవుట్-పేషెంట్ వైద్య చికిత్స విషయంలో, ఎంచుకున్న వ్యక్తిగత ప్లాన్ పై ఆ విధానం ఆధారపడి ఉంటుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ వద్ద సులభంగా మరియు ఇబ్బందులు లేకుండా ఒక క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. అది ఒక వైద్య అత్యవసర పరిస్థితి, చెక్-ఇన్ బ్యాగేజీని పోగొట్టుకోవడం లేదా ట్రిప్ ఆలస్యాలు అయినా, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లిష్టమైన సమయాల్లో మీ ఒత్తిడిని తగ్గించడానికి అవాంతరాలు-లేని క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌ను అందిస్తుంది.
టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ లేదా ఇమెయిల్ ద్వారా సంఘటన గురించి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెంటనే తెలియజేయండి.
క్లెయిమ్ ఫారం పొందండి మరియు తప్పులు లేకుండా పూరించండి.
వైద్య బిల్లులు, ప్రయాణ టిక్కెట్లు లేదా పోలీస్ రిపోర్టులు వంటి అవసరమైన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను సేకరించండి.
ధృవీకరణ కోసం పూర్తి చేయబడిన ఫారం మరియు డాక్యుమెంట్లను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపండి.
మీ క్లెయిమ్ స్థితి గురించి అప్‌డేట్ల కోసం క్లెయిమ్స్ బృందాన్ని సంప్రదించండి.
మీ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం క్లెయిమ్ ఫైల్ చేయడానికి, మీకు ఇవి అవసరం:
ఈ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మీ క్లెయిమ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసియా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అనువైన ఎంపిక అనేది ఇక్కడ ఇవ్వబడింది:
మీ ప్రయాణాల కోసం మీరు ఎంచుకోగల ప్లాన్‍లను త్వరగా పోల్చి చూడటానికి ఈ క్రింది పట్టికను చూడండి:
ట్రావెల్ కంపానియన్ | ట్రావెల్ ఎలైట్ | |||
ఆసియా ఫ్లెయిర్ | ఆసియా సుప్రీమ్ | ఆసియా ఫ్లెయిర్ | ఆసియా సుప్రీమ్ | |
కవరేజీలు | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం | US$ ల ప్రయోజనం |
---|---|---|---|---|
వైద్య ఖర్చులు, తరలింపు మరియు రిపేట్రియేషన్ | 15,000 | 25,000 | 15,000 | 25,000 |
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది | 500 | 500 | 500 | 500 |
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం గమనిక: ప్రతి బ్యాగేజ్‌కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‌లోని ప్రతి వస్తువుకు 10 %. |
200 | 200 | 200 | 200 |
AD & D కామన్ క్యారియర్ | - | - | 2,500 | 2,500 |
బ్యాగేజ్ ఆలస్యం | 100 | 100 | 100 | 100 |
వ్యక్తిగత ప్రమాదం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మరణిస్తే కేవలం 50% మొత్తం మాత్రమే హామీ ఇవ్వబడుతుంది |
7,500 | 7,500 | 7,500 | 7,500 |
పాస్‌పోర్ట్ నష్టం | 100 | 100 | 100 | 100 |
వ్యక్తిగత బాధ్యత | 10,000 | 10,000 | 10,000 | 10,000 |
హైజాక్ | ప్రతి రోజుకి $20 నుండి గరిష్టంగా $ 200 వరకు |
ప్రతి రోజుకి $20 నుండి గరిష్టంగా $ 200 వరకు |
ప్రతి రోజుకు $ 50 నుండి గరిష్టంగా $ 300 |
$60 ప్రతి రోజు నుండి గరిష్టంగా $ 360 |
అత్యవసర నగదు అడ్వాన్స్ గమనిక: నగదు అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి |
- | - | 500 | 500 |
ట్రావెల్ కంపానియన్ ఆసియా ఫ్లెయిర్ ప్రీమియం టేబుల్ (రూ. లో.)
వ్యవధి/వయస్సు | జపాన్ మినహాయించి | ||
0.5 - 40 సంవత్సరాలు | 41-60 సంవత్సరాలు | 61-70 సంవత్సరాలు | |
1-4 రోజులు | 246 | 320 | 514 |
5-7 రోజులు | 320 | 368 | 565 |
8-14 రోజులు | 368 | 418 | 686 |
15-21 రోజులు | 418 | 465 | 785 |
22-30 రోజులు | 465 | 539 | 883 |
ఫిబ్రవరి '09 నాటికి వర్తించే విధంగా ప్రీమియం పై సేవా పన్ను ఉంటుంది.
ట్రావెల్ కంపానియన్ ఆసియా సుప్రీమ్ ప్రీమియం టేబుల్
వ్యవధి/వయస్సు | జపాన్ మినహాయించి | ||
0.5-40 సంవత్సరాలు | 41-60 సంవత్సరాలు | 61-70 సంవత్సరాలు | |
1-4 రోజులు | 320 | 393 | 588 |
5-7 రోజులు | 393 | 442 | 686 |
8-14 రోజులు | 509 | 565 | 809 |
15-21 రోజులు | 565 | 638 | 1045 |
22-30 రోజులు | 638 | 686 | 1277 |
జపాన్ మినహా, ఆసియా దేశాలలో ప్రయాణం చేయడానికి పరిమితం చేయబడింది. ప్రయాణ వ్యవధి: 30 రోజులకు మించకూడదు.
ఫిబ్రవరి '09 నాటికి వర్తించే విధంగా ప్రీమియం పై సేవా పన్ను ఉంటుంది.
ట్రావెల్ ఆసియా ఎలైట్ ఫ్లెయిర్ ప్రీమియం టేబుల్ (రూ. లో)
వ్యవధి/వయస్సు | 0.5 - 40 సంవత్సరాలు | 41-60 సంవత్సరాలు | 61-70 సంవత్సరాలు |
1-4 రోజులు | 283 | 367 | 593 |
5-7 రోజులు | 367 | 423 | 649 |
8-14 రోజులు | 423 | 480 | 790 |
15-21 రోజులు | 480 | 536 | 903 |
22-30 రోజులు | 536 | 621 | 1016 |
ఫిబ్రవరి '09 నాటికి వర్తించే విధంగా ప్రీమియం పై సేవా పన్ను ఉంటుంది.
ట్రావెల్ ఆసియా ఎలైట్ సుప్రీమ్ ప్రీమియం టేబుల్
వ్యవధి/వయస్సు | 0.5 - 40 సంవత్సరాలు | 41-60 సంవత్సరాలు | 61-70 సంవత్సరాలు |
1-4 రోజులు | 367 | 451 | 677 |
5-7 రోజులు | 451 | 507 | 790 |
8-14 రోజులు | 586 | 649 | 931 |
15-21 రోజులు | 649 | 735 | 1202 |
22-30 రోజులు | 735 | 790 | 1466 |
జపాన్ మినహా, ఆసియా దేశాలలో ప్రయాణం చేయడానికి పరిమితం చేయబడింది. ప్రయాణ వ్యవధి: 30 రోజులకు మించకూడదు.
ఫిబ్రవరి '09 నాటికి వర్తించే విధంగా ప్రీమియం పై సేవా పన్ను ఉంటుంది.
ఆసియా దేశాలలో ప్రయాణిస్తున్నారా? బజాజ్ అలియంజ్ ఎంచుకోండి!
ఒక కోట్ పొందండిరెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
డేవిడ్ విలియమ్స్
చాలా సులభమైన ప్రాసెస్. ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు అవాంతరాలు లేని ప్రాసెస్
సత్విందర్ కౌర్
నాకు మీ ఆన్‌లైన్ సర్వీస్ నచ్చింది. నేను దీనితో సంతోషంగా ఉన్నాను.
మదన్‌మోహన్ గోవిందరాజులు
స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి